Img Src : Canva

వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన 10 కూరగాయలు!

వర్షాకాలంలో అంటువ్యాధులు సోకకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం తప్పక తీసుకోవాల్సిన 10 కూరగాయల జాబితాను ఇస్తున్నాం. ఇవి ఇన్ఫెక్షన్లను అధిగమించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి!

Img Src : Canva

వర్షాకాలంలో తప్పక తీసుకోవాల్సిన కూరగాయలు

వర్షాకాలం అధిక తేమ మరియు ఇన్ఫెక్షన్లను కూడా తీసుకువస్తుంది. సరైన కూరగాయలు తినడం వల్ల జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది మరియు కాలానుగుణ వ్యాధులను దూరంగా ఉంచుతుంది.

Img Src : Canva

వర్షాకాలంలో కూరగాయల ఎంపిక ఎందుకు ముఖ్యం

వర్షాకాలంలో సోరకాయ తీసుకోవడం చక్కని ఎంపిక. ఇది తేలికైనది మాత్రమే కాదు సులభంగా జీర్ణం అవుతుంది. వర్షాకాలంలో శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది బరువు నిర్వహణ మరియు నిర్విషీకరణలో సహాయపడుతుంది.

Img Src : Canva

సోరకాయ (Bottle Gourd)

వర్షాకాలంలో చేదు కూరగాయలు మంచివి. అందుకనే కాకరకాయలకు ఈ కాలంలో డిమాండ్ ఎక్కువ. ఇవి అంటువ్యాధులు సోకకుండా రోగనిరోధక శక్తిని పెంచి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చక్కెర స్థాయిలను నియంత్రించి, కాలానుగుణ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

Img Src : Canva

కాకరకాయ (Bitter Gourd)

పొడుగు సోరకాయలో మాదిరిగానే గుండ్రని సొరకాయలో కూడా నీటి శాతం మరియు ఫైబర్‌తో అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

Img Src : Canva

గుండ్రని సోరకాయ (Apple Gourd)

బీరకాయలో ఆహార ఫైబర్ అధికంగా ఉండటంతో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బీరకాయలు బరువు నియంత్రణకు సహాయం చేయడంతో పాటు కాలేయ ఆరోగ్యానికి మరియు శరీర నిర్విషీకరణ చేయడానికి చక్కగా పనిచేస్తుంది.

Img Src : Canva

బీరకాయ (Ridge Gourd)

వర్షాకాలంలో నీరు తాగకపోవడంతో శరీరం వేడి చేసే ప్రమాదాన్ని పోట్లకాయ తగ్గిస్తుంది. దీని శీతలీకరణ ప్రభావంతో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది.

Img Src : Canva

పొట్లకాయ (Snake Gourd)

వర్షాకాలంలో ఆకుకూరలు పచ్చివి తినకూడదు. అయితే పాలకూరను బాగా వండిన తీసుకోవడం ద్వారా ఇనుము, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి. కాలుష్యాన్ని నివారించడానికి వర్షాకాలంలో ఎల్లప్పుడూ పాలకూరను ఉడికించాలి.

Img Src : Canva

పాలకూర (Spinach)

క్యారెట్లు సంవత్సరం పోడుగునా తీసుకోదగిన కూరగాయ. దీనిలోని బీటా-కెరోటిన్ మరియు విటమిన్ ఎ కంటికి, దృష్టికి ఎంతో ఉపయోగపడుతుంది. కంటి చూపు మరియు చర్మ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.

Img Src : Canva

క్యారెట్లు (Carrots)

బీట్ రూట్ శరీరంలో రక్త ఉత్పత్తిలో మద్దతు చేసయడంతో పాటు స్థైర్యాన్ని పెంచుతుంది మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తపోటును నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.

Img Src : Canva

బీట్‌రూట్ (Beetroot)

కూర గుమ్మడికాయలో ఫైబర్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Img Src : Canva

గుమ్మడికాయ (Pumpkin)

మెంతికూరను ఏడాది పొడుగునా తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియ & మధుమేహ నిర్వహణకు అద్భుతమైనది. ఉబ్బరాన్ని నివారిస్తుంది మరియు చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

Img Src : Canva

మెంతికూర (Fenugreek Leaves)

కూరలు వండే ముందు అన్ని కూరగాయలను బాగా కడగాలి. ఎల్లప్పుడూ సరిగ్గా ఉడికించాలి. వీధి వ్యాపారుల నుండి ఆకుకూరలను నివారించండి. వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకోరాదు.

Img Src : Canva

గుర్తుంచుకోవాల్సిన అంశాలు (Things to remember)

సీజనల్‌ కూరగాయలను తీసుకోండి. అవి కాలానుగూణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో మద్దతుగా నిలుస్తాయి. ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, ముందస్తు భద్రతా చర్యలు తీసుకోండి!

Img Src : Canva

చివరిగా: