Img Src : iStockphoto
వేసవి కాలం ఎండల నుండి ఉపశమనం కల్పించే వర్షాకాలం కోసం సాధారణ ప్రజలు, పంటల కోసం అన్నదాతలు ఎదురుచూడటం పరిపాటి. ఉష్ణోగ్రతలు తగ్గి, వర్షాలు కురువడంతో ఇదే అదనుగా అంటువ్యాధులు వ్యాపిస్తాయి.
Img Src : iStockphoto
మరీ ముఖ్యంగా చిన్నారులు, పిల్లలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, కామెర్లు, వైరల్ జ్వరం వంటి అంటువ్యాధులకు గురవుతుంటారు. దోమలు, సూక్ష్మక్రిములకు సంతానోత్పత్తి స్థలాన్ని అందించే అనువైన వాతావరణమిది.
Img Src : iStockphoto
ఈ అంటువ్యాధుల బారిన పడకూడదంటే తులసిని ఆశ్రయించాల్సిందే. అత్యుత్తమ ఔషధ మూలికలలో ఒకటైన తులసిలో అద్భుతమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. కొన్ని చుక్కల తులసి నీరు వేస్తే సూక్ష్మక్రిములను చంపి ఆహారాన్ని శుద్ధి చేస్తుంది.
Img Src : iStockphoto
తులసి.. అసాధారణమైన యాంటీబయాటిక్, జెర్మిసైడ్, ఫంగైసైడ్, క్రిమిసంహారక ఏజెంట్, అన్నిరకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి సమర్థవంతంగా రక్షిస్తుంది. వైరస్లు, ప్రోటోజోవా, బ్యాక్టీరియా, ఫంగస్ ద్వారా సోకే ఇన్ఫెక్షన్లు, జ్వరాన్ని తగ్గిస్తుంది.
Img Src : iStockphoto
తులసిలోని బలీయమైన గుణాలు, ఫైటోన్యూట్రియంట్లు, వ్యాధికారక క్రిములన్నింటినీ నాశనం చేసి, ఫలితంగా వచ్చే జ్వరాన్ని నయం చేస్తాయి. తులసి ఆకులు, పువ్వుల కషాయం జ్వరం చికిత్సకు సహాయపడుతుంది.
Img Src : iStockphoto
తులసిలో ఫైటోకెమికల్స్, బయోఫ్లావనాయిడ్స్, రోస్‌మరినిక్ యాసిడ్ వంటి యాంటీ-ఆక్సిడెంట్ కాంపౌండ్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో యాంటీ-మైక్రోబయల్ ఏజెంట్ గా పనిచేస్తాయి. దగ్గుకు అద్భుత ఔషధం, గొంతుకు ఉపశమనం, ఛాతీ వాపును తగ్గిస్తుంది.
Img Src : iStockphoto
తులసి నూనె బలమైన యాంటీబయాటిక్, క్రిమిసంహారక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రభావాన్ని కలిగి చర్మ రుగ్మతలను నయం చేస్తుంది. తులసి ఆకులు, తులసి నూనె శరీరంపై పూయడం వల్ల దోమలు, ఇతర కీటకాలు దరి చేరవు. రోజూ 5-6 తులసి ఆకులను తీసుకుంటే చాలు.
Img Src : iStockphoto
తులసి అద్బుతాల గని. సహజ రోగనిరోధక వ్యవస్థ బూస్టర్‌గా, అంటువ్యాధులను దూరంగా, వైరస్లు, బ్యాక్టీరియా, పంగస్, ప్రోటోజోవా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణనిస్తుంది. తులసి ఆకుల సారం T సహాయక కణాలు, సహజ కిల్లర్ కణాలను, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Img Src : iStockphoto
తులసి మూలికలు దోమల రిఫెలెంట్ గా ఉపయోగపడుతుంది. వ్యాధుల వ్యాప్తికి కారణమైన దోమలు, బొద్దింకలు, ఈగలు వంటి కీటకాలను దీని బలమైన సువాసనకు దరిచేరవు. ఇంట్లో ఈ మొక్క ఉంచడం వికర్షకంగా పనిచేస్తుంది.
Img Src : iStockphoto
అతి పురాతన, విలువైన ఔషధ మిశ్రమాలలో ఒకటి తులసి కషాయం. ఇది అనేక సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమమిది. అనివార్యమైన ఔషధ లక్షణాలతో నిండి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వంటింటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడతాయి.
Img Src : iStockphoto
తులసి కాషాయం తయారీకి కావలసినవి పదార్థాలు: 10-15 తులసి ఆకులు, 1-అంగుళాల అల్లం, 1-అంగుళాల పచ్చి పసుపు, 4 ములేతి కర్రలు, 10 నల్ల మిరియాలు, 10 లవంగాలు, 3-4 దాల్చిన చెక్క కర్రలు, 8 కప్పుల నీరు
Img Src : iStockphoto
కుక్కర్ లో అన్ని పదార్థాలు వేసి నీరు పోసి.. తక్కువ మంటపై ఒక గంట పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనీయండి. అంతే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కాషాయం రెడి. ఎయిర్ టైట్ గాజు సీసాలో భద్రపర్చుకుని తాగే ముందు వేడి చేసుకోవాలి.
Img Src : iStockphoto
రోగనిరోధక శక్తిని పెంచే ఈ కషాయం అంటువ్యాధులను దూరం చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు జ్వరం, జలుబు, దగ్గు, ఫ్లూ, తలనొప్పి, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. జెర్మ్స్, బ్యాక్టీరియాను దూరం చేసి, మంటను తగ్గిస్తుంది.
Img Src : iStockphoto