Img Src : Canva

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని అందించే పండ్లు

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని అనుకుంటున్నారా? ఈ కాలంలో లభించే ఈ రుచికరమైన పండ్లను తినండి. ఇవి ప్రకృతి ప్రసాదించిన సహజ రుచికరమైన ఇమ్యూనిటీ బూస్టర్లు. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

Img Src : Canva

వర్షాకాలంలో ఇమ్యూనిటీని అందించే పండ్లు

రుతుపవన కాలంలో లభించే పండ్లు పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే సమ్మేళనాల వంటి మంచి పదార్థాలతో నిండి ఉన్నాయి. ఇవి సీజనల్ వ్యాధులతో పాటు జలుబు మరియు ఫ్లూ నుండి రక్షణను అందిస్తాయి.

Img Src : Canva

మాన్సూన్ ఫ్రూట్ అడ్వాంటేజ్

చెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు మరియు మెలటోనిన్ అధికంగా ఉన్నాయి. అవి శరీరాన్ని నోప్పులు, మంట నుండి రక్షణను అందించడంలో సహాయపడతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి. అయితే వీటిని తినడానికి ముందు వాటిని బాగా కడగాలని గుర్తుంచుకోండి.

Img Src : Canva

చెర్రీస్

చెర్రీలను తినడానికి ముందు వాటిని బాగా కడగాలి. వాటిపై సూక్ష్మ క్రీములు తొలగిపోవడంతో పాటు క్రిమి సంహారకాలు దరిచేరకుండా శుభ్రపరచి తినాలి. చెర్రీలను తాజాగా తినండి లేదా స్మూతీస్, సలాడ్‌లు లేదా ఓట్‌మీల్‌లో జోడించండి.

Img Src : Canva

చెర్రీలను ఎలా తినాలి?

రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత పండు దానిమ్మ. వీటిలో ఉండే చిన్న రసభరిత గింజలలో పుష్కళంగా విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫెక్షన్లను నివారించడానికి కీలకంగా ఉంటాయి.

Img Src : Canva

దానిమ్మలు

దానిమ్మ గింజలు తినడం చాలా మందికి ఇష్టం, కానీ దాని గింజలను తీయడం రాకపోవడం చేత దూరంగా ఉండిపోతారు. దానిమ్మ గింజలను తాజాగా ఆస్వాదించండి. పెరుగు, సలాడ్‌లపై చల్లుకోండి లేదా తాజా దానిమ్మ రసం తయారు చేయండి.

Img Src : Canva

దానిమ్మలను ఎలా తినాలి

లిచీ పండ్లు ఇవి తియ్యదనంతో నిండినవే కాకుండా శరీరానికి అర్ధ్రీకరణను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి పుష్కళంగా ఉంటుంది. ఈ పండ్లలో నీటి కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది మరియు సాధారణ జలుబుతో పోరాడుతుంది.

Img Src : Canva

లిచీ

తాజా లిచీ పండ్లను శుభ్రపరచి సురక్షితంగా ఆస్వాదించండి. మీరు పండిన లిచీలను మాత్రమే తింటున్నారని మరియు వాటిని మితంగా తినాలని నిర్ధారించుకోండి. తొక్క తీసే ముందు వాటిని బాగా కడగాలి.

Img Src : Canva

లిచీని తినడం ఎలా:

రేగు పండ్లలో అధిక ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. రేగు పండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరియు వర్షాకాలంలో సాధారణ సమస్య అయిన మలబద్ధకాన్ని నివారిస్తుంది. త్వరిత చిరుతిండిగా ఈ పండ్లు సరైనది.

Img Src : Canva

రేగు పండ్లు

వర్షాకాలంలో జీర్ణక్రియ మందగమనంలో నడవకుండా చురుకైన ప్రేగు కదలికలను ప్రోత్సహించే రేగుపండ్లను మీ ఆహారంలో చిరుతిండిగా జోడించడం మంచిది. వాటిని స్నాక్‌గా తినండి లేదా ఫ్రూట్ సలాడ్, లేదా వెజ్ సలాడ్‌లలో జోడించండి. అవి రుచికరమైనవి మరియు పోషకమైనవి.

Img Src : Canva

రేగు పండ్లను తినండిలా..

బేరి కరిగే ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. మంచి ఫైబర్ కారణంగా బేరి పండ్లు మీ పొట్టపై చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి పేగులకు అనుకూలమైన పండు. వాటిలో విటమిన్ సి మరియు కె కూడా ఉన్నాయి. వీటిలోని గరిష్ట ఫైబర్ అందుకునేందుకు వాటిని చర్మంతో సహా తినాలి.

Img Src : Canva

బేరి

బహుముఖ ప్రయోజనాలను అందించే ఆరోగ్యకరమైన బేరి పండ్లు పోషకాల గనులు. వీటిలోని కరిగే ఫైబర్ వనరులను గరిష్టంగా అందుకోవడం కోసం వాటిని తొక్కతో పచ్చిగా తినండి లేదా కాల్చిన ఆహారాలకు జోడించుకుని తినడం రుచికరంగా ఉంటుంది.

Img Src : Canva

బేరి పండ్లను తినే విధానం:

జామపండ్లలో విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి కడుపుకు ఉపశమనం కలిగిస్తాయి. జామపండ్లు విటమిన్ సి తో నిండి ఉంటాయి మరియు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లతో కూడా సమృద్ధిగా ఉంటాయి.

Img Src : Canva

జామపండ్లు

జామపండ్లను తాజాగా తినడం అందులోనూ అవి పండుగా మగ్గుతున్న తరుణంలోనే తినడానికి సరైన మార్గం. వీటిని బాగా కడిగి పచ్చిగా ఆస్వాదించండి. మీకు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే ఖాళీ కడుపుతో వాటిని తినడం మానుకోండి.

Img Src : Canva

జామపండ్లను ఎలా తినాలి

పీచెస్ ఇవి శరీరాన్ని అర్ద్రీకరణగా ఉంచడంలో ఘనాపాటిలు. ఎందుకంటే వీటిలో అధిక నీటి శాతం ఉండటమే అందుకు కారణం. ఇవి చాలా జ్యుసిగా, విటమిన్లతో నిండి ఉంటాయి. వీటిలోని బీటా-కెరోటిన్‌ మీ చర్మాన్ని గొప్పగా ఉంచుతుంది.

Img Src : Canva

పీచెస్

పీచెస్‌ను తాజాగా అస్వాదించడం ఒక మార్గం. ఇలా వాటిని ఒక స్నాక్ గా తీసుకోవడం ఉత్తమం. అలా కాకుండా వాటిని సలాడ్‌లు, సల్సాలు లేదా స్మోకీ ఫ్లేవర్ కోసం గ్రిల్ చేసిన వాటిలో జోడించి తీసుకోవడం కూడా గొప్పగా ఉంటాయి.

Img Src : Canva

పీచెస్‌ను శుభ్రం చేసి తినండి

వర్షాకాలంలో లభించే అన్ని పండ్లు ఇమ్యూనిటీని అందిస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు బాగా శుభ్రపర్చుకోవడం తప్పని సరి. ముఖ్యంగా వర్షాకాలంలో మురికి లేదా పురుగుమందుల అవశేషాలను తొలగించడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన నీటితో బాగా కడగాలి.

Img Src : Canva

ఒక గోల్డెన్ రూల్:

ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని అందించే పండ్లను అస్వాదిస్తూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. వర్షాకాలం అంతా ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉండటానికి ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి!

Img Src : Canva

చివరి చిట్కా