బ్రెయిన్ మెడిసిన్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త ఆర్టికల్ వైద్య నిపుణులను ఆందోళన పరుస్తోంది. మానవుల బ్రెయిన్ లోకి మైక్రోప్లాస్టిక్‌లు చోచ్చుకుపోయి అవి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి ఈ ఆర్టికల్ లో ప్రచురితం కావడమే అందుకు కారణం. మానవుడు తన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ను ఎంతగా ఉపయోగిస్తున్నాడు.. ఎలాంటి వాటిని దానిని వినియోగిస్తున్నాడన్న విషయం తెలిసిందే. చివరకు ప్లాస్టిక్ ఆహారం తీసుకునేందుకు, వేడి వేడి ఆహారాలను నిల్వ చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నాడు. వేసుకునే దుస్తులు, వాడే వస్తువులు ఇలా అన్నింటికీ ప్లాస్టిక్ పైనే ఆధారపడటంతో ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం తారాస్థాయికి చేరుకుంది. ఫలితంగా ఈ ప్లాస్టిక్ మైక్రో పదార్థాలు ఏకంగా మనషి మెదడులోకి కూడా చోచ్చుకువెళ్లాయి. ఈ ఆర్టికల్ లో ప్రధానంగా ప్రస్తావించబడిన అంశం మానవ మెదడులో మైక్రో ప్లాస్టిక్స్, వీటిని ఎలా నివారించాలి అన్న అంశాలను పరిశీలిద్దాం. ఈ సర్వవ్యాప్త పాలిమర్ ముక్కలకు గురికావడాన్ని తగ్గించడం సాధ్యమా అన్న అంశాన్ని కూడా పరిశీలించుకుందాం.
మెదడుల్లోకి మైక్రోప్లాస్టిక్‌లు.. Microplastics into our brains

పర్యావరణ వేత్తలు గత కొన్ని దశాబ్దాలుగా భూమికి అత్యంత హాని కలిగించే వాటిలో ఒకటిగా హెచ్చరిస్తూ వస్తూన్నది ప్లాస్టిక్ గురించే. దీని వినియోగంపై నిషేధాజ్ఞలు విధించాలని కూడా ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తూ కొంత మేరకు విజయం సాధించారు. నిషేదాజ్ఞాలు అక్కడక్కడా అమలులోకి వచ్చినా.. చాలా చోట్ల విచ్చలవిడిగా వినియోగం జరుగుతూనే ఉంది. ఇది చేరకూడని చోటుకు చేరి అందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ జీవఅధోకరణం (బయోడిగ్రేడ్) చెందదు, అందుకు బదులు, ఇది నెమ్మదిగా చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది. మైక్రోప్లాస్టిక్ అని పేరు సూచించినట్లుగా, ఈ ప్యాకేజింగ్ మెటీరియల్ చివరికి మైక్రోస్కోపిక్ శిధిలాలుగా మారుతుంది. క్రమంగా విచ్ఛిన్నమయ్యే ప్లాస్టిక్ విధానం కారణంగా, మైక్రోప్లాస్టిక్‌లు విస్తృత పరిమాణాలలో మారడంతో పాటు అవి భూమిపై ఉన్న ప్రతి జంతువు మింగడానికి లేదా శ్వాస ద్వారా వాటి శరీరంలోకి వెళ్లే పరిమాణంలోకి మారుతూ అని జీవరాశుల శరీరాల్లోకి వెళ్తున్నాయి.
పరిమాణంలో ఈ వైవిధ్యం మరియు వాటి స్పష్టమైన సర్వవ్యాప్తి కారణంగా, అవి ప్రతి ఆహార గొలుసులో మరియు భూమిలోని ప్రతి డిన్నర్ ప్లేట్‌లోకి చేరకుంటున్నాయి. “పర్యావరణానికి మైక్రోప్లాస్టిక్‌ల ఉద్గారాలు సంవత్సరానికి 10 నుండి 40 మిలియన్ టన్నుల మధ్య ఉంటాయని అంచనా వేయబడింది మరియు వ్యాపారపరంగా సాధారణ పరిస్థితులలో, ఈ మొత్తం 2040 నాటికి రెట్టింపు కావచ్చు” అని మైక్రో ప్లాస్టిక్ ఉద్గారాలు అనే అంశంపై సమీక్ష చేసిన రచయితల అభిప్రాయపడుతున్నారు. మైక్రోప్లాస్టిక్‌లపై పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, కానీ ఇప్పటికే, భూమిపై నివసించే జంతువులు, మానవులపై వాటి ప్రభావాలు ఆందోళనకరమైన కలిగిస్తున్నాయన్న సంబంధాలను శాస్త్రవేత్తలు వెలికితీస్తున్నారు.

ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను కూడా పర్యావరణ నిపుణులు కొన్ని ఆధారాలతో బయటపెట్టారు. రక్తంలోని మైక్రోప్లాస్టిక్‌లు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఇప్పటికే పలు ఆధారాలు ఉన్నాయి. ఇతర శాస్త్రవేత్తలు ఊపిరితిత్తులలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు మరియు అవి సంతానోత్పత్తి మరియు గట్ మైక్రోబయోమ్‌పై ప్రభావం చూపుతాయని ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా, ఈ సంవత్సరం ప్రచురించబడిన ఒక అధ్యయనంలో మానవ మెదడుల్లో ఏ ఇతర అవయవం కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని కనుగొన్నారు. 2024లో మరణించిన వారి మెదడుల్లో సగటున 8 సంవత్సరాల క్రితం మరణించిన వారి కంటే 50 శాతం మైక్రోప్లాస్టిక్‌లు అధికంగా ఉన్నాయని కూడా ఇది చూపించింది. దీంతో మైక్రోప్లాస్టిక్‌లు క్రమంగా పెరుగుతున్న సమస్యగా వారు పేర్కొన్నారు.
మైక్రోప్లాస్టిక్‌లకు గురికావడాన్ని ఎలా తగ్గించాలి? How to reduce exposure to microplastics

“మైక్రోప్లాస్టిక్‌లు” అనే పదం మొదట 20 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రీయ పేపర్ లో కనిపించింది. అప్పటి నుండి, దానిపై ఆసక్తి విపరీతంగా పెరిగింది, కానీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఒక వ్యక్తి యొక్క ఎక్స్‌పోజర్‌ను ప్రభావితం చేసే అంశాలు మరియు దానిని ఎలా తగ్గించాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినప్పటికీ, ఇటీవలి వ్యాఖ్యాన రచయితలు ఎక్స్‌పోజర్‌ను తగ్గించడానికి కొన్ని సైన్స్-ఆధారిత మార్గాలను చేర్చారు. మేము వారి సలహాను ఇతర నిపుణుల నుండి ఇన్‌పుట్‌తో సహా వివరిస్తాము.
1. నీరు: బాటిల్, ట్యాప్, మరిగించిన Water: Bottled, tap, and boiled

పర్యవరణ శాస్త్రం మరియు సాంకేతిక (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ) జర్నల్‌లో జరిగిన ఒక అధ్యయనం, బాటిల్ వాటర్ నుండి నేరుగా ట్యాప్ వాటర్‌కు మారడం వల్ల ప్రతి సంవత్సరం మైక్రోప్లాస్టిక్‌ల తీసుకోవడం 90,000 నుండి 4,000కి తగ్గించవచ్చునని పేర్కోంది. అది గణనీయమైన తగ్గింపు అయినప్పటికీ, ఈ లెక్కలు బాటిల్ వాటర్ మాత్రమే తాగే వ్యక్తితో, ట్యాప్ వాటర్ మాత్రమే తాగే వ్యక్తిని పోలుస్తాయని గుర్తుంచుకోవాలి. ఇక ఈ రెండు విలువల మధ్య అనేక మంది ఉండి ఉంటారన్నది చెప్పకనే అర్థం చేసుకోవాల్సిన అంశం.
అదే అధ్యయనంలో, బాటిల్ వాటర్ ద్వారా తీసుకునే నీటితో శరీరంలోకి వెళ్లే మైక్రోప్లాస్టిక్‌లకు రెండవ గొప్ప మూలంగా పేర్కొనబడింది. ఇక మొదటి స్థానంలో మనం సులభంగా నివారించలేనిది ఉంది. అదేంటేంటే మనం పీల్చే గాలి. ఇక మూడవ మూలంగా పేర్కొనబడింది సముద్ర ఆహారం. పర్యవరణ నిపుణులు, రచయితల ప్రకారం, ఈ మూడు “మైక్రోప్లాస్టిక్ తీసుకోవడంలో ఎక్కువ భాగం” అని తేలింది. కాగా, మరొక అధ్యయనంలో, శాస్త్రవేత్తలు నీటిలో మైక్రోప్లాస్టిక్‌లను తగ్గించడానికి చాలా సులభమైన, అయితే సమయం తీసుకునే పద్ధతిని గుర్తించారు. మరిగే నీటిని కాఫీ ఫిల్టర్ ద్వారా పోయడం వల్ల 90 శాతం వరకు మైక్రోప్లాస్టిక్‌లను తొలగించవచ్చని వారు చూపించారు.
2. టీబ్యాగులు సురక్షితమేనా? Are teabags safe?

చారిత్రాత్మకంగా, టీబ్యాగులు కాగితంతో తయారు చేయబడ్డాయి. చాలా ఇతర వాటిలాగే, వాటిలో ప్లాస్టిక్‌లు ఉండవచ్చునన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇది 2019లో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అధ్యయనం చేయడానికి కారణమయ్యింది. టీబ్యాగులు ప్లాస్టిక్‌ను తుది పానీయంలోకి వదులుతాయా అని పరిశోధించింది. 95 °C సెంటీగ్రేడ్ నీటిలో ఒకే టీబ్యాగ్‌ను నానబెట్టినప్పుడు, అది తుది పానీయంలోకి 14 బిలియన్లకు పైగా మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. అందువల్ల, టీని ఆస్వాదించే వ్యక్తుల కోసం, ప్లాస్టిక్ లేకుండా టీబ్యాగులను ఉత్పత్తి చేసే తయారీదారుల కోసం వెతకడం లేదా వదులుగా ఉండే ఆకు టీలు మరియు మంచి పాత-కాలపు టీ స్ట్రైనర్‌కు మారడం విలువైనది కావచ్చు.
అయితే, అమెరికాలో టీ విక్రయాల వర్తక అసోసియేషన్ వారు ఈ ఆధ్యయన వివరాలను తప్పబట్టారు. తాము వినియోగిస్తున్న టీబ్యాగ్‌లలోని మైక్రోప్లాస్టిక్‌ల పరిమాణం గురించి తగినంత ఆధారాలు లేవని ఎత్తి చూపింది. “పిఎల్ఏ (పాలీలాక్టిక్ యాసిడ్), నైలాన్ మరియు పిఈటి (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) వంటి కొన్ని టీబ్యాగ్‌లను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఎఫ్.డి.ఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్) మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర గౌరవమైన, స్వతంత్ర ఏజెన్సీలు వేడి ఆహారం మరియు పానీయాల సంప్రదింపు అనువర్తనాల యొక్క వివిధ పరిస్థితులలో వాటి సురక్షితమైన ఉపయోగం కోసం అంచనా వేశాయి” అని వారు చెప్పారు. అధికారిక ప్రకటనల ప్రకారం, టీబ్యాగ్‌లలో వచ్చే టీ తయారు చేయడం సురక్షితమని అమెరికా టీ విక్రయాల వర్తక అసోసియేషన్ అన్ని తమ దేశ వినియోగదారులకు భరోసా ఇవ్వాలనుకుంది.
3. ఇంటి చుట్టూ ఎక్స్‌పోజర్ తగ్గించాలి Reduce exposure around home

ఇంటి చుట్టూ ఎక్స్‌పోజర్‌ను ఎలా తగ్గించడం మంచిది అన్న విషయంలో వివరాలను తెలుసుకోవడంలో ఆసక్తిని కనబర్చిన పలువురికి, ఎర్త్ డే ఈవెంట్‌ను నిర్వహించే గ్లోబల్ ఎర్త్ డే అసోసియేట్ డైరెక్టర్ ఐడాన్ చార్రోన్‌ను వ్యాఖ్యలు మైంక్ బ్లాక్ చేశాయంటే నమ్మగలరా? ఆయన చెప్పిన వివరాల ప్రకారం మనం ఇంటి ఆవరణలో అందులోనూ బయటి వాతావరణంలో కంటే మన ఇంటి లోపలే అధికంగా మైక్రో ప్లాస్టిక్ లకు గురవుతున్నామని ఆయన పేర్కొన్నారు. అదెలా అంటే “నైలాన్ లేదా పాలిస్టర్‌తో తయారు చేయబడిన బట్టలు, ఫర్నిచర్, కర్టెన్లు, కార్పెట్‌లు, కుషన్లు, బొమ్మలు, పెంపుడు జంతువుల బొమ్మలు, ఇలా దేనికైనా మీరు ఏమైనా పేరు పెట్టండి, కానీ అవి అన్ని సమయాల్లో మైక్రోస్లాస్టిక్ ఫైబర్ లను రాలుస్తూనే ఉంటాయి.”
వీలైనంత వరకు ఊడ్చడం లేదా వాక్యూమింగ్ చేయాలని సిఫార్సు చేసిన ఆయన వీలైనంత వరకు, పాలిస్టర్ లేదా నైలాన్ తో చేయబడిన పరుపులు, తువ్వాళ్లు, లోదుస్తులు, ఫర్నిచర్, రగ్గులు లేదా కార్పెట్‌లను కొనుగోలు చేయవద్దని ఇవన్నీ మైక్రోప్లాస్టిక్‌లను రాలుస్తూనే ఉంటాయని అన్నారు. మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని అధ్యయనం చేసే 15 సంవత్సరాల నైపుణ్యం కలిగిన పరిశోధన-ఆధారిత ప్రభుత్వేతర సంస్థ అయిన 5 గైర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సైన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ లిసా ఎర్డిల్, కూడా మైక్రోప్లాస్టిక్ విషయంలో పలు జాగ్రత్తలను సూచించారు. లాండ్రీ యంత్రాలు మరియు డ్రైయర్‌లకు మైక్రోఫైబర్-క్యాచింగ్ ఫిల్టర్‌ను ఇన్‌స్టాల్ చేయడం, సింథటిక్‌కు బదులుగా సహజ ఫైబర్‌లతో తయారు చేసిన గృహ వస్త్రాలను (కర్టెన్లు, సోఫాలు, రగ్గులు) ఎంచుకోవడం ఉత్తమమని ఆమె సూచించారు.
4. వంటగదిలో ప్లాస్టిక్ పాత్రలను నివారణ Avoid plastic utensils in kitchen

మైక్రోవేవ్ చేయగల ప్లాస్టిక్‌లలో ఆహారాన్ని వేడి చేసినప్పుడు, మైక్రోప్లాస్టిక్‌లు నేరుగా మన ఆహారంలోకి స్రవింప చేస్తాయని పర్యావరణ నిపుణులు వివరిస్తున్నారు. ప్లాస్టిక్ కంటైనర్లలో లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని వేడి చేయవద్దని వారు సిఫార్సు చేస్తున్నారు. మనం ప్లాస్టిక్ పాత్రలు, స్ట్రాస్, చాపింగ్ బోర్డులు, పాన్‌లు, ప్లేట్ల వంటివి వేటిని ఉపయోగించినా కూడా ఇదే జరుగుతుంది అని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. బదులుగా, సాధ్యమైన చోట గాజు, కలప, వెదురు మరియు పత్తి వంటి సహజ పదార్థాలను ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు.
అదేవిధంగా, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను నివారించడం ద్వారా మైక్రోప్లాస్టిక్ కొంతవరకు నివారించవచ్చునని, మరీముఖ్యంగా మైక్రోవేవ్‌లో ఆహారాలను తయారు చేసేటప్పుడు మరియు వంట మరియు నిల్వ కోసం మెటల్ లేదా గాజును పాత్రలను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలను నివారించాలని కూడా పర్యావరణ నిపుణలు సూచించారు, ఇవి తరచుగా ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్టి విక్రయాలు జరుపుతారని మరియు తయారీ సమయంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.
5. అందం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించండి: Reduce use of beauty products

ఇక పర్యావరణ వేత్తలు చెప్పిన మరో విషయం నిజంగా విస్మయానికి గురిచేస్తుంది. అదేమిటంటే ఆరుబయట బహిర్భూమికి వెళ్లడం పర్యావరణ హితం కాదని చెబుతూవచ్చిన వారే ఇంట్లో లేదా కార్యాలయాల్లో లేదా బయట ఎక్కడైనా టాయిలెట్‌లకు వెళ్లాలంటే కూడా సాధ్యమైనంత తక్కువ సార్లు వాటిని వినియోగించాలని సూచిస్తున్నారు. ఎందకంటే టాయిలెట్‌లను వాడిన ప్రతీసారి అవి తరచూ విడుదల చేసే థాలేట్స్ వంటి ప్లాస్టిక్ రసాయనాలు శరీరంలోకి వెళ్తాయని చెప్పారు. అంతేకాకుండా, అందం మరియు వ్యక్తిగత సంరక్షణ మార్కెట్‌లో ఉపయోగించే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అపారమైన మొత్తంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని కలిగి ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
పర్యావరణ వేత్తల ప్రకారం, 2018లో యునైటెడ్ స్టేట్స్‌లో మాత్రమే, అందం పరిశ్రమ మాత్రమే 7.9 బిలియన్ యూనిట్ల దృఢమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను ఉత్పత్తి చేసింది. అదేవిధంగా, ఎర్డిల్ “ప్లాస్టిక్ మైక్రోబీడ్‌లు లేకుండా వ్యక్తిగత సంరక్షణ మరియు శుభ్రపరిచే ఉత్పత్తులను ఎంచుకోవాలని” వారు సూచించారు. మైక్రోబీడ్‌లు అనేవి వివిధ రకాల సౌందర్య సాధనాలలో కనిపించే చిన్న ప్లాస్టిక్ గోళాలు. వీటి వినియోగం కూడా శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ పదార్థాలను జోప్పిస్తాయని చెప్పారు. అమెరికా “రిన్స్-ఆఫ్” ఉత్పత్తులలో మైక్రోబీడ్‌ల వాడకాన్ని నిషేధించినప్పటికీ, వాటిని కడిగివేయని అనేక సౌందర్య సాధనాలలో ఇప్పటికీ అనుమతిస్తున్నారు.
భవిష్యత్తు కోసం ఏదైనా ఆశ ఉందా? Is there any hope for the future?

ప్యాకేజింగ్ యొక్క భవిష్యత్తు గురించి మరియు హోరిజోన్‌లో ఏవైనా ఆశాజనకమైన ఆవిష్కరణలు ఉన్నాయా అనే దిశగా కూడా పర్యావరణ వేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బయో మెటీరియల్స్ చివరికి సమాజాన్ని ప్లాస్టిక్ నుండి దూరం చేయడంలో సహాయపడతాయని వారు వివరించారు. అయితే, ఇందుకు చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ అనేది పలు కారణాల చేత పారిశ్రామికంగా ఎంచుకోబడింది. అలాగే ప్రజల చేత వినియోగించబడుతోందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ తో ఉత్పత్తులు చేయడం చాలా చౌక అని, ఇక వాటిపై అచ్చు వేయడం మరియు ఆకృతి తీర్చిదిద్దడం సులభం అని ఈ కారణాల చేత అది ఆదరించబడిందని అయితే దురదృష్టవశాత్తు, చాలా కాలం పాటు ఉంటుందని వారు తెలిపారు.
అన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలుగా క్రియాత్మక బయోమెటీరియల్స్ వినియోగించడం సాధ్యం కానప్పటికీ, సన్నని పొరతో చేసే ప్లాస్టిక్ ను భర్తీ చేయడానికి బయో మెటీరియల్స్ వినియోగించడంలో చాలా సామర్థ్యాన్ని చూశామని పర్యవరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే విచారకరంగా, వినియోగదారులు ఇప్పుడు మరింత పర్యావరణ అనుకూల ఉత్పత్తుల కోసం చూస్తున్నందున, కొంతమంది తయారీదారులు తమ ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా చేయడానికి పర్యావరణ అనుకూలమైన వాదనలను ఉపయోగిస్తున్నారు.

ఉదాహరణకు, “బయోడిగ్రేడబుల్” అని లేబుల్ చేయబడిన ప్యాకేజింగ్ ఏ పరిస్థితుల్లో అది క్షీణిస్తుందో పేర్కొనలేదు. 5 గైర్స్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధన ప్రకారం, పదార్థం యొక్క మందం మరియు అది ఉంచబడిన వాతావరణం ఏదైనా నిజంగా జీవఅధోకరణం చెందుతుందా లేదా అనే దానిలో గణనీయమైన తేడాను కలిగిస్తాయి. మైక్రోప్లాస్టిక్‌లు మరియు ఆరోగ్యంలో వాటి పాత్ర వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు సంబంధిత పరిశోధనా రంగం. ప్రస్తుతానికి, పైన పేర్కొన్న సిఫార్సులను అనుసరించడం వలన ఒక వ్యక్తికి కలిగే ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు, కానీ మైక్రోప్లాస్టిక్‌లు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి మరియు చివరకు మన ఇళ్ల నుండి ప్లాస్టిక్‌లను తరిమికొట్టగల కొత్త పదార్థాలను అభివృద్ధి చేయడానికి మనకు ఇంకా చాలా పరిశోధన అవసరం.