ఇంట్లో ఆమ్లా మురబ్బా, ఉసిరి ఊరగాయ చేయండిలా: రెసిపీ

Img Src : iStockphoto

దక్షిణ భారతదేశంలోని అనేక ఇళ్లలో, ఉసిరికాయ పచ్చడి ప్రధానంగా ఇష్టపడితే.. ఉత్తరాదిన మాత్రం ఉసిరిని ‘అమ్లా మురబ్బా’గా ఆస్వాదిస్తారు. ఉత్తరభారతంలో మురబ్బా చాలా ప్రసిద్ధి చెందింది. క్యాండీలు, చట్నీలు, రసం, అనేక రకాలుగా విస్తృతంగా ఉపయోగిస్తారు

Img Src : iStockphoto

ఆమ్లా మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు: 15 తాజా ఉసిరి, 250 గ్రాముల చక్కెర, 15 గ్రాముల ఇలైచి పొడి. తయారీ విధానం: ఉసిరికాయలను కడిగి ఆరనివ్వండి. ఫోర్క్‌తో పండ్లలో రంధ్రాలు చేయండి.

Img Src : iStockphoto

ఆమ్లా మురబ్బా

ఒక పాత్రలో నీటిని మరిగించి, ఉసిరికాయలు వేసి మెత్తగా అయ్యే వరకు (15 నిమిషాలు) ఉడకనివ్వండి. తరువాత నీటిని తీసివేసి, పండ్లను పక్కన పెట్టండి. మూడు కప్పుల నీటిలో చక్కెర వేసి మరిగించి.. ఆ తరువాత ఉడకబెట్టిన ఉసిరికాయలు వేసి 30 నిమిషాలు ఉండనివ్వండి.

Img Src : iStockphoto

చక్కెర నానబెట్టిన ఉసిరికాయను 2 రోజులు ఫ్రీజ్ లో కాకుండా పక్కన పెట్టండి. ఆతరువాత షుగర్ సిరప్‌ను డీప్ బాటమ్ పాన్‌లో వేసి.. మంట మీద ఉంచండి, యాలకుల పొడి జోడించండి. పారుదల పండ్లను వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

Img Src : iStockphoto

చల్లబడిన తరువాత గాలి చొరబడని గాజు కంటైనర్ లో భద్రపర్చండి. ఎలాంటి శీతలీకరణ లేకుండా ఇది ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇది ప్రసిద్ధ రాజస్థానీ వంటకం, ఏడాది పోడవునా ఆస్వాదించవచ్చు. వీటిని తినడం వల్ల తక్షణ శక్తిని అందిస్తుంది.

Img Src : iStockphoto

ఉసిరి ఊరగాయకు కావాల్సిన పదార్థాలు: 10-12 తాజా ఉసిరికాయలు, 2 టేబుల్ స్పూన్లు ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 4 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె, 100 గ్రా కారం పొడి, 50 గ్రా పసుపు, రుచికి తగినంత ఉప్పు.

Img Src : iStockphoto

ఉసిరి ఊరగాయ

తయారీ విధానం: ఉసిరికాయలను కడిగి ఆరబెట్టిన తరువాత ప్రతి పండుపై 4 కోతలు కోయండి. కడాయిలో నూనె వేసి ఉసిరికాయలు వేయాలి. బంగారు రంగు వేయించాలి. చల్లారిన తరువాత ఆవాలు, మెంతి, మిరియాల పొడి, ఉప్పు వేయాలి.

Img Src : iStockphoto

పూర్తిగా చల్లబడిన తరువాత బాగా కలుపుకోవాలి. దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. వారం రోజుల తరువాత టిఫిన్స్, అన్నం, చపాతి, రోట్టెలతో వేడిగా వడ్డించుకుని అస్వాదిస్తే.. బాగుంటుంది. కొందరు మాత్రం మూడు రోజుల నుంచే అస్వాదిస్తుంటారు.

Img Src : iStockphoto

ఉసిరి ఊరగాయ ఏడాది వరకు నిల్వ ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడే ఊరగాయలో వేసిన ఆవాలలో మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. మెంతిలో డైటరీ ఫైబర్ పుష్కళం, ఇవి జీర్ణక్రియను ప్రోత్సహించి, చక్కెరలను స్థిరీకరిస్తుంది.

Img Src : iStockphoto