
ఆప్టిమల్ హెల్త్ అంటే అన్ని విధాలుగా అరోగ్యంగా ఉండడం. ఇది ఎలా సాధ్యం అంటే పవర్-ప్యాక్డ్ న్యూట్రిషన్ తో మాత్రమేనని చెప్పవచ్చు. మొత్తం శరీర అరోగ్య శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, నిర్వహించడం రోజువారీ ఆహారాన్ని రూపొందించడం అనే సమగ్ర విధానానికి పోషకాలు ప్రాధాన్యత వహిస్తాయి. ఇందుకోసం అవసరమైన విభిన్న స్థూల, సూక్ష్మ పోషకాలు, విటమిన్‌లు, ఖనిజాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వు పదార్థాలులతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం సరైన పనితీరుకు అవసరమైన పోషకాలతో పాటు బయోయాక్టివ్ సమ్మేళనాలు రోజువారీగా ఏవేవి ఎంతెంత మోతాదులో తీసుకోవాలన్న విషయాలను తెలుసుకుందాం:
విభిన్న స్థూలపోషకాలు: Diverse Macronutrients
- కార్బోహైడ్రేట్లు: శరీరానికి ప్రధాన శక్తిని అందించే వనరులు కార్బోహైడ్రేట్లు. నిరంతర శక్తి అందించడానికి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తీసుకోవడం చాలా అవసరం.
- ప్రోటీన్లు: కణజాల మరమ్మత్తు, రోగనిరోధక పనితీరు, కండరాల నిర్వహణ విధులను చేపట్టేందుకు ప్రోటీన్లు అవసరం. పౌల్ట్రీ, చేపలు, బీన్స్, టోఫు వంటి లీన్ మూలాలను చేర్చండి.
- కొవ్వులు: ఆరోగ్యకరమైన కొవ్వులు కణ నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తి సహా మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవకాడోలు, గింజలు, నట్స్, ఆలివ్ నూనె వంటి మూలాల నుండి అసంతృప్త కొవ్వులను ఎంచుకోండి.
సూక్ష్మపోషకాలు: Micronutrients:
- విటమిన్లు: శరీరంలో వివిధ విధులను నిర్వహించే విటమిన్లు సరైన ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ A, C, D, E, K వంటి విస్తృతమైన విటమిన్లను పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి ఇంధ్రధనస్సు వర్ణంలోని వివిధ రకాల పండ్లు, కూరగాయలను తీసుకోండి.
- ఖనిజాలు: ఎముక ఆరోగ్యానికి, ద్రవ సమతుల్యతకు, నరాల పనితీరుకు కీలకం. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి.
యాంటీఆక్సిడెంట్లు: Antioxidants:
యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. బెర్రీలు, ఆకు కూరలు, రంగురంగుల కూరగాయల్లో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్ల ఉంటాయి.
ఫైబర్: Fiber:
అధిక ఫైబర్ ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు ఇస్తుంది. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయల్లో పుష్కళంగా డైటరీ ఫైబర్ ఉంటుంది.
హైడ్రేషన్: Hydration:
మానవ శరీరంలో అర్థభాగం నుంచి మూడొంతుల భాగం వరకు నీరు ఉందంటే నమశక్యమేనా.? కానీ ఇది నిజం. శరీర విధులను నిర్వహించడానికి, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి నీరు చాలా అవసరం. అందుకని తగినంత నీరు త్రాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం అవసరం.
లీన్ ప్రోటీన్: Lean Protein:
కండరాల పెరుగుదల, రోగనిరోధక పనితీరు, హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందించడానికి లీన్ ప్రోటీన్ అవసరం. గుడ్లు, కాటేజ్ చీజ్, చికెన్, పప్పు దినుసులు, చేపలు, టోఫు, క్వినోవలలో అధిక లీన్ ప్రోటీన్ మూలాలు.
ఆరోగ్యకరమైన కొవ్వులు: Healthy Fats:
అవోకాడోలు, గింజలు, నట్స్, సాల్మన్, ట్యూనా, అల్బాకోర్, మాకేరెల్, పొలుసుల (కోడ్), ట్రౌట్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు.. ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప వనరులు. వీటిని మీ రోజూ వారి ఆహారంలో చేర్చండి. ఈ కొవ్వులు మెదడు ఆరోగ్యం, హార్మోన్ ఉత్పత్తి, మొత్తం కణాల పనితీరుకు తోడ్పడతాయి.
ఆహారంపై నియంత్రణ: Portion Control on Nutritious Food:
అన్నీ ఆరోగ్యకరమైన ఆహారాలే కానీ వాటిని కూడా అతిగా తిన్నారంటే బరువు పెరగడం ఖాయం. అంతేకాదు ఇలా తిన్నారంటే అది ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అరోగ్యకరమైనా అవసరానికి తగిన మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. తగిన కేలరీలను వినియోగిస్తున్నారా అనేది కూడా నిర్ధారించుకోవాలి.
పరిమితంగా ప్రాసెస్ చేసిన, చక్కెర జోడించిన ఆహారాలు: Limit Processed Foods and Sugars:
శుద్ది చేసిన ఆహారాలతో పాటు జోడించిన చక్కెర కలిసిన పదార్థాలను తీసుకోవడం అనారోగ్యాలకు మూల కారణం. అనారోగ్య కొవ్వులు, కృత్రిమ సంకలనాల ఆహార వినియోగాన్ని తగ్గించండి. ఇవి బరువు పెరగడానికి దోహదం చేయడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు కారకాలని గుర్తించండి.
అనుకూలీకరణ స్థాయిలో పోషకాహారం: Customization of Nutrition:
పోషకాహారాల అవసరం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. ఆయా వ్యక్తుల వయస్సు, లింగం, కార్యాచరణ స్థాయి, ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాల ఆధారంగా ప్రతి ఒక్కరి పోషకాహార అవసరాలు భిన్నంగా ఉంటాయి. నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని తీసుకోండి. అంతేకానీ ఒకరితో పోల్చుకుని తీసుకోవడం అనర్థదాయకం.
స్థిరత్వమైన పోషకాహారం: Consistency on Nutrition:
స్వల్పకాలిక ఆహారాల కంటే దీర్ఘకాల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుండి సరైన ఆరోగ్య ఫలితాలు పొందవచ్చునని డైటీషయన్లు, న్యూట్రీషియన్లు పేర్కోంటారు. పోషకాహారం ఎంపికలు చేయడంలో స్థిరత్వం కీలకం. అలాకాకుండా ఈ ఒక్కరోజు ఇలా కానీ అని మినహాయింపులు తీసుకుంటూ ఫలితాలు శూన్యం.
నిపుణులైన డైటీషియన్ సంప్రదించండి: Consult a Professional:
నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు లేదా ఆహార అవసరాలు ఉంటే, వ్యక్తిగత పోషకాహార ప్రణాళిక అభివృద్ధి చేయడానికి, లేదా రూపొందించడానికి రిజిస్టర్డ్ డైటీషియన్, న్యూట్రీషియన్ లేదా హెల్త్‌కేర్ ప్రొఫెషనల్‌ని సంప్రదించండి.
మొత్తం శరీరం అరోగ్యంగా ఉండాలన్నా.. లేక అరోగ్యపరంగా మరింతగా మెరుగుపర్చుకోవాలన్నా పోషకాలతో కూడిన పరవ్ ప్యాక్డ్ ఆహారం చాలా అవసరం. ఇది మీ శరీరానికి పోషణనిస్తూనే, మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించే స్థిరమైన, సుసంపన్నమైన విధానం. దీన్ని అవలంబించడం కొంత కష్టతరమే అయినా దీర్ఘకాలికంగా పాటిస్తే సానుకూల ప్రలితాలతో కూడిన ప్రయోజనాలు సొంతం.