Img Src : iStockphoto
బ్లాక్‌హెడ్స్‌ను శాస్త్రీయంగా ఓపెన్ కామెడోన్స్ అని అంటారు. ఇవి మొటిమల సాధారణ రూపం, ఇవి ఎప్పుడైనా పుట్టుకరావచ్చు. ఎరుపు లేదా గులాబీ మచ్చలతో ఇబ్బంది ఉండదు. కానీ బ్లాక్ హెడ్స్ ముఖంపై మచ్చలుగా కనిపిస్తాయి. వీటిని సాధారణ రూపాన్ని పొందవచ్చు.
Img Src : iStockphoto
బ్లాక్ హెడ్స్ ఇబ్బందికరమైన ముదురు రంగులో ముక్కు, ముఖం, మెడ, ఛాతీ, వీపు సహా ఇతర భాగాలపై ఏర్పడతాయి. కొందరు వాటిని వివిధ మార్గాల ద్వారా బయటకు తీస్తారు. కానీ వీటి తొలగించాలంటే క్లినిక్ లేదా సెలూన్‌కి వెళ్లాల్సిందే.
Img Src : iStockphoto
బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. క్లినిక్ లేదా సెలూన్‌కి వెళ్లి వీటిని తొలగించుకుంటారు. మరికొందరు శక్తివంతమైన పదార్ధమైన సాలిసిలిక్ యాసిడ్ ఉత్పత్తులను ఓవర్-ది-కౌంటర్ కొనుగోలు చేసి ప్రయత్నిస్తారు.
Img Src : iStockphoto
అలా కాకుండా బ్లాక్ హెడ్స్ ను సహజ మార్గాల ద్వారా కూడా వదిలించుకోవచ్చు. అందులోనూ ఇంటి చిట్కాలతో నివారించవచ్చు. అయితే వీటిని నివారించడానికి కేవలం వంటింట్లో లభించే పదార్థాలు మాత్రమే సరిపోతాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దామా.
Img Src : iStockphoto
నారింజ తొక్కను ఎండబెట్టి పోడి చేసుకుని ముల్తానీ మట్టిలో బాగా మిశ్రమం బాగా కలసిన తరువాత, బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రభావిత ప్రాంతపై అప్లై చేయాలి. 10 నిమిషాల తరువాత సున్నితంగా స్క్రబ్ చేసి, ముఖాన్ని కడిగితే చాలు.
Img Src : iStockphoto
శోషక లక్షణాలు ఉన్న ముల్తానీ మట్టి నూనె చర్మంపై అదనపు నూనెను నియంత్రించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఆరెంజ్ తొక్కలోని విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతం చేసి మెరుగుపరుస్తాయి, డార్క్ స్పాట్స్ రూపాన్ని తగ్గిస్తాయి.
Img Src : iStockphoto
బేకింగ్ సోడాలో కాసింత నీటిని వేసి పేస్ట్‌లా చేయాలి. తడి చర్మంపై పేస్ట్‌ను సున్నితంగా మసాజ్ చేస్తూ.. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతాలపై కొన్ని నిమిషాల పాటు అదనంగా స్క్రబ్ చేసిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Img Src : iStockphoto
ఒక టేబుల్ స్పూన్ చక్కెరలో సగం నిమ్మకాయ రసం కలపండి. పంచదార, నిమ్మరసం మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసిన తరువాత దానిని చర్మంపై సున్నితంగా మసాజ్ చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆతర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
Img Src : iStockphoto
చక్కెర, నిమ్మరసం మిశ్రమం కూడా ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. చక్కెర రేణువుల పాకం చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి సహాయపడగా, నిమ్మరసం చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది.
Img Src : iStockphoto
బొప్పాయి జుగ్గు, పాల పోడి, నిమ్మరసం, బియ్యప్పిండి ఈ నాలుగు పదార్ధాలు సమపాళ్లలో తీసుకుని పేస్ట్ చేయాలి. దీనిని ముఖంపై అప్లై చేసి, మెత్తగా స్క్రబ్ చేసి, 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Img Src : iStockphoto
బొప్పాయిలో పపైన్ వంటి సహజ ఎంజైమ్‌లు చనిపోయిన చర్మ కణాలను, అదనపు నూనెను విచ్ఛిన్నం చేసి, కరిగించడానికి సహాయపడుతుంది. ఈ ఎంజైమాటిక్ చర్య బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం ముఖాన్ని కాంతివంతం చేస్తుంది.
Img Src : iStockphoto
ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మిశ్రమాన్ని బాగా కలపి పది నిమిషాలు వదిలేయండి. ఈ మిశ్రమం బాగా కలిసిన తరువాత దానిని ముఖానికి అప్లై చేసి, సున్నితంగా స్క్రబ్ చేయాలి. 10 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి.
Img Src : iStockphoto
తేనె, దాల్చిన చెక్కతో స్క్రబ్ ముఖ సౌందర్యాన్ని మెరిసేలా చేస్తుంది. తేనె సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండగా, దాల్చిన చెక్క చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపర్చి.. అరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.
Img Src : iStockphoto
చర్మం నుండి నూనెలు, టాక్సిన్లను బయటకు తీయడానికి క్లే మాస్క్‌లను కూడా ప్రయత్నించవచ్చు. ఇది రంధ్రాలను అన్‌లాగ్ చేయడంలో సహాయపడుతుంది, క్రమంగా బ్లాక్‌హెడ్స్ తొలగించడంలో సహాయపడుతుంది.
Img Src : iStockphoto