Home టిప్స్ చర్మాన్ని మెరిసేలా చేసే సౌందర్య చిట్కాలు

చర్మాన్ని మెరిసేలా చేసే సౌందర్య చిట్కాలు

0
చర్మాన్ని మెరిసేలా చేసే సౌందర్య చిట్కాలు

ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

తేనే

మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు త్వరగా ప్రకాశవంతంగా మారుటకు ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తేనే అందులో మొదటిది. చర్మానికి తేనే రాయటం వలన త్వరగా ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మం పైన ఉండే మచ్చలకు, మరకలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కారణం ఇది ‘యాంటీ-బ్యాక్టీరియా’ గుణాలను కలిగి ఉండటం వలన. అంతేకాకుండా, తేనే వలన చర్మం సున్నితంగా మారుతుంది.

దోసకాయ

ప్రకాశవంతమైన చర్మం కోసం చెప్పుకునే సౌందర్య చిట్కాలలో, దోసకాయ ఎలా మర్చిపోతున్నారు? ఫ్రిజ్ నుండి తీసిన దోసకాయల నుండి తయారు చేసిన రసాన్ని చర్మానికి వాడండి. దీని వలన వివిధ రకాల చర్మ సమస్యలు మరియు అలసిన కళ్ళకు ఉరట కలిగిస్తుంది. దోసకాయ రసాన్ని కళ్ళకు వాడటం వలన హైడ్రెటింగ్ భావనను పొందుతారు, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దోసకాయ వలన కంటి కింద చర్మం పైన ఉండే నల్లటి వలయాలను కూడా త్రోలగిస్తుంది. మీరు నల్లటి మచ్చలను కలిగి ఉన్నారా.. అయితే తాజా దోసకాయ రసాన్ని, కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి.

అవసరమైన నూనెలు

మీరు ఇంట్లోనే స్వతహాగా సౌందర్య చిట్కాలను అనగా కొన్ని రకాల నూనెలను ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యకరంగా మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఆలివ్ ఆయిల్, జోజోబ ఆయిల్ లేదా బాదం వంటి నూనెలు మీ చర్మం పైన ఉండే దుమ్ము, ధూళిలను పోగొడుతాయి. పడుకోటానికి ముందుగా ఆలివ్ పాయిల్ లేదా సన్ ఫ్లవర్ నూనెలను వాడటం వలన మీరు త్వరిత ఫలితాలను పొందుతారు.

పాలు

మీ చర్మం జిడ్డుగా ఉందా, అయితే చల్లటి మంచు గడ్డ కలిపిన పాలను ముఖానికి వాడండి; దీని వలన చర్మం పైన ఉండే నూనెలు తొలగిపోతాయి, సౌందర్య చర్మం కోసం జీవన శైలిలో చాలా రకాల చిట్కాలను అనుసరించాలి.

Exit mobile version