
ప్రోటీన్ డైట్ కోక్, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా సంచలనం సృష్టిస్తున్న ఈ అధునాతన డ్రింక్ సోషల్ మీడియాలో అందులోనూ ముఖ్యంగా టిక్‌టాక్‌లో వైరల్ డ్రింక్ గా ట్రెండింగ్ అవుతోంది. ఈ డ్రింక్ తయారీ కూడా డైట్ సాప్ట్ డ్రింక్ తో ఫ్లేవర్డ్ ప్రోటీన్ షేక్ కలపడం ద్వారా తయారు చేయబడింది. అయితే ఈ అదునాతన పానీయం రోజూవారీ ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి మార్గాలను అన్వేషించే వ్యక్తులకు ప్రోటీన్ డ్రింక్ అందించేందుకు సహయం చేస్తుంది. కాగా, ఈ పానీయంలో డైట్ కోక్ వంటి సాప్ట్ డ్రింక్ జోడించిన దరిమిలా ఇందులో ఎలాంటి పోషకాల విలువలు లేవని అరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అహారం విషయంలో ప్రజల అరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఏది మంచి, ఏది కాదో పరిశీలించే అధికారులు కూడా సోషల్ మీడియా కథనాలపై ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. దీనికి బదులుగా సహజంగా అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం ద్వారా సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టవచ్చని సిఫార్సు చేస్తున్నారు. ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ పై ఆధారపడే వారు లావు తగ్గడానికి లేదా తమ శరీర బరువును నిర్వహించుకోడానికి ఎంచుకుంటారు. అయితే ప్రోటీన్ షేక్ తో పాటు డైట్ కోక్ కలపడం కారణంగా ఇందులో ఎలాంటి పోషకాలు లేవని, దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని అరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ పానీయం కోకా-కోలా కంపెనీ అధికారిక ఉత్పత్తి కాదు, కానీ, దాని లేబులింగ్ విధానం, మరియు దాని పేరు సూచించిన విధానం బట్టి చూస్తే ఈ అధునాతన ఉత్పత్తి వనిల్లా ప్రోటీన్ షేక్ మరియు డైట్ కోక్ కలయికతో ఏర్పడినట్టు స్పష్టం అవుతోంది. ఇక ఈ ప్రోటీన్ డైట్ కోక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొంతకాలం గడుస్తున్నా.. అమెరికాలోని ఉటాకు చెందిన ఎలిమెంటరీ స్కూల్ టీచర్ రెబెక్కా గోర్డాన్, ఒక కప్పు బబ్లీ బ్రూని ఆస్వాదిస్తూ, టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియో త్వరగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత పానీయాన్ని ప్రాచుర్యం పొందడంలో సహాయపడింది.
రెబెక్కా గోర్డాన్ అనే ఎలిమెంటరీ ఉపాధ్యాయురాలు చేసిన ఈ వీడియోకు ప్రతిస్పందనగా, ప్రజలు పానీయాన్ని ప్రయత్నించడం ప్రారంభించారు. అంతేకాదు ఈ పానీయంపై వారి ట్విస్ట్‌లు, అనుభవాలను పంచుకోవడం వంటి వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా, మిలియన్ల కొద్దీ వీక్షణలను సంపాదించాయి. చాలా మంది వారి రోజువారీ ప్రోటీన్ లక్ష్యాలను చేరుకోవడానికి రుచికరమైన మార్గంగా ప్రోటీన్ డైట్ కోక్ పానీయాన్ని ఎంచుకోవడంతో పాటు దానిపై ప్రశంసలను కురిపిస్తున్నారు. అయితే ఈ అధునాతన పానీయం కొందరు ప్రశంసలు కురిపిస్తున్నట్లు ప్రోటీన్ పొందడానికి నిజంగా “ఆరోగ్యకరమైన” మార్గమా? లేక నిపుణులు విమర్శిస్తున్నట్లు నిష్ప్రయోజనమా.? అన్నది ఈ ఆర్టికల్ లో పరిశీలిద్దాం.

ప్రోటీన్ డైట్ కోక్ యొక్క లాభాలు మరియు నష్టాలను బేరిజు వేసి ఈ పానీయం లాభదాయకమా, నష్టకరమా అన్నది అంచనా వేయడంలో పోషకాహార నిపుణులతో అభిప్రాయాలను తీసుకోవడం ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ ఈ అధునాతమైన పానీయానం నిజంగా ఒక సిప్ విలువైనదా లేదా మీరు ఈ డ్రింక్ మినహాయించ వలసిందా.? అన్నది అరోగ్య నిపుణులు, న్యూట్రీషియన్లు, డైటీషియన్లు అభిప్రాయాలలోనే తెలుసుకుందాం.
ప్రోటీన్ డైట్ కోక్ అంటే ఏమిటి? What is Protein Diet Coke?

ప్రొటీన్ డైట్ కోక్ అనేది పలు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నా అంతగా జనాదరణ పోందని “డర్టీ సోడా” ట్రెండ్‌కి సంబంధించినది. “డర్టీ సోడా” అనేది సాధారణంగా రూట్ బీర్ ఫ్లోట్ లేదా ఆల్కహాల్ లేని మాక్‌టైల్ వంటి “పిల్క్” (పెప్సీ + మిల్క్) వంటి అదనపు రుచిగల సిరప్‌లు, క్రీమ్‌లు లేదా పండ్ల రసాలతో కూడిన బేస్ సాఫ్ట్ డ్రింక్. అయితే ఈ ప్రోటీన్ డైట్ కోక్ అన్నది 2022లో జనాదరణ పొందింది. అదెలా అంటే డైట్ కోక్ తో ఎంచుకున్న ప్రోటీన్ ను కలపడం వల్ల అటు ప్రోటీన్ తో పాటు ఇటు సాప్ట్ డ్రింక్ రెండింటినీ ఎంజాయ్ చేయవచ్చునన్న టిక్ టాక్ పోస్టు ఈ డ్రింక్ సేల్స్ ను అమాంతం పెంచింది. సాధారణంగా ప్రోటీన్ డైట్ కోక్ చాలా తరచుగా రెండు పదార్ధాలను కలిగి ఉంటుంది. మీరు ఎంచుకున్న ఆహార శీతల పానీయాన్ని రెడీమేడ్ ప్రోటీన్ షేక్ బాటిల్‌తో కలుపుతారు. అంతే మీ ప్రోటీన్ డైట్ కోక్ రెడీ. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా ప్రోటీన్ డైట్ కోక్ తీసుకోవడం అరోగ్యకరమా.? కాదా.? అన్నది తెలుసుకోవాల్సిన అంశం.
ప్రోటీన్ డైట్ కోక్ ఆరోగ్యకరమైనదా? Is Protein Diet Coke healthy?

ప్రొటీన్ డైట్ కోక్ ఆరోగ్యకరమైన పానీయంగా లేబుల్ చేయలేమని, అయితే అదే సమయంలో దానిని అనారోగ్యకర పానీయం కూడా కాదని ప్రముఖ డైటీషియన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. టాప్ న్యూట్రిషన్ కోచింగ్ సెంటర్లో రిజిస్టర్డ్ డైటీషియన్ గా గుర్తింపు పోందిన డైటీషియన్ ప్రోటీన్ డైట్ కోక్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ… ప్రోటీన్ షేక్స్, మిల్క్ వంటివి ఇప్పటికే మార్కెట్లో లభ్యం అవుతున్నాయని, వీటిని నేరుగా తాగగలిగినప్పుడు సోడాలో రెడీ-టు-డ్రింక్ ప్రోటీన్‌ని మిళితం చేయడం కొంచెం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. సోడాలో ఎటువంటి కేలరీలు లేవు మరియు ఖచ్చితంగా అదనపు ప్రోటీన్ లేదా సూక్ష్మపోషకాలను కలిగి ఉండవు, వీటిని పరిగణనలోకి తీసుకుంటే అది నిజంగా విలువైనదేమీ జోడించదు అని అన్నారు.
ప్రత్యేకించి రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి ప్రయత్నిస్తున్న వారు, వెయ్ ప్రోటీన్ షేక్‌ల రూపంలో ఆహారంలో ఎక్కువ ప్రోటీన్‌ను జోడించడం వల్ల పోషకమైన పంచ్‌ను ప్యాక్ చేయవచ్చని పేర్కొన్నారు. కాగా, ‘‘ఫెయిర్ లైఫ్ కోర్ పవర్ ప్రొటీన్ షేక్’’ తీసుకోవడాన్ని తాను ఇష్టపడుటంతో పాటు ప్రోటీన్ అధికంగా కావాలి అన్నవారికి కూడా తాను వీటినే సిఫార్సు చేస్తానని చెప్పారు. ఈ ప్రోటీన్ షేక్స్ తరచుగా ప్రాథమిక పదార్ధంగా ఉపయోగించ బడుతోందని టిక్‌టాక్‌లో పోస్ట్ చేయబడిన అనేక #ప్రోటీన్ డైక్ కోక్ (#proteindeitcoke) వీడియోలలో చూపబడిందని డైటీషియన్ తెలిపారు. అవి అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో మంచి మొత్తంలో అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను అందిస్తాయని అన్నారు. రోజువారీ కాల్షియంలో సగం శాతం, మరియు మీరు భోజనం మధ్య పూర్తి స్థాయిలో ఉండేందుకు ఖచ్చితంగా సహాయం చేస్తాయని డైటీషియన్ చెప్పారు.
బరువు తగ్గడంలో ప్రోటీన్ డైట్ కోక్ సహాయపడుతుందా? Can Protein Diet Coke help you lose weight?

అమెరికన్ల ఆహార మార్గదర్శకాలు 2020-2025 ప్రకారం వయోజనలైన పురుషులు ప్రతి రోజూ కనీసం 56 గ్రాముల ప్రోటీన్ తినాలని, అదే సమయంలో వయోజన మహిళలు ప్రతి రోజూ కనీసం 46 గ్రాములు తినాలని సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ, అధిక మొత్తంలో ప్రోటీన్ తినడం వల్ల కండర ద్రవ్యరాశిని నిలుపుకోవడం మరియు నిర్మించడం ద్వారా బరువు తగ్గడంలో మీకు సహాయపడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రోటీన్ జీఎల్పీ-1 (GLP-1) మరియు పివైవై (PYY) వంటి హార్మోన్లు శరీరం యొక్క ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది, ఇది ఎక్కువ కాలం ఆకలి వేయని అనుభూతిని కలిగిస్తుంది.
గ్రెలిన్ అనే ‘ఆకలి హార్మోన్’ను తగ్గించడంలో కూడా ప్రోటీన్ సహాయపడుతుంది. సాధారణ వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునప్పుడు, ప్రోటీన్ డైట్ కోక్ మితంగా వినియోగించడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడవచ్చునని డైటీషియన్ అభిప్రాయపడ్డారు. వెయ్ ప్రోటీన్ షేక్స్ రూపంలో డైట్‌లో ఎక్కువ ప్రొటీన్‌లను జోడించడం అనేది కండరాలను నిర్మించడానికి మరియు బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన మార్గంమని చెప్పారు. అయితే ప్రోటీన్ ను డైట్ కోక్‌తో కలపడం వల్ల ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తే, తాను ఈ పానీయాన్ని పూర్తిగా సమర్ధిస్తారని అమె పేర్కొన్నారు.

అధిక క్యాలరీలు కలిగిన చిరుతిండ్లు తినాలన్న కోరికలు ఉత్పన్నం కాకుండా ఉండటానికి, సంపూర్ణ భావనను కలిగి ఉండడానికి భోజనాల మధ్య ఈ పానీయం తాగడంతో పోలిస్తే బరువు తగ్గవచ్చు. చిప్స్ మరియు గ్రానోలా బార్‌లు వంటి కార్బోహైడ్రేట్స్ ఆధారిత చిరుతిళ్లు మీరు తిన్న కొద్దిసేపటికే మళ్లీ మీకు ఆకలిని కలిగిస్తాయని చెప్పారు. అయినప్పటికీ, డైట్ కోక్ పేరుతో అదనపు సోడాను జోడించకుండా కేవలం “ప్రోటీన్ షేక్ తాగడం” మంచిదని డైటీషియన్ నొక్కి చెప్పారు. డైట్ కోక్ కండరాల నిర్మాణానికి లేదా బరువు తగ్గడానికి అదనపు ప్రయోజనాన్ని జోడించదని ఖరాఖండీగా చెప్పారు. అలాంటిదేమైనా ప్రయోజనం ఉందని ప్రోటీన్ డైట్ కోక్ వారు నిరూపించగలిగితే, దానిని మరింత ప్రయోజనకారిగా తాను లేబుల్ చేస్తానని చెప్పారు డైటీషియన్.
ప్రోటీన్ తీసుకోవడాన్ని పెంచే ఆరోగ్యకర మార్గాలు Healthier ways of increasing protein intake

ప్రొటీన్ డైట్ కోక్ వంటి పానీయాలను మితంగా తాగడం వల్ల రోజువారీ ప్రొటీన్‌లను పెంచడంలో సహాయపడవచ్చునని ప్రముఖ హృదయ అరోగ్య నిపుణులు, ప్రివెంటివ్ కార్డియాలజీ డైటీషియన్ తెలిపారు. మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యతను అందివ్వాలని చెప్పారు. స్థిరమైన కండరాల పెరుగుదల, బరువు తగ్గడం, మొత్తం ఆరోగ్యం కోసం, పోషకాల సమృద్ధిని నిర్ధారించే వ్యాయామం తర్వాత సమతుల్య భోజనంపై దృష్టి పెట్టడం మంచిదని తెలిపారు. ఈ విధానం మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఎందుకంటే ఇది స్థిరమైన, దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తుందని మరియు సరైన రికవరీ కోసం శరీరానికి తగిన ఇంధనాన్ని కూడా అందిస్తుందని పేర్కొన్నారు.
భోజనం బదులుగా ప్రోటీన్ షేక్స్‌పై ఆధారపడటం పోషకాహార అంతరాలకు దారితీయవచ్చునని సందేహం వ్యక్తం చేశారు. ఘన రూపంలో ప్రోటీన్ తీసుకోవడానికి బదులు ద్రవ రూపంలో తీసుకోవడం వల్ల వ్యాయామం తర్వాత సరైన పునరుద్ధరణకు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని మరియు కండరాల మరమ్మత్తు, మొత్తం శరీర పునరుద్ధరణను దెబ్బతీసే ఆక్సీకరణ ఒత్తిడిని పెంచడానికి సంభావ్యంగా దోహదం చేస్తుందని కూడా ఆమె పేర్కొంది. బదులుగా, ఆహారంలో మరిన్ని పూర్తి ఆహారాలను చేర్చడం ద్వారా మీ ప్రోటీన్ తీసుకోవడం పెంచాలని హృద్రోగ నిపుణురాలు, ప్రివెంటివ్ కార్డియాలజీ డైటీషియన్ సిఫార్సు చేశారు.
అవి:
- లీన్ మాంసాలు
- చేప
- గుడ్లు
- పాడి పరిశ్రమ
- చిక్కుళ్ళు
- గింజలు
- విత్తనాలు
ప్రోటీన్-రిచ్ అల్పాహారం కోసం ప్రోటీన్ డైట్ కోక్ తాగడానికి బదులుగా, రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి పెరుగు, బాగా ఉడికించిన గుడ్లు లేదా ఎడామామ్ వంటి ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రయత్నించడం ఉత్తమమని అమె సిఫార్సు చేస్తున్నారు. అయినప్పటికీ, మీరు మీ ఆహారంలో ప్రోటీన్ షేక్‌లను చేర్చాలని ప్లాన్ చేస్తే, వాటిని ఆరోగ్యకరమైన సహజ పదార్ధాలతో పెంచాలని కూడా అమె సూచనలు చేశారు. తాను స్ట్రాబెర్రీ కోర్ పవర్ షేక్‌లను, స్తంభింపచేసిన స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు, గ్రీక్ పెరుగు (మరింత ప్రోటీన్ కోసం) మరియు చియా విత్తనాలతో కలపి తీసుకోవడం ఇష్టపడతానని తెలిపారు.
ప్రివెంటివ్ కార్డియాలజీ డైటీషియన్ తీసుకోవడానికి ఇష్టపడతానని చెప్పినది ఒక ఉదాహరణగా అందరూ ఫాలో కావాలి. ఎందుకంటే అమె తీసుకునే ఇష్టమైన ఫుడ్ ఉదాహరణలో, అమెకు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు ప్రోటీన్‌తో పాటు కాల్షియం, విటమిన్ సి వంటి మరిన్ని సూక్ష్మపోషకాలను అందుతున్నాయని మనం గ్రహించాలి. ఇలాంటి ఘనపదార్ధాలతో మనం పొందే పోషకాలతో పాటు అరోగ్య ప్రయోజనాలు కూడా ఘనంగానే ఉంటాయి. అయితే ప్రోటీన్ డైట్ కోక్ తీసుకోవడం వల్ల ఎవరూ ఇలాంటి పోషకాలను ఆరోగ్య ప్రయోజనాలను పోందలేరు అన్నది ఇక్కడ నిరూపితం అయ్యింది. ప్రోటీన్ డైట్ కోక్ తీసుకోవడం కన్నా మొత్తం శరీర అరోగ్యానికి ఘన పదార్థాల ప్రోటీన్ లేదా ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం ఉత్తమం అని చెప్పక తప్పదు.
చివరిగా.!
టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ప్రోటీన్ డైట్ కోక్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఫ్లేవర్డ్ ప్రోటీన్ షేక్‌తో డైట్ సాఫ్ట్ డ్రింక్ కలపడం ద్వారా తయారు చేయబడిన ఈ పానీయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం లేమి లేవని అరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజువారీ ప్రోటీన్ తీసుకోవడాన్ని పెంచడానికి మార్గాలను అన్వేషించే వ్యక్తులకు ఈ అధునాతనమైన ప్రోటీన్ డైట్ కోక్ పానీయం సహాయం చేస్తుందని, అయితే ప్రోటీన్ షేక్‌లో డైట్ కోక్‌ను జోడించడం వల్ల పోషక విలువలు జోడించబడవు. బదులుగా, సహజమైన అధిక ప్రోటీన్ ఆహారాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడాన్ని సిఫార్సు చేయబడింది, ముఖ్యంగా బరువు తగ్గడం కోసం రోజు వారీ ప్రోటీన్ పెంచుకోవడంతో పాటు వారికి సహాయం చేయడానికి కూడా ఇది ఉత్తమం మార్గం.