Img Src : iStockphoto
మెంతులు, మెంతికూర చేదుగా ఉన్నా దీనిలోని అరోగ్య ప్రయోజనాలు మాత్రం ఔషధ భాండాగారమనే చెప్పాలి. అందుకనే ఇవి దేశీయ వంటశాలల్లో విస్తృతంగా ఉపయోగపడతాయి. మెంతులు ఒక ప్రధానమైన పదార్ధం, దీనిని కొద్దిగా కాల్చిన, పొడి లేదా నీటిలో నానబెట్టి అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.
Img Src : iStockphoto
మెంతులు అనేక ఖనిజాలు, విటమిన్లు, పాలీన్యూట్రియెంట్ల పవర్‌హౌస్. కరిగే డైటరీ ఫైబర్‌తో నిండిన ఇది ప్రేగు కదలికలను వేగవంతం చేయడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం కల్పిస్తుంది. గెలాక్టగోగ్‌గా అద్భుతాలు చేసి పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది.
Img Src : iStockphoto
మెంతులు చెడు (LDL) కొలెస్ట్రాల్‌ను తగ్గించి, పెద్దప్రేగు క్యాన్సర్ నుండి గట్ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. వీటిలోని సపోనిన్‌లు, హెమిసెల్యులోజ్, మ్యుసిలేజ్, టానిన్, పెక్టిన్ వంటి కీలక కాంపౌండ్లు కలిగి ఉన్న నాన్-స్టార్చ్ పాలిసాకరైడ్‌లు ఉన్నాయి.
Img Src : iStockphoto
ఆయుర్వేదం ప్రకారం మెంతి గింజలు షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి. అందుకోసం ఒక టీస్పూన్ పెరుగులో మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల మిగిలిన రోజంతా బ్లడ్ షుగర్స్‌ని క్రమబద్ధం చేస్తుంది.
Img Src : iStockphoto
మధుమేహ స్థాయిలు అధికంగా ఉన్నవారు వైద్య సలహా మేరకు అలోపతి మందులు వాడుతూనే మెంతులను జోడించవచ్చు. ఒక చెంచా మెంతులను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే వేటి నీటిలో నానబెట్టిన మెంతులను జోడించి తీసుకోవాలి. ఇది మెరుగైన ఇన్సులిన్ స్రావాన్ని అందిస్తుంది.
Img Src : iStockphoto
మెంతులలోని అద్భుత ఔషధ గుణాలు అనేకం. ఇది జుట్టుకు చక్కని హెయిర్ కండీషనర్. మెంతులను 4 నుంచి 5 గంటలు నానబెట్టి, గ్రైండ్ చేసి పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మీద వేసి అప్లై చేసి, ఒక గంట పాటు వదిలివేయండి. పొడవాటి, నల్లని జుట్టు సోంతం అవుతుంది.
Img Src : iStockphoto
గొంతు నొప్పి, దగ్గు నుండి తక్షణ ఉపశమనం కోసం తేనె, నిమ్మకాయలో ఒక టీస్పూన్ మెంతి పొడిని కలపి తీసుకోండి. పచ్చి మెంతి ఆకులను పప్పుతో కలిపి వండడం లేదా కూరలు, గ్రేవీలపై ఎండు మెంతి ఆకులను చిలకరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Img Src : iStockphoto
మెంతులు కొద్దిగా టోస్ట్ చేసి, దానిని పొడిగా మార్చి.. కూరలు, పప్పులపై కొద్దిగా చిలకరిస్తే, ప్రత్యేకమైన రుచి, జీర్ణక్రియకు సహాయపడతాయి. దోస పిండిలో ఒక టీస్పూన్ మెంతి గింజలను జోడించడం వల్ల డిష్‌కి అందమైన రంగు, క్రిస్ప్‌నెస్ వస్తుంది.
Img Src : iStockphoto
Thanks for reading!
Img Src : iStockphoto