Img Src : iStockphoto

ముఖ వెంట్రుకలను తొలగింపుకు ఇంటి చిట్కాలు

అందానికి పెద్దపీట వేసే మహిళల్లో చాలా మంది ఎదుర్కొన్నే సమస్య ముఖ వెంట్రుకలు. దీనినే హిర్సుటిజం అని అంటారు. వీటిని తొలగించడానికి షేవింగ్, ప్లకింగ్ లేదా వ్యాక్సింగ్ చేసుకోవడం కోసం ప్రతి నెల లేదా రెండు నెలలకో పర్యాయం బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తారు.

Img Src : iStockphoto

మహిళల్లో ముఖ సౌందర్యానికి వెంట్రుకలు చెక్:

ముఖ సౌందర్యాన్ని ఇవి దెబ్బతీస్తున్నాయని భావించి.. ఖర్చుకు వెనుకాడని వారు లేజర్ చికిత్సను ఆశ్రయించవచ్చు. ఈ చికిత్సతో వెంట్రుకలను శాశ్వతంగా తొలగించవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ చికిత్స అనేక అసుపత్రులలో అందుబాటులోకి వచ్చింది.

Img Src : iStockphoto

ముఖవెంటుక్రలను తొలగించుకోవడమెలా?:

ముఖవెంట్రుకలను తొలగించుకోవాలని అనే అలోచన ఉన్నా.. తరచుగా సెలూన్లు లేదా క్లినిక్‌లకు వెళ్లడానికి ఇష్టపడని వారి సంఖ్య ఎక్కువ. ఇలాంటి వారు ఈ వెంటుక్రలను సహజమైన గృహ చిట్కాలతోనే తొలగించవచ్చు. ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి.

Img Src : iStockphoto

ముఖవెంట్రుకలను సహజంగా నివారించుకునే పద్దతులు

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి వైద్య పరిస్థితుల వల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల మహిళల్లో ముఖంపై వెంట్రుకలు వస్తాయి. ముఖ వెంట్రుకల పెరుగుదల నమూనాను నిర్ణయించడంలో జన్యుశాస్త్రం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Img Src : iStockphoto

మహిళల్లో ముఖవెంట్రుకలు రావడానికి కారణం:

చాలామంది మహిళలు ముఖానికి పసుపు రాసుకుంటారు. ముఖ్యంగా పండుగలు, లేదా శుభకార్యాల సమయంలో ఇలా చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సహజంగా ముఖ వెంట్రుకలను వదిలించుకునే మార్గాలలో ఇది ఒకటి. ఇక మిగిలిన గృహచిట్కాలను పరిశీలిద్దామా:

Img Src : iStockphoto

ముఖవెంట్రుకలను తొలగించే సహజ మార్గాలు:

ఒక నిమ్మకాయ రసంలో 2 టేబుల్ స్పూన్ల చక్కర వేసి, దానిలో 35 ml నీరు పోయాలి. ఈ మిశ్రమం మరిగే వరకు వేడి చేయాలి. చల్లారిన తరువాత దీనిని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. వృత్తాకార కదలికలో రుద్దడం ద్వారా నీటితో శుభ్రం చేసుకోవాలి

Img Src : iStockphoto

ముఖవెంట్రుకలకు చెక్ పెట్టే చక్కెర, నిమ్మరసం

ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల చక్కెర, నిమ్మరసం కలపిన మిశ్రమాన్ని మూడు నిమిషాలు వేడి చేయాలి. చల్లారిన తర్వాత, ప్రభావిత ప్రాంతాలపై రాయాలి. ఇది సహజ మైనం లాంటిది, కాబట్టి మైనపు స్ట్రిప్‌ని ఉపయోగించి, జుట్టును వ్యతిరేక దిశలో తీయాలి.

Img Src : iStockphoto

ముఖవెంట్రుకలను నివారించే నిమ్మ, తేనె

ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ పంచదార, అర టీస్పూన్ బియ్యప్పిండి కలిపి పేస్ట్‌లా చేయాలి. ప్రభావిత ప్రాంతాలపై అప్లై చేసి, 25 నుండి 30 నిమిషాలు ఆరనివ్వండి. జుట్టుకు వ్యతిరేక దిశలో ముసుగును సున్నితంగా తీసి, ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి.

Img Src : iStockphoto

తెల్లసొన, బియ్యం పిండితో ముఖవెంట్రుకలకు చెక్:

రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్‌ను, ఎఫెక్టివ్ నేచురల్ ఎక్స్‌ఫోలియంట్‌ను, పండిన అరటిపండుతో కలపాలి. ఈ పేస్ట్‌ను ప్రభావిత ప్రాంతాల్లో వృత్తాకార కదలికలో రాస్తూ అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు మసాజ్ చేసిన తరువాత, నీళ్లతో ముఖాన్ని సున్నితంగా కడగాలి.

Img Src : iStockphoto

వోట్మీల్, అరటితో ముఖవెంట్రుకల తొలగింపు:

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ వెంట్రుకల కుదుళ్లను విచ్ఛిన్నం చేసి, జుట్టు పెరుగుదలను నిరోధిస్తుంది. బొప్పాయి గుజ్జును చిటికెడు పసుపు పొడిని కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి.

Img Src : iStockphoto

ముఖవెంట్రుకల తొలగింపులో బొప్పాయి, పసుపు:

ముఖవెంట్రుకలను తొలగించుకునే క్రమంలో పైన తెలిపిన ఇంటి చిట్కాలలో ఏదీ మీ శరీర తత్వానికి సరిగ్గా సూట్ అవుతుంది, ఏదీ ప్రతిచర్యను కలిగిస్తుంది అన్న విషయాలను ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతిచర్య నివారణకు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి.

Img Src : iStockphoto

ఏ ఇంటి చిట్కా ప్రభావవంతమో తెలుసుకోండిలా:

ముఖవెంట్రుకల తొలగింపుకు చాలామంది మధ్యతరగతివారు ఎంచుకునే మార్గం షేవింగ్. నొప్పి లేకుండా, సెలూన్‌కి వెళ్లకుండా స్వంతంగా చేసుకోవచ్చు కాబట్టి దీని ఎంపిక. అయితే ముఖచర్మం చాలా సున్నితమైంది కాబట్టి షేవింగ్ తర్వాత చర్మ సంరక్షణను అనుసరించాలి.

Img Src : iStockphoto

వెంట్రుకల తొలగింపుకు చాలామంది ఎంచుకునే మార్గం:

షేవింగ్ తర్వాత, తేలికపాటి క్లెన్సర్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకోండి. చల్లటి నీటితో ముఖాన్ని కడిగి ఆరబెట్టాలి. ముఖచర్మాన్ని రుద్దకూడదు. మీకు సరిపోయే ఒక మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇక చర్మ రక్షణకు అధిక SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.

Img Src : iStockphoto

షేవింగ్ తర్వాత చేపట్టాల్సిన చర్యలివే: