Img Src : Canva

వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే సూప్‌లు, పానీయాలు

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంచేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఘన పదార్ధాల కన్నా ద్రవ పదార్థాలే మిన్న అని తెలుసుకోండి. వర్షాకాలంలో వ్యాధుల నుండి రక్షణను అందించే వెచ్చని పానీయాలు, మరియు సూప్‌లను ఎంచుకుని ఆస్వాదించండి.

Img Src : Canva

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంచే ద్రవాలు:

వేడి వేడి ద్రవాలను తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. వర్షాకాలంలో సాధారణంగా పెరిగిన తేమ మరియు ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు తెస్తుంది. ఇది మనల్ని ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. వెచ్చని పానీయాలు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ అందించి రోగనిరోధక శక్తి పెంపుకు సహాయపడతాయి.

Img Src : Canva

వర్షాకాలంలో వెచ్చని పానీయాలు ఎందుకు?

వేడి పానీయాలు మరియు సూప్‌లను సిద్దం చేసేందుకు వినియోగించిన కొన్ని పదార్థాలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీవైరల్/యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటంతో అంటువ్యాధులు సోకకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

Img Src : Canva

ద్రవాలతో రోగనిరోధక శక్తి పెంపు:

రుతుపవనాల సమయంలో తప్పక తీసుకోవాల్సినది అల్లం టీ. ఇది శక్తివంతమైన శోథ నిరోధక మరియు యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే దగ్గు మరియు జలుబుతో పాటు సీజనల్ అంటువ్యాధులను నివారించడానికి అల్లం టీ సహాయపడుతుంది.

Img Src : Canva

వర్షాకాలంలో తప్పక తీసుకోవాల్సిన అల్లం టీ:

అల్లం టీ తయారీ కోసం 2 కప్పుల నీటిలో 1 అంగుళం తురిమిన అల్లాన్ని వేసి 5-7 నిమిషాలు ఉడకబెట్టండి. ఆదే సమయంలో కప్పులో కొద్దిగా తేనె మరియు పావు బద్ద నిమ్మకాయ రసాన్ని వేసి సిద్దం చేసుకోవాలి. ఇప్పుడు మరిగిన అల్లం నీటిని కప్పులో వేసుకుని చక్కగా కలుపుకుని తాగాలి.

Img Src : Canva

అల్లం టీని ఎలా తయారు చేయాలి:

పసుపులోని ఔషధ గుణాలకు కారణం దానిలో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, అంతేకాదు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా. వర్షాల సమయంలో ప్రబలంగా ఉండే ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు శరీరానికి వేడిని అందించే అద్భుతమైన వంటింటి దినుసు.

Img Src : Canva

వెచ్చదనాన్ని అందించే పసుపు పాలు:

పసుపు పాల తయారీ చాలా సులభం. ఇందుకోసం 1 కప్పు పాలు వేడి చేసి, అందులో 1/2 టీస్పూన్ పసుపు పొడి మరియు చిటికెడు నల్ల మిరియాల పొడిని జోడించండి. బాగా మరిగిన తరువాత కప్పులోకి వేసుకుని అస్వాదించాలి. అయితే ఈ పసుపు పాలు రాత్రి పడుకునే ముందు త్రాగాలి.

Img Src : Canva

పసుపు పాల తయారీ, తీసుకునే విధానం:

పవిత్ర తులసి టీ (హోలీ బాసిల్ బ్రూ)గా ఖ్యాతి చెందినది. సహజంగా ప్రతీ ఇంటిలో తులసి మొక్కను ఆధ్యాత్మికంగా కొలుస్తారు. అయితే ఇది యాంటీమైక్రోబయల్ సహా ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంది. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఈ టీ ఉత్తమమైనది.

Img Src : Canva

హోలీ బాసిల్ బ్రూ ఖ్యాతి చెందిన తులసి టీ:

తులసి టీ కోసం 5-6 తాజా తులసి ఆకులను ఎంపిక చేసుకుని వాటిని కడిగాలి. ఇప్పుడు ఒక కప్పు నీటిని వేడి చేయాలి. అందులో తులసి ఆకులను వేసి 5 నిమిషాలు మరిగించాలి. వడకట్టి గోరువెచ్చగా త్రాగవచ్చు. తీపిని కోరుకునేవారు తేనెను జోడించుకోవచ్చు.

Img Src : Canva

తులసి టీని ఎలా తయారు చేయాలి:

నిమ్మకాయలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. సాధారణ రుతుపవనాల సమయంలో వర్షంలో తడిసిన చిన్నారుల నుంచి పెద్దల వరకు జలుబు వస్తుంది. ఈ నీరు వాటి నుండి ఉపశమనం కల్పిస్తుంది. వ్యాధుల బారిన పడకుండా రక్షణను అందిస్తుంది.

Img Src : Canva

ప్రభావవంతమైన నిమ్మకాయ, తేనె నీరు:

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని వేడి చేయాలి. బాగా వేడిక్కిన నీటిలో అర నిమ్మకాయ రసం మరియు 1 టీస్పూన్ తేనె కలపాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ అస్వాదించాలి. ఉత్తమ ఫలితాలకు ఇది పరిగడుపున తాగి అరగంట వరకు ఏలాంటి ఆహారం తీసుకోకూడదు.

Img Src : Canva

నిమ్మకాయ, తేనె నీరు తయారీ:

కూరగాయల సూప్ కన్నా దీనిని పోషకాల సూప్ అని అనవచ్చు. ఈ సూప్ విటమిన్లు, ఖనిజాలతో నిండినది. కూరగాయాలలోని ఔషధీయ గుణాలు కూడా కలిగిన కారణంగా ఇది వ్యాధుల నుండి రక్షణతో పాటు శరీరాన్న హైడ్రేట్ చేస్తుంది. వర్షాకాలంలో అవసరమైన పోషకాలను అందిస్తుంది.

Img Src : Canva

పోషకాలతో నిండిన కూరగాయల సూప్:

కూరగాయల సూప్ చేసుకోవడానికి మీకు నచ్చిన కూరగాయలను ఎంపిక చేసుకుని కుక్కర్ లో ఉడికించుకోవాలి. తరువాత దానిలో మరిన్నీ వేడి నీళ్లతో పాటు మిరియాలు, అల్లం, ఇతర సుగంధ ద్రవ్యాలు జోడించుకోవాలి. ఈ సూప్ రంగు మారేంత వరకు ఆగి దించుకుని వడ్డించుకోవడమే.

Img Src : Canva

కూరగాయల సూప్‌ తయారీ ఇలా:

వర్షాకాలంలో మాంసాహార ప్రియుల కోసం చికెన్ సూప్ చక్కని ప్రత్యామ్నాయం. చికెన్ వేపుళ్లు, బిర్యానీలు తినడం కన్నా సూప్ చేసుకుని తాగడం చక్కని ప్రత్యామ్నాయం. ఇది జలుబు, ఫ్లూలకు సాంప్రదాయ నివారణి. ఇది శరీరాన్ని హ్రడైట్ చేయడంతో పాటు వ్యాధుల నుండి కోలుకునేందుకు సహాయపడుతుంది.

Img Src : Canva

వర్షాకాలంలో వేడినిచ్చే చికెన్ సూప్:

చికెన్ సూప్ తయారు చేయడానికి తగినంత చికెన్ తో పాటు కూరగాయలు, అల్లం, వెల్లుల్లి మరియు సుగంధ ధ్రవ్యాలు జోడించి అన్నింటినీ నీటిలో బాగా ఉడకబెట్టుకోవాలి. సూప్ చక్కగా తయారైనాక ఉప్పు మరియు మిరియాలతో సీజన్ చేసి అస్వాదించండి.

Img Src : Canva

చికెన్ సూప్‌ ఎలా తయారు చేయాలి:

పేదవాడి యాపిల్ పండు అని చెప్పుకునే టమాటాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. వర్షాకాలంలో టమాటాల సూప్ తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్లు అందడంతో పాటు శరీరాన్ని వేడెక్కించేస్తుంది. స్పైసీ సూప్ ముక్కు దిబ్బడ, ముక్కు రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది.

Img Src : Canva

స్పైసీ టమాటా సూప్: వేడెక్కించేస్తుంది

టమాటాలను తీసుకుని వాటిని బాగా కలిపి ప్యూరీలా చేయాలి. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని వేయించి, ప్యూరీ చేసిన టమోటాలు, కూరగాయలను నీటిలో ఉడికించాలి. దీనిలో మిరపకాయలు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించండి. అంతే అస్వాదించేందుకు టమాటా సూప్ రెడీ.

Img Src : Canva

స్పైసీ టమాటో సూప్ తయారీ విధానం:

వర్షాకాలంలో అంటు వ్యాధుల వేగంగా ప్రబలుతాయి. వీటి నుండి రక్షించుకోవడానికి మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ వెచ్చని పానీయాలు మరియు సూప్‌లను మీ దినచర్యలో చేర్చుకోండి.

Img Src : Canva

ఈ వర్షాకాలంలో హైడ్రేటెడ్ & ఆరోగ్యంగా ఉండండి!