Img Src : iStockphoto
ఉసిరికాయలో అసంఖ్యాక ఔషధ గుణాలున్నాయి. ఆకుపచ్చ గుజ్జుతో నిండిన చిన్న జ్యూసీ ఉసిరి అత్యంత శక్తివంతమైనది. ఆయుర్వేద గ్రంధాలలో ‘అమలాకి’గా ప్రసిద్ధి చెందిన ఉసిరి శాస్త్రీయనామం ఎంబ్లికా అఫిసినాలిస్.
Img Src : iStockphoto
రోగనిరోధక శక్తిని మెరుగుపర్చి, జీవక్రియ పెంపోదించే ఉసిరిని ప్రతిరోజూ పరిగడుపు సేవనం దీర్ఘాయువు పొందడమే. పంచ రుచుల 'దివ్యౌషధం'లో విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, ఖనిజాలు, పోషకాలు మేళవితం.
Img Src : iStockphoto
శీతాకాలంలో ఉసిరికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లభ్యత. హిందూ ఆచారాల మేరకు కార్తీక మాసంలో భక్తులు శివుడికి ఉసిరి దీపాలను సమర్పిస్తారు. ఉసిరి దంచి తలకు, ఒంటికి పట్టించే మతాచారంతో జుట్టు సమస్యలు, చర్మవ్యాధుల నివారణ.
Img Src : iStockphoto
వాత, పిత్త, కఫ, అసమతుల్యత కారణంగా సంభవించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ నుండి ఉపశమనం కల్పించే ఉసిరిలోని యాంటీ-ఆక్సిడెంట్ల శక్తి క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
Img Src : iStockphoto
ఉసిరి ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు, ఫినోలిక్ ఫైటోకెమికల్స్‌తో నిండి ఉంది. విటమిన్ సి, విటమిన్ ఎ మొక్కల సమ్మేళనం హోస్ట్ క్యాన్సర్ నివారణ, ఆలస్య వృద్ధాప్యం, జ్ఞాపకశక్తిని పెంచడం వంటి అనేక వైద్యం ప్రయోజనాలను అందిస్తుంది.
Img Src : iStockphoto
మధుమేహ వ్యాధిగ్రస్తులలో ప్యాంక్రియాటైటిస్‌ను నివారించి, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా సక్రమంగా నిర్వహిస్తుంది. విటమిన్ సి ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాలను తిప్పికొడుతుంది.
Img Src : iStockphoto
ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలలో ముఖ్యంగా ఫోటాషియం అధిక రక్తపోటును అరికడుతుంది. ఆమ్లా సేవనం వల్ల రక్తపోటు తగ్గి, హృదయ సంబంధ వ్యాధులు తగ్గి, రక్త నాళాలను విస్తరించి, రక్తపోటు వివిధ లక్షణాలను నియంత్రిస్తుంది.
Img Src : iStockphoto
మహిళల్లో సంతానోత్పత్తి మెరుగుపరచడానికి, రుతుచక్రాన్ని నియంత్రించి, హార్మోన్ల సమతుల్యం చేయడంలోనూ ఉసిరి పోరాడుతుంది. జీవక్రియను ప్రేరేపించి, అవాంఛిత ప్రదేశాలలో కొవ్వును నిరోధించి, విషవ్యర్థాలను బయటకు పంపుతుంది.
Img Src : iStockphoto
ఉసిరి సహజ బ్లడ్ ఫ్యూరిఫైయర్. ఉసిరి తీసుకోవడం వల్ల చర్మం లోపల నుండి నిగారింపు వస్తుంది. మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. వృద్దాప్య ఛాయలను అటంకపరుస్తుంది.
Img Src : iStockphoto
ఉసిరి కాయతో జుట్టు మూలాల నుండి కుదుళ్లను బలోపేతం చేసి, చనిపోయిన కణాలను కొత్త వాటితో భర్తీ చేస్తుంది. జుట్టును సహజంగా నల్లగా మార్చగల పదార్ధంగా ఉసిరి ప్రాచుర్యం పొందింది. పిత్త దోషాల నుండి ఉపశమనం కల్పించి, తెల్ల వెంట్రుకలను అడ్డుకుంటుంది.
Img Src : iStockphoto
ఐరన్, కెరోటిన్ పుష్కలంగా ఉన్న ఉసిరి, ఆకస్మిక జుట్టు రాలడం, విరిగిపోవడానికి ఒక అద్భుత నివారణి. కుదుళ్లను రూట్ నుండి కొన వరకు బలోపేతం చేస్తుంది. ఉసిరి నూనె జుట్టుకు కండీషనర్‌లా పనిచేస్తుంది. చుండ్రు నివారణ, స్కేలింగ్, దురదను నివారిస్తుంది.
Img Src : iStockphoto
ఉసిరిని పండులా, లేదా జ్యూస్ చేసుకుని లేదా అమ్లా మురబ్బా, లేదా ఉసిరి పచ్చడిగా చేసుకుని అస్వాదించండి. ఇక ఉసిరి పోడిని ఉదయాన్నే నీళ్లలో కలుపుకుని తాగవచ్చు. ఉసిరి నూనెను తలకు పట్టించవచ్చు. మరెందుకు ఆలస్యం..!
Img Src : iStockphoto