Img Src : iStockphoto
పురాతన అయుర్వేత వైద్య విధానం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడానికి పలు మూలికా ఔషధాలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను తొలగించడంలో సహాయపడే ఆయుర్వేద మూలికలు కూడా చాలనే ఉన్నాయి:
Img Src : iStockphoto
ఇండియన్ బీచ్ అని పిలవబడే కానుగ చెట్టు గింజలలోని పప్పు కూడా మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. మూడు గ్రాములు పప్పు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి తాగితే మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును.
Img Src : iStockphoto
బార్లీ (యవాక్షరం, బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజుల వరకు తీసుకుంటే రాళ్లు కరిగి పడిపోతాయి. దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం తీసుకుంటే ఉత్తమ ఫలితం లభించును.
Img Src : iStockphoto
వేప ఆకుల్లోని ఔషధ గుణాలు తెలిసినవే. కొన్ని వేప ఆకులను నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకుంటే కిడ్నీలలో రాయి కరిగిపోవును. రోజు ఉదయం, సాయంకాలు తీసికోవాలి.
Img Src : iStockphoto
తిప్పతీగ (టినోస్పోరా కార్డిఫోలియా) శరీరం నుంచి విషవ్యర్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం, మూత్రపిండాల్లో రాళ్లను సహజంగా తొలగించడంలో సహాయపడుతుంది.
Img Src : iStockphoto
ఆంగ్లంలో బ్రయోఫిలమ్ పిన్నటం, సంస్కృతంలో పాశానబేధి అని పిలిచే రణపాల మొక్క ఆకుల రసంతోనూ రాళ్లు కరిగిపోతాయి. ఈ ఆకుల రసం 6 గ్రాములు తీసుకుని దానికి కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతిరోజు రెండుపూటలు తాగితే చాలు.
Img Src : iStockphoto
పల్లేరు (గోక్షుర) చూర్ణం ఒక స్పూన్, కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరువాత ఈ నీటిని ప్రతిరోజు రెండు పూటలు తీసుకొవాలి. పల్లేరు మూత్ర నాళాల పనితీరు మెరుగుపర్చి, రాళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటుంది.
Img Src : iStockphoto
పొద్దుతిరుగుడు చెట్టు వేర్లలోనూ రాళ్లను కరిగించే గుణం ఉంది. ఈ చెట్టు వేర్ల పొడి 25 గ్రాములు, ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి, దానిని ప్రతి రోజు ఉదయం సాయంత్రాలు కొన్ని రోజులు తీసుకుంటే రాళ్లు కరిగి పడిపోతాయి.
Img Src : iStockphoto
వెల్లులిలో అద్భుత ఔషధగుణాలు ఉన్నాయి. కిడ్నీలలో రాళ్లు ఉన్నవారు పూటకు రెండు వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి గుజ్జు నమిలి తింటే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయ్. అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు.
Img Src : iStockphoto
పాతబియ్యపు అన్నం, యవలు, గోధుమలు, ఉలవలు, పెసలు, మజ్జిగ, ఆవునెయ్యి, ఆవుపాలు, అల్లం, చక్కెర, బూడిద గుమ్మడికాయ, పొట్లకాయ, కొండపిండికూర, పల్లేరుకూర, చిర్రికూర, పెరుగుతోటకూర, ఖర్జురము, వెదురుమొలకలు, కొబ్బరికాయ, తాటిముంజలు, మేకమాంసం.
Img Src : iStockphoto
చద్దన్నం, తాంబులం, అధిక ఉప్పు, ఎక్కువ నూనె, పిండివంటలు, నువ్వులపిండి, పులుసు, ఇంగువ, నువ్వులు, ఆవాలు, మినుములు, మామిడికాయ, వెల్లుల్లి వంటి వేడివస్తువులు, మలబద్దకం కలిగించే ఆహారాలు, కోడిమాంసం, పందిమాంసం, చేపలు, మద్యం తీసుకోరాదు.
Img Src : iStockphoto
ఆయుర్వేద మూలిక వైద్యం కొందరిలో ఉపశమనం కలిగించినప్పటికీ, రోగ నిర్థారణ, చికిత్స విధానం తీసుకునే సమయానికి రాళ్లు ఏ సైజులో ఉన్నాయన్న వివరాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకు అలోపతి వైద్యులను కలసి వారి సలహాలు తీసుకోవడం అవసరం.
Img Src : iStockphoto