Img Src : iStockphoto
చమోమిలే టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడివేన్నందున ప్రస్తుతం దీని పేరు మార్మోగిపోతోంది. నాడీ వ్యవస్థను శాంతపర్చే లక్షణాలు కలిగి చక్కని నిద్రను ప్రోత్సహించే చమోమిలే టీ నిద్రలేమి తగ్గించి, ఉబ్బరం, అజీర్తిల నుంచి ఉపశమనం అందిస్తుంది.
Img Src : iStockphoto
చమోమిలే టీలో ప్రశాంతపర్చే లక్షణాలు ఉన్నా కారణంగా శరీరాన్ని శాంతింపజేసి, ఆందోళనను తగ్గించి, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఇది ఒత్తిడి, నిద్రలేమికి సహజ నివారణి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకు దోహదపడతాయి.
Img Src : iStockphoto
చమోమిలే టీలోని లక్షణాలు జీర్ణ ప్రయోజనాలతో పాటు కడుపు నొప్పి, అజీర్తీ నుండి ఉపశమనం కల్పిస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణశయాంతర పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Img Src : iStockphoto
చమోమిలే టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన కాంపౌండ్లు శరీరంలో మంటను తగ్గించి, ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ చర్మ పరిస్థితుల నుంచి రక్షణనిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి.
Img Src : iStockphoto
చమోమిలే టీని దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో తరచుగా ఉపయోగిస్తారు. ఇది చర్మపు చికాకుల మంట నుంచి ఉపశమనం కల్పించి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
Img Src : iStockphoto
చమోమిలే టీ తాగడం వల్ల కడుపు నొప్పి, కండరాల నొప్పులు వంటి ఋతు తిమ్మిరి లక్షణాలను తగ్గించవచ్చు. దీని లక్షణాలు కండరాలలో ఒత్తిడిని తగ్గించి అసౌకర్యం నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
Img Src : iStockphoto
చమోమిలే టీని సాధారణంగా సహజ నిద్రకు ఉపయోగిస్తారు. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపర్చి, నిద్రలేమిని తగ్గిస్తుంది. ఎలాంటి ఒత్తిడి, అందోళన లేకుండా చేస్తుంది. ఇక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది
Img Src : iStockphoto
Img Src : iStockphoto
కొంతమంది చమోమిలేకి అలెర్జీని కలిగి ఉంటారు. వీరికి చర్మంపై దద్దుర్లు, దురదలు వంటి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడవచ్చు. రాగ్‌వీడ్ లేదా మేరిగోల్డ్స్ వంటి మొక్కలకు అలెర్జీ ఉన్న వ్యక్తులు కూడా చమోమిలేతో క్రాస్-రియాక్టివిటీని అనుభవించవచ్చు.
Img Src : iStockphoto
చమోమిలే టీ రక్తాన్ని పలుచన చేసే మందులు, మత్తుమందులు, యాంటి యాంగ్జైటీ డ్రగ్స్ తో సంకర్షణ చెందుతుంది. చమోమిలే టీని క్రమం తప్పకుండా తీసుకునే ముందు ఇలాంటి మందులు తీసుకునేవారు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
Img Src : iStockphoto
గర్భిణీ స్త్రీలు చమోమిలే టీతో గర్భస్రావం, అకాల పుట్టుక ప్రమాదం కలగవచ్చు. నిద్రను ప్రేరేపించే గుణాల కారణంగా పెద్దమొత్తం మగత కారణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణాల కారణంగా షుగర్ పేషంట్లు ఈ టీ తాగితే షుగర్ పరిశీలించుకోవాలి.
Img Src : iStockphoto
చమోమిలే టీ తక్కువ రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరమే అయినా కొంతమంది కడుపు నొప్పి, వికారం అనుభవించవచ్చు. చమోమిలే టీ కంటికి చేరువగా తీసుకువస్తే కంటి చికాకు కలగవచ్చు. దీనిని శిశువులకు సిఫార్సు చేయలేదని గమనించాలి
Img Src : iStockphoto