Img Src : Canva
రుతుపవనాలు విస్తరించి విరివిగా వర్షాలను కురిసే సమయంలో దాని మాటున అంటు వ్యాధులు కూడా ప్రబలుతాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది ఆహారాలు మరియు పానీయాలను నివారించడం ఉత్తమం.
Img Src : Canva
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా ప్రతీ ఒక్కరి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో మిగిలిన ఆహారంపై బ్యాక్టీరియా చేరుతుంది. ఆహార పదార్ధాలను కుళ్లిపోయేలా చేస్తుంది. అందుకనే వర్షాకాలంలో ఆహారం ఎంచుకునేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
Img Src : Canva
వర్షాకాలంలో ఆకుకూరలకు దూరంగా ఉండాలి. పాలకూర, క్యాబేజీ మరియు ఇతర ఆకుకూరలు తడి నేల కారణంగా ధూళి, లార్వా మరియు సూక్ష్మక్రిములను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటిని వేడి నీటిలో బాగా కడగాలి తీసుకోవాలి, లేదా దూరంగా ఉండటం ఇంకా మంచిది.
Img Src : Canva
వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలలో చేపలు, రొయ్యలు వంటి నీటిలో ఉండే ఆహారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం చేపలు మరియు ఇతర జలచలరాశులకు సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో వాటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగవచ్చు.
Img Src : Canva
వర్షాకాలంలో వీధి ఆహారాలకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా చాట్, పానీపూరి (గొల్గప్పాలు) మరియు ఇతర వీధి ఆహారాల తయారీకి ఉపయోగించే నీరు మరియు పదార్థాలు పరిశుభ్రంగా ఉండకపోవచ్చు, ఇది నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల సంక్రమణకు దారితీస్తుంది.
Img Src : Canva
ఇంట్లో పండ్లను చక్కగా కట్ చేసుకుని తాజాగా తినడం చాలా మంచింది. అంతేకాని వీధిలో విక్రేతలు విక్రయించే ప్రీ-కట్ పండ్లు, ముడి సలాడ్స్ బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశంగా ఉంటాయి. తాజాగా కట్ చేసిన పండ్లు మరియు ఇంట్లో తయారు చేసిన సలాడ్స్ మాత్రమే తీసుకోండి.
Img Src : Canva
వర్షాకాలంలో జీర్ణప్రక్రియ నిదానంగా సాగుతుంది. అందుకుని పకోఠాలు మరియు సమోసాలు వంటి భారీ ఆహారాలు, నూనెతో చేసిన స్నాక్స్ జీర్ణం కావడం కష్టం. అధిక తేమ మీ జీర్ణవ్యవస్థను మరింత నెమ్మదింపజేస్తుంది, ఇది ఉబ్బరానికి దారితీస్తుంది.
Img Src : Canva
పుట్టగొడుగులు (మష్ రూమ్) తడిగా, తేమతో కూడిన పరిస్థితులలో పెరుగుతాయి కాబట్టి వర్షాకాలంలో వీటిని తీసుకోకుండా ఉంటే మంచింది. ఎందుకంటే తేమ ఆధారంగా వీటిలో కూడా బ్యాక్టీరియా పెరుగుదలకు చాలా అవకాశం ఉంది. అందుకని వీటిని నివారించడం ఉత్తమం.
Img Src : Canva
కార్బోనేటెడ్ డ్రింక్స్ క్యాటగిరిలోకి వచ్చే ఫిజీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవి జీర్ణ ఎంజైమ్‌ల కార్యకలాపాలను తగ్గించి గ్యాస్ ను పెంచుతాయి. వీటికి బదులుగా తాజా పండ్ల రసాలు, వెచ్చని పానీయాలను ఎంచుకోండి.
Img Src : Canva
పెరుగు మరియు యోగార్ట్ తీసుకోవడం సాధారణంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. అయితే వర్షాకాలంలో వీటిని తీసుకోవడం పునరాలోంచించాలి, ఎందుకంటే యోగార్ట్, పెరుగులపై శ్లేష్మం ఏర్పడుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో జలుబు మరియు దగ్గుకు దారితీస్తుంది.
Img Src : Canva
మొలకెత్తిన విత్తనాలను సాధ్యమైనంత వరకు నివారించండి. వెచ్చగా, తేమగా ఉండే వాతావరణం వాటిలో ఇ. కొల్లీ మరియు సాల్మోనెల్లా (E.coli and Salmonella) వంటి బాక్టీరియా ఏర్పడి కలుషితంగా మర్చే అవకాశం ఉంది. తప్పదు అనుకుంటే వాటిని బాగా ఉడికించి తీసుకోవాలి.
Img Src : Canva
ఊరగాయలలో ఎక్కువ ఉప్పు మరియు నూనె ఉంటుంది. దీని ఫలితంగా ఊరగాయలు తినడం వల్ల ఆయా వ్యక్తులలో నీరు నిలుపుదల కలుగుతుంది. ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది, ఇది తేమతో కూడిన వాతావరణం వల్ల మరింత తీవ్రమవుతుంది.
Img Src : Canva
వర్షాకాలంలో నీటితో సమృద్ధిగా ఉండే పండ్లను తీసుకోవడాన్ని నివారించాలి. ముఖ్యంగా పుచ్చకాయలు మరియు లిచీలు అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. వాటిని సరిగ్గా కడగకపోతే, బ్యాక్టీరియా పండ్లలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణం అయ్యే ప్రమాదం ఉంది.
Img Src : Canva
వర్షాకాలంలో అధిక తేమ ఆహారం వేగంగా మిగిలిపోయిన ఆహారం చెడిపోవడానికి కారణమవుతుంది. వీటితో పాటు ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారాన్ని తరువాత తినడం కూడా అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఎందుకంటే అవి కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
Img Src : Canva
వర్షాకాలంలో చల్లని పదార్ధాలు, ద్రవాలకూ దూరంగా ఉండాలి. చల్లటి నీరు లేదా ఐస్డ్ పానీయాలు తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల జలుబు మరియు ఫ్లూ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి.
Img Src : Canva
వర్షాకాలంలో తాజా పండ్లు, పండ్ల రసాలు తాగడం మంచిది. కానీ, పండ్ల రసాల కోసం రోడ్‌సైడ్ స్టాల్స్ ఆశ్రయించరాదు. వీరు ఉపయోగించే అపరిశుభ్రమైన పదార్థాలు మరియు ఫిల్టర్ చేయని నీరు టైఫాయిడ్, కలరా వంటి వ్యాధుల సంక్రమణానికి కారణం కావచ్చు.
Img Src : Canva
రుతుపవన సమయాల్లో చేపలు తినకూడదు కానీ రొయ్యలు తినవచ్చు అన్న సందేహం వద్దు. ఎందుకంటే వర్షాకాలంలో రొయ్యల్లో బ్యాక్టీరియా పెరుగుదలకు జరుగుతుంది. అందుకని వీటిని ఆస్వాదించడానికి శీతాకాలం లేదా వేసవి వరకు వేచి ఉండటం మంచిది.
Img Src : Canva
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి పరిశుభ్రత ఎంతైన అవసరం. తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో వండిన వేడి వేడి ఆహారాన్ని తిసుకోవడం, కాచి చల్లార్చిన నీరు త్రాగడం, బాగా ఉడికిన ఆహారాలను మాత్రమే తీసుకోవడాన్ని ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.
Img Src : Canva