Img Src : istockphoto
ఉసిరిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలం. దీనికి తోడు అనేక మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో నిండివుంది. దీనిని ప్రతీరోజు తీసుకుంటే అరోగ్యం మీ సోంతం.
Img Src : istockphoto
దీనిలో తీపి, పులుపు, చేదు, ఒగరు, ఘాటు ఐదు రుచులు ఉన్నా ఎక్కువగా పులుపు, ఒగరు నాలుకను డామినేట్ చేస్తాయి. దాంతో దీనికి చాలా మంది దూరంగా ఉంటారు.
Img Src : istockphoto
Img Src : istockphoto
ఉసిరి కాయ, లేదా ఉసిరి రసం రోజూ తీసుకోవడం చాలా మందికి రుచించదు. కాగా, దీనిని రోజు పరిగడుపున తీసుకోవాలని అటు యోగా గురువులు, ఇటు ఆయుర్వేదం చెబుతోంది.
Img Src : istockphoto
ప్రతి రోజు ఒక ఉసిరిని తీసుకోవాలని ఏరోబిక్, ఫిట్ నెస్ కేంద్రాలు, ప్రకృతి అరోగ్య కేంద్రాలు సిఫార్సు చేస్తుండటంతో ఇటీవలి సంవత్సరాలలో ఉసిరి జ్యూస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Img Src : istockphoto
తాజా కూరగాయలు, పండ్ల రసాలను అందించే అనేక రెస్టారెంట్ల మెనులలో ఉసిరి జ్యూస్ కూడా స్థానం కల్పించుకుంది. అయితే ఇంట్లోనే ఉసిరికాయ రసం తయారు చేసుకోవడం ఇలా:
Img Src : istockphoto
ఉసిరి రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే డీటాక్సీఫై డ్రింక్ గా పనిచేస్తూనే.. తక్షణ శక్తిని అందిస్తుంది, కొన్ని రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని ప్రయోజనాలను పొందవచ్చు.
Img Src : istockphoto
తాజా ఆమ్లా జ్యూస్ రెసిపీకి కావలసిన పదార్థాలు: 5 బొద్దుగా ఉండే ఉసిరికాయలు, 2 టేబుల్ స్పూన్లు తేనె, ¼ స్పూన్ ఉప్పు, 300 ml చల్లటి నీరు
Img Src : istockphoto
ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసి, విత్తనాలు తీసివేయండి. మిక్సీలో, కొద్దిగా నీరు పోసి ముక్కలను పేస్ట్‌లా చేసుకుని.. తగినంత నీరు, తేనె వేసి బాగా కలుపితే సరి.
Img Src : istockphoto
ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచి, ఫ్రి ర్యాడికల్స్ ను కట్టడి చేసే ఉసిరి కాయ జ్యూస్ రెడీ. చల్లని నీటితో కలసి మెల్లిగా తీసుకుని ఆస్వాదించండి. ఆరోగ్యంగా ఉండండి.
Img Src : istockphoto
ఉసిరికాయలను నేరుగా తీసుకోని వారు పచ్చళ్లు, జ్యూస్, ఆమ్లా మురబ్బాగా, పోడిగా చేసుకుని నీటిలో కలుపుని చాలా రకాలుగా తీసుకుని అరోగ్యాన్ని పెంపోందించుకుంటారు.
Img Src : istockphoto
ఉసిరి రసం ప్రయోజనాలు: ఉసిరి రసాన్ని త్రిదోషిక్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది శరీరంలోని వాత, పిత్త, కఫ మూడు దోషాలను తొలగిస్తుంది.
Img Src : istockphoto
ఉసిరి పోషకాహారం: ఉసిరిలో కేలరీలు తక్కువ, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు, శక్తివంతమైన మూలం వంటి అనేక ఫినోలిక్ ఫైటోకెమికల్స్‌తో నిండి ఉంది.
Img Src : istockphoto
విటమిన్ సి, విటమిన్ ఎ కాంపౌండ్లలో హోస్ట్ క్యాన్సర్ నివారణ, ఆలస్య వృద్ధాప్యం, మంటతో పోరాడటం, జ్ఞాపకశక్తిని పెంచడం వంటి అనేక వైద్యం ప్రయోజనాలను అందిస్తుంది.