Home న్యూస్ చైనాలో కోవిడ్-19 పరిస్థితిని వివరించిన భారత వైద్యుడు

చైనాలో కోవిడ్-19 పరిస్థితిని వివరించిన భారత వైద్యుడు

0
చైనాలో కోవిడ్-19 పరిస్థితిని వివరించిన భారత వైద్యుడు
<a href="https://www.reuters.com/">Src</a>

తమిళనాడుకు చెందిన IAP TN ID చాప్టర్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ & ప్రోఫెసర్ డి.రాజ్‌కుమార్ గా పేర్కోంటున్న వైద్యుడి కోవిడ్-19 బిఎఫ్.7 వేరియంట్ పై చైనాలో అసలేం జరుగుతుందోన్న వివరాలతో కూడిన పీడీఎఫ్ డాక్టుమెంట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. చైనాలోని పలు నగరాల్లో విధించిన లాక్ డౌన్ ఎత్తివేయగానే అక్కడి ప్రజలు అనేకులు కరోనా బిఎఫ్.7 వేరియంట్ బారిన పడతుంటటం.. ఆ సంఖ్య అసంఖ్యాకంగా పెరుగుతూ ఉండటం అక్కడి వైద్యుల్నే కాదు ఏకంగా ప్రపంచ ఆరోగ్యసంస్థను కూడా కలవరానికి గురిచేస్తోంది. అయితే చైనాలోని వాస్తవ పరిస్థితిని తనదైనశైలిలో డాక్టర్ డి.రాజ్‌కుమార్ వివరించారు.

అసలు అక్కడ ఏం జరుగుతోంది?

ప్రస్తుతం దావానలంలా వ్యాపిస్తున్న కోవిడ్‌19 పరిస్థితి నిజంగా చైనాలో భయంకరంగా ఉంది.

కోవిడ్ 19 ఏ రూపాంతరం దీనికి కారణం?

ఓమిక్రాన్ BA.5 వేరియంట్ రూపాంతరం చెంది బిఎఫ్-7 వేరియంట్ మరోమారు చైనాలో మహమ్మారిగా మారింది.

ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది?

Omicron BF-7 China
Src

చైనా ప్రభుత్వం చాలా కఠినమైన “జీరో కోవిడ్ పాలసీ”తో కరోనా తమ దేశంలో వెలుగుచూసిన సమయం నుంచి 2022 మధ్యకాలం వరకు కోవిడ్19ని చాలా పకడ్భందీగా అమలుపర్చింది. దీంతో అక్కడ కరోనా విజృంభన పెద్దగా లేదు. ఇక దీనితో అక్కడి ప్రజలు ఇప్పటివరకు పెద్ద కోవిడ్-19 వ్యాప్తిని ఎదుర్కోనే అవకాశం లేకపోయింది. చైనా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతున్న కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోనే శక్తిని కూడా పోందలేకపోయారు. చైనా ప్రభుత్వం విధించిన “జీరో కోవిడ్ పాలసీ”తోనే ఇది సాధ్యమైనా ఏకంగా నెలల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో అక్కడి ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. అంతేకాదు “జీరో కోవిడ్ పాలసీ”కి వ్యతిరేకంగా ఈ ఏడాదిలో చిన్న తిరుగుబాటుకు కూడా కారణమైంది. ప్రభుత్వ విధానాంతో అక్కడి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి చివరకు అధికారులు పశ్చాత్తాపపడి జీరో కోవిడ్ విధానాన్ని సడలించారు.

దాదాపు అదే సమయంలో, ఒమిక్రాన్ బిఎఫ్-7 వేరియంట్ (ఒమిక్రాన్ బిఏ.5 రూపాంతరం చెందిన వేరియంట్) ఉప రకం హాంకాంగ్ ద్వారా చైనాలోకి ప్రవేశించింది. ఇక పలు రకాలుగా రూపాంతరం చెందిన ప్రస్తుతం బిఎఫ్-7గా తన ప్రతాపం చూపుతున్న బిఎఫ్-7 వేరియంట్ కొన్ని విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది అత్యంత వేగంగా ఇతరులకు సోకుతుండటంతో పాటు చాలా తక్కువ సమయం ఇంకుబేషన్ పిరియడ్ ఉన్న వేరియంట్ ఇది. ఈ తరహా కోవిడ్19 బిఎఫ్-7 వేరియంట్ ఎలాంటి యాంటీబాడీ చికిత్సకు లొంగడం లేదు. అంతేకాదు ధీని ట్రాన్స్మిసిబుల్ ఫ్యాక్టర్ ఆర్ఓ రమారమి 16గా నమోదైంది, దీంతో ఇది దావానలంలా వ్యాపిస్తుంది.

చైనా టీకాల నాణ్యాత లోపభూయిష్టం:

చైనాలో అక్కడి వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు రూపోందించిన కరోనా టీకాలు కూడా ఈ వ్యాప్తికి ఒక కారణం. చైనా ప్రభుత్వం తమ దేశంలోని 100 కోట్ల మందికి పైగా టీకాలు వేసినట్లు ప్రకటించుకుంటున్నా.. నిజానికి ఆ సంఖ్యలో టీకాలు అక్కడి ప్రజలు తీసుకోలేదని ప్రస్తుత కరోనా వ్యాప్తి దర్పణం పడుతుంది. వాస్తవానికి 60 ఏళ్లు పైబడిన వృద్ధులలో దాదాపు 60 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. ప్రస్తుతం ఒమిక్రాన్ బిఎఫ్-7 కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోంటున్నవారు, కష్టాలు అనుభవిస్తున్న వారు వీరే కావడం గమనార్హం. ఇక టీకాలు తీసుకున్నవారు కూడా ఈ వేరియంట్ బారిన పడుతున్నారు.

China with Covid19 spreading
Src

టీకాలు తీసుకున్నవారికి సోకుతున్న బిఎఫ్-7:

నిజానికి మన భారత దేశంలో కరోనాను ఎదుర్కోనేందుకు చాలామంది ప్రజలు టీకాల కోసం ఎగబడ్డారంటే అతిశయోక్తి కాదు. టీకాలపై అపోహలు చాలా తక్కువ శాతం మందికి ఉన్నాయి. మిగతావారు స్వచ్చంధంగా ఆసుపత్రులకు వెళ్లి.. బారులుతీరిన క్యూలైన్లలో నిల్చుని టీకాలను తీసుకున్నారు. కాగా, చైనాలో టీకాలు తీసుకున్నవారి సంఖ్యే తక్కువగా ఉందంటే.. అవి కూడా అంత ప్రభావవంతమైన కాకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. చైనా కరోనా వ్యాక్సిన్‌లు – సినోఫార్మ్, సినోవాక్ మొదలైనవి చాలా తక్కువ సెరో మార్పిడి రేటును కలిగి ఉన్నాయని, ఉత్పత్తి చేయబడిన వాటి రోగనిరోధక శక్తి కూడా 3 – 6 నెలల వ్యవధిలో తక్కువగా ఉంటుందని తేలింది. ఇది కూడా టీకాలు తీసుకున్నవారికి మరోమారు బిఎఫ్-7 వేరియంట్ సోకడానికి కారణం.

చైనాలో బిఎప్-7 సంబంధించిన చిక్కులు ఏమిటి?

అత్యంత వేగంగా ఒకరి నుంచి మరోకరికి సోకగలిగే ఒమిక్రాన్ బిఎప్-7 చైనాలో పంజా విసరుతోంది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది చైనాలోని నలుదిశలా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకరి నుంచి ఏకంగా 16 మందికి సోకగల ఈ వేరియంట్ తో ప్రతీ గడపకు బిఎఫ్-7 వెళ్లే అవకాశముంది. ఇదే జరిగితే చైనాలో లక్షలాధి మరణాలు సంభవిస్తాయి. అందులోనూ ఇవి ఎక్కువగా 60ఏళ్లకు పైబడిన వ్యక్తులలో సంభవిస్తాయి. ముఖ్యంగా 60 ఏళ్లకు అధికంగా జనాభాలో గణనీయమైన మరణాలను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం మరోమారు కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదు. దీని ప్రభావం ఆ దేశ ఆర్థిక/పాఠశాల కార్యకలాపాలపై పడనుంది. దేశంలో వయోవృద్దుల ప్రాణాలను పన్నంగా పెట్టడానికి సుముఖంగా లేని నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలను తీసుకోకతప్పదు. అయితే దీని నుంచి 2023 వేసవి నాటికి గానీ బయటపడే పరిస్థితులు లేవు.

చైనాలో ఈ పరిణామాలతో ప్రపంచానికి చిక్కులు ఉన్నాయి?

Omicron BF-7 symptoms
Src

చైనా ఒక ప్రధాన తయారీ కేంద్రంగా ఉన్నందున, ప్రపంచ వాణిజ్యపరమైన సమస్యలను ఎదుర్కోనాల్సి వస్తుంది. చైనా తయారీ దేశం కావడం కారణంగా ప్రపంచం పలు సరుకుల సరఫరాలు అందక కొన్ని ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తుంది. పలు సరుకుల సప్లయ్ చైన్ అంశాలలో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి చాలా అవసరమైన వస్తువుల కొరత స్వల్పకాలం పాటు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఈ వేరియంట్ అత్యధిక జనాభా కలిగిన చైనాలో అత్యల్పకాలంలో విసృత్తంగా విజృంభిస్తే.. అది మరోక వేరియంట్ రూపాంతరానికి కూడా కారణం కావచ్చు. ఈ కొత్త వేరియంట్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చేరితే అది అక్కడి అంటువ్యాధులుగా కూడా పరిణమించే అవకాశాలు లేకపోలేవు. ఇది మధ్యస్థ, దీర్ఘకాలిక వ్యవధిలో మారుమూల ప్రాంతాలకు కూడా చేరే ప్రమాదాలను కాదనలేని సాధారణ దృశ్యం.

బిఎఫ్-7 వేరియంట్ ఇండియాకు చేరితే?

Omicron BF-7 India
Src

అయితే బిఎఫ్-7 వేరియంట్ అంశంలో భారత్ చింతించాల్సిన పనిలేదు. బిఎఫ్.7 గత 4 – 5 నెలలుగా మన దేశంతో పాటు అమెరికా, లండన్ సహా పలు యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో కనుగొనబడింది. దేశంలోని ప్రజలందరూ దాదాపుగా 90శాతంగా పైగా రెగ్యూలర్ ఇంటర్వెల్స్ లో కోవిడ్ వాక్సీన్లు తీసుకోవడం..సమర్థవంతమైన వాక్సీన్లు కరోనా వేరియంట్లను ఎదుర్కోనే శక్తి కలిగిఉండటంతో మనకు బిఎఫ్-7తో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. దీంతో పాటు ఇప్పటికే పలు దశలుగా దేశంలో కరోనా విజృంభించిన నేపథ్యంలో ఇక్కడి మనుషలలో కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ కూడా సహజంగానే వచ్చేసింది. ఎక్బిబి, బిక్యూ1, బిఏ.2, లాంటి అనేక వేరియంట్లు ఇప్పటికే దేశంలో నమోదయ్యాయి. ఇవే బిఎఫ్-7 వేరియంట్ ను అడ్డుకోగలుగుతున్నాయి. బిఎఫ్-7 సామర్థ్యంతో పాటు దాని ఆధిపత్యాన్ని ఇతర వేరియంట్లు పరిమితం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో బిఎప్-7 కేసులు కొన్ని మాత్రమే నమోదయ్యాయి.

Exit mobile version