మలద్వారం చుట్టూ ఉన్న సిరలు ఉబ్బినప్పుడు, తరచుగా ప్రేగు కదలిక లేదా మలబద్ధకం సమయంలో ఒత్తిడి కారణంగా ఏర్పడే గడ్డలనే పైల్స్ (మొలలు, హెమోరాయిడ్స్) అని అంటారు. ఇవి ఎలా సంభవిస్తాయి. ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఎలా గుర్తిస్తారు, అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయా?, ఎలా చికిత్స చేస్తారు.? వాటిని నివారించే మార్గాలు ఉన్నాయా.? గృహచిట్కాలు ఏమైనా ఉన్నాయా.? అయుర్వేదంలో మొలల నివారణ ఎలా చేపడతారు.? ఇత్యాది ప్రశ్నలను సమాధానాలను మనం ఈ వ్యాసంలో పరిశీలిద్దాం. అంతకు ముందు మనం అలసు మొలలు అంటే ఏమిటీ అన్న విషయాన్ని తెలుసుకుందాం.
పైల్స్ (మొలలు) అంటే ఏమిటి? What are Piles (Hemorrhoids)?
ఆంగ్లంలో తరచుగా పైల్స్ అని సంబోధించినా మొలలను హెమోర్హొయిడ్స్ అని పిలుస్తారు. ఇవి భాధాకరమైన అనుభూతిని కలిగించే గడ్డలు. సాధారణంగా మొలలు మలద్వారం లోపల మరియు బయటి అంచున వస్తాయి. అక్కడే వచ్చేందుకు కారణంగా కూడా ఉంది. సంక్లిష్ట చిన్న సిరల (రక్త నాళాలు)తో మలద్వార ప్రదేశం కప్పబడి ఉంటుంది. ఇవి మలబద్దకం కారణంగా ఒత్తిడికి గురవుతాయి, దీంతో అప్పుడప్పుడు వాపుకు గురికావడం, రక్తంతో నిండి ఉబ్బుతాయి. ఈ విస్తరించిన రక్తనాళాలు మొలలు ఏర్పడేందుకు కారణంగా మారుతాయి, ఇవి వాటి పైన ఉన్న కణజాలాలతో సమూహంగా ఏర్పడటం వల్ల మొలలు (పైల్స్) ఏర్పడతాయి.
ప్రపంచ జనాభాలో దాదాపుగా ఐదు శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, యాభై ఏళ్ల వయస్సు దాటిన దాదాపు 50 శాతం మంది పెద్దలు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మొలలు సమస్యను ఎదుర్కోని, వాటి లక్షణాలను అనుభవించి ఉంటారు. పైల్స్ మలద్వారం అంచున బాహ్యంగా లేదా అంతర్గతంగా ఉండవచ్చు. మలద్వారం లేదా పురీష నాళంలో అంతర్గత హేమోరాయిడ్లు అభివృద్ధి చెందుతాయి. బాహ్య హేమోరాయిడ్లు (పైల్స్) మలద్వారం వెలుపల అభివృద్ధి చెందుతాయి. బాహ్య హేమోరాయిడ్లు అత్యంత సాధారణ మరియు అత్యంత సమస్యాత్మకమైనవి. ఈ పైల్స్ నొప్పి, తీవ్రమైన దురదతో కూడివుంటాయి మరియు కూర్చోవడాన్ని కష్టతరంగా మారుస్తాయి. అయితే ఎంతటి బాధను అనుభవించినా అదృష్టవశాత్తూ, అవి చికిత్స చేయదగినవి.
పైల్స్ (మొలలు) నిర్వచనం:
మొలలు (పైల్స్) అనేవి నాళ సంబంధిత ఖాళీలు, నాళలతో పాటు కణాలు జతకలవడంతో ఇవి మలద్వారం లోపల లేదా బయట కండ కలిగిన మరియు వాపు-వంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి. దీంతో మలం బయటకు వెళ్లకుండా అడ్డుకువడంలోనూ పాత్రను పోషిస్తాయి. అయితే మలాన్ని బయటకు పంపకుండా వాయువుని (గ్యాస్ ని) మాత్రమే , మలద్వారా ద్వార అనుమతిస్తాయి. ఈ మొలలలో రక్తం గడ్డకట్టి చీముతో కూడిన ద్రవము చేరుకొని వెడల్పు అయ్యి అది చీలుకుని కిందకి జారటం వల్ల నొప్పి, రక్తస్రావం, దురద లేదా ఉత్సర్గకు కారణమవుతుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి వైద్యపరంగా సమస్యాత్మకంగా కూడా మారవచ్చు. అందుకని పైల్స్ సమస్య ఉత్పన్నం కాగానే, లేదా ఈ పరిస్థితి లక్షణాలు ఎదురుకావడంతోనే.. వైద్యులను సంప్రదించి తగు చికిత్సలను తీసుకుని, వారి సూచనల మేరకు ఔషధాలు తీసుకోవడం ఉత్తమ మార్గం.మారుతుంది.
పైల్స్ (మొలలు) యొక్క ప్రాబల్యం Incidence of piles
ఒక అధ్యయనం ప్రకారం, జనాభాలో దాదాపు 5 శాతం మంది ఎప్పుడైనా (ఏ వయసులోనైనా) మొలల సమస్యను అనుభవిస్తారు. అదేవిధంగా దాదాపు 50 శాతం మంది ప్రజలు తమ జీవితంలో ఒకానొక సమయంలో, బహుశా వారు 50 ఏళ్లు వచ్చేసరికి పైల్స్ సమస్యను అనుభవించి ఉండడం జరుగుతుంది. ప్రస్తుత మార్గదర్శకాలు భారతీయ దృక్కోణం నుండి మొలల చికిత్స కోసం వాస్తవాల ఆధారంగా వాటి యొక్క తీవ్ర స్వభావాన్ని మరియు సంఘటనలను బట్టి సూచనలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
పైల్స్ (మొలలు) రకాలు Types of Piles (Hemorrhoids)
మొలలు (పైల్స్) లో అనేక రకాలు ఉన్నాయి. వీటి వర్గీకరణ వాటి యొక్క స్థానం మరియు తీవ్రతను ఆధారంగా చేసుకుని చేయబడుతుంది.
స్థానాన్ని బట్టి పైల్స్ (మొలలు) రకాలు:
అంతర్గత మొలలు / పైల్స్ (internal hemorrhoids)
బాహ్య మొలలు / పైల్స్ (external hemorrhoids)
1. అంతర్గత మొలలు (ఇంటర్నల్ పైల్స్):
మలద్వారం మూలంలో లోతుగా ఉండేవి అంతర్గత మొలలు. ఇవి మలద్వారం లోపలి ప్రదేశంలో (మల ద్వారం నుండి లోపలకు వెళ్లే మార్గం) 2 సెంటీమీటర్లు కంటే పొడవు కలిగి ఉంటాయి. ప్రోలాప్స్ పైల్స్ గా అభివృద్ధి చెంది పెద్దగా పరిణితి చెందే ఈ ఫైల్స్ మల ద్వారం వెలుపలకు పొడుచుకు రావడంతోనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంతర్గత మొలలు సాధారణంగా నోప్పి రహితంగా ఉండటం కారణంగా వాటికి చికిత్స చేసే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాము. కాగా, ఇవి మల విసర్జణతో పాటు రక్తస్రావం కలిగిస్తాయి.
ప్రోలాప్స్డ్ హేమోరాయిడ్లు / పైల్స్ (అంతర్గం నుంచి బయటకు పొడుచుకు వచ్చిన మొలలు):
ఇవి మరింత తీవ్రమైన మరియు బాధాకరమైన అంతర్గత మొలలు. మల విజర్జన సమయంలో లేదా మలద్వారాన్ని తుడిచే సమయంలో లేదా ప్రేగు కదలికల వల్ల సాధారణంగా ఇవి బయటకి వస్తాయి. లక్షణాలు నెమ్మదిగా పెరిగి అడపాదడపా వస్తుంటాయి. కాగా, కొందరిలో కొన్ని రకలా రుగ్మతలు కూడా ఈ పరిస్థితికి కారణం అవుతుంటాయి, ఇక మరికోందరిలో ఆనల్ స్పింక్టర్ (మల మార్గ కండరాల) సంకోచం కారణంగా కూడా ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.
2. బాహ్య మొలలు (ఎక్స్టర్నల్ పైల్స్):
బాహ్య మొలలు ఇవి మలద్వారా బయట లేదా గుద భాగము వెలుపల 2 సెం.మీటర్ల పరిమాణంతో అభివృద్ధి చెందుతాయి. ఇవి రమారమి వేడిమి గడ్డలు లేద సెగ గడ్డల మాదిరిగా కనబడతాయి. ఇవి మల ద్వారం, పిరుదుల భాగంలో గడ్డలుగా కనిపిస్తాయి. స్కిన్ ట్యాగ్‌లతో (అదనపు చర్మంతో) కొన్ని సందర్భాలలో ఇవి పొరబడటం జరుగుతుంది. ఈ బాహ్య మొలలు తీవ్రతరం అయిన నేపథ్యంలో రక్తం కారణంగా సిరలు ఉబ్బి, నీలిరంగు గడ్డలుగా మారుతాయి. కొన్నిసార్లు అవి thrombosed hemorrhoids (రక్తంతో గడ్డ కట్టిన మొలలు) ఏర్పడటానికి దోహదం చేస్తాయి.
రక్తంతో గడ్డ కట్టిన మొలలు (త్రొమ్బోసేడ్ హెమోర్హొయిడ్స్):
త్రొమ్బోసేడ్ హెమోర్హొయిడ్స్ అనే మొలలు రక్తంతో గడ్డ గడ్డకడతాయి. దీంతో ఇవి తీవ్రమైన మరియు స్థిరమైన నొప్పికి కారణం అవుతాయి. రక్తం గడ్డకట్టిన మొలలు, పగులగొట్టడానికి దారితీయడం కారణంగా కూడా ఆ ప్రదేశంలో ఒత్తిడిని పెంచుతుంది. ఈ మొలలు రక్తంతో గడ్డకట్టకపోతే అసౌకర్యం, వాపు, ఒత్తిడి ఫిర్యాదు చేయవచ్చు.
తీవ్రత ఆధారంగా పైల్స్ (మొలలు) రకాలు:
గ్రేడ్ – 1: అంతర్గత మల ద్వారానికి ఆనుకుని ఏర్పడే చిన్న మొలలు వాపుతో కూడిఉంటాయి. ఇవి గుద భాగము (anus) వెలుపల అభివృద్ధి చెందుతాయి. అవి కనిపించవు మరియు గ్రహించ బడవు. గ్రేడ్-1 పైల్స్ సర్వ సాధారణం, అవి కొంతమందిలో పెద్దవిగా పెరిగి, గ్రేడ్ 2 లేదా గ్రేడ్-౩ మొలలకు దారితీస్తుంది.
గ్రేడ్ – 2: ఇవి పరిణామంలో గ్రేడ్ 1 కన్నా పెద్దవిగా ఉంటాయి మరియు రోగి మలద్వారం ప్రాంతాన్ని తుడిచినప్పుడు లేదా మరుగుదొడ్డిని ఉపయోగించినప్పుడు మలద్వారం వెలుపలకి పాక్షికంగా లాగబడవచ్చు, కానీ రోగి ప్రయాసపడటం (ముక్కడం) ఆపివేసిన వెంటనే, అవి లోపలికి తిరిగి యధాస్థితికి చేరుకుంటాయి.
గ్రేడ్ – 3: మొలలు మూడవ గ్రేడ్ దశకు చేరుకున్న తరుణంలో రోగులు టాయిలెట్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మలద్వారం నుండి మొలలు బయటకు జారడాన్ని ఎదుర్కొంటారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మొలలు మలద్వారం నుండి వేలాడబడి ఊగుతున్న గడ్డలుగా అనిపించవచ్చు. వీటిని బాధితుడు తిరిగి మలాశయంలోకి చోప్పించడానికి ఒక వేలితో బలవంతంగా నెట్టవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.
గ్రేడ్ – 4: మలద్వారం నుండి అర్శమొలలు కింద్రికి వచ్చి ఊడులాడుతుంటాయి. ఇది నాల్గవ గ్రేడ్ లేదా చివరి దశలో ఏర్పడే పరిస్థితి. ఇక వీటిని లోపలికి చోప్పించలేవు. అవి కొన్నిసార్లు చాలా పెద్దవిగా మారి, అనేక ఇబ్బందులకు బాధితులను గురిచేస్తాయి. వారిని కూర్చోనివ్వదు, వాహనాలను నడపనీయదు.
పైల్స్ (మొలలు) లక్షణాలు Piles symptoms of Piles (hemorrhoids)
పైల్స్ (మొలలు) లక్షణాలు రోగి కలిగి వున్న హేమోరాయిడ్ల రకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. బాహ్య మొలలు నొప్పితో కూడి ఉన్నా చికిత్స చేయబడతాయి. అయితే అంతర్గత మొలలు నొప్పిని కలిగించకపోయినా అవి చికిత్స చేయబడవు. అయితే ప్రోలాప్స్డ్ మొలలు కాసింత నొప్పిని కలిగిస్తాయి. పైల్స్ లక్షణానలు పరిశీలిస్తే:
అంతర్గత మొలల లక్షణాలు:
* మలవిసర్జన సమయంలో రక్తస్రావం
* నొప్పి
* రక్తంతో కూడిన ఎరుపు రంగు మలం
* ప్రోలాప్స్డ్ పైల్స్ (మలద్వారం నుండి మొలలు బయటకు వచ్చుట)
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అంతర్గత మొలలు నొప్పిని కలిగించకపోవచ్చు కాని, ప్రోలాప్స్డ్ మొలలు నొప్పితో పాటు అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి.
బాహ్య మొలల లక్షణాలు:
* మలద్వారం చుట్టూ విపరీతమైన దురద
* అసౌకర్య గడ్డ(లు) లేదా మలద్వారం దగ్గర వాపు
* ఈ గడ్డలును తాకడం ద్వారా నోప్పి కలిగిస్తయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గడ్డలు ఉత్పన్నం అవుతాయి.
* కూర్చున్నప్పుడు మలాశయ/మలద్వారం దగ్గర నొప్పి
మొలలు తరచుగా నొప్పిని కలిగించవు. అయితే, కొన్నిసార్లు బాహ్య మొలలు చర్మంపై రక్తం గడ్డకట్టవచ్చు. దీనిని థ్రాంబోస్డ్ హెమోరాయిడ్ అంటారు. అంతర్గత హేమోరాయిడ్లు కూడా ప్రోలాప్స్ కావచ్చు. అంటే ఇవి తిరిగి మలద్వారంలోకి ఉపసంహరణ కాకుండా బాధిస్తాయి. ప్రోలాప్స్డ్ మరియు థ్రోంబోస్డ్ హేమోరాయిడ్స్ రెండూ ముఖ్యమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ పైల్స్ చాలా అసౌకర్యంగా ఉన్నప్పటికీ, అవి ప్రాణాంతకం కావు మరియు తరచుగా చికిత్స లేకుండా స్వయంగా వెళ్లిపోతాయి. ఎప్పుడైనా రక్తస్రావం లేదా మలం నల్లగా వస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. రక్తస్రావం హేమోరాయిడ్‌ల వల్ల కాకుండా మరేదైనా కారణం కావచ్చు మరియు తప్పనిసరిగా మూల్యాంకనం చేయాలి. ఇంట్లో చికిత్స చేసిన 1 వారంలోపు మొలలు మెరుగుపడకపోతే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. మలద్వారాన్ని శుభ్రపర్చడం లేదా తరచుగా రుద్దడం వల్ల లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. బాహ్య మొలల లక్షణాలు సాధారణంగా కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి.
మొలల కారకాలు: (మొలలు ఎందుకు సంభవిస్తాయి.?) What are the Causes of Piles
మొలలు రావడానికి కారణాలు ఏమనగా:
* మల విసర్జన సమయంలో ప్రేగు కదలిక వల్ల ఒత్తిడి
* దీర్ఘకాలిక మలబద్ధకం లేదా అతిసారం
* బాత్‌రూమ్‌లలో ఎక్కువసేపు ఉండటం
* గర్భం కారణంగా పొత్తికడుపులో ఒత్తిడి పెరగటం
* భారీ బరువులు ఎత్తడం.
* అతిగా కారము మరియు మసాలాతో కూడిన వంటలు తినడం
* శరీరంలో నీటి కొరత ఏర్పడటం
పైల్స్ వ్యాధి ప్రమాద కారకాలు : Risk factors of piles (hemorrhoids)
* అధిక బరువు: ఇది పొత్తి కడుపుపై ఒత్తిడిని కలిగిస్తుంది. మొలలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
* మలబద్ధకం: ఇది మలం కష్టతరం అయ్యేలా చేస్తుంది మరియు ప్రేగు కదలికకు ఒత్తిడిని పెంచుతుంది, ఇది మలాశయ ద్వార సిరల్లో మరియు దాని చుట్టుపక్కల ఒత్తిడిని పెంచుతుంది.
* తక్కువ పీచు ఆహారం తీసుకోవడం: తక్కువ పీచు ఆహారం తీసుకోవడం వల్ల మలవిసర్జన కష్టతరం అవుతుంది తద్వరా మలబద్దకం మరియు పైల్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* తక్కువ నీరు త్రాగడం లేదా నిర్జలీకరణం (డీహైడ్రేషన్): శరీరంలో నీరు లేకపోవడం వల్ల మలవిసర్జన ప్రక్రియకు కష్టతరం అవుతుంది, ఇది పైల్స్‌కు కారణమవుతుంది.
* వృద్ధాప్యం: వయస్సుతో పాటు వచ్చే కొన్ని పరిస్థితులలో ఫైల్స్ కూడా ఒకటి. మలాశయ లైనింగ్/గుద భాగం యొక్క సహాయక స్వభావం కూడా తగ్గిపోయి ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
* ప్రెగ్నెన్సీ/గర్భధారణ: గర్భధారణ సమయంలో మల ప్రాంతం పైన బిడ్డ ఉండడం వల్ల ఒత్తిడి కలిగి పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ప్రసవం తర్వాత అదృశ్యం కావచ్చు.
* వంశపారంపర్య కారకాలు: మలాశయంలో మొలలు కూడా వారసత్వం వల్ల పెద్దల నుంచి పిలల్లకు సంక్రమించే అవకాశాలు ఉండటం
* అధిక బరువులు ఎత్తడం: అధిక బరువులు ఎత్తడం వల్ల మలద్వార భాగములో ఒత్తిడి ప్రమాదం పెరిగి మొలలు ఏర్పడవచ్చు.
* నిరంతర లేదా దీర్ఘకాలిక దగ్గు: దగ్గుతున్నప్పుడు గుద భాగములో ఒత్తిడి ఏర్పడడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది.
* అధిక పురిటి నొప్పులు: పురిటి నొప్పులు అధికంగా రావడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంది.
పైల్స్ (మొలలు) యొక్క సమస్యలు: complications of hemorrhoids (Piles)
పైల్స్ (మొలలు) వల్ల వచ్చే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. థ్రోంబోస్ పైల్స్, ప్రోలాప్స్డ్ పైల్స్, స్టెనోసిన్ ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
* థ్రోంబోస్ పైల్స్ (పైల్‌కు రక్త సరఫరా నిలిచిపోయి గడ్డకట్టడం ఏర్పడవచ్చును, ఇది తీవ్రమైన మొలల నొప్పికి దారితీస్తుంది).
* మలద్వారం చుట్టూ అధిక చర్మం ఏర్పడటం.
* మలద్వారంలో మొలలు పగులడం ద్వారా మలద్వార పొరలో చికాకు మరియు తీవ్రమైన ఇన్ఫెక్షన్ నొప్పికి కారణం అవుతుంది.
* స్టెనోసిస్ (మలద్వారం మార్గం పాక్షికంగా మూసివేయబడడం).
* స్ట్రాంగ్యులేషన్ పైల్స్ (మొలలకు రక్త సరఫరా తగ్గడం).
పైల్స్ (మొలలు) నిర్ధారణ How to diagnose Piles (Hemorrhoids)
సాధారణంగా, మొలలు నిర్ధారణ రోగి సొంతగానే తెలిసిపోతుంది. అయితే అంతర్గత మొలలను రోగి గుర్తించలేకపోవచ్చు. కానీ బాహ్య మొలలను రోగి గుర్తించవచ్చు. మలద్వారా చుట్టూర ఉన్న ప్రాంతంలో ఏదో ఒక చోట గడ్డగా ఏర్పడి ఉంటాయి. అయితే ఇది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గడ్డులు కూడా ఏర్పడి ఉండవచ్చు. అవి స్పర్శతో నోప్పిని కలిగి ఉంటాయి. దీంతో వాటిని రోగి తనంతట తానుగా గుర్తించవచ్చు. ఇక అంతర్గత మొలలు నిర్థారణ మాత్రం శారీరక పరీక్షతో మొదలవుతుంది, తరువాత తదుపరి విధానాలు ఉంటాయి.
పైల్స్ / మొలలు నిర్ధారణ చేసే విధానం:
* గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్ (జీర్ణాశయ శస్త్ర వైద్యులు) మొదట రోగి లక్షణాలు పరిశీలిస్తారు. రోగుల వ్యక్తిగత చరిత్ర, వైద్య-ఔషధ చరిత్రలతో పాటు కుటుంబ చరిత్రను వివరములను తెలుసుకుంటారు.
* చేతులకు గ్లౌజులు వేసుకున్న వైద్యుడు మలద్వారం ద్వారా పురీషనాళంలోకి (rectum) వేలిని ముందు లోపలి మరియు బయటి ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు.
* సాధారణంగా ఈ ప్రక్రియను డిజిటల్ రెక్టల్ పరీక్ష అని అంటారు. మొలల కణజాలాన్ని దృశ్యమానం చేయడానికి సహాయపడే ఒక పరికరం అనోస్కోప్‌ని ఉపయోగించి ఈ ప్రక్రియను చేపడతారు.
* జీర్ణాశయ శస్త్ర వైద్య నిపుణులకు ఏవైనా రక్తస్రావం కారణాలు, క్యాన్సర్‌లు లేదా పాలిప్‌లను (గడ్డలను) గుర్తించిన పక్షంలో వారు పెద్దప్రేగు నుంచి అదనపు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకు వారు సిగ్మాయిడోస్కోపీ (సిగ్మోయిడ్ కోలన్‌ని పరిశీలించడానికి ఉపయోగించే పరికరం) లేదా కోలనోస్కోపీ (మొత్తం పెద్దప్రేగును పరిశీలించడానికి ఉపయోగించే పరికరం) ద్వారా చేస్తారు.
* రోగి శరీరానికి భౌతిక పరీక్ష:
వైద్యుడు లేదా జీర్ణాశయ శస్త్ర వైద్యనిపుణులు రోగి శరీరాన్ని బౌతికంగా పరీక్ష చేస్తారు. మలాశయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఈ క్రింది వాటి కోసం అంచనా వేస్తాడు
* చర్మం దురదగా ఉండటం.
* స్కిన్ ట్యాగ్‌లు లేదా సెంటినెల్ పైల్ – గడ్డ కరిగిపోయిన తర్వాత లేదా పగిలిపోయిన తర్వాత మిగిలిపోయిన అదనపు చర్మం.
* మలద్వారం వద్ద పగుళ్లు – ఇవి నొప్పి, దురద, రక్తస్రావం కలిగించే గుదభాగంలో చిన్న చీలిక.
* గడ్డలు లేదా వాపు
* మల ద్వారం నుండి కిందికి జారిన వచ్చే అంతర్గత ప్రోలాప్స్ హేమోరాయిడ్స్.
* రక్తనాళంలో గడ్డ కట్టబడిన బాహ్య మొలలనే త్రొమ్భస్ పైల్స్ అంటారు.
* రక్తంతో మలం లేదా శ్లేష్మం విడుదల కావడం.
పైల్స్ (మొలలు) కోసం రోగనిర్ధారణ పరీక్షలు:
ఆనోస్కోపీ (anoscopy): అనోస్కోపీ అనేది ఆసన మరియు పురీషనాళ పరిస్థితులను నిర్ధారించడంలో సహాయపడటానికి అనోస్కోప్‌తో ఆసన కాలువ మరియు పురీషనాళాన్ని పరీక్షించడం. అనోస్కోప్ అనేది ఒక చిన్న-వ్యాసం కలిగిన ప్లాస్టిక్ లేదా మెటల్ బోలు గొట్టం (వేలు కంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది) ఒక అబ్ట్యురేటర్ అని పిలువబడే ఇన్సర్ట్. దీని ద్వారా వైద్యుడు అనోస్కోపీ ప్రక్రియను నిర్వహిస్తాడు.
ప్రోక్టోస్కోపీ (proctoscopy):
ప్రోక్టోస్కోపీ అనేది మీ పురీషనాళం మరియు పాయువు లోపలి భాగాన్ని పరిశీలించే ప్రక్రియ. మీ పురీషనాళం మీ పాయువు వద్ద ముగిసే మీ దిగువ జీర్ణశయాంతర ప్రేగు యొక్క చివరి విభాగం. మీ పాయువు అనేది మీ పురీషనాళం తెరవడం, దీని ద్వారా మలం మీ శరీరాన్ని వదిలివేస్తుంది.
ప్రోక్టోస్కోప్ ప్రకియ కోసం 10 అంగుళాల పొడవు కలిగిన ట్యూబ్ వినియోగిస్తారు. ఇది పెద్దప్రేగు, పురీషనాళం లోపల ఉన్న అసాధారణతలను దృశ్యమానం చేయడానికి కెమెరాను మరియు లైట్ కలిగి ఉంటుంది.
ఈ క్రింది వాటిని పరిశీలించడానికి ప్రోక్టోస్కోప్ ఉపయోగించబడుతుంది:
* మొలల ఉనికిని.
* రక్తస్రావం మరియు వాపుకు కారణమయ్యే పాలిప్స్ లేదా కణితులు.
* అతిసారం మరియు మలబద్ధకం యొక్క కారణాలు.
* కణితి యొక్క ఖచ్చితమైన స్థానం మరియు ఇతర సంకేతాలు.
కొలొనోస్కోపీ (colonoscopy):
మొలలు (పైల్స్) కోసం కొలొనోస్కోపీ మొత్తం పెద్దప్రేగును పరిశీలిస్తుంది. కోలోనోస్కోపీ అనేది పెద్ద ప్రేగు (కొలన్) మరియు పురీషనాళంలో వాపు, విసుగు చెందిన కణజాలాలు, పాలిప్స్ లేదా క్యాన్సర్ వంటి మార్పులను చూసేందుకు ఉపయోగించే పరీక్ష. కోలనోస్కోపీ సమయంలో, ఒక పొడవైన, సౌకర్యవంతమైన ట్యూబ్ (కొలనోస్కోప్) పురీషనాళంలోకి చొప్పించబడుతుంది. ఈ క్రింది వాటిని తెలుసుకోవడానికి కొలొనోస్కోపీ ఉపయోగించబడుతుంది:
* పెద్దప్రేగు యొక్క కణజాలం వాపు
* రక్తస్రావం కారణాలు
* క్యాన్సర్
* అల్సర్స్ (కురుపులు)
పైల్స్ (మొలలు) పోలిన ఇతర వ్యాధులు: Differential diagnosis of piles
సాధారణంగా ఈ మొలల నిర్దారణ పరీక్షలు అనేవి మొలలను గుర్తించడంతో పాటు వాటి కారకాలను గుర్తించడంలో ఉపయోగపడతాయి. ఇక దీంతో పాటు మొలలను పోలిన ఇతర వ్యాధులను కనుగొనటానికి కూడా చేయబడతాయి. ఇవి రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవి లక్షణాల ఆధారంగా మొలలతో పోలినవి ఒకటి కాగా, మరోకటి వైద్య సంబంధ ఆధారంగా పైల్స్ తో పోలినవి.
1. లక్షణాల ఆధారంగా పోలినవి
మలద్వార రక్తస్రావం:
* మలద్వారం దగ్గర చర్మం చిరగడం లేదా చీలిపోవడం వల్ల ఏర్పడే మలద్వార పగుళ్లు
* మలద్వారం వద్ద దురద లేక తామర (అలెర్జీ) దీర్ఘకాలిక చికాకును కలిగిస్తుంది. ఇది విష రసాయనాలతో సంబంధంలోకి రావడం వల్ల కూడా ఏర్పడుతుంది. ఈ దురగ కారణంగా వాపు, రక్తస్రావానికి దారితీస్తుంది.
* మలాశయ క్యాన్సర్: గుదభాగంలో సంభవించే అరుదైన క్యాన్సర్ మలాశయ క్యాన్సర్. మలాశయంలో లేదా పురీషనాళంలో రక్తస్రావం లేదా మలద్వారం దగ్గర గడ్డ ఏర్పడటం వంటి సంకేతాలు కనిపిస్తాయి.
* రెక్టల్ క్యాన్సర్: పురీష నాళంలోని కణజాలాలలో ప్రాణాంతక కణాలు (క్యాన్సర్) అభివృద్ధి చెందడమే రెక్టల్ క్యాన్సర్. రక్తంతో కూడిన మలం లేదా మల విసర్జన అలవాట్లలో మార్పులు అనేవి ఈ క్యాన్సర్ కు రెండు సూచికలు.
* ప్రొక్టిటిస్: పురీషనాళం (రెక్టమ్) వాపు కలిగిన పరిస్థితిని ప్రొక్టిటీస్ అంటారు.
– దురద:
* మలాశయ తామర: ప్రురిటిస్ అని అంటే లాటిన్‌లో “దురదతో కూడిన పాయువు” అని అర్థం. ఈ పరిస్థితి పాయువు దగ్గర చర్మం యొక్క చికాకును కలిగిస్తుంది, ఫలితంగా ఆ ప్రాంతాన్ని గీసేందుకు బలమైన కోరిక ఏర్పడుతుంది. అనేక సందర్భాల్లో, దురదను వివరించడానికి నిర్దిష్ట సమస్య కనుగొనబడలేదు.
* దీర్ఘకాలికంగా మలద్వార పగుళ్లు: మలద్వారం పగుళ్లు దీర్ఘకాలికంగా ఉన్న పరిస్థితి. ఇది మలద్వార పోర చిరగడం లేదా పగులుట వలన మంట మరియు దురద వస్తుంది.
– నొప్పి:
* పెరి ఆనల్ వీనస్ త్రాంబోసిస్: ఆసన ప్రాంతంలోని సిరలలో రక్తం గడ్డకట్టడం – బాహ్య హేమోరాయిడ్స్ అని పిలుస్తారు – అకస్మాత్తుగా పాయువుపై చాలా బాధాకరమైన గడ్డలు కనిపిస్తాయి. అవి సాధారణంగా గట్టి ప్రేగు కదలికల సమయంలో లేదా గర్భాలు మరియు ప్రసవాల సమయంలో బలంగా నొక్కడం వల్ల సంభవిస్తాయి మరియు ప్రమాదకరం కాదు.
* మలద్వారం పొర చినుగుట: మలద్వారం చర్మం చిరిగిపోవడాన్ని మలద్వార పగులు అంటారు. ఇది ఆరువారాల కంటే తక్కువ ఉంటుంది. మల ప్రోలాప్స్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో ఇబ్బందిని కలిగిస్తుంది మరియు ఇది ఆపుకొనలేని స్థితికి దారితీస్తుంది. ఇది గాయం, తక్కువ పీచు ఆహారం తినడం, మలబద్ధకం, మునుపటి శస్త్రచికిత్స వల్ల లేదా గట్టి మలం చరిత్ర ఉన్నవారిలో తరచుగా వస్తుంది. ప్రారంభ చికిత్సలో ద్రవాలు, పెరిగిన ఫైబర్ తీసుకోవడం మరియు పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు ఉండవచ్చు, కానీ చాలా మందికి చివరికి శస్త్రచికిత్స అవసరమవుతుంది.
* ఆబ్సెస్ (చీము)
– కణితులు:
* పైన ఉదహరించినట్లుగా ఆనల్ వీనస్ త్రాంబోసిస్
* చీము (ఆబ్సెస్)
* నిరపాయకారమైన కణితులు (క్యాన్సర్ కాని కణితులు)
* కాండిలోమా అక్యుమినాటా: (Condylomata acuminata) మానవ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల కలిగే అనోజెనిటల్ మొటిమలను సూచిస్తుంది. అనోజెనిటల్ మొటిమలను కలిగించే HPV యొక్క అత్యంత సాధారణ జాతులు 6 మరియు 11. HPV అనేది డబుల్ స్ట్రాండెడ్ DNA వైరస్, ఇది ప్రధానంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది.
* హైపర్ట్రోఫిక్ అనల్ పాపిల్లే: హైపర్‌ట్రోఫీడ్ ఆసన పాపిల్లే మరియు ఫైబరస్ ఆనల్ పాలిప్స్ దీర్ఘకాలిక ఆసన పగుళ్లతో సంబంధం ఉన్న ముఖ్యమైన ఆసన పాథాలజీలు మరియు ప్రురిటస్, ప్రెకింగ్ సెన్సేషన్, హెవీనెస్ మొదలైన లక్షణాలకు కారణమవుతాయి.
* మలాశయ క్యాన్సర్
2. వైద్య సంబంధ ఆధారంగా పోలినవి
* రెక్టల్ ప్రోలాప్స్: పురీషనాళం (రెక్టమ్) పురీషనాళం విస్తరించి, పాయువు నుండి జారిపోయినప్పుడు రెక్టల్ ప్రోలాప్స్ సంభవిస్తుంది. పెద్ద ప్రేగు యొక్క అత్యల్ప విభాగంలో భాగం, పురీషనాళం, పాయువు అని పిలువబడే జీర్ణాశయం చివరిలో కండరాల తెరవడం వెలుపల జారిపోయినప్పుడు మల ప్రోలాప్స్ జరుగుతుంది.
* హైపర్ట్రోఫిక్ ఆనల్ పాపిల్లే, కాండిలోమా అక్యుమినాటా, ఆనల్ వెయిన్ థ్రాంబోసిస్, మలాశయ / మలద్వారం పొర చినుగుట అనేవి ఈ వర్గానికి కూడా వచ్చును.
పైల్స్ (మొలలు) నివారణ: Prevention of Piles
పైల్స్ (మొలలు) నివారణ చర్యల్లో భాగంగా బాధితులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకొవాలి:
* లావెటరీ లేదా టాయిలెట్లలో ఎక్కువ సమయం గడపడం మానుకోవలెను.
* ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం మంచిది.
* ప్రేగు కదలికలపై ఎలాంటి ఒత్తిడిని కలిగించకుండా ఉండాలి.
* రెగ్యులర్ వ్యాయామం మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
* ఎక్కువ బరువులను ఎత్తడం మానుకోవాలి.
* పీచు పదార్ధాలను అధికంగా తీసుకోవాలి.
* నీరు ఎక్కువగా త్రాగడం వలన కూడా పైల్స్ ను నివారించవచ్చు.
పైల్స్ (మొలలు) నయము చేసే పద్ధతులు Piles treatment
పైల్స్ (మొలలు) నివారణకు గృహ చిట్కాలు
మందుల వినియోగం లేదా ఆపరేషన్ తో కూడిన పైల్స్ (మొలలు) చికిత్స
1. పైల్స్ (మొలలు) నివారణకు గృహ చిట్కాలు
ఆహార పద్ధతులు:
* చిరుధాన్యాల రొట్టె, తృణ / చిరు ధాన్యాలు (cereals), పండ్లు కూరగాయలు వంటి అధిక ఫైబర్ ఆహారాలు తీసుకోవడం వల్ల మలం మరింత సులభంగా కదులుతుంది.
* నీరు ఎక్కువగా తాగడం వల్ల రోగి మలాన్ని మృదువుగా విసర్జించవచ్చు.
* ఇస్పాఘులా, మిథైల్ సెల్యులోజ్, ఊక లేదా స్టెర్క్యులియా వంటి ఫైబర్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు.
* మద్యం మరియు కెఫిన్లను పరిమితికి మించి తీసుకోకూడదు.
* అమెరికా డైటరీ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి 1,000 కేలరీలకు 14 గ్రాముల డైటరీ ఫైబర్ (పీచు పదార్ధాలను) తినాలని సూచించింది. పైల్స్ నివారణ కోసం 2,000 కేలరీల ఆహారంలో రోజువారీ ఫైబర్ 28 గ్రాములు తీసుకోవాలని సూచించింది.
పైల్స్ ఉన్నవారు నివారించాల్సిన ఆహారాలు:
* ముందుగానే వండి నిల్వ ఉంచిన ఆహారాలు (ఘనీభవించిన ఆహారాలు)
* ప్రాసెస్ చేయబడిన ఆహారాలు (మైక్రోవేవ్తో వేడిచేసి తినే పదార్దములు)
* వెన్న
* ఫాస్ట్ ఫుడ్
* మాంసం
పైల్స్ ఉన్నవారు తీసుకోవలసిన అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు:
* ధాన్యాలు
* ఓట్స్
* దంపుడు బియ్యం (పొట్టుతో)
* బీన్స్
* పప్పు ధాన్యాలు
నివారించవలసిన మందులు:
* రోగులు మలబద్ధకానికి దారితీసే OTC / ఓవర్-ది-కౌంటర్ (డాక్టర్ సిఫారసు లేకుండా మందుల షాపులో లభించే) నొప్పి నివారణ మందులను నివారించాలి.
పైల్స్ నొప్పి నుంచి ఉపశమనం ఎలా:
* నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సిట్జ్ లేదా టబ్ బాత్ తీసుకోండి. టబ్ లో శరీరం తట్టకునేంత వెడి నీరు పోసి, అందులో కూర్చోవడం వల్ల నోప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
* సిట్జ్ బాత్: ఇది మొలలకు ఉత్తమ గృహ చికిత్సలలో ఒకటి. ఇది దురద, నొప్పి లక్షణాలను తగ్గించడానికి మరియు మలద్వారం, జననేంద్రియ ప్రాంతాలలో ఉపశమనం పొందడానికి రోగి వెచ్చని లేదా చల్లటి నీటిలో కూర్చుని స్నానం చెయ్యడం.
2. మందులు, శస్త్రచికిత్సలతో కూడిన పైల్స్ చికిత్స
పైల్స్ (మొలలు) చికిత్సలు ఏవనగా:
* మందులు
* శస్త్రచికిత్స కాని విధానాలు
* శస్త్ర చికిత్సలు
మందులు:
* మొలలు కోసం లేపనం, అలాగే పైల్స్ క్రీమ్, పైల్స్ టాబ్లెట్ మరియు కార్టికోస్టెరాయిడ్స్ (నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది), ఉపశమన మందులు (చల్లదనం మరియు మృదువైన ప్రభావాన్ని ఇస్తుంది), ఆస్ట్రింజెంట్లు (మొలల రక్తస్రావం మరియు ఇతర రాపిడిని తగ్గించే మొలల ఔషధం) మరియు యాంటీబయాటిక్స్ (ఇన్ఫెక్షన్ చికిత్స కోసం).
* పై మందులు OTC (ఓవర్-ది-కౌంటర్) మరియు ప్రిస్క్రిప్షన్‌గా (డాక్టర్ సిపారసుచే) ఇవ్వబడతాయి.
* తీవ్రమైన నొప్పి, రక్తస్రావం ఉన్నట్లయితే, మీ వైద్యుడు మీకు కార్టికోస్టెరాయిడ్స్ సహా మత్తుని కలిగించే మందులను సూచించవచ్చు.
మొలల చికిత్సలో భాగంగా శస్త్ర చికిత్స లేని విధానాలు:
* రబ్బర్ బ్యాండ్ లైగేషన్ (బ్యాండింగ్ చికిత్స):
సాధారణంగా, ఈ ప్రక్రియ గ్రేడ్ 1 మొలలు, గ్రేడ్-2 మరియు గ్రేడ్-3 మొలలు ఉన్న రోగులకు చేయబడుతుంది. మొలల ఉన్న ప్రాంతంలో ఆ ఆవరణ చుట్టూ రబ్బరు లేదా సాగే బ్యాండ్‌ను ఉంచుతారు. రబ్బరు బ్యాండ్‌ను ఉంచిన తర్వాత, పైల్స్ కు రక్త సరఫరా నిలిచిపోతుంది, తద్వారా పైల్స్ చనిపోయి వాటంతట అవే రాలిపోతాయి. రబ్బరు బ్యాండ్ లైగేషన్ సాధారణంగా నొప్పిలేకుండా ఉంటుంది. ఇది ఉత్తమ క్యూరింగ్ రేటును కలిగి ఉంది సుమారుగా 10 కేసులలో, 8 కేసులు నయమవుతున్నాయి. ఇతర పద్ధతులతో పోలిస్తే రబ్బర్ బ్యాండ్ లైగేషన్తో శస్త్రచికిత్స లేకుండా అంతర్గత మొలలు చికిత్సను ప్రభావవంతంగా నయము చేయగలిగే పద్దతి.
* ఇంజెక్షన్ స్క్లెరోథెరపీ:
అంతర్గత మొలల రక్తస్రావ సందర్భాల్లో, ఈ అంబులేటరీ (హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం లేకుండా) చికిత్స అనేది స్క్లెరోసెంట్‌లతో ఇంజెక్ట్ చేయబడుతుంది, దీని ఫలితంగా మొలల కణజాలాలలో ఉన్న రక్త నాళాలు కుంచించుకుపోతాయి. స్క్లెరోసెంట్ చికిత్స ప్రారంభించే ముందు, ఎండోస్కోపిక్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ చికిత్సా పద్ధతి మల రక్తస్రావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది ఔట్ పేషెంట్ ప్రక్రియ మరియు తక్కువ సెషన్లను కలిగి ఉంటుంది.
* ఇన్‌ఫ్రారెడ్ ఫోటోకోగ్యులేషన్:
ఇన్‌ఫ్రారెడ్ ఫోటోకోగ్యులేషన్ (కోగ్యులేషన్ థెరపీ అని కూడా పిలుస్తారు) అనేది చిన్న మరియు మధ్యస్థ-పరిమాణ హేమోరాయిడ్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక వైద్య విధానం. ఈ చికిత్స అంతర్గత హేమోరాయిడ్లకు మాత్రమే. ప్రక్రియ సమయంలో, వైద్యుడు ఇన్ఫ్రారెడ్ లైట్ యొక్క తీవ్రమైన పుంజం సృష్టించే పరికరాన్ని ఉపయోగిస్తాడు.
* ఎలెక్ట్రోకోగ్యులేషన్:
ఎలెక్ట్రోకోగ్యులేషన్ (“ఎలక్ట్రో”, అంటే నీటికి విద్యుత్ చర్జ్ ని వర్తింపజేయడం, మరియు “గడ్డకట్టడం”, అంటే కణ ఉపరితల ఛార్జిని మార్చే ప్రక్రియ, సస్పెండ్ చేయబడిన పదార్థం సముదాయాన్ని ఏర్పరుస్తుంది) ఒక అధునాతన మరియు ఆర్థిక నీటి శుద్ధి సాంకేతికత.
పైల్స్ కోసం కొన్ని లేజర్ చికిత్సలు:
* హేమోరాయిడల్ లేజర్ ప్రొసీజర్ (HeLP):
సాధారణ చికిత్సలతో మొలలు తగ్గని పక్షంలో బాధితులకు ‘HeLP’ అవసరం అవుతుంది. ఇది ఔట్ పేషెంట్ మరియు తక్కువ ఇన్వాసివ్ లాపరోస్కోపిక్ ప్రక్రియ. చికిత్స కణజాలాన్ని తొలగించడానికి చక్కటి లేజర్ పుంజంను అనుసరిస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణజాలాలు ప్రభావితం కాకుండా ఉంటాయి. ప్రజలు వివిధ ప్రయోజనాల కోసం పైల్స్ కోసం లేజర్ చికిత్సను ఇష్టపడతారు. తద్వారా మొలలను తీసివేయవచ్చు.
* హేమోరాయిడల్ లేజర్ ప్రక్రియ + మ్యూకోపెక్సీ (HeLPexx):
లేజర్‌తో డాప్లర్-గైడెడ్ హెమోరోహైడల్ డీటెరియలైజేషన్ మరియు ఆసన మ్యూకోపెక్సీని జోడించడం వంటి కుట్టు-పెక్సీ (HeLPexx)తో హెమోరాయిడ్ లేజర్ ప్రక్రియ, ఇది హేమోరాయిడ్‌లకు చికిత్స చేయడానికి ఒక నాన్-ఎక్సిషన్ ప్రక్రియ. ప్రస్తుత అధ్యయనం యొక్క లక్ష్యం సాంకేతికతను వివరించడం మరియు క్లినికల్ మరియు దీర్ఘకాలిక ఫలితాలను నివేదించడం.
* లేజర్ హెమోర్హోయిడోప్లాస్టీ (LHP):
లేజర్ హెమోర్హోయిడోప్లాస్టీ అనేది సాంప్రదాయిక శస్త్రచికిత్స. తక్కువ సమయంలో రికవరీ కలిగిన కనిష్ట ఇన్వాసివ్ (కోత లేని) ఔట్ పేషెంట్ ప్రక్రియ. ఈ చికిత్సలో లేజర్ హేమోరాయిడోప్లాస్టీ కిట్ ఉపయోగించబడుతుంది. లేసర్ కిరణాలను నియంత్రించి వాపు ఉన్న హేమోరాయిడ్లు తగ్గించడం జరుగుతుంది. ఈ పద్ధతితో ప్రోలాప్స్ నిరోధించబడతాయి. ప్రమాదాలు లేదా శస్త్రచికిత్స హెమోరాయిడ్ చికిత్సతో సంబంధం ఉన్న దీర్ఘకాలిక రికవరీ లేకుండా హెమోరాయిడ్‌లను సమర్థవంతంగా చికిత్స చేస్తుంది. పాయువు నుండి కణజాలం కత్తిరించకుండా లేదా తీసివేయకుండా (I-III దశ, దశ IV లేజర్‌తో బాహ్య చర్మాన్ని తొలగించడం అవసరం కావచ్చు)
మొలల చికిత్సలో భాగంగా శస్త్ర చికిత్సలు:
* సర్జికల్ హెమోర్హోయిడెక్టమీ:
వైద్య నిర్వహణలో వైఫల్యం, మొలలు పెద్దగా ఉబ్బడం, ముదిరిపోవుట, రక్తస్రావం ఉన్న కోగులోపతిక్ రోగులు మరియు అంతర్గత మూడవ, నాల్గవ-డిగ్రీ మొలలు కలిగిన పరిస్థితులలో చికిత్స చేయడానికి సర్జికల్ హెమోర్హోయిడెక్టమీ (సాంప్రదాయ శస్త్రచికిత్స) సూచించబడుతుంది. ఈ సర్జరీ ప్రక్రియకు సాధారణంగా అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఇన్‌పేషెంట్ విధానం. రోగిని కొన్ని రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, చికిత్స చేసిన తరువాత నయం అవుతున్న తరుణంలో డిశ్చార్జ్ చేస్తారు.
* స్టేపుల్డ్ హేమోరాయిడోపెక్సీ:
ఈ విధానంలో, పైల్స్ పైన ఉన్న మలద్వారం లైనింగ్ యొక్క వృత్తాకార భాగాన్ని కత్తిరించడానికి స్టాప్లింగ్ గన్ ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో పైల్స్‌ను మలద్వారం లోపలి భాగంలోకి లాగుతుంది మరియు పైల్స్‌కు రక్త సరఫరాను తగ్గిస్తుంది, దీని వలన సంకోచం ఏర్పడి మొలలు తీసివేయబడతాయి. సాంప్రదాయ శస్త్రచికిత్సతో పోల్చినప్పుడు ఇది తక్కువ నొప్పితో కూడిన ప్రక్రియ. ఈ ప్రక్రియకు కూడా అనేస్తేషియా (మత్తుమందు) ఇవ్వబడుతుంది.
* హేమోరాయిడల్ ఆర్టరీ లైగేషన్:
పైల్స్‌కు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ముడి (లైగేట్) వేయడం జరుగుతుంది, తద్వారా పైల్స్ కుచించుకుపోతాయి.
పైల్స్ (మొలలు) మరియు ఆనల్ ఫిషర్ మధ్య వ్యత్యాసం Difference between piles and fissure
పైల్స్ మలద్వారం ప్రాంతంలో రక్తనాళాలు మరియు కణజాలాల వాపును ప్రేరేపిస్తాయి, అదేవిధంగా ఆనల్ ఫిషర్ వల్ల, మలాశయము / మలద్వారం దగ్గర పొర చిరిగిపోవడం లేదా పగలడం కనిపిస్తుంది.
కారణాలు :
పైల్స్ (మొలలు): మలబద్ధకం, దీర్ఘకాలిక దగ్గు, గర్భం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక బరువు, మలం విసర్జించడానికి పెట్టే ఒత్తిడి, నిర్జలీకరణం, తక్కువ పీచు ఆహారం తీసుకోవడం.
ఆనల్ ఫిషర్: మలబద్ధకం, టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చోవడం, మలాన్ని విసర్జించడానికి ఒత్తిడి చేయడం, క్రోన్’స్ వ్యాధి.
లక్షణాలు :
పైల్స్ (మొలలు): మల రక్తస్రావం, నొప్పి, రక్తంతో కూడిన ఎరుపు రంగు మలం, మలాశయ/ మలద్వార దురద, నొప్పితో కూడిన గడ్డలు, కూర్చున్నప్పుడు మలద్వారం దగ్గర నొప్పి.
ఆనల్ ఫిషర్: మలంలో రక్తం, మలద్వార ప్రాంతం దగ్గర దురద లేదా మంట, మలాశయ ప్రాంతం దగ్గర పొర చినిగి లేదా పగిలి గడ్డగా ఏర్పడటం, నొప్పితో కూడిన ప్రేగు కదలికలు.
నివారణ:
పైల్స్ (మొలలు): ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, నీరు మరియు ద్రవాలు ఎక్కువగా తాగడం, టాయిలెట్లు మరియు గట్టి ఉపరితలాలపై తక్కువ సేపు కూర్చోవడం, ఫైబర్ ని పెంచే మందులు తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం, వ్యాయామాలు చేయడం.
ఆనల్ ఫిషర్: ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, నీరు మరియు ద్రవాలు ఎక్కువగా తాగడం, టాయిలెట్లు మరియు గట్టి ఉపరితలాలపై తక్కువ సేపు కూర్చోవడం మానటం, ఫైబర్ కి సంబందించిన మందులు తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం, వ్యాయామాలు చేయడం.
చికిత్స :
పైల్స్ (మొలలు): జీవనశైలి మార్పులు, లేపనాలు, క్రీమ్‌లు మరియు కార్టికోస్టెరాయిడ్స్, ఉపశమన మందులు, యాంటీ-బయాటిక్స్ మరియు ఆస్ట్రింజెంట్‌లను కలిగి ఉన్న సపోజిటరీలు. రబ్బర్ బ్యాండ్ లైగేషన్, ఇంజెక్షన్ స్క్లెరోథెరపీ, ఇన్‌ఫ్రారెడ్ కోగ్యులేషన్/ఫోటోకోగ్యులేషన్, డయాథెర్మీ మరియు ఎలక్ట్రోథెరపీ, హెమోర్హోయిడెక్టమీ, స్టేపుల్డ్ హేమోరాయిడోపెక్సీ, హేమోరాయిడల్ ఆర్టరీ లిగేషన్ వంటి వివిధ చికిత్సా విధానాలు.
ఆనల్ ఫిషర్: జీవనశైలి మార్పులు, పార్శ్వ స్పింక్టెరోటోమీ (లాటరల్) , ఓపెన్ సర్జరీ, లేజర్ చికిత్స.