మోదుగ చెట్టు: ఆధునిక కాలానికి అనాది వైద్యం

Img Src : iStockphoto

మోదుగ చెట్టు కొన్ని దశాబ్దాల క్రితానికి వెళ్తే అప్పట్లో ఏ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా.. వీటితో చేసిన విస్తరాకులనే వినియోగించేవారు. దీనిని తోసిరాజుతూ రకరకాల పేపర్ విస్తరాకులు మార్కెట్లో వ్యాపించాయి. మరి దీని ఔషధీయ గుణాలు పేపర్ ప్లేట్లకు వస్తాయా.?

Img Src : iStockphoto

మోదుట చెట్టులో ఔషధ గుణాలు:

మోదుగ ఆకుల్లో ఔషధ గుణాలున్నాయి కాబట్టే వాటితో విస్తరాకును చేసి తినేవారు మన పూర్వికులు. అనేక రకాల వ్యాధులకు ఈ చెట్టులోని పలు భాగాలు చికిత్స చేస్తాయి. ఈ చెట్టు ఆసాంతం మనుషలకు వినియోగపడుతుందంటే నమ్మశక్యంగా లేదు కదూ.

Img Src : iStockphoto

మోదుగ విస్తరాకుల్లో భోజనానికి విశిష్టత:

ఫాబేసి కుటుంబంలో బుటియా జాతికి చెందిన మోదుగ శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. దక్షిణ, ఆగ్నేయాసియాలోని ఉష్ణ, ఉప-ఉష్ణమండలాలకు చెందినది. ఇది భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, మలేషియా సహా పలు దేశాల్లో దర్శనమిస్తోంది.

Img Src : iStockphoto

ఉష్ణ-ఉప ఉష్ణ మండలాలకు చెందిన మోదుగ:

పూర్వం హోలీ అంటే మోదుగు పువ్వులకే డిమాండ్. హోలీకి వారం రోజుల ముందు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబెట్టి.. ఉడికించేవారు. చల్లారిన తరువాత ఆ రంగు నీళ్లనే చల్లుకునేవారు. వీటిలోని ఔషధగుణాల వేసవిలో చర్మరోగాలు రావు.

Img Src : iStockphoto

చర్మవ్యాధుల నిర్మూలణలో మోదుగ:

మోదుగ కాయలను వైద్యంలో వాడుతారు. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదం ఉపయోగిస్తారు. మోదుగ ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు మూత్ర సమస్యలు, ఫైల్స్ , ఇన్ఫెక్షన్స్ చర్మ సమస్యలు నివారిస్తాయి.

Img Src : iStockphoto

ఆయుర్వేద వైద్యంలో అనాదిగా మోదుగ:

వీటి ఆకులను గ్లాసు నీటిలో వేసి మరిగించిన తరువాత వచ్చిన కషాయాన్ని నోట్లో వేసుకుని పుక్కిల్లించడం ద్వారా నోటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ కషాయం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్ గానూ, నోటి పూతలను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.

Img Src : iStockphoto

దంత సమస్యల నివారణలో మోదుగ:

ఉబ్బసానికి ఈ చుట్టు జిగురును ఎండబెట్టి పొడి చేసి రోజుకు రెండు గ్రాములు తీసుకోవాలి. మోదుగ జిగురు విరోచనాలలో, డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో వచ్చే విరోచనాలకు ఇది చక్కని పరిష్కారం. కడుపులో ఉండే క్రిములను హరిస్తుంది.

Img Src : iStockphoto

ఉబ్బసం, విరోచనాల ఉపశమనానికి మోదుగ:

ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు, బద్దె పురుగు (టేప్ వార్మ్) లాంటి మొండి ఘటాలకు కూడా మోదుగ చాలా చక్కని పరిష్కారం. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్యలకు కూడా ఇదే ఔషధం. మోదుగ విత్తనాల పొడిని తేనెలో కలిపి ఇవ్వడం ద్వారా వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Img Src : iStockphoto

కడుపులోని టేప్ వార్మ్, రౌండ్ వార్మ్ మోదుగతో చెక్:

మొలల సమస్యకు మోదుగ చక్కని పరిష్కారం. ఫైల్స్ గా పిలిచే ఈ సమస్యకు మోదుగ దివ్యౌషధం. మోదుగ చెట్టు కాడలను తెచ్చి మెత్తగా నూరి మొలల మీద వేసి కట్టు కట్టాలి. ఇలా వారం రోజులు చేస్తూ ఉంటే మొలలు ఊడిపోయి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Img Src : iStockphoto

మొలల సమస్యకు మోదుగ చక్కని పరిష్కారం:

మోదుగ గింజలను జిల్లేడు పాలతో కలిపి బాగా నూరి తేలు కుట్టిన చోట రాయడం వల్ల తేలు కుట్టినపుడు కలిగే నొప్పి తొందరగా తగ్గిపోతుంది. ఏనుగు గజ్జి అనే చర్మవ్యాధి (ఏక్జిమా) వచ్చినవారికి, మోదుగ విత్తనాల పొడిలో, కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రాస్తే ఉపశమనం కనిపిస్తుంది.

Img Src : iStockphoto

తేలు కుట్టిన నోప్పికి విరుగుడునిచ్చే మోదుగ:

మదుమేహానికి మోదుగ ఆకులు శాశ్వత పరిష్కారం. మోదుగ ఆకులు ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. మూత్రంలో మాత్రమే షుగర్ ఉండి గ్లైకోజ్ యూరియా లాంటి పరిస్థితులు ఉన్నవాళ్లకు మోదుగ ఆకుల పొడి చక్కని పరిష్కారం.

Img Src : iStockphoto

మధుమేహానికి మోదుగ ఆకుల శాశ్వత పరిష్కారం:

యజ్ఞయాగాదులలో మోదుగను హోమద్రవ్యంగా వాడతారు. నెయ్యితో కలసి మండటం వల్ల దీనిలోని ఔషధ గుణాలు ద్విగుణీకృతమవుతాయి. ఈ పొగ పీల్చడం వల్ల అనేక జబ్బులు నయమవుతాయి. దీంతో ప్లీహ, శ్లేష్మ రోగాలు, మూల వ్యాధులు నయం అవుతాయి.

Img Src : iStockphoto

మోదుగలోని ఔషధగుణాలు ద్విగుణీకృతం: