Home లవ్ & రిలేషన్షిప్ రతి సామార్ధ్యాన్ని పెంచుకోండిలా?

రతి సామార్ధ్యాన్ని పెంచుకోండిలా?

0
రతి సామార్ధ్యాన్ని పెంచుకోండిలా?

ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు.  వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు.

అలాగే, శృంగారంలో ఆసక్తిని పెంచడానికి ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్‌ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.

ఇప్పుడు మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రోట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది. చాక్లెట్లు తినడం వల్ల కూడా లైంగిక శక్తి పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. వీటన్నింటి కంటే ప్రధానంగా భార్యాభర్తల మధ్య లేని పోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయం అవుతుందని సలహా ఇస్తున్నారు.

Exit mobile version