Img Src : iStockphoto
వ్యాయామం చేయలేనంత బిజీగా ఉన్నా లేక ఏం చేస్తాములే అని సోమరితనం ప్రదర్శించినా.? ప్రమాదానికి దగ్గరవుతున్నారని తెలుసా? నడివయస్సులో ఆరేళ్ల పాటు శారీరక శ్రమ లేకుండా ఉంటే గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుసా.?
Img Src : iStockphoto
ఈ విషయాన్ని వైద్యులు కాదు ఏకంగా హార్ట్ ఫెయిల్యూర్ పై అధ్యయనం చేసిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జర్నల్ సర్క్యులేషన్‌లో వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. నడి వయస్సులో వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం అవసరం.
Img Src : iStockphoto
ప్రతి నిత్యం చురుకుగా ఉండాలంటే.. బ్రిస్క్ వాకింగ్, లేదా బైకింగ్ వంటి ప్రతి వారం సిఫార్సు చేయబడినట్లు 150 నిమిషాలకు తగ్గకుండా చేయాలి. శక్తివంతమైన కార్యాచరణలో స్థిరంగా పాల్గొనడం వల్ల ఈ ప్రమాదాన్ని 31 శాతం మేర తగ్గించుకోవచ్చు.
Img Src : iStockphoto
సాధారణంగా చురుకైన వారి కంటే శారీరకంగా అధిక చురుకైన వ్యక్తులలో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి. అయితే గుండె వైఫల్యం ప్రమాదంపై వ్యాయామ ప్రభావం గురించి ఇప్పటికి చాలా తక్కువగా తెలుసు.
Img Src : iStockphoto
నడివయస్సులో ఆరు సంవత్సరాలలో ఎటువంటి వ్యాయామం కానీ, సిఫార్సు చేయబడిన కార్యాచరణ చేయకుండా బద్దకంగా గానీ లేక బిజీగా ఉండి విస్మరిస్తే.. గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Img Src : iStockphoto
ఇక వ్యాయామం చేయని స్థితి నుంచి సిఫార్సు చేసిన కార్యచరణ స్థాయిలకు చేరుకోవడం వల్ల 23 శాతం హార్ట్ ఫెయిల్యూర్ ప్రమదాన్ని తగ్గించుకోవచ్చునని అమెరికా మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
Img Src : iStockphoto
ఈ అద్యయనంలో 60 ఏళ్ల సగటు వయస్సున్న మొత్తం 11,351 మంది పాల్గోన్నారని, వీరిని సగటున 19 సంవత్సరాలు పర్యవేక్షించామని, అధ్యయన నేతృత్వ బృందంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ చియాడి న్డుమెలే చెప్పారు.
Img Src : iStockphoto
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, వారానికి కనీసం 75 నిమిషాలు తీవ్రమైన తీవ్రత గల వ్యాయామం లేదా వారానికి కనీసం 150 నిమిషాల మితమైన తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
Img Src : iStockphoto
శారీరక శ్రమ అలవాటు లేనివారు ఇంటర్మీడియట్ స్థాయి లేదా సిఫార్సు చేసిన స్థాయికి చేరుకున్నవారిలో, పేలవమైన స్థాయి నుంచి ఇంటర్మీడియట్ యాక్టివిటీ రేటింగ్ ఉన్నవారితో పోలిస్తే, గుండె ఆగిపోయే ప్రమాదం సుమారు 12 శాతం తగ్గింది.
Img Src : iStockphoto
గుండె కండరాలు చనిపోవడంతో హార్ట్ అటాక్ వస్తుంది. కానీ గుండె వైఫల్యం అనేది శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకురావడానికి తగినంత రక్తాన్ని పంప్ చేయడానికి, తగినంత గట్టిగా పంప్ చేయాలి. కానీ గుండె దీర్ఘకాలిక అసమర్థత వల్ల వైఫల్యం గుర్తించబడుతుంది.
Img Src : iStockphoto
65 ఏళ్లు పైబడిన వారిలో ఆసుపత్రిలో చేరడానికి ప్రధాన కారణం, రుగ్మత ప్రమాద కారకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం కుటుంబ చరిత్ర. కాబట్టి ఇకపై వ్యాయామం చేసి ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్త పడండి.
Img Src : iStockphoto