Img Src : iStockphoto
బెండకాయను మనం సాధారణ కూరగాయగా పరిగణిస్తే.. దాని జగటను చూసి చాలా మంది మహిళలు దూరంగా పెడతారు. కానీ మధుమేహం నుండి బరువు తగ్గడం వరకు అనేక ఔషధీయ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన దీని గురించి తెలిసనవారు ప్రతిరోజు ఆహారంలో చేర్చుతారు.
Img Src : iStockphoto
బెండకాయ అద్భుత ఔషధీయ గుణాలతో కూడిన కూరగాయ. దానిని ముక్కలుగా తరిగేప్పుడు చేతులకు అంటుకునే జిగురు పదార్థాన్ని అటుంచితే, అది పుష్కలమైన పోషకాలతో నిండినది. దానిలోని ఔషధీయ గుణాలు, పోషకాలు అనేక అరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయి.
Img Src : iStockphoto
వేలు పాటి మందం, పొడువు ఉన్న బెండకాయ పరిమాణంలో చిన్నది, అని తక్కువగా అంచనా వేయకండీ.. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరీకరించడం నుండి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు మద్దతునివ్వడం వరకు అన్ని ప్రయోజనాలను కవర్ చేసింది. ఓ సారి పరిశీలిద్దామా.
Img Src : iStockphoto
ఆహారంలో బెండకాయను చేర్చుకోవడం వల్ల తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ అందిస్తుంది. ఇది అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఎక్కువ ఫైబర్ కారణంగా ఇది జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది. కనీసం వారంలో మూడు రోజులు తిసుకోవాలి.
Img Src : iStockphoto
డయాబెటిక్-ఫ్రెండ్లీ డైట్‌కు బెండకాయ ఒక అద్భుతం. దీని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేసేలా చేసి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను స్థిరీకరించి మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Img Src : iStockphoto
ఒక నిమ్మకాయ రసంలో 2 టేబుల్ స్పూన్ల చక్కర వేసి, దానిలో 35 ml నీరు పోయాలి. ఈ మిశ్రమం మరిగే వరకు వేడి చేయాలి. చల్లారిన తరువాత దీనిని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. వృత్తాకార కదలికలో రుద్దడం ద్వారా నీటితో శుభ్రం చేసుకోవాలి
Img Src : iStockphoto
ఫైబర్ పవర్‌హౌస్ గా పేరొందిన బెండకాయ జీర్ణ ఆరోగ్యానికి విలువైన ఆస్తి. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఆహారంలో దీనిని చేర్చుకోవడం ద్వారా, జీర్ణక్రియను మెరుగవుతుంది.
Img Src : iStockphoto
బెండకాయ హృదయాన్ని కూడా పథిలపరుస్తుంది. దీనిలోని పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహిస్తుంది. ప్రేగులలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయ బహుముఖ ప్రయోజనాలను ఆస్వాదనకు బోజనంలో చేర్చకోండి.
Img Src : iStockphoto
బెండకాయలో విటమిన్ ఎ, లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలం, ఇవి ఆరోగ్యకర దృష్టి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మాక్యులర్ డీజెనరేషన్, కంటి శుక్లం, వయస్సు సంబంధిత రుగ్మతల నుండి కళ్ళను రక్షించి, దృష్టిని మెరుగుపరుస్తాయి.
Img Src : iStockphoto
బెండకాయ ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా ఆస్వాదించడానికి, దానితో పోషకమైన పద్ధతిలో వంటకాలను తయారు చేయడం చాలా ముఖ్యం. భోజనంలో బెండకాయని చేర్చుకోవడం ఎంత ముఖ్యమో.. వాటి పోషకాలను యధాతధంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం.
Img Src : iStockphoto
బెండకాయ వేపుడు చేస్తే పోషకాలన్నీ పోతాయన్నది అపోహ కాదు. కానీ ఇలా చేస్తే పథిలంగా ఉంటాయి. పాన్‌లో కొద్ది మొత్తంలో నూనె వేడి చేసి, తరిగిన బెండకాయను వేసి, లేతదనం పోయేవరకు వేయించాలి. అదనపు రుచి కోసం నచ్చిన మసాలా దినుసులతో సీజన్ చేయండి.
Img Src : iStockphoto
పూర్తిగా లేదా ముక్కలుగా చేసిన బెండకాయని లేతదనం, పచ్చి వాసన పోయి లేత బంగారు వర్ణంగా మారే వరకు ఆవిరి మీద ఉడికించాలి. రిఫ్రెష్ టచ్ కోసం కొంచెం ఉప్పు, నిమ్మరసం చల్లుకుని కర్రీ చేసుకోవాలి. దీంతో బెండకాయలో పోషకాలు అలాగే ఉంటాయి.
Img Src : iStockphoto
బెండకాయను వేపుడు, కూర, లేదా సాంబారు చేయడం మనకు తెలిసన మూడు పద్దతులు. పోషకాహారం అదనం కోసం ఇతర కూరగాయలు లేదా సాంబారులో బెండకాయ ముక్కలు జోడించవచ్చు. అయితే సాంబారులో బెండకాయు ఉడికినంత వరకు ఉంచనివ్వాలి అప్పుడే రుచులు కలిసిపోతాయి.
Img Src : iStockphoto
ఆహారంలో బెండకాయను చేర్చడం ద్వారా దాని అద్భుతమైన పోషకాలను ఆస్వాదించవచ్చు. తద్వార దానిలోని ఔషధీయ గుణాలను కూడా సోంతం చేసుకుని అరోగ్య ప్రయోజనాలను పోందవచ్చు. మొత్తం అరోగ్య శ్రేయస్సును ఇది మెరుగుపరుస్తుంది.
Img Src : iStockphoto