Img Src : iStockphoto
వేసవి వచ్చిందంటే చాలు అనేక రకాల శీతల పానీయాలను ఫ్రిడ్జీలోకి డౌన్ లోడ్ చేసేవారి సంఖ్యకు కొదవలేదు. దుష్ర్పభావాలు ఉన్నా తప్పడం లేదు అందుకు కారణం గ్రీష్మతాపం. కానీ ఒంటికి చలవ చేసే ఐస్ యాపిల్ గురించి తెలుసా.?
Img Src : iStockphoto
జ్యూసి ద్రవంతో నిండిన అద్భుతమైన శీతలీకరణ లక్షణాలను కలిగి ఉన్న ఈ పండు వేసవిలో విరివిగా లభ్యమవుతుంది. లేలేత కొబ్బరి రుచిని కలిగిన ఈ పండులో వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, సంపూర్ణ చక్కర మిశ్రమాలను అందిస్తుంది.
Img Src : iStockphoto
ఈ పండును ఆంగ్లంలో పామ్యారా, తడ్ గోలా, పామ్ ఫ్రూట్, కల్లు తాటి పండు, ఇక హిందీలో తడ్గోలా, తమిళంలో నుంగు అని పిలుస్తారు. తెలుగులో ‘తాటి ముంజలు’ అని పిలిచే ఈ పండులో అనేక అరోగ్య ప్రయోజనాలను ఉన్నా కాలరీలు మాత్రం చాలా తక్కువ.
Img Src : iStockphoto
100 గ్రాముల ఐస్ యాపిల్ లో 43 కేలరీలు, 11 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్‌లను సమృద్ధిగా అందిస్తుంది. ఇంకా తక్కువ మొత్తంలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, ఎ, ఇ, కె, బి7, ఐరన్‌లను కలిగి ఉంది.
Img Src : iStockphoto
తాటి ముంజలు అద్భుతమైన శీతలకరణిగా పనిచేసి వేసవిలో శరీరాన్ని సహజంగా చల్లబర్చి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది దాహాన్ని తీర్చి రోజంతా చురుగ్గా ఉండేలా శక్తిని చేస్తుంది. ఇది ఉదర, జీర్ణ సమస్యల సహజ నివారణి.
Img Src : iStockphoto
ఈ పండ్లు మలబద్ధకం నుండి ఉపశమనం కల్పించి, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఎసిడిటీ, పొట్ట అల్సర్ల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో చిన్న చిన్న కడుపు నోప్పులు, వికారాన్ని కూడా తగ్గిస్తుంది.
Img Src : iStockphoto
ఈ పండు సోడియం, పొటాషియంలకు మంచి మూలం. దీంతో శరీరంలో ద్రవం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడి, డీహైడ్రేషన్, అలసటను నివారిస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
Img Src : iStockphoto
ఇందులోని ఫైటోకెమికల్స్ ఉండటం వల్ల బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి వృద్ధాప్యతను మందగించడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
Img Src : iStockphoto
వేసవిలో వచ్చే చమటకాయ, శగ గడ్డల వంటి చర్మ సమస్యల ప్రభావిత ప్రాంతాల్లో దీని గుజ్జును పూయడం వల్ల దురద నుండి ఉపశమనం, ఓదార్పు లభిస్తాయి. ఇవి సహజంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి.
Img Src : iStockphoto
తాటి ముంజల్లోని నీటి ఉనికి మిమ్మల్ని చాలా సేపు సంతృప్తిగా ఉంచుతుంది. కాగా, ముదిరిన తాటి ముంజలతో కడుపు నొప్పి రావచ్చు. ఇక వీటిని ఒక్క రోజులో తినకపోతే ఈ పండు పాడవుతుంది.
Img Src : iStockphoto