Home హెల్త్ A-Z డయాబెటిస్ మధుమేహాన్ని చటుక్కున నియంత్రించే జ్యూస్ ఇదే..!

మధుమేహాన్ని చటుక్కున నియంత్రించే జ్యూస్ ఇదే..!

0
మధుమేహాన్ని చటుక్కున నియంత్రించే జ్యూస్ ఇదే..!

మనలో చాలా మంది సర్వసాధారణమైన దీర్ఘకాలిక వ్యాధులు ఏవీ అంటే ముందుగా వచ్చేవి మాత్రం రెండే. వాటిలో ఒకటి మధుమేహం, కాగా రెండోవది రక్తపోటు. శరీరంలో రక్తపోటు స్థాయిలు రోజుకు చాలా సార్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు అదుపులో ఉండాలంటే ముందుగా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంటే షుగర్, బీపీ ఉన్నవారు మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే, అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుకుంటారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మందికి నోరు ఎండిపోవడం, దాహం వేయడం, కళ్లు మసకబారడం, అలసిపోయినట్లు అనిపించడం, చంచలమైన మనస్సు వంటివి కలిగిఉంటారు. కొందరిలో ఈ లక్షణాలన్నీ ఉండవచ్చు, మరికొందరికి కొన్ని మాత్రమే ఉండవచ్చు. మరికోందరిలో అసలు ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు.

శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాలంటే ముందుగా మనలో దాని లెవెల్ చెక్ చేసుకోండి అంటున్నారు డాక్టర్లు. బ్రిటెన్-ఆధారిత ఎస్తేర్ వాల్డెన్ డయాబెటిస్‌లో సీనియర్ క్లినికల్ సలహాదారు వివరాల ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయితే మధుమేహ స్థాయి అధికంగా ఉంటే అనేక అవయవాలపై దాని ప్రభావం పడుతుంది. ఇది అనేక సమస్యలకు కూడా దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా మూత్రపిండాలు, కళ్లు, కంటి చూపుపై ప్రభావం చూపుతుంది. కానీ ఈ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడానికి చిన్న గ్లాసు జ్యూస్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అదేంటి ఒక్క చిన్న గ్లాసు జ్యూస్ తాగితే చాలు షుగర్ లెవల్స్ తక్షణం అదుపులోకి వస్తాయని అంటే.. అందుకు మేము సిద్దం. రోజు అదే జ్యూస్ తాగుతూ తమ డయాబిటిస్ లెవల్స్ ను నియంత్రణలో ఉంటుకుంటాం.. ఆ జ్యూస్ ఏంటో చెప్పరూ.. అంటారా?. కాకర జ్యూస్ కాదు కదా.? అన్న అనుమానం అక్కర్లేదు. అది మనకు నిత్యం అందుబాటులో ఉండే ఒక పండు జ్యూస్. ఆ పండు మరేదో కాదు దానిమ్మ పండు. ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే 15 నిమిషాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న డయాబెటిక్ పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపునకు 230 మిల్లీలీటర్ల చక్కెర నీరు, మరో గ్రూపునకు 230 మిల్లీలీటర్ల దానిమ్మ రసం అందించారు. దానిమ్మ రసం శరీరంలోని గ్లూకోజ్‌ని తగ్గిస్తుందని పరిశోధకులు గమనించారు. దానిమ్మ జ్యూస్ తాగిన వారికి 15 నిమిషాల్లోనే షుగర్ లెవల్స్ తగ్గుముఖం పట్టగా, షుగర్ వాటర్ తాగిన వారి షుగర్ లెవల్స్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

Pomegranate Juice for diabetic people

దానిమ్మ ఎందుకు ప్రత్యేకం..?

దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో గ్రీన్ టీ, రెడ్ వైన్ కంటే మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం లేదా ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే వ్యాధులతో పోరాడుతాయి. దానిమ్మ గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రత్యేకమైన, ప్రయోజనకరమైన పండు అని చెప్పవచ్చు. ఇది కాకుండా, దానిమ్మలో చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 100 గ్రాముల దానిమ్మలో 19 శాతం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్లు వేగవంతమైన జీవక్రియను కలిగి ఉంటాయి. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. అందుకే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం కాదు. కాబట్టి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున దానిమ్మ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరమైన పండు.

మధుమేహాన్ని తగ్గించడానికి మరికొన్ని మార్గాలు:

Walking

రోజువారీ నడక: క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుకోవచ్చని ఆప్టిబాక్ ప్రోబయోటిక్స్‌లో పోషకాహార చికిత్సకుడు క్యారీ బీసన్ చెప్పారు. నడక నిజానికి హృదయ స్పందన రేటును పెంచుతుంది. అది శ్వాసను వేగవంతం చేస్తుంది. దీని వల్ల రక్తం మన శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుంది. కండరాలు ఉత్తేజితమవుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ 15 నుంచి 30 నిమిషాలు నడవడం మంచిది.

ఒత్తిడిని తగ్గించుకోండి: మీరు ప్రతిరోజూ నడవలేకపోతే, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి, క్యారీ బీసన్ చెప్పారు. దీనికి యోగా చాలా సహాయపడుతుంది. యోగా వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయని చెప్పారు. అంతేకాదు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం రోజూ కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి.

స్వీట్లను నివారించండి: అధిక చక్కెర ఆహారం మన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రధానంగా షుగర్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ మరియు రిఫైన్డ్ ఫుడ్ తినకూడదు. కార్బోహైడ్రేట్లను కూడా తగ్గించాలి. అదేవిధంగా, చక్కెర పానీయాలు, వైట్ రైస్ మరియు వైట్ బ్రెడ్‌లకు దూరంగా ఉండాలి.

హై బ్లడ్ షుగర్ ఉందా.? చిటికలో కంట్రోల్ చేయండిలా!
Exit mobile version