Img Src : Canva

వర్షాకాలంలో ఘనీభవించిన ఆహారాలు అస్వస్థతకు గురిచేయవచ్చు?

వర్షాకాలంలో ఏ ఆహార పదార్థం తింటున్నా.. తరుచుగా ఫుడ్ పాయిజన్ పరిస్థితిని అనుభవిస్తున్నారా.? తాజాగా వండి వార్చిన వేడి అన్నం, లేదా చపాతి లేదా మరేదైనా తిన్నా.. లేక తాగిన తరువాత ఫుడ్ పాయిజన్ అవుతుందంటే అందుకు కారణాలు లేకపోలేదు.

Img Src : Canva

వర్షాకాలంలో పుడ్ పాయిజన్ అవుతుందా?

వర్షాకాలంలో సూక్ష్మక్రీములు పెద్ద సంఖ్యలో గుడ్ల పెట్టి, పురుడు పోసుకునే కాలం అన్నది తెలిసిందే. విరోచనాలు, అతిసారం, అంటువ్యాధులు, ఫ్లూ, టైఫాయిడ్, వైరల్ జర్వాలు వంటి అంటువ్యాధులు సంక్రమణ తెలిసిందే. వీటితో పాటు వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ కూడా సాధరణమే.

Img Src : Canva

సంతతితో విజృంభించే సూక్ష్మక్రీములు

వర్షాకాలంలో మనం ఏమి తింటున్నామన్నది చాలా ముఖ్యం.. ఏం తాగుతున్నామన్నది కూడా అంతే ముఖ్యం. వేసవికాలంలో ఏమి తిన్నా పర్వాలేదా..? అంటే ఔనని చెప్పక తప్పదు. వేసవిలో సూక్ష్మక్రిముల సంఖ్య తక్కువ, అంతేకాదు అంటురోగాలు సంక్రమణ కూడా చాలా తక్కువ.

Img Src : Canva

తినే పదార్థాలను పరిశీలిన అవసరం

వర్షాకాలంలో ఎక్కువగా వేడివేడి ఆహారం తినేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి. తాజా ఆహారం, వేడి ఆహారం తినడం వల్ల.. ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది. ఆహార పదార్థం చల్లారడం ద్వారా దానిపై సూక్ష్మక్రిములు చేరి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

Img Src : Canva

తాజా, వేడి పదార్థాలను తీసుకోవాలి

ఫ్రిజ్‌లో ఫ్యాక్ చేసి ఉంచిన ఆహారాన్ని ఉంచడం చాలా మందికి అలవాటు. వారం లేదా పది రోజులకు సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చి, దానిలో నిల్వచేస్తుంటారు. ఫ్రిడ్జిలోని శీతల వాతావరణం, తేమను అదునుగా చేసుకుని సూక్ష్మక్రీములు చేరుతాయి. తద్వారా ఫుడ్ పాయిజన్ ప్రమాదం పొంచివుంది.

Img Src : Canva

నిల్వ ఉంచిన పదార్థాలతో ఫుడ్ పాయిజన్

ముఖ్యంగా శీతల పానీయాలు, పాలు, పెరుగు, గుడ్లు, తరిగిన కూరగాయాలు, అంతకుముందు వండిన ఆహారపదార్థాలు, ఇలా ప్రిఢ్జిలో నిల్వ చేసుకుని పెట్టుకుంటారు. చాలా మంది పెద్ద పిండి ముద్దను కలిపి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి రోజూ కొద్దికొద్దిగా తీసి చపాతీలు చేసుకొని తింటుంటారు. ఇదే ప్రమాదకరం.

Img Src : Canva

నిల్వ చేసిన పదార్థాలపై బ్యాక్టీరియా

గోపిండి ముద్దలలో నీరు కలిపి ఉంచడం ద్వారా వాటిలోని తేమకు ఆకర్షితులయ్యే బ్యాక్టీరియా, ఫంగస్ చేరుకుంటాయి. ఇవి అటు శీతల వాతావరణంలోనూ పెరుగుతాయి. వీటి కారణంగా ఆహారం విషపూరితంగా మారుతాయి. వీటిని తీసుకోవడంతో ఫుడ్ పాయిజనింగ్‌ దారితీస్తుంది.

Img Src : Canva

చల్లదనమే సూక్ష్మక్రీములకు అనువు

లిస్టెరియా మోనోసైటోజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల చాలా రకాల తీవ్రమైన వ్యాధులు సంక్రమిస్తాయి. ఇది ఫ్రీజ్‌లో తక్కువ ఉష్ణోగ్రతలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సహా అసిడిటీ, మలబద్దకం వంటి పరిస్థితులు కూడా సంక్రమించవచ్చు.

Img Src : Canva

లిస్టెరియా మోనోసైటోజెన్స్ బ్యాక్టీరియాతో జాగ్రత్తా

చపాతీ పిండిని తీసుకుని రోటీలుగా తాల్చిన తరువాత పెనంపై కాలుస్తాం కదా మరి ఫుడ్ పాయిజనింగ్ ఎలా సాధ్యం? పెరుగు లేదా ఇతర ఆహార పదార్థాలలోని బ్యాక్టీరియా, ఫంగస్ పిండిపైకి చేరవచ్చు. ఇక ఈ సూక్ష్మక్రీములు వేడిని కూడా తట్టుకునేవి ఉంటాయన్న విషయం మరువరాదు.

Img Src : Canva

చపాతీ పిండితో ఫుడ్ పాయిజన్?

ఫ్రిజ్‌లో నిల్వ చేసే ప్రతీ పదార్ధం శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. అలాగే ఫ్రిజ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. గోధుమ పిండి ముద్దను ఫ్రిజ్‌లో ఉంచాల్సి వస్తే, గాలి చేరని కంటైనర్‌లో ఒక్క రోజు మాత్రమే నిల్వ చేయాలి, దాటితే ఫుడ్ పాయిజనింగ్ కారణమని గమనించాలి. 

Img Src : Canva

ఫ్రిడ్జిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి

వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ కాకుండా అరోగ్యాన్ని పరిరక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. కూరగాయాలు, గుడ్లు, ఆకుకూరలు, ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు ప్రిడ్జిలో పెట్టకుండా చూసుకోవాలి. దీర్ఘకాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో ఆరోగ్యం దెబ్బతింటుందని గమనించాలి.

Img Src : Canva

ఫుడ్ పాయిజనింగ్ ఎలా నివారించుకోవాలి