Home లవ్ & రిలేషన్షిప్ నిపుణుల సలహాలు పురుషులలో సంతానోత్పత్తి.. వీర్యపుష్టికి మార్గాలు తెలుసా?

పురుషులలో సంతానోత్పత్తి.. వీర్యపుష్టికి మార్గాలు తెలుసా?

0
పురుషులలో సంతానోత్పత్తి.. వీర్యపుష్టికి మార్గాలు తెలుసా?

మీరు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ సమస్య మీ ఒక్కరిదీ కాదు. ఈ మధ్యకాలంలో సంతానోత్పత్తి సమస్య మీరు అనుకున్నదానికంటే చాలా పెరిగింది. సాధారణంగా కూడా మారిందని చెప్పడానికి ప్రతీ నగరంలో పుట్టగోడుగుల్లా వెలుస్తున్న ఫర్టిలిటీ సెంటర్లే నిదర్శనం. ప్రతి ఆరు జంటలలో ఒకరిని ఈ సమస్య ప్రభావితం చేస్తుందంటే అతిశయోక్తికాదు. ప్రతి మూడు కేసులలో ఒకటి పురుష భాగస్వామిలో మాత్రమే సంతానోత్పత్తి సమస్యల కారణంగా ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వంధ్యత్వం సమస్యను ప్రతీ ఒక్కరిలో చికిత్సలతో నయం చేయడం అన్నది సాధ్యంకాకపోవచ్చు.

అయితే, మీ వల్ల మీ భాగస్వామి గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దామా.? ఆరోగ్యకరమైన ఆహారం, సప్లిమెంట్లు మరియు ఇతర జీవనశైలి వ్యూహాలతో సంతానోత్పత్తిని కొన్నిసార్లు మెరుగుపరచవచ్చు. ఈ కథనం పురుషులలో మెరుగైన సంతానోత్పత్తికి సంబంధించిన కొన్ని ప్రధాన జీవనశైలి కారకాలు, ఆహారాలు, పోషకాలు మరియు సప్లిమెంట్‌లను జాబితా చేస్తుంది. శిశువు తీవ్రమైన అనారోగ్యంతో ఏడుస్తుంటే వారి సంకేతాలను గ్రహించండీ. మీ శిశువులో భిన్నమైన లేదా ఆందోళనకర ప్రవర్తన ఉంటే అదేమిటో మీరు తెలుసుకోండీ.

పురుషులలో సంతానోత్పత్తి లేమికి కారణమేంటే?

సంతానోత్పత్తి అనేది వైద్య సహాయం లేకుండా పునరుత్పత్తి చేయగల వ్యక్తుల సామర్థ్యాన్ని సూచిస్తుంది. పురుషులలో సంతానోత్పత్తి లేకపోవడం కారణంగా ఆ మగవారు తమ భాగస్వామిని గర్భవతిని చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా అతని వీర్య కణాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సంతానోత్పత్తి లేకపోవడం లైంగిక పనితీరుతో ముడిపడి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇది వీర్యం నాణ్యతతో ముడిపడి ఉంటుంది. ప్రతిదానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:

Boost Male Fertility
  • లిబిడో / సెక్స్ డ్రైవ్: లిబిడో అనేది సెక్స్ చేయాలనే వ్యక్తి కోరికను వివరిస్తుంది. లిబిడోను పెంచే ఆహారాలు లేదా సప్లిమెంట్లను అఫ్రోడిసియాక్స్ అంటారు. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ తో లిబిడో సమస్యలు తగ్గుతాయి.
  • అంగస్తంభన లోపం: దీనినే నపుంసకత్వము అని కూడా పిలుస్తారు, అంగస్తంభన అనేది ఆ వ్యక్తి పురుషాంగం నిలబడకుండా చేస్తుంది. అంతేకాదు చలనశీలతను కూడా కోల్పోయేలా చేస్తుంది. ఇలా శృంగారంలో శీఘ్ర అంగస్తంభనం / పురుషాంగం నిలబడలేని పరిస్థుల కారణంగా నపుంసకత్వ పరిస్థితి ఏర్పడుతుంది.
  • స్పెర్మ్ కౌంట్: వీర్యం నాణ్యతలో ముఖ్యమైన అంశం ఒక నిర్దిష్ట మొత్తంలో వీర్య కణాల సంఖ్య లేదా వీర్యపుష్టి కలిగి ఉండటం.
  • స్పెర్మ్ చలనశీలత: ఆరోగ్యకరమైన వీర్యకణాల పురుషులలో వారి రతి సామర్థ్యాన్ని కలిగి ఉండటమనే చెప్పాలి. స్పెర్మ్ చలనశీలతను వీర్యం నమూనాలో కదిలే స్పెర్మ్ కణాల శాతంగా కొలుస్తారు. ఇవి వాటి పనిని నిర్వహించడంలో విఫలమైనా సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  • టెస్టోస్టెరాన్ స్థాయిలు: మగవారిలో శృంగార హార్మోన్ టెస్టోస్టెరాన్ తక్కువ స్థాయిలో ఉండటం కూడా కొంతమంది పురుషులలో సంతానోత్పత్తి లేకపోవడానికి కారణం కావచ్చు. ఇది ప్రస్తుతం జనరేషన్ వారిలో ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన పనిఒత్తిడి కారణంగా ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి.

సంతానోత్పత్తి లేమికి అనేక కారణాలు ఉండవచ్చు. వ్యక్తులకు జన్యుపరంగా, సాధారణ ఆరోగ్యం, ఫిట్‌నెస్, వ్యాధులు, ఆహార కలుషితాలపై ఆధారపడిపై కూడా సంతానోత్పత్తి ఆధారపడి ఉంటుంది. అదనంగా, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం ముఖ్యం. కొన్ని ఆహారాలు, పోషకాలు ఇతరులకన్నా ఎక్కువ సంతానోత్పత్తి ప్రయోజనాలతో సంబంధం కలిగి ఉంటాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి సంతానోత్పత్తిని పెంచడానికి ఇక్కడ 10 సైన్స్-ఆధారిత మార్గాలు ఉన్నాయి.

1. డి-ఏఏ (డీ-అస్పార్టిక్ యాసిడ్) సప్లిమెంట్లు:

డి-ఆస్పార్టిక్ ఆమ్లం (D-AA): శృంగారంలో రాణించాలంటే అస్పార్టిక్ ఆమ్లం కూడా కీలకం. డీ-ఆస్పార్టిక్ యాసిడ్ అనేది అస్పార్టిక్ యాసిడ్ ఒక రూపం, ఇది ఒక రకమైన అమైనో ఆమ్లం, ఇది ఆహార పదార్ధంగా విక్రయించబడుతుంది. అయితే డి అస్పార్టిక్ యాసిడ్ తరహాలోనే, ఎల్-అస్పార్టిక్ యాసిడ్‌ సప్లిమెంట్లు కూడా మార్కెట్లు సాధారణంగా లభిస్తుంటాయి. ఈ రెండింటిలో అయోమయం చెందకూడదు, ఎల్-అస్పార్టిక్ యాసిడ్ అనేక ప్రోటీన్ల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాగా డి-అస్పార్టిక్ యాసిడ్ ప్రధానంగా వృషణాల గ్రంధులలో, అలాగే సెమెన్ సహా వీర్యకణాలలో ఉంటుంది.

డి-ఏఏ పురుషుల సంతానోత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. నిజానికి, డి-ఏఏ స్థాయిలు సంతానోత్పత్తి కలిగే సాధారణ పురుషులలో కన్నా సంతానోత్పత్తి లేమితో బాధపడే పురుషులలో గణనీయంగా తక్కువగా ఉన్నాయని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. పురుషుల సంతానోత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ.. పురుషుల సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలను డి-ఏఏ సప్లిమెంట్లు పెంచవచ్చని నిరూపించే అధ్యయనాలు కూడా ఇందుకు మద్దతు ఇస్తున్నాయి. ఉదాహరణకు, సంతానం లేని పురుషులలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, 3 నెలల పాటు 2.7 గ్రాముల డి-ఏఏ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల వారి టెస్టోస్టెరాన్ స్థాయిలు 30-60 శాతంమేర పెరిగాయని, దీనికి తోడు వీర్యకణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, చలనశీలత 60-100 శాతంమేర పెరుగాయని స్పష్టం చేశాయి.

అంతేకాదు వారి భాగస్వాములలో కూడా గర్భాల సంఖ్య పెరిగిందని నిరూపితమైంది. ఆరోగ్యవంతమైన పురుషులు 2 వారాల పాటు ప్రతిరోజూ 3 గ్రాముల డి-ఏఏ సప్లిమెంట్లను తీసుకోవడం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలు 42 శాతంమేర పెరిగాయని మరొక నియంత్రిత అధ్యయనంలో తేలింది. అయితే, సాధారణ స్థాయి నుండి అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్న అథ్లెట్లు లేదా బలం-శిక్షణ పొందిన పురుషులలో చేసిన అధ్యయనాలు డి-ఏఏ దాని స్థాయిలను మరింత పెంచలేదని, కాగా, టెస్టోస్టెరాన్ స్థాయిలను స్థిరీకరించి అధిక మోతాదును కూడా కట్టడి చేసిందని కనుగొన్నారు. దీంతో డి-ఏఏ సప్లిమెంట్లు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉన్నవారిలోనూ సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని ప్రస్తుత ఆధారాలు తేల్చాయి. కాగా, సాధారణ, అధిక స్థాయి ఉన్న పురుషులలో వీటిని స్థిరీకరణ చేయడం తప్ప అదనపు ప్రయోజనాలను అందించవని కూడా కనుగోన్నారు. మానవులలో డి-ఏఏ సప్లిమెంట్ల సంభావ్య దీర్ఘకాలిక ప్రమాదాలు, ప్రయోజనాలను పరిశోధించడానికి మరింత పరిశోధన అవసరం.

2. క్రమం తప్పకుండా వ్యాయామం:

సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇక సంతానోత్పత్తి లేమితో బాధపడే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచవచ్చు, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే పురుషులు అధిక టెస్టోస్టెరాన్ స్థాయిలు, ఎలాంటి వ్యాయామం చేయని పురుషుల కంటే మెరుగైన వీర్య నాణ్యతను కలిగి ఉంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. వ్యాయామం చేయాలని భావించి అధిక సమయం దానికే కేటాయించి.. శ్రమించడం సముచితం కాదు. అధికంగా వ్యాయామం చేయడం వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. సరైన మొత్తంలో జింక్ తీసుకోవడం వలన ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీరు చాలా అరుదుగా వ్యాయామం చేస్తున్నా.. మీ సంతానోత్పత్తిని మెరుగుపర్చాలనుకుంటే, శారీరకంగా చురుకుగా ఉండటం ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా చేసుకోండి.

3. తగినంత విటమిన్ సి తీసుకోండి:

మనిషికి విటమిన్ సి అవసరం ఎంతో కరోనా మహమ్మారి అందరికీ చెప్పేసింది. రోగనిరోధక శక్తిని పెంచుతూ.. మనిషిని రోగాల బారి నుంచి కాపాడే సామర్థ్యం ఉన్నది విటమిన్ సి లోనేనని వైద్యులు కరోనా సమయంలో చేసిన విపరీత ప్రచారం బత్తాయిలను విపరీతంగా తీసుకుని ఆరోగ్యాలను కాపాడుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అందరూ. అయితే విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుందని కూడా కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (ఆర్ఓఎస్ ROS) స్థాయిలు శరీరంలో హానికరమైన స్థాయికి చేరుకోవడం ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆయా పురుషులలో వ్యాధులకు, వృద్ధాప్యం సంకేతాలకు, అనారోగ్యాలకు, తత్సంబంధమైన జీవనశైలి లేదా పర్యావరణ కాలుష్య కారకాల కారణంగా శరీరం స్వంత యాంటీఆక్సిడెంట్ రక్షణ అధికంగా కావాల్సినప్పుడు ఇది జరుగుతుంది.

ఆర్ఓఎస్ నిరంతరం శరీరంలో ఉత్పత్తి చేయబడుతున్నా, ఆరోగ్యవంతమైన వ్యక్తులలో వాటి స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక స్థాయి ఆర్ఓఎస్ కణజాల గాయం, వాపును ప్రోత్సహిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి అధిక స్థాయి ఆర్ఓఎస్ పురుషులలో సంతానోత్పత్తి లేమికి కూడా దారితీయవచ్చని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. విటమిన్ సి వంటి తగినంత యాంటీఆక్సిడెంట్లను తీసుకోవడం వల్ల ఈ హానికరమైన ప్రభావాలలో కొన్నింటిని ఎదుర్కోవడంలో సహాయపడవచ్చు. విటమిన్ సి సప్లిమెంట్లు వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తాయని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. సంతానోత్పత్తి లేని పురుషులలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, 2 నెలల వరకు రోజుకు రెండుసార్లు 1,000-మి.గ్రా విటమిన్ సి సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల వీర్య చలనశీలత 92 శాతం, స్పెర్మ్ కౌంట్ 100 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ఇది వికృతమైన స్పెర్మ్ కణాల నిష్పత్తిని 55 శాతానికి తగ్గించింది.

భారతీయ పారిశ్రామిక కార్మికులపై జరిగిన మరొక పరిశోధన అధ్యయనం ప్రకారం, 3 నెలల పాటు వారానికి ఐదు సార్లు 1,000 మి.గ్రా విటమిన్ సి తీసుకోవడం వీర్య కణాలలో ఆర్ఓఎస్ వల్ల కలిగే డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ సి సప్లిమెంట్లు స్పెర్మ్ కౌంట్, చలనశీలతను గణనీయంగా మెరుగుపరుస్తాయి, అదే సమయంలో దెబ్బతిన్న స్పెర్మ్ కణాల సంఖ్యను తగ్గిస్తాయి. ఈ అద్యయనాలను కలిపి చూస్తే..విటమిన్ సి ఆక్సీకరణ ఒత్తిడితో సంతానోత్పత్తి లేని పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, ఈ మేరకు ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో.. మరింత నియంత్రిత అధ్యయనాలు అవసరం మాత్రం ఉంది.

4. ఒత్తిడిని జయించాలి.. తగినంత విశ్రాంతి అవసరం:

Male sperm count

ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మానసిక స్థితిని సక్రమంగా ఉంచడం చాలా కష్టం, ఇలాంటి సమయంలో శృంగారం చేయాలన్న ఫీలింగ్ కూడా మీకు కలగకపోవచ్చు. మానసిక ఒత్తిడి లైంగిక కొరికను కూడా జయిస్తుంది. శృంగారం చేయాలన్న అలోచన, తలంపును కూడా ఇది కలగనీయదు, ఇదే ప్రతిరోజు ఎదురైతే.. క్రమంగా ఆయా వ్యక్తులలో సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది. కార్టిసాల్ హార్మోన్ ఒత్తిడి ఈ ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా వివరిస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది టెస్టోస్టెరాన్‌పై బలమైన ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. కార్టిసాల్ పెరిగినప్పుడు, టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. తీవ్రమైన, వివరించలేని ఆందోళన సాధారణంగా మందులతో చికిత్స చేయించుకుంటే తగ్గుతుంది. అయితే సడలింపు పద్ధతులతో ఒత్తిడిని తేలికపాటి రూపాలను తగ్గించవచ్చు. ఒత్తిడి నిర్వహణ అనేది ప్రకృతిలో నడవడం, ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం లేదా స్నేహితులతో సమయం గడపడం వంటివి చాలా సులభం.

5. తగినంత విటమిన్ డి పొందండి

పురుషులు లేదా మహిళల్లో సంతానోత్పత్తికి ముఖ్యమైనది విటమిన్ డి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే మరొక పోషకం. ఒక అధ్యయనంలో విటమిన్-డి లోపం ఉన్న పురుషులు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను కలిగి ఉంటారని తేలింది. తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు, విటమిన్ డి లోపం ఉన్న 65 మంది పురుషులలో నియంత్రిత అధ్యయనం ఈ పరిశోధనలకు మద్దతు ఇచ్చింది. 1 సంవత్సరం పాటు ప్రతిరోజూ 3,000 IU విటమిన్ D3 తీసుకోవడం వల్ల వారి టెస్టోస్టెరాన్ స్థాయిలు దాదాపు 25శాతం పెరిగాయి. అధిక విటమిన్ డి స్థాయిలు ఎక్కువ స్పెర్మ్ చలనశీలతతో ముడిపడి ఉంటాయి.

6. ట్రైబులస్ టెరెస్ట్రిస్ (పల్లేరుకాయ)ను ప్రయత్నించండి:

ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్, పంక్చర్ వైన్ అని కూడా పిలిచే ఈ తీగను ప్రయత్నిస్తే ఫలితాలు లభించవచ్చు. రోడ్లపై, బావుల వద్ద, పోలాల గట్లపై పెరిగే ఈ తీగలో గొప్ప ఔషధగుణాలు దాగున్నాయి. భారతీయ సంప్రదాయ వైద్యంలో అనాది కాలం నుంచి ఇది పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి తరచుగా ఉపయోగించే ఔషధ మూలిక. తక్కువ వీర్యకణాలు, సెమెన్ ఉన్న పురుషులలో ఒక అధ్యయనం ప్రకారం, 2 నెలల పాటు ప్రతిరోజూ రెండుసార్లు 6 గ్రాముల పల్లేరుకాయ (ట్రిబ్యులస్ రూట్) వేరును తీసుకోవడం అంగస్తంభన పనితీరు, లిబిడో మెరుగుపడింది. పల్లేరుకాయ (ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్) టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచనప్పటికీ, ఇది టెస్టోస్టెరాన్, లిబిడో-ప్రోత్సాహకాలపై ప్రభావం చూపి మెరుగుపరుస్తుందని పరిశోధన సూచిస్తుంది. అయినప్పటికీ, దాని కామోద్దీపన లక్షణాలను నిర్ధారించడానికి, దానితో అనుబంధంగా దీర్ఘకాలిక నష్టాలు, ప్రయోజనాలను అంచనా వేయడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.

Diet for sperm count

7. మెంతి సప్లిమెంట్లను తీసుకోండి

మెంతి చెట్టు (ట్రిగోనెల్లా ఫోనుమ్-గ్రేకమ్) ఒక ప్రసిద్ధ ఔషధ మూలిక. ప్రతిరోజూ 500 మిగ్రా మెంతి సారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒక అధ్యయనం ద్వారా విశ్లేషించారు. ఈ ప్రయోజనాలలో అనుభవజ్ఞులైన పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిల గణనీయంగా పెరిగినట్లు దీంతో పాటు బలంగా తయారైనట్లు కనుగోన్నారు. అంతేకాదు ఇదే సమయంలో ప్లేసిబోతో పోలిస్తే.. కొవ్వు పదార్థాలను కూడా సులభంగా కరిగించడంతో వారు నూతనోత్తేజంగా కనిపించారని అధ్యయనం కనుగొంది.

మరో అధ్యయనంలో 60 మంది ఆరోగ్యవంతులైన పురుషులలో 6 వారాలపాటు మెంతి గింజల సారం, ఖనిజాలతో తయారు చేయబడిన 600 mg టెస్టోఫెన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల లిబిడో, లైంగిక పనితీరు, బలం మెరుగుపడ్డాయని తేలింది. 3 నెలల పాటు ప్రతిరోజూ 600 mg టెస్టోఫెన్ తీసుకోవడం వల్ల స్వీయ-నివేదిత అంగస్తంభన పనితీరు, లైంగిక చర్య ఫ్రీక్వెన్సీ మెరుగుపడిందని 120 మంది ఆరోగ్యకరమైన పురుషులలో మరొక పెద్ద అధ్యయనం ద్వారా ఫలితాలు నిర్ధారించబడ్డాయి. అలాగే, సప్లిమెంట్ టెస్టోస్టెరాన్ స్థాయిలను గణనీయంగా పెంచింది. ఈ అధ్యయనాలన్నీ మెంతి సారాలతోనే పరిశీలించాయని గుర్తుంచుకోవాలి. అంతేకానీ వంటలలో, హెర్బల్ టీలో ఉపయోగించే మొత్తం మెంతులు అంత ప్రభావవంతంగా ఉండే అవకాశం లేదని గుర్తెరుగాలి.

8. తగినంత జింక్ పొందండి

జింక్ అనేది మాంసం, చేపలు, గుడ్లు, షెల్ఫిష్ వంటి జంతువుల ఆహారాలలో అధిక మొత్తంలో కనిపించే ముఖ్యమైన ఖనిజం. తగినంత జింక్ పొందడం పురుషుల సంతానోత్పత్తికి ఒక కీలకం. తక్కువ జింక్ స్థితి లేదా లోపం ఉన్నట్లయితే తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు, పేలవమైన వీర్య నాణ్యత, వంధ్యత్వానికి గురైయ్యే ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశీలనా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, జింక్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల జింక్ తక్కువగా ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు, స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇంకా, అధిక-తీవ్రత వ్యాయామంతో సంబంధం ఉన్నవారిలోనూ జింక్ సప్లిమెంట్లు టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించవచ్చు.

9. అశ్వగంధను తీసుకోండి

అశ్వగంధ (వితానియా సోమ్నిఫెరా) అనేది పురాతన కాలం నుండి మన దేశంలో ఉపయోగించబడుతున్న ఔషధ మూలిక. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడం ద్వారా అశ్వగంధ పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక అధ్యయనంలో తక్కువ వీర్యకణాల గణనలు ఉన్న పురుషులలో 3 నెలల పాటు రోజుకు 675 మి.గ్రా అశ్వగంధ రూట్ సారం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని తేలింది. అధ్యయన ప్రారంభ స్థాయిలతో పోల్చితే ప్రత్యేకంగా, వీర్యకణాల గణనలను 167 శాతం, వీర్యం పరిమాణం 53 శాతం, స్పెర్మ్ చలనశీలతను 57 శాతం పెంచింది. ప్లేసిబో చికిత్స పొందిన వారిలోనూ కనీస మెరుగుదలలు కనుగొనబడ్డాయి.

అయితే పెరిగిన టెస్టోస్టెరాన్ స్థాయిలు ఈ ప్రయోజనాలకు పాక్షికంగా కారణం కావచ్చు. 57 మంది బలవంతమైన యువకులలో శిక్షణలో భాగంగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 600 మి.గ్రా అశ్వగంధ రూట్ సారం తీసుకోవడం వల్ల ప్లేసిబోతో పోలిస్తే టెస్టోస్టెరాన్ స్థాయిలు, కండర ద్రవ్యరాశి, బలం గణనీయంగా పెరుగాయి. అశ్వగంధ సప్లిమెంట్లు వీర్య గణనలు, స్పెర్మ్ చలనశీలత, యాంటీఆక్సిడెంట్ స్థితి, టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి.

10. మాకా రూట్:

మాకా రూట్ సప్లిమెంట్లను తీసుకోవడం లిబిడో, అలాగే సంతానోత్పత్తి, లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. మకా రూట్ అనేది సెంట్రల్ పెరూలో ఉద్భవించిన ఒక ప్రసిద్ధ మొక్కల ఆహారం. సాంప్రదాయకంగా, లిబిడో సంతానోత్పత్తిని పెంచే సామర్థ్యం కోసం ఇది ఉపయోగించబడింది. పురుషులపై చేసిన అనేక అధ్యయనాల ప్రకారం 1.5 నుండి3 గ్రాముల ఎండిన మాకా రూట్‌ను 3 నెలల వరకు తీసుకోవడం ద్వారా స్వీయ-నివేదిత లైంగిక కోరిక లేదా లిబిడో, మెరుగుపడతాయని తేలింది. మకా రూట్ లైంగిక పనితీరును మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తేలికపాటి అంగస్తంభన లోపం ఉన్న పురుషులలో, 12 వారాల పాటు 2.4 గ్రాముల ఎండిన మాకా రూట్ తీసుకోవడం వల్ల స్వీయ-నివేదిత అంగస్తంభన పనితీరు, లైంగిక శ్రేయస్సు మెరుగుపడింది.

3 నెలల పాటు ప్రతిరోజూ 1.75 గ్రాముల మాకా రూట్ పౌడర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పురుషులలో వీర్యకణాల వృద్ది, చలనశీలత పెరుగుతుంది. ఈ పరిశోధనలు సమీక్షల ద్వారా పాక్షికంగా ధృవీకరించబడ్డాయి, అయితే పరిశోధకులు సాక్ష్యం బలహీనంగా ఉందని, ఖచ్చితమైన వాదనలు చేయడానికి ముందు మరింత పరిశోధన అవసరమని గుర్తించారు. అదనంగా, మాకా రూట్ హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేయదు. 3 నెలల పాటు రోజుకు 1.5 నుండి 3 గ్రాముల మాకా రూట్ తీసుకోవడం ఆరోగ్యకరమైన, సారవంతమైన పురుషులలో టెస్టోస్టెరాన్ లేదా ఇతర పునరుత్పత్తి హార్మోన్లపై ఎటువంటి ప్రభావం చూపలేదని అయితే ప్రేరణ కల్పించేలా మాత్రమే దోహదపడ్డాయని తేలింది.

Men infertility

సంతానోత్పత్తికి ఇతర చిట్కాలు:

అనేక విషయాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి, అయితే అవి ఆయా వ్యక్తుల సంతానోత్పత్తి సమస్యలకు కారణంపై ఆధారపడి ఉంటాయి. అలాగే, సంతానోత్పత్తి, లిబిడో సాధారణంగా మీ ఆరోగ్యంతో కలిసిపోతాయని గుర్తుంచుకోండి. ఈ కారణంగా, మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఏదైనా మీ సంతానోత్పత్తిని పెంచుతుంది. సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్/నాణ్యతను పెంచడానికి ఇక్కడ మరో ఎనమిది అదనపు చిట్కాలు అందిస్తున్నాము:

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి: అనారోగ్యకరమైన జీవనశైలి పద్ధతులు సంతానోత్పత్తితో సహా మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
  • అధిక బరువు కోల్పోవాలి: అదనపు బరువును మోయడం వంధ్యత్వతానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని మీ వైద్యుడు అనుమానించినట్లయితే, బరువు తగ్గడాన్ని మీ ఆరోగ్య లక్ష్యాలలో ఒకటిగా చర్చించండి.
  • మద్యపానం మితంగా తీసుకోవడం లేదా మానేయడం: అధిక ఆల్కహాల్ వినియోగాన్ని నివారించండి, ఎందుకంటే ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది, వీర్యం నాణ్యతను దెబ్బతీస్తుంది.
  • తగినంత ఫోలేట్ పొందండి: ఫోలేట్ తక్కువ తీసుకోవడం వల్ల వీర్యం నాణ్యత దెబ్బతింటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • తగినంత నిద్ర పొందండి: మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. పరిమితం చేయబడిన లేదా అధిక నిద్ర కూడా పేలవమైన వీర్యం నాణ్యతతో ముడిపడి ఉంది.
  • వాల్నట్లను చిరుతిండిగా ఎంచుకోండి: వాటిలోని యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల సంతానోత్పత్తికి ప్రయోజనం చేకూరుతుంది.
  • యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కూడా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కోఎంజైమ్ Q10 వీర్యం నాణ్యతను మెరుగుపరుస్తుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి.
  • సోయా ఎక్కువగా తినడం మానుకోండి: సోయాలో ఐసోఫ్లేవోన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి తక్కువ వీర్యం నాణ్యతతో సంబంధం కలిగి ఉంటాయి.

వంధ్యత్వం చాలా సాధారణం, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పురుషులను ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తి సమస్యలను కలిగి ఉన్నట్లయితే, మీరు చేయగలిగేది మీ సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం. అయితే ఇదే సమయంలో హామీ ఇవ్వబడిన పరిష్కారమేమీ లేదు, కానీ పోషక లోపాలు లేదా తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు దోహదపడే కారకాలు అయితే, ఈ జీవనశైలి చిట్కాలు సహాయపడే అవకాశాలు ఉన్నాయి.

పురుషుల్లో సంతానోత్పత్తి.. వీర్యపుష్టికి మార్గాలివే..
Exit mobile version