ఆముదం విత్తనాల నుంచి సేకరించిన ఆముదం నూనెకు ఆయుర్వేదంలో శతాబ్దాల ప్రాముఖ్యత ఉంది. శాస్త్రీయంగా రిసినస్ కమ్యూనిస్ అని పిలిచే అముదం.. వివిధ ఔషధ, సౌందర్య, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోంది. లేత పసుపు వర్ణంలో వగరు వాసన కలిగి ఉండే దీనిలో రిసినోలిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం ఉంది.
ఆముదంలోని రిసినోలిక్ యాసిడ్ అధిక సాంద్రత అనేక చికిత్సా లక్షణాలను నయం చేస్తుంది. వైద్యపరంగా ఆముదం నూనెను భేదిమందుగా ఉపయోగిస్తారు. మలబద్ధకం నుండి ఉపశమనం, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. కీళ్ల నోప్పులు, వాపులు, చర్మ పరిస్థితుల రుగ్మతలను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు.
ఇది ప్రేగుల కండరాలను ఉత్తేజపరచడం ద్వారా పనిచేస్తుంది, జీర్ణవ్యవస్థ ద్వారా మలం కదలికను పెంచడంతో దీనిని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వాడుతున్నారు. ఇది జుట్టు పెరుగుదల, కుదుళ్ల ధృడత్వంతో పాటు చర్మ సంరక్షణకు, మెరిసే చర్మతో పాటు అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ ఆముదం నూనె కూడా ఇతర సహజ నూనెల మాదిరిగానే జుట్టు, తలకు హైడ్రేట్ చేస్తుంది. ఇందులోని రిసినోలిక్ యాసిడ్ జుట్టుకు సహజమైన ఎమోలియెంట్. ఇందులో ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆముదం జుట్టులో తేమ, సహజ నూనెలను బంధించి, తంతువులలోకి మూసివేస్తుంది.
జుట్టు పెరుగుదల, కుదుళ్ల ధృడత్వం, చుండ్రు నివారణ మాత్రమే కాదు ఆముదం నూనెతో అనేక సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆముదం చర్మానికి చక్కని నిగారింపునిస్తుంది. ఆముదంతో మసాజ్ చేసుకున్నవారిలో వృద్దాప్య లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ముఖం, కాళ్లు, చేతులపై ఉన్న మచ్చలను తెలికపరుస్తుంది.
కాస్మెటిక్ పరిశ్రమలో, ఆముదం దాని తేమ, పోషణ లక్షణాల కారణంగా చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడం, స్థితిస్థాపకతను మెరుగుపర్చడం, మచ్చల రూపాన్ని తగ్గించడం, గర్భవతి, అధిక బరువుల స్ట్రెచ్ మార్కులను తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టుకు ఆముదం నూనెను పట్టించినప్పుడు, ఇది తంతువులను బలోపేతం చేస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును పొడిగా చేయడంతో పాటు, విరిగిపోకుండా చేస్తుంది. అంతేకాదు యుక్తవయస్సులోనే తెల్ల వెంట్రుకలను రానీయకుండా అరికట్టడంలోనూ సహాయం చేస్తుంది.
ఆముదం నూనెను వారానికి ఒకసారి లేదా పక్షం రోజులకో పర్యాయం పట్టించాలి. అప్పుడు కేశాలు వృద్ది చెందుతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని నివారించడంలో బాగా సహాయపడింది. అలాగే చుండ్రు సమస్యను క్రమంగా పరిష్కరించడంలోనూ అముదం సహాయపడుతుంది.
అలోపేసియా అంటే వెంట్రుకలు కోల్పోవడం లేదా జుట్టు పలచబడే పరిస్థితిని తిరగమార్చగల సత్తా ఆముదం నూనె సొంతం. అసంభవ పరిస్థితులకు చెక్ పెడుతూ తిరిగి జుట్టును పెరిగేట్లు చేయడంలో ఆముదం నూనెకు సాటి మరోకటి లేదు. ఈ ప్రయోజకరం కోసం వారానికి రెండు రోజులు ఆముదం నూనె రాస్తూవుండాలి.
ఇక అరోగ్యపరంగా నిద్రలేమి సమస్య ఉపశమనం ఆముదంతో సాధ్యం. టిన్నిటస్‌కు పూర్తి నివారణ లేదు కానీ ఆముదం నూనెను 8 చుక్కలను చెవిలో పోయడంతో ఆ బాధను తగ్గిస్తుంది. ప్రతిరోజు కంటిలో రెండు చుక్కులు వేస్తే కంటి శుక్లాలు తొలగిపోతాయి, హార్మోన్లను సమతుల్యం చేసి లిబిడో మెరుగుపరుస్తుంది.
కొన్ని చుక్కల ఆముదం నూనెను, స్కాల్ప్, వెంట్రుకల మధ్యభాగం, చివర్లలో సున్నితంగా మసాజ్ చేస్తే, జుట్టు పగిలిపోకుండా కాపాడి, ఆకృతిని పెంచుతుంది. ఆముదం నూనెను రెండు గంటలపాటు తలపై ఉంచడం వల్ల తల చర్మం, కుదుళ్లు, షాఫ్ట్‌లో నూనె బాగా ఇంకుతుంది.
ఆముదం మరకలు పోవు కాబట్టి బట్టలకు అంటకుండా తలను షవర్ క్యాప్‌తో కప్పుకోవాలి. రెండు గంటల తర్వాత షాంపూతో శుభ్రపర్చుకోవాలి. కాగా, నిపుణులు మాత్రం ఆముదాన్ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు.
ప్రతీరోజు అముదం తలకు పట్టిస్తే మ్యాటింగ్ సమస్యలు వస్తాయి. ఆముదం నూనె బరువుగా ఉన్న కారణంగా తేలికపర్చుకోవడానికి కొబ్బరి లేదా జోజోబా ఆయిల్‌తో పలుచన చేసి వాడాలి. ఇది బరువునే కాకుండా, ఆముదం సువాసనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.