Home హెల్త్ A-Z కాన్సర్ గుమ్మడికాయ గింజలు: మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ తో పోరాడే గింజలు

గుమ్మడికాయ గింజలు: మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ తో పోరాడే గింజలు

0
గుమ్మడికాయ గింజలు: మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ తో పోరాడే గింజలు

గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు. మరీ ముఖ్యంగా మన తెలుగువారికి గుమ్మడికాయకు ఉన్న అనుబంధం అలాంటిలాంటిది కాదు. ఏ శుభకార్యమైనా గుమ్మడికాయ ఉండాల్సిందే. ఇక వేసవి వచ్చిందంటే చాలు గుమ్మడి వడియాలు పెట్టాల్సిందే. గుమ్మడికాయతో కూర, సాంబారు ఇలా పలు రకాలు చేసినా.. గుమ్మడికాయ కోసిన వెంటనే తీసిపడేసేది మాత్రం మధ్యలో ఉన్న గుజ్జు.. దాంతో పాటు ఉండే గింజలు. అయితే గుమ్మడి గింజల్ని పాడేసేవారు ఒక్క క్షణం అలోచించండీ.. వీటితో మీ ఆరోగ్యం బాగుపడుతుందని, రోగాలను దరిచేరనీయకుండా కాపాడుతుందని అంటే కూడా పాడేస్తారా.? ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. గుమ్మడిగింజలతో ప్రాణాంతక వ్యాధులను నియంత్రిస్తూ.. మీ అరోగ్యాన్ని అవి పరిరక్షిస్తాయి. ఈ గింజలతో ఒకటి కాదు రెండు కాదు పలు రకాలుగా అరోగ్యాప్రదాతలు అంటే అతిశయోక్తి కాదు.

గుమ్మడికాయ గింజలలో ఉన్న అనేక పోషకాలు, ఖనిజాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని మితంగా ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే మీకు ఆరోగ్యపరంగా శ్రీరామరక్షలా ఉంటాయి. గుమ్మడికాయ గింజలలోని ఔషధ గుణాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

  • మెరుగైన గుండె ఆరోగ్యం
  • రక్తంలో మధుమేహం స్థాయి నియంత్రణ
  • మెరుగైన నిద్ర నాణ్యత
  • పలు రకాల క్యాన్సర్ నిరోధించడం

ఈ విత్తనాలు అనేక రకాల సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగించబడుతున్నాయని మీకు తెలుసా? గుమ్మడికాయ అనేది స్క్వాష్ మొక్క యొక్క సాగు, ఇది వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిందని భావిస్తున్నారు. వాస్తవానికి, పురావస్తు శాస్త్రవేత్తలు ఒక మాదిరిగా చెబుతున్నా.,. అనాదిగా గుమ్మడికాయతో ముడివేసుకున్న అనుబంధం మనకు ఉందని, గుమ్మడికాయ కొట్టనిదే ఏ శుభకార్యం ప్రారంభించని సంప్రాదాయం మనదని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను అటుంచితే.. గుమ్మడికాయ గింజల ప్రత్యేకమైన రుచితో ఆహారంలో, శక్తివంతమైన ఔషధ గుణాలతో ఇటు ఆయుర్వేద వైద్యంలోనూ వీటిని వినియోగించడం మన పూర్వికులకు తెలిసిందే. పోట్టలో ఇబ్బందులు నుంచి పలు రకాల వైద్య చికిత్సలకు ఆయుర్వేదం ఔషధాల్లో వీటిని వినియోగిస్తారు.

గుమ్మడి గింజలతో కలిగే లాభాలు:

ఇకపై మీరు ఎప్పుడు గుమ్మడికాయను కోసినా.. వాటిలోని ఔషధ గుణాల మేళవితమైన గింజలను పడేయకుండా వాటిని పక్కనపెట్టండీ. ఎందుకంటే వాటిని దొరగా వేయించుకుని తిన్నా కూడా అనేక పోషకాలు మన శరీరంలోకి చేరిపోతాయి. అవేంటో తెలుసా:

  • అమైనో ఆమ్లాలు
  • ఫైటోస్టెరాల్స్
  • అసంతృప్త కొవ్వు ఆమ్లాలు
  • ఫినోలిక్ సమ్మేళనాలు
  • టోకోఫెరోల్స్
  • కుకుర్బిటాసిన్లు
  • విలువైన ఖనిజాలు

గుమ్మడికాయ గింజలు వేల సంవత్సరాలుగా ఆహారంతో పాటుగా వైద్యంలో చేర్చబడ్డాయి. అటు ఆయుర్వేద ఆహారంలో, అవి ఆల్కలైజింగ్‌గా పరిగణించబడ్డాయి. రక్తాన్ని శుద్ది చేయడం, మూత్రవిసర్జన సమస్యలకు సహజంగా పరిష్కరించే శక్తి వీటిలో పుష్కళంగా ఉంది. పెద్ద పేగు పనితీరును మెరుగుపర్చడంతో పాటు పురుషులలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ వైద్యంలో కడుపు నొప్పులు వంటి అనేక రకాల పరిస్థితులకు చికిత్స చేయడంలో వీటిని వినియోగిస్తారు. అంతేకాకుండా అవి తల్లుల్లో చనుబాలను పెంచడానికి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయని కూడా భావిస్తున్నారు. ఈ విలువైన గుమ్మడి గింజల్లో యాంటీ-డయాబెటిక్, యాంటీడిప్రెసెంట్, యాంటీ ఆక్సిడెంట్, యాంటిట్యూమర్, సైటోప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ వంటి కార్యకలాపాలు ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు:

గుమ్మడికాయ గింజల్లో వ్యాధులతో పోరాడే యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉన్నాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ గా ఏర్పడే ఆక్సిండెంట్ల నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పాటు కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా శక్తివంతమైన రక్షణ సమ్మేళనాలను కలిగిఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే అత్యంత కీలకమైన గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి పరిస్థితులను కూడా నివారిస్తాయని ఇటీవల పలు పరిశోధనలు స్పష్టం చేశాయి.

జంతువులపై అధ్యయనాలను చేసే ఓ ప్రచురణ ప్రకారం ఫార్మాకోలాజికల్ రీసెర్చ్‌ చేసిన పరిశోధనలో, గుమ్మడికాయ గింజల నూనె (విత్తనాలలో తయారు చేసిన) వాపును తగ్గించడంతో పాటు ఆర్థరైటిస్‌ సమస్యలను కూడా దూరం చేయగలదు అని పేర్కోంది. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మరో పరిశోధనలో.. గుమ్మడికాయ గింజల నుండి సేకరించిన ఒక నిర్దిష్ట రకం ప్రోటీన్ దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా కాలేయం దెబ్బతినకుండా రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని కూడా పేర్కోంది.

2. గుండె ఆరోగ్యానికి శ్రీరామరక్ష

మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లతో పాటు అరోగ్యకరమైన కోవ్వు ఆమ్లాలతో కూడిన ఈ గుమ్మడి గింజలు, లేదా గింజల నుంచి సేకరించబడిన గుమ్మడి నూనే.. గుండె ఆరోగ్యాన్ని పటిష్టపర్చడంలో దోహదపడతాయి. అంతేకాదు హృదయ సంబంధ కరోనరీ వ్యాధులు రాకుండా.. వచ్చినవారిలోనూ ప్రమాదశాతాన్ని తగ్గించడంలో అనేక రకాలుగా సహాయపడతాయని తేలింది. జంతువులపై చేసిన పరిశోధన అధ్యయనాలు ఈ నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయ పడుతుందని తేలింది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్.. ఈ రెండూ గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలన్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ గుమ్మడికాయ గింజల నూనే కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ మేరకు జరిగిన ఓ అద్యయనంలో గుమ్మడికాయ గింజల నూనె.. పెద్దల రక్తంలో ప్రయోజనకరమైన హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేటంతో పాటు.. డయాస్టొలిక్ రక్తపోటును తగ్గించడంతోనూ దోహదపడుతుందని తేలింది. అదనంగా, గుమ్మడికాయ గింజలు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను కూడా పెంచుతాయి. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది, గుండె మరింత సమర్థవంతంగా పనిచేయడానికి రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది.

3. మధుమేహ స్థాయిల నియంత్రణ:

గుమ్మడికాయ గింజల ప్రయోజనాల్లో మరో కీలకమైన అంశం మధుమేహ స్థాయిల నియంత్రణ. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్ధ్యం గల ఈ గింజలు.. డయాబెటీస్ లక్షణాలను నివారించడంలోనూ కీలక పాత్రను పోషిస్తాయి. వాటిలో ముఖ్యంగా దాహం పెరగడం, అలసట, తరచుగా మూత్రవిసర్జన, వికారం వంటివి తగ్గిస్తాయి. ఈ విత్తనాలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఈ రెండూ మెరుగైన రక్తంలో చక్కెర నియంత్రణను ప్రోత్సహించడానికి రక్తప్రవాహంలో చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. ఆసక్తికరంగా, జర్నల్ ఆఫ్ డయాబెటిస్ అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్‌లో ప్రచురించబడిన 2011 జంతు నమూనా, ఫ్లాక్స్‌తో వాటిని కలపడం వల్ల ఎలుకలలో యాంటీఆక్సిడెంట్ స్థితి మెరుగుపడటమే కాకుండా మధుమేహం సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందని నివేదించింది.

4. నాణ్యమైన నిద్రకు ప్రోత్సహం

నిద్ర రావడం లేదా? అయితే మీరు చేయవలసిందల్లా.. మీ రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజల మోతాదును జోడించడమే. గుమ్మడి గింజలకు నిద్రకు సంబంధమేమిటా.? అని అలోచింస్తున్నారా.? అక్కడికే వస్తున్నాం. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్, మెగ్నీషియంతో సహా మెరుగైన, నాణ్యతతో కూడిన నిద్రను అందించేందుకు కారణమయ్యే అనేక పోషక గుణాలు కలిగి ఉన్నాయి. ట్రిప్టోఫాన్ ఒక ముఖ్యమైన అమైనో ఆమ్లం, ఇది సెరోటోనిన్, మెలటోనిన్, నియాసిన్, నికోటినామైడ్‌లతో సహా శరీరంలో “మంచి అనుభూతిని కలిగించే” రసాయనాల ఉత్పత్తిలో పాత్ర పోషిస్తుంది. ట్రిప్టోఫాన్ నిద్ర నాణ్యతను పెంపొందించే సామర్థ్యానికి, ముఖ్యంగా నిద్ర లేమితో బాధపడేవారికి ఈ గుమ్మడి గింజలు చక్కని ఔషధంగా పరిగణించబడ్డాయి. అదే సమయంలో, వీటిలో అత్యల్పంగా లభించే మెగ్నీషియం నాణ్యమైన నిద్రను కలిగించేలా దోహదపడుతుంది. ఇది నిద్రలేమితో పాటు సంబంధమైన అనేక చర్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిద్ర సామర్థ్యాన్ని పెంచడం, నిద్ర నాణ్యతను పెంచడం, నిద్రపోయే సమయాన్ని కూడా పెంచడంలో మెగ్నీషియం సమయం పడుతుంది.

5. పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది

గుమ్మడి గింజలలో లభించే ఔషధ గుణాలు గురించి ఏమని చెప్పగలం. మానుషులు తమ ఆహారంలో తప్పక చేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన వాటిగా ఇవి మారాయంటే అందుకు వాటిలోని లభించే పోషక గుణాలు ఔషధ తత్వాలు అమోఘం. మనవులతో పాటు జంతువులపై కూడా జరిపిన పలు అథ్యయనాలలో గుమ్మడికాయ గింజలు ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు, జింక్‌తో సహా ఫైటోన్యూట్రియెంట్‌ల పుష్కళంగా లభించడం కారణంగా పురుషుల సంతానోత్పత్తికి ప్రయోజనకరంగా మారాయి. అంతేకాదు అవి ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మగవారిలో స్పెర్మ్ అసాధారణతలను నివారించడంతో పాటు స్పెర్మ్ కౌంట్ ను పెంపోందించడంలోనూ గుమ్మడి గింజలు నూనె దోహదపడుతుందని 2012లో ఎలుకలపై జరిపిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వీటి నూనెలలో లభించే ఓ సప్లిమెంట్ కారణంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని అధ్యయనాలు పేర్కోంన్నాయి. మరొ అధ్యయనం ప్రకారం, సా పామెట్టోతో పాటుగా గుమ్మడి గింజల నూనెను జత చేయడం వల్ల పురుషులలో వయోభారంతో పాటు వచ్చే నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియాను (BPH) కూడా తగ్గిస్తుంది.

ఇది ప్రోస్టేట్ గ్రంధి విస్తరణ ద్వారా వర్గీకరించబడుతుంది. దీంతో పురుషుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. గుమ్మడికాయ గింజలు కేవలం మగవారికే కాదు ఆడవారికి కూడా మేలు చేస్తాయి. అవి అందించే కొవ్వులు రెండు లింగాలలో పునరుత్పత్తి ఆరోగ్యానికి తోడ్పడతాయి, ఎందుకంటే శరీరానికి కొన్ని హార్మోన్లను తయారు చేయడానికి కొవ్వు ఆమ్లాలు అవసరం. అదనంగా, అవి కొన్ని ఫైటోఈస్ట్రోజెన్ ప్రభావాలను కలిగి ఉంటాయి, ఇవి ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉన్న కొంతమంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తాయి.

6. క్యాన్సర్ కణాలపై పోరాటం:

గుమ్మడికాయ గింజల్లో అధిక మొత్తంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా, ఇవి కాన్సర్ కణాల పెరుగుదలపై పోరాటం చేయడం.. క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదల వ్యాప్తితో పోరాటం సల్పుతూ వాటిని నివారించేందుకు దోహదపడతాయి. గుమ్మడికాయ గింజల ఫైటోఈస్ట్రోజెన్ సారాంశాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని, మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణకు దోహదపడతాయని అధ్యయనం తెలిపింది. అంతేకాదు కాన్సర్ చికిత్సలోనూ సముచితపాత్రను పోషిస్తాయని ఇన్ విట్రో పరిశోధన అధ్యయనం కనుగొంది. అదనంగా, ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించబడిన సమీక్ష ప్రకారం, గుమ్మడికాయ గింజలు అధికంగా ఉండే ఆహారాలు కడుపు, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్, రొమ్ము క్యాన్సర్‌తో సహా అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించగలవు.

7. బ్లాడర్ సమస్యలకు చెక్:

గుమ్మడికాయ గింజలు పురుషులలో సాధారణంగా వృధ్దాప్యం సమయంలో వచ్చే ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా లక్షణాలను మెరుగుపరుస్తాయని తేలింది, ఈ పరిస్థితి పురుషులలో మూత్రవిసర్జనకు ఇబ్బంది కలిగిస్తుంది. అంతే కాదు, గుమ్మడికాయ నూనె మూత్రాశయ పనితీరు ఇతర సమస్యలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అతి చురుకైన మూత్రాశయం లక్షణాలను గణనీయంగా మెరుగుపరచగలదని, మూత్ర విసర్జనను సరిచేయగలదని ఒక అధ్యయనం చూపించింది.

గుమ్మడి గింజలలో పోషకాలు:

గుమ్మడి గింజలు అత్యంత పోషక పదార్ధమన్న విషయం తెలిసిందే. అయితే ఎంతలా పోషకయుక్తమైనదన్న వివరాల్లోకి వెళ్తే:

  • ఆరోగ్యకరమైన కొవ్వులు
  • ప్రోటీన్
  • మాంగనీస్
  • మెగ్నీషియం
  • భాస్వరం
  • రాగి
  • జింక్
  • ఇనుముతో పాటు ఇంకా చాలా పోషకాలు వీటిలో ఇమిడివున్నాయి.

వీటి కొవ్వు పదార్ధాల పరంగా, అవి వివిధ రకాల ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలతో నిండి ఉన్నాయి, వీటిలో:

  • కాపిక్
  • మిరిస్టిక్
  • స్టెరిక్
  • ఒలీక్
  • లినోలెయిక్
  • లినోలెనిక్

ఒక ఔన్స్ (సుమారు 28 గ్రాములు) ఎండిన, పొట్టుతో కూడిన గుమ్మడికాయ గింజలు సుమారుగా కలిగి ఉంటాయి:

  • 163 కేలరీలు
  • 4.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు
  • 8.5 గ్రాముల ప్రోటీన్
  • 13.9 గ్రాముల కొవ్వు
  • 1.8 గ్రాముల డైటరీ ఫైబర్
  • 0.9 మిల్లీగ్రాముల మాంగనీస్
  • 151 మిల్లీగ్రాముల మెగ్నీషియం
  • 332 మిల్లీగ్రాముల భాస్వరం
  • 4.2 మిల్లీగ్రాముల ఇనుము
  • 0.4 మిల్లీగ్రాముల రాగి
  • 14.5 మైక్రోగ్రాముల విటమిన్ K
  • 2.1 మిల్లీగ్రాముల జింక్
  • 228 మిల్లీగ్రాముల పొటాషియం
    ఈ పోషకాలతో పాటు గుమ్మడికాయ గింజలలో తక్కువ మొత్తంలో ఫోలేట్, విటమిన్ B6, థయామిన్, విటమిన్ A, సెలీనియం కూడా ఉన్నాయి.

గుమ్మడికాయ గింజలు vs. పొద్దుతిరుగుడు విత్తనాలు

గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు ఈ రెండు ఎంతో రుచికరమైన, అద్భుతమైన వైవిధ్యభరిత పోషకాలతో నిండిన గింజలు అని చెప్పడంలో సందేహమే లేదు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రెండు గింజలలో ఫైబర్, ప్రోటీన్, గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్నాయి. వీటికి అదనంగా అవసరమైన విటమిన్లు, ఖనిజాల కలగలిపిన మేళవింపు. అయితే, ఈ రెండు పవర్-ప్యాక్డ్ పదార్థాల మధ్య అనేక ప్రత్యేక తేడాలు ఉన్నాయి. గుమ్మడికాయ గింజలు ఫ్లాట్, ఓవల్ ఆకారంలో, లేత ఆకుపచ్చగా ఉంటాయి. అవి కూడా తెల్లటి పొట్టులో కప్పబడి ఉంటాయి.

మరోవైపు పొద్దుతిరుగుడు గింజలు లేత గోధుమరంగు నల్ల చారల పెంకులతో కప్పబడి ఉంటాయి. రెండూ మృదువైన అల్లికలు, తేలికపాటి, వగరు రుచిని కలిగి ఉంటాయి, ఇవి ఏదైనా మసాలాతో బాగా పని చేస్తాయి. పోషణ పరంగా, ఒక ఔన్స్ గుమ్మడికాయ గింజలు సాధారణంగా అధిక మొత్తంలో ప్రోటీన్, తక్కువ మొత్తంలో కేలరీలు, కొవ్వు, ఫైబర్‌ను సరఫరా చేస్తాయి. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటాయి, పొద్దుతిరుగుడు విత్తనాలు పాంతోతేనిక్ యాసిడ్, ఫోలేట్, రాగిని పుష్కలంగా కలిగివున్నాయి.

గుమ్మడికాయ గింజలను ఎలా తినాలి?

గుమ్మడికాయ గింజలు చాలా కిరాణా దుకాణాలతో పాటు ప్రస్తుతం ఆన్‌లైన్ లోనూ సులభంగా లభ్యం అవుతున్నాయి. అవి సాధారణంగా పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి ఇతర విత్తనాలతో పాటు చిరుతిండి క్యాటగిరిలోనూ లభ్యం అవుతుంటాయి. స్థానిక దుకాణంలో ఇవి రెండు క్యాటగిరిల్లో లభ్యమవుతుంటాయి. ఒకటి పైన షెల్ తో పాటు ఒక రకంగా, షెల్ తీసివేసిన గింజలుగా మరో రకంగానూ అందుబాటులో ఉంటాయి. షెల్ తీసివేసిన వాటిని “పెపిటాస్”గా పిలుస్తారు. చాలా మంది ముడి విత్తనాలు లేదా అదనపు నూనె లేకుండా కాల్చిన విత్తనాలను కొనుగోలు చేస్తారు. ఇక కొందరు గుమ్మడికాయలను కొని విత్తనాలను సేకరించి వాటిని చక్కగా నీటిలో కడిగి.. ఎండలో ఎండబెట్టి సేకరించుకుంటారు. విత్తనాలను వేయించడం వల్ల వాటి యాంటీఆక్సిడెంట్ల శోషణను మెరుగుపరుస్తుంది, వాటిని సులభంగా జీర్ణం చేయగలదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గుమ్మడికాయ గింజలను ఎలా ఉడికించాలి అనేదానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఓవెన్లో వాటిని కాల్చడం బహుశా సర్వసాధారణం:

  • వాటిని నూనె రాసుకున్న బేకింగ్ ట్రేలో పలుచని పొరలో వేసి, ఓవెన్‌లో 300 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద సుమారు 30 నిమిషాలు బేక్ చేయండి.
  • పొయ్యి నుండి తీసివేసి, ఆలివ్ నూనె, ఉప్పు మరియు మిరపకాయ, ఒరేగానో, జీలకర్ర లేదా మిరపకాయ వంటి మీ ఎంపిక మసాలాతో టాసు చేయండి.
  • మళ్లీ ఓవెన్‌లో ఉంచండి మరియు అవి మంచి బంగారు రంగుతో మంచిగా పెళుసుగా ఉండే వరకు మరో 20 నిమిషాలు కాల్చండి.

వాటిని కాల్చిన తర్వాత వాటి రుచిని మీరు వదిలేందుకు ఇష్టపడరు. ఇష్టమైన రుచికర చిరుతిండిగా మీరు వీటిని ఆస్వాదిస్తారు. సలాడ్లు, తృణధాన్యాలు లేదా పెరుగుతో వీటిని అస్వాదించవచ్చు. వివిధ రకాల గింజలతో, విత్తనాలతో పాటు ట్రయల్ మిక్స్‌లో కలపి తీసుకోవచ్చు. మీరు పచ్చి గుమ్మడికాయ గింజలను ఆరోగ్యకరమైన, రుచికరమైన నో ఫస్ స్నాక్‌గా కూడా ఆస్వాదించవచ్చు, అదే విధమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ గింజలు రోజూ తిసుకోవచ్చా.? అంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. ఇవి రోజు తీసుకోవడం కారణంగా అరోగ్యం ధృడంగా ఉంటుంది. అయితే ఇవి అధికంగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు. రోజు పరిమితమైన స్థాయిలోనే తీసుకోవడం అరోగ్యానికి మేలు చేస్తుంది. అధిక క్యాలరీలు కలిగి ఉండటం కారణంగా, ఫైటోఈస్ట్రోజెన్ ప్రభావాలను కలిగి ఉన్నందున, రోజుకు దాదాపు పావు కప్పుకు మించకుండా తీసుకోవడం ఉత్తమం. అయితే అంతకుమించి తీసుకుంటే హార్మోన్ సంబంధిత లక్షణాలకు కారణం అవుతూ.. అధిక బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది.

గుమ్మడికాయ గింజల వంటకాలు

గుమ్మడికాయ గింజలతో ఏమి చేయాలి.? వాటిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా?. అయితే గుమ్మడి గింజలను అనేక రకాలుగా అహారంగా తీసుకోవచ్చు. గుమ్మడి గింజల షెల్ తీసేసి.. పలుకులను తేనెలో ముంచుకుని తినడం నుంచి వేయించుకుని తినడం వరకు అనేక రకాలుగా వీటిని రోజువారీగా తీసుకోవచ్చు. వాటిలో కొన్ని రుచికరమైన వంటకాలు ఇక్కడ ఉన్నాయి:

  • వేయించి గుమ్మడికాయ గింజలు
  • గుమ్మడికాయ బ్రేక్ ఫాస్ట్ బైట్స్
  • శాఖాహారం పోజోల్ వెర్డే
  • వనిల్లా గుమ్మడికాయ గింజల సమూహాలు
  • ఉష్ణమండల ఎకై బౌల్

గుమ్మడి గింజలతో ప్రమాదాలు.? దుష్ప్రభావాలు:

గుమ్మడికాయ గింజలు చెడు చేస్తాయని అనుమానంగా ఉందా? ఔను మీ సందేహం నిజమే. అయితే ఇవి మీరు సేకరించే గుమ్మడి గింజల నుండి కాకుండా.. మార్కెట్లో లభ్యమయ్యే ప్రాసెస్ చేయబడిన, లేదా ముందుగా ప్యాక్ చేయబడిన గుమ్మడికాయ గింజల ఉత్పత్తులలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటిలో కలిపిన ఇతర పదార్థాలు కూడా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. అయితే దీనిని అధిగమించడానికి మీరు సోంతంగా గుమ్మడి గింజలను సేకరించడం లేదా తీసుకునే సమయంలో లేబుల్స్ పై తక్కువ సోడియం మోతాదు ఉన్న ఫ్యాకెట్లను ఎంచుకోవడమే మార్గం. ముడి గింజలను ఎంపిక చేసుకుని ఇంట్లో తినబోయే ముందు వాటిని ప్రాసెస్ చేసుకోవడం మరింత మంచింది. గుమ్మడి కాయ గింజల షెల్ తినదగినది అయినప్పటికీ, అది కొంత నూనెను ఉత్పత్తి చేసే రకం కాబట్టి.. ఇది కడుపుని చికాకుపెట్టే అవకాశం ఉంది. ఇక మరికోందరికి ఇది త్వరగా అరగకపోవడంతో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. నమలడం లేదా మింగడంలో ఇబ్బందులు ఉన్నవారికి నమలడం కూడా కష్టంగా ఉంటుంది.

షెల్ తీసివేసిన గుమ్మడికాయ గింజల పలుకులను తినలేకపోతున్నారని మీరు భావిస్తే, పొట్టుతో ఉన్న గింజలను ఎంచుకుని అస్వాదించడం ద్వారా.. దాదాపు అదే పోషకాలను అందుకోవడంతో పాటు అవే ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇక గుమ్మడి గింజలను అధిక మొత్తంలో తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి ప్రతికూల దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. ఈ గింజలు అధిక మొత్తంలో కేలరీలను కలిగి ఉండటం కారణంగా.. అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి కూడా కారణంగా మారతాయి.

కొసమెరుపు

  • గుమ్మడికాయ విత్తనం అనేది ఒక రుచికరమైన విత్తనం, ఇది వేల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల అరోగ్యాలను పరిరక్షిస్తోంది.
  • ఈ విత్తనాలు ప్రోటీన్, ఫైబర్ లు పుష్కలంగా ఉండటం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు, ముఖ్యమైన విటమిన్లను కలిగి ఉన్నాయి.
  • గుమ్మడికాయ గింజలు మధుమేహాన్ని నియంత్రించడం, గుండె ఆరోగ్యం మెరుగుపర్చడం, మెరుగైన నిద్ర, క్యాన్సర్ కణాలపై పోరాడటం, మూత్రవిసర్జన పనితీరును పెంచడం వంటి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
  • వీటిని తీసుకోవడం వల్ల పురుషులలో ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా లక్షణాలను తగ్గిపోతాయి. రొమ్ము క్యాన్సర్ కణాలను నివారించడంలోనూ దోహదపడుతుంది.
  • గుమ్మడికాయ గింజలను ఎలా తీసుకోవాలన్న అనేదానికి అనేక ఎంపికలు ఉన్నాయి, వీటిని పచ్చిగా తీసుకోవచ్చు లేదా సలాడ్‌లు, స్మూతీస్, తృణధాన్యాలు, డెజర్ట్‌లలో కలిపి తీసుకోవచ్చు.
Exit mobile version