Home టిప్స్ కాఫీని ఇలా తాగితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.! - <span class='sndtitle'>Want to Have a Healthy coffee in Telugu </span>

కాఫీని ఇలా తాగితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.! - Want to Have a Healthy coffee in Telugu

0
కాఫీని ఇలా తాగితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.! - <span class='sndtitle'></img>Want to Have a Healthy coffee in Telugu </span>

మీ శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలను రోజువారీగా అందిస్తున్నారా.? ఈ ప్రశ్న వినగానే అవేంటీ అన్న ప్రశ్న సర్వసాధారణంగా వినిపిస్తుంది. లేదా.. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నింటినీ సమపాలల్లో అందించాలంటే అదెలా సాధ్యం అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తుంటాయి. అయితే అవి లోపిస్తే అసలేం జరుగుతుందోనన్న అవగాహన లేకపోవడం కూడా అందుకు కారణం. ఇదే జరిగితే ఆయా పోషకపదార్ధాల సమ్లిమెంట్లతో కూడిన మాత్రలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు వెళ్లకుండా ముందుగానే జాగ్రత్తపడటం ఉత్తమం. అందకు అనువైన మార్గాలు ఎంచుకోవడం మంచిది. అదెలా అంటే ఎంతటివారైనా ఉదయం లేవగానే మర్చిపోకుండా తీసుకునేది కాఫీ. ఇక దీనినే మనకు అనుగూణంగా మార్చుకుంటే రుచికి రుచి.. అరోగ్యానికి ఆరోగ్యం.

వాస్తవానికి, మనలో చాలా మందికి టీ లేదా కాఫీ లేనిదే రోజు ప్రారంభం కాదు. అయితే ఈ కాఫీనే ఫోషక పదార్థాలతో నింపేస్తే. అదెలా అంటారా..? రోజువారీగా తీసుకునే కాఫీలో పోషక గుణాలు మెండుగా ఉండి అరోగ్య ప్రయోజనాలను కల్పించే పదార్థాలను కలిపితే సరి. దీంతో కాఫీ రుచి రెట్టింపు కావడంతో పాటు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషక పదార్థాల ప్రయోజనంతో ఉదయాన్నే ఆరోగ్యకరమైన మోతాదు అందుతుంది. అందుకు మనం తీసుకునే రోజువారీ కాఫీలో ఒక టీస్పూన్ ఈ పదార్థాలను అదనంగా జోడిస్తే సరి. ఈ ఆరు జోడింపులలో ఏదో ఒకదాన్ని ప్రయత్నించండి. ఒక ప్రత్యేకమైన విటమిన్ కాఫీని తయారు చేసుకోండి. వీటితో అరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. మానసిక ఉల్లాసంతో పాటు దేహానికి కావాల్సిన శక్తిని పెంచేడం వరకు.. మీ గుండెను పథిలంగా రక్షించడం నుంచి మీరు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించేవరకు అన్నింటినీ ఈ పోషక పదార్థాలే అందిస్తాయి. ఇక ఆసలు ఆ ఆరు పదార్థాలు ఏమిటీ అన్న వివరాల్లోకి వెళ్తే..

1) దాల్చిన చెక్క పౌడి

దాల్చినచెక్కను ఉదయం కాఫీతో కలుపుకుంటే దానిలోని పోషక గుణాలతో మీ గుండె పథిలంగా రక్షిస్తుంది. మార్నింగ్ కపీ కఫ్ లో దాల్చిన చెక్క పోడిని చిలకరించడం వల్ల శక్తివంతమైన, రుచికరమైన యాంటీ ఆక్సిడెంట్ల మోతాదు లభిస్తుంది. దాల్చినచెక్క వేలాది సంవత్సరాలుగా సుగంధ ద్రవ్యంగా, అటు ఆయుర్వేద చికిత్సలో ఔషధంగా ఉపయోగించబడింది. మసాలా రక్షిత సమ్మేళనాలతో పరిధిలోకి వచ్చే ఈ దాల్చిన చెక్కలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఎలుకలపై చేసిన పరిశోధనల ప్రకారం, దాల్చినచెక్క గుండె, మెదడుకు రక్షణను కల్పిస్తుంది. ఇక మనుషులలో ఇది గుండె, మెదడు పరిరక్షించడంతో పాటు మానవ కణాలపై క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించగలదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. దీంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థను కూడా పెంపొందిస్తుంది.

తయారీ పద్దతి:

కాఫీ మరిగిన తరువాత అందులో అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు దాల్చినచెక్క వేసినా లేక దానిని పోడిగా మార్చి వేసి కలుపితే చాలు.నా పర్లాలేదు. లేదా 1 టీస్పూన్‌తో మీ కాఫీని బ్రూ చేయండి.

చిట్కా:

దాల్చినచెక్క వంగడాల్లో ఒరిజినల్ వంగడంగా పేరొందిన సిలోన్ దాల్చినచెక్కను వెతికి తీసుకోవడం ఉత్తమం. ఈ రకం దాల్చిన చెక్క లభించడం కొంచెం కష్టం, కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్‌ (అమెరికా)లో సాధారణంగా కనిపించే తక్కువ-నాణ్యత వెర్షన్ కాసియా దాల్చినచెక్క కంటే ఇది చాలా నాణ్యతతో కూడుకున్నది. కాసియాతో పోల్చితే సిలోన్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా సురక్షితమైనది. కాసియాలో ఎక్కువ మొత్తంలో మొక్క సమ్మేళనం కౌమరిన్ ఉంది, దీనిని పెద్ద మొత్తంలో వినియోగించడం సురక్షితం కాదని భావన ఉంది.

2) అల్లం

సాధారణంగా ప్రతీరోజు వంటల్లో అల్లం వేస్తుంటారు. చాలా మంది అల్లంతో పాటు వెలుల్లిని కూడా పేస్టు చేసి కూర్రల్లో కలుపుతుంటారు. ఇలా మేము అల్లాన్ని ప్రతీరోజు తీసుకుంటాం. ఇక అమెరికా లాంటి దేశాల్లో అల్లాన్ని బ్రెడ్ వెర్షన్‌లో తీసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల టన్నుల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నారు. అలా కాకుండా కాఫీలో కాసింత అల్లాన్ని జోడిస్తే.. అరోగ్య ప్రయోజనాలతో పాటు మీ కాఫీ కాసింత మసాలా ఘాటు వచ్చినా.. సుగంధభరితం అవుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా కాఫీలో కాసింత అల్లాన్ని కలపడమే. దీంతో సులభమైన మార్గంలో ఆరోగ్యం మీ సొంతం. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో అల్లాన్ని వినియోగించడం మనకు తెలిసిందే. వాంతులు, వికారంతో బాధపడే వారికి అల్లం ఒక సాధారణ చికిత్స. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. అల్లం కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. తక్కువ కొలెస్ట్రాల్ జీర్ణక్రియలో సహాయపడుతుంది.

తయారీ విధానం:

మీ కాఫీకి నేరుగా అల్లం జోడించండి (ఒక కప్పుకు 1 టీ స్పూన్ వరకు), లేదా చక్కెరతో కూడిన కాఫీ షాప్ వెర్షన్‌ను బదులుగా, గుమ్మడికాయ, అల్లం కలిపి ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన కాఫీ రుచికి మార్చండి.

చిట్కా:

ఫ్రిజ్‌లోని తాజా అల్లాన్ని తీసుకుని.. మైక్రోప్లేన్‌ సాయంతో మెత్తగా తురుముకోవాలి, ఇలా తురుమును మీ గుమ్మడికాయతో చేసిన జావాలో కలపకోవడం.. లేదా కాఫీలో కప్పుకు ఓ చెంచా మోతాదులో తీసుకోవడం కండరాలకు పటుత్వాన్ని అందిస్తుంది.

3) పుట్టగొడుగులు

ఏమిటీ ఇలాంటి కాంబినేషనేనా.? ఎవరైనా ఇలా చేస్తారా.? కాఫీ పుట్టగొడుగులు? ఎవరైనా ఇలా తీసుకుంటారా అన్న ప్రశ్నలు మీలో ఉద్భవిస్తున్నాయని తెలుసు. అయితే ఇది కూడా గోప్ప అరోగ్య ప్రయోజనాలతో కూడిన కాంబినేషన్ అని మర్చిపోకండి. పుట్టగొడుగులు అంటే ఫంగీ (శిలీంధ్రాలు) నిండిన కాఫీ గొప్ప ఆరోగ్యాన్ని ఇమిడివుంటుందన్నది సత్యం. పుట్టగొడుగులలో యాంటీవైరల్, యాంటీఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన, పుట్టగొడుగులు ఎలుకలపై యాంటీకాన్సర్ ప్రభావాలను కలిగి ఉంటాయి, పుట్టగొడుగులు కాలేయ వ్యాధిని కూడా నిరోధించవచ్చని మరిన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దాని శక్తివంతమైన ప్రీబయోటిక్స్ కారణంగా ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడవచ్చు.

అయితే ఇందుకోసం నాణ్యతతో కూడిన పుట్టగొడుగులను ఎంపిక చేసుకోవడం మర్చిపోరాదు. ఫోర్ సిగ్మాటిక్, అనే పాపులర్ మష్రూమ్ కాఫీ బ్రాండ్ ప్రకటన ప్రకారం పుట్టగొడుగులతో మేళవితమైన కాఫీని తాగడం మీ శరీరానికి లాభదాయకమని, సగం కెఫిన్ మాత్రమే ఉండే ఈ సమ్మెళనంలో మిగతా సగం సుపర్ ఫుడ్స్ నిండి ఉంటాయని చెబుతుంది. “సాధారణ కాఫీ చాలా మందికి ఇచ్చే జిట్టర్‌లు, కడుపు సమస్యలు, పోస్ట్-కెఫీన్ క్రాష్‌లను కూడా మీరు దాటవేస్తారు” అని చెప్పింది.

తయారీ విధానం:

ఈ రకమైన కాఫీ కోసం మీరు మీ స్వంత మష్రూమ్ పౌడర్‌లను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే వాటిపై సర్వింగ్ పరిమాణాన్ని సూచించినదైతే మేలు చేస్తుంది. సౌకర్యవంతంగా ప్యాక్ చేసిన మష్రూమ్ కాఫీని కూడా కొనుగోలు చేసుకుని వినియోగించవచ్చు. లేదా మష్రూమ్ కాఫీ K-కప్ పాడ్‌లు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి వాటినైనా కొనుగోలు చేసుకుని వాడుకోవచ్చు.

చిట్కా:

అన్ని మష్రూమ్ కాఫీలు సమానమైన ఫలితాలను అందించవు. ఎందుకంటే ఇవి సమానంగా సృష్టించబడవని తెలుసుకోవాలి. కాగా, మరింత శక్తి కోసం చూస్తున్నట్లయితే.. కార్డిసెప్స్ పుట్టగొడుగులను ప్రయత్నించండి. ఒత్తిడి నివారించి చక్కని నిద్రకు దోహదపడేందుకు రీషి పుట్టగొడుగులను వినియోగించండి.

4) పసుపు

మీరు కాఫీలో పసుపును చిలకరించుకుని తాగితే అది అనేక లాభాలను చేకూర్చుతుందన్న విషయం మీకు తెలుసా.? బంగారు మసాలాగా పేరొందిన పసువు ఆయుర్వేద వైద్యంలో పురాతనకాలం నుంచి వినియోగించబడుతుంది. దానిలోని అనేక ఔషధ గుణాలు మనకు అరోగ్య ప్రయోజనాలను అందించనున్నాయి. పసుపులోని శక్తివంతమైన యాంటీ- ఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న కర్కుమిన్ సమ్మేళనం నుండి వచ్చాయి. ఈ యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్ మీ లీవర్ ను డీటాక్సిఫికేషన్ చేయడంలో సాయపడుతుంది. అంతేకాదు జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు మానసిక ఒత్తిడి (డిప్రెషన్) చికిత్స చేయడంలో కూడా సహాయపడవచ్చు.

సర్వ్:

ఈ పసుపు కాఫీలో నాలుగు పదార్ధాలను చేర్చడం మరింది అరోగ్యదాయకం. కొబ్బరి, మిరియాలు, పసుపుతో పాటు వేసి తయారు చేసి ఉదయం మేల్కోన్న వెంటనే తాగితే ఆరోగ్యకరమైన కొవ్వులతో కలసిన పసుపు సమ్మెళనం మీలోని జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.

చిట్కా:

పసుపు ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి, చిటికెడు నల్ల మిరియాలుతో జత చేయండి. మిరియాలు పసుపు జీవ లభ్యతను మెరుగుపరుస్తుంది, మసాలాను తక్కువ మోతాదులో మరింత ప్రభావవంతంగా చేస్తుంది.

కాఫీని ఇలా బూస్ట్ చేసుకుంటే.. అరోగ్యం మీ వెంటే.!

5) మాకా

మెడికల్ స్టోర్ లేదా జనరల్ స్టోర్ లో లభించే మాకా రూట్ పౌడర్‌ని మీరు చూసి ఉండవచ్చు. సాంప్రదాయకంగా మాకా రూట్ నుంచి దీనిని తయారు చేస్తారు. అధికంగా ఈ మొక్క ఫౌడర్ ను సంతానోత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో హార్మోన్-బ్యాలెన్సింగ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు చూపబడింది. ఈ మొక్క అథ్లెటిక్ పనితీరు మెరుగుపర్చేందుకు, శక్తి స్థాయిలు పెంపోందేందుకు, సెక్స్ డ్రైవ్ పెంచడానికి దోహదపడుతుందని అధ్యయనం తేల్చింది. ఈ మొక్కలో పోషకాల భండాగారమని చెప్పడం అతిశయోక్తి కాదు. మాకాలో 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలు (ఎనిమిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో సహా), 20 ఫ్రీ-ఫారమ్ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ప్రోటీన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి.

తయారీ విధానం:

సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రోజుకు 1 నుండి 3 టీ స్పూన్ల మాకా పోడిని వినియోగించాలని సిఫార్సు చేయబడింది. ఈ సూపర్‌ ఫుడ్ పోడిని కాఫీతో కలుపుకుని ఉదయాన్నే సేవిస్తే.. ఇక ఆ రోజుంతా మీకు ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడిచిపోతుంది. మాకా పౌడర్ తో నాలుగు రకాల సూఫర్ పుడ్స్ తయారు చేయవచ్చని దాని జాబితా వెల్లడిస్తోంది.

చిట్కా:

మాకా పౌడర్ దీర్ఘకాలంగా తాజాగా ఉండాలంటే దానిని సాధారణ ఉష్ణోగ్రతల్లో కాకుండా ఫ్రిడ్జిలో నిల్వ ఉంచితే దానిలోని ఔషధ గుణాలు సజీవంగా ఉంటాయి.

6) కోకో

చాక్లెట్ కాఫీ కలయికతో ఇప్పటికే స్వర్గంలో చేసిన బంధంలా మారి.. ఎందరెందరో స్వీట్ లవర్స్ తీసుకునే ఉదయపు డ్రింక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక దీనికి బదులుగా కోకో పౌడర్ ను కాఫీ కప్పులో చిలకరించి తీసుకోవడం.. మీకు కొత్త రుచితో పాటు కొత్త అనుభూతిని అందిస్తుంది. అంతేకాదండీ పచ్చి కోకో పౌడర్‌లోని ఔషధ గుణాలతో మీకు చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాఫీలో పచ్చి కోకో పౌడర్ ను చిలకరించినప్పుడు అది మీ అరోగ్యాన్ని మరింత మెరుగుపడుతుంది. ఈ సూపర్‌ ఫుడ్ లో ఉన్న అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు తో పాటు ఐరన్ మీ హృదయానికి ఎంతో మేలు కలిగిస్తాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న కోకో అధిక రక్తపోటుకు నియంత్రించడంతో పాటు హైపర్ టెన్షన్ కు చక్కని ఔషధంలా పనిచేస్తుంది, మంచి (HDL) కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, చెడు (LDL) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దాని అభిజ్ఞా ప్రయోజనాలు, మానసిక స్థితిని మెరుగుపరిచే, యాంటిడిప్రెసివ్ లక్షణాలు మెదడు కూడా కోకోను గొప్పగా చేస్తాయి. ఇది ఎంత రుచికరమైనదో మేము చెప్పాల్సిన పనిలేదు.

సర్వ్:

1 టేబుల్ స్పూన్ కోకోను మీ ఒక్క కప్పు కాఫీలో కలుపుకుని తీసుకుని తీసుకుంటూ మీకు ఉదయాన్నే చక్కటి డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియంతో పాటు యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు అందుతాయి.

చిట్కా:

అత్యంత అధిక ప్రయోజనాలను పొందడానికి ఆర్గానిక్ ముడి కోకోను కాఫీలో కలుపుకునేందుకు చూడండీ. ముడి కోకో, కోకో పౌడర్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ఉత్తమం.

చాలా మంది ప్రజలు తమ కాఫీ వినియోగాన్ని పరిమితం చేయమని ప్రోత్సహిస్తారు కాబట్టి, ప్రతి కప్పును ఎక్కువగా ఉపయోగించుకోవడం అర్ధవంతమే. ఆ ఉదయపు పానీయాన్ని ఎందుకు మసాలాభరితం చేయకూడదు? ఈ సూచనలన్నీ గొప్ప ప్రయోజనాలు, తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి, అయినప్పటికీ వాటి పూర్తి ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం.

Exit mobile version