Img Src : iStockphoto
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు వైద్యులు, పరిశోధకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహిళల కంటే పురుషులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.
Img Src : iStockphoto
ప్రపంచవ్యాప్తంగా అన్ని గుండెపోటు కేసులలో 50శాతం 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో సంభవిస్తున్నాయని, మరీ ముఖ్యంగా వీటిలో నాల్గవ వంతు 30 ఏళ్ల కన్నా తక్కువ వయస్సువారే కావడం గమనార్హం.
Img Src : iStockphoto
గుండెకు ఆక్సిజన్‌తో కూడిన రక్తం సరఫరా నిరోధించబడటం వల్ల ప్రధానంగా గుండెపోటు సంభవిస్తుంది. లేదా దీర్ఘకాలిక గుండె జబ్బులు లేదా అనారోగ్యకర జీవనశైలి కారణంగా కండరాలలోకి రక్తం ప్రవహించడం ఆగిపోవడం వల్ల రావచ్చు.
Img Src : iStockphoto
హార్వర్డ్ ఆరోగ్య అధ్యయనం ప్రకారం, వృద్ధులలో కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణమయ్యే ప్రమాద కారకాల వల్లే యువకులలో ఎక్కువ శాతం గుండె జబ్బులు సంభవిస్తాయని వెల్లడయ్యింది.
Img Src : iStockphoto
గుండె జబ్బులకు గురవుతున్నవారిలో ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ప్రీహైపర్‌టెన్షన్, ఉదర ఊబకాయం, మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్, సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు పెరగడం వంటి కారణాలు ఉన్నాయి.
Img Src : iStockphoto
వీటితో పాటు వ్యాయామం లేకపోవడం, శత్రుత్వ భయం, తక్కువ విద్యార్హత వంటి కుటుంబ చరిత్రతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అధికంగా గుండెపోటుకు ధూమపానం, మద్యపానం వల్లే ప్రమాదం
Img Src : iStockphoto
పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా గుండె జబ్బులు రావచ్చు. సంతృప్తకర కొవ్వు, ట్రాన్స్-ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం హృదయ ధమనులను ప్రభావితం చేస్తుంది. వీటితో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
Img Src : iStockphoto
ఇక వీటికి తోడు మధుమేహం సహా వివిధ రుగ్మతలు కూడా గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక రక్తపోటు, ఊబకాయం, శారీరానికి వ్యాయామం లేకపోవడం కూడా గుండెపోటు ప్రమాదాలను పెంచుతాయి.
Img Src : iStockphoto
ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, ఒత్తిడి లేని వాతావరణంలో జీవించడాన్ని ఎంచుకోవడం గుండెపోటు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇకపైనైనా యువత గుండెబబ్బులు, స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
Img Src : iStockphoto