Img Src : iStockphoto
ఇంట్లో చేసిన ఆహారంతో ఏ మందులు, టానిక్ మీద ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా ఆహారంలో ఈ టాప్ ఐదు కూరగాయలను జోడించుకోవడమే. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
Img Src : iStockphoto
ప్రతీరోజు కూరగాయలు తింటాం కదా. మళ్లీ వర్షాకాలంలో ప్రత్యేకంగా ఐదు ఉత్తమ కూరగాయలు ఏమిటీ.? అని అలోచనలో పడకండి. వర్షాకాలంలో ఫిట్‌గా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ తినాల్సిన ఐదు రకాల కూరగాయలు ఇవే..
Img Src : iStockphoto
సొరకాయలో ఉండే అధిక నీటి శాతం కారణంగా, శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంది కాబట్టి జీర్ణవ్యవస్థ మేలు చేస్తుంది. ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల హానికరమైన టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
Img Src : iStockphoto
క్యాప్సికమ్ విటమిన్ సి అద్భుతమైన మూలం, ఇది రోగనిరోధక శక్తిని పెంచి, మంచి పోషకాలను అందిస్తుంది. కాగా, 100 గ్రా ఎరుపు రకం క్యాప్సికమ్ లో 127.7మిగ్రా విటమిన్ సహా శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. మిగతా రకాలలో కన్నా ఇది అధికం.
Img Src : iStockphoto
బెండకాయలలో రోగనిరోధక శక్తితో పాటు విటమిన్లు A, C, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. వర్షాకాలంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం అరోగ్య కారకమే.
Img Src : iStockphoto
బ్రోకలీ విటమిన్ సి గొప్ప మూలం. ఇందులోని బీటా-కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఐరన్, వంటి ఇతర పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
Img Src : iStockphoto
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే కాకరకాయ యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీని ప్రయోజనాలను పొందేందుకు ఉదయాన్నే ఒక గ్లాసు కాకర జ్యూస్ తాగితే చాలు.
Img Src : iStockphoto
మీ వంటగదిలో ఈ కూరగాయలను నిల్వ చేసుకోండి, వర్షాకాలంలో ప్రతిరోజు ఆహారంలో ఈ కూరగాయాలను కూడా భాగం చేసుకుని అస్వాధించడం వల్ల అరోగ్యానికి అరోగ్యంతో పాటు అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చు. మరెందుకు ఆలస్యం మార్కెట్ కు వెళ్తే వీటిని తెచ్చుకోండి.!
Img Src : iStockphoto
Thanks for reading!
Img Src : iStockphoto