దీర్ఘకాల కోవిడ్ ప్రభావంతో బాధపడుతున్న రోగుల ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాలను చూపుతుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంగా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకిన రోగులు వారి ఆరోగ్యంలో తీవ్రమైన మార్పును కనుబరుస్తున్నారని పేర్కోంది. అత్యంత దారుణ పరిస్థితులు ఎదుర్కోంటున్న వీరి పరిస్థితి.. స్టేజ్-4 ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్తహీనత లేదా స్ట్రోక్ వంటి ప్రాణాంతక అనారోగ్యం కంటే ప్రమాదకరంగా మారిందని అధ్యయనం వెల్లడించింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (NIHR) నిధులతో నిర్వహిస్తున్న బిఎంజే ఓపెన్ సంస్థ చేసిన పరిశోధనలో ఈ అత్యంత విషాధకర విషయాలు వెలుగుచూశాయి. సుదీర్ఘ కోవిడ్ తో బాధపడుతున్న 3,750 మంది రోగుల జీవితాలపై చేసిన అధ్యయనంలో బాధితులపై సుదీర్ఘ కోవిడ్ ప్రభావాన్ని పరిశీలించగా సంచలనాత్మక విషయాలు బహిర్గతం అయ్యాయి. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత వారి శరీరంలోని మార్పులకు సంబంధించిన ప్రశ్నలను రోగులను పరిశోధనలో భాగంగా అడిగారు. వీరి కోసం ఓ డిజిటల్ యాప్‌ను ఉపయోగించిన వాలంటీర్లు వారి తెలిపిన వివరాలను యాప్ లోనే నమోదు చేశారు. దీనిలో బాధితుల అలసట స్థాయి, నిరాశ, ఆందోళన, జీవన నాణ్యత, మెదడుకు చమట పట్టడం మొదలైన వాటిపై వివరాలను పంచుకున్నారు.
చాలా మంది దీర్ఘకాలిక కోవిడ్ రోగులు అధికస్థాయి అలసటతో కొట్టుమిట్టాడుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. అలసట స్థాయిలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కోన్న వాలంటీర్లు దీర్ఘకాలిక కోవిడ్ బాధితుల అలసటను క్యాన్సర్ సంబంధిత రక్తహీనత అనీమియా లేదా తీవ్రమైన మూత్రపిండ బలహీనత కలిగిన బాధితులతో పోల్చవచ్చు. స్టేజ్-4 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోల్చినా కోవిడ్ దీర్ఘకాలిక బాధితులు మరింత తక్కువ ఆరోగ్య సంబంధిత జీవన నాణ్యతను కలిగి ఉన్నారని అధ్యయనంలో కనుగొన్నారు.
మొత్తంమీద, రోగుల రోజువారీ కార్యకలాపాలపై దీర్ఘకాల కోవిడ్ ప్రభావం.. బ్రెయిన్ స్ట్రోక్ రోగుల కంటే అధ్వాన్నంగా ఉందని, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న రోగులతో పోల్చదగినదని పరిశోధన బృందం కనుగొంది. తమ అధ్యయనాల్లో దీర్ఘకాల కోవిడ్ బాధితుల అరోగ్య పరిస్థితులు, జీవితాలపై అలసట వినాశకర ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించారు. ఇవి వారి సామాజిక కార్యకలాపాల నుండి పని, పనులు, సన్నిహిత సంబంధాలను కొనసాగించడం వంటి ప్రతిదానిపై ప్రభావం చూపుతున్నాయన్ని బిఎంజే ఓపెన్ అద్యయన ఫలితాలు కనుగొన్నాయని ఈ పరిశోధన బృందానికి సహ-నాయకత్వం వహించిన డాక్టర్ హెన్రీ గుడ్‌ఫెలో తెలిపారు. ఆయన దివంగత ప్రొఫెసర్ ఎలిజబెత్ ముర్రే (యుసిఎల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ హెల్త్)తో కలిసి అధ్యయనం చేశారు.
అధ్యయనం ప్రకారం, యాప్‌ను ఉపయోగిస్తున్న దీర్ఘకాల కోవిడ్ రోగులలో 90శాతం కంటే ఎక్కువ మంది పని చేసే వయస్సువారే. వీరులో చాలా మంది 18-65 ఏళ్ల మధ్య వయస్స్కులే. కాగా వీరిలో 51 శాతం మంది గత నెలలో కనీసం ఒక రోజు కూడా సరిగ్గా పని చేయలేకపోయారు, 20శాతం మంది ఆసలు పనే చేయలేకపోయామని అన్నారు. అన్ని వద్ద పని. మరోవైపు దీర్ఘకాల కోవిడ్ బాధితుల్లో, 71 శాతం మంది మహిళలే పేషంట్లుగా ఉన్నారు. ఆరోగ్య, సామాజిక సంరక్షణ వర్క్‌ఫోర్స్‌లో మోజారిటీగా ఉన్న పనిచేసే వయస్సు గల మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీరి పని సామర్థ్యంపై సుదీర్ఘ కోవిడ్ ప్రభావం పడటంతో ఇప్పటికే విస్తరించిన సేవలకు అదనపు ఒత్తిళ్లను జోడించవచ్చునని సహ పరిశోధకుడు డాక్టర్ హెన్నీ గుడ్ ఫెలో అభిప్రాయపడ్డారు.