Home టిప్స్ బంగారుదుంపలతో ’బంగారం‘లాంటి అందం

బంగారుదుంపలతో ’బంగారం‘లాంటి అందం

0
బంగారుదుంపలతో ’బంగారం‘లాంటి అందం

తక్కువ ఖర్చులో అందాన్ని అద్భుతంగా కాపాడుకునే పద్దతుల్లో బంగాళదుంపతో రిమిడీలు చాలా బాగా పనికి వస్తాయి. వేలకు వేలు పెట్టి పార్లర్లలో చేయించుకునే ఫేషియల్ కన్నా బెటర్ లుక్ కోసం బంగాళదుంపను సరైన రీతిలో వాడి మంచి ఫలితాలను పొందవచ్చు. బంగాళదుంపను ఎన్ని రకాలుగా అందానికి పనికి వచ్చేట్లు వాడొచ్చో చూడండి..

నేచురల్ బ్లీచ్:

చర్మం నల్లగా..కమిలినట్లు అనిపిస్తుంటే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, పొటాటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముడతలు పోయేలా :

బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. బంగాళదుంప గుజ్జులో కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి మాస్క్ లా వేసుకొని 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడుతలతో పాటు ఏజింగ్ లక్షణాలు కూడా తొలగిపోతాయి.

పొడి చర్మము :

పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప మరియు అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది.

చక్కని ఛాయకి :

బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం మిక్స్ చేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. దీన్ని ఫేస్ మాస్క్ లాగ అప్లై చేయాలి .

ఫేస్‌మాస్క్‌లు :

ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.

డార్క్ సర్కిల్స్ మరియు కళ్లకి మెరుపుకు :

ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.పొటాటోను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి కంటి చుట్టూ అప్లై చేయాలి 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే డార్క్ సర్కిల్స్ చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

టోనర్ గా:

మీరు నేచురల్ టోనర్ కోసం చూస్తుంటే ఇది గ్రేట్ గా హెల్ప్ అవుతుంది. పొటాటో పేస్ట్ లో కొద్దిగా కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల టోనర్ గా పనిచేస్తుంది.

Exit mobile version