Home అనారోగ్యాలు హైపోగ్లెసెమియా (బ్లడ్ షుగర్ తగ్గడం) కారణాలు, లక్షణాలు, చికిత్స

హైపోగ్లెసెమియా (బ్లడ్ షుగర్ తగ్గడం) కారణాలు, లక్షణాలు, చికిత్స

0
హైపోగ్లెసెమియా (బ్లడ్ షుగర్ తగ్గడం) కారణాలు, లక్షణాలు, చికిత్స

మనిషి ఉషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే అతడు ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు శరీరానికి కావాల్సినంత శక్తి కూడా ఉండాలి. ఈ శక్తి దేహానికి ఆహారం నుంచి లభిస్తుంది. ఆహారం నుంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇత్యాదులు అందుతుంటాయి. అవి శరీరంలోని అవయవాలకు కావాల్సిన శక్తిని అందిస్తుంటాయి. వీటి సాయంతో మన శరీరంలోని రక్తపోటు, మధుమేహం, లవణాలు, అన్ని వాటి స్థాయిలను సక్రమంగా ఉండేట్లు హార్మోన్లు పనిచేస్తుంటాయి. ఏ కొంచెం లయ తప్పినా.. ముందుగా అవి రక్తపోటు, మధుమేహంపై ప్రభావాన్ని చాటుతాయి. రక్తపోటు రోజులో పలు పర్యాయాలు పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. అయితే మధుమేహం మాత్రం పెరగడానికి, తగ్గడం సమయంతో కూడుకుని ఉంటుంది. మరీ ముఖ్యంగా రక్తలో చక్కర స్థాయిలు పెరగడమే డయాబెటీస్ మధుమేహం అని అంటాం. మరి దీనిని నియంత్రించేందుకు ఇన్సులిన్ ట్యాబెట్లు సహా ఇంజెక్షన్లను కూడా తీసుకునే పేషంట్లున్నారు. షుగర్ పెరిగిందనగానే వెంటనే తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. దీంతో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. దీనినే హైపోగ్లెసెమియా అని అంటారు. మధుమేహంతో బాధపడేవారి దీని బారిన పడుతుంటారు. అయితే హైపోగ్లెసెమియాకు గురైతే అది ప్రాణాంతకం కూడా కావచ్చు. తక్షణం వైద్యచికిత్స అవసరం ఏర్పడవచ్చు. బ్లడ్ షుగర్ కాకుండా అత్యంత అరుదుగా పలు మందుల ప్రభావం కారణంగా కొందరిలో ఈ హైపోగ్లెసెమియా పరిస్థితి తలెత్తవచ్చు. అయితే రక్తంలో చక్కర స్థాయిలు 70 mg/dLకి దిగువన నమోదైతే అది హైపోగ్లెసెమియాకు దారితీస్తుంది.

రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు

రక్తంలో చక్కెరను గ్లూకోజ్ అని కూడా అంటారు. గ్లూకోజ్ మనం తీసుకునే ఆహారం నుండే శరీరానికి అందుతుంది. ఇది శరీరానికి ముఖ్యమైన శక్తి వనరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనం తీసుకునే ఆహార పదార్థాలు (బియ్యం, బంగాళాదుంపలు, బ్రెడ్, టోర్టిల్లాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు వంటి వాటిలో) పుష్కలంగా నిక్షిప్తమై ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి గ్లూకోజ్ ను అందిస్తాయి. వాటి ద్వారా శరీరానికి అందే గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి శోషించబడి.. శరీర కణాలకు వెళుతుంది. మీ ప్యాంక్రియాస్‌లో తయారయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్, కణాలు బ్లడ్ గ్లూకోజ్ (చక్కెర)ను గ్రహించడంలో సహాయపడుతుంది. అప్పుడు కణాలు శక్తి కోసం గ్లూకోజ్‌ను ఉపయోగిస్తాయి. అయితే అవసరమైన దానికంటే ఎక్కువ గ్లూకోజ్‌ని తీసుకుంటే, మీ శరీరం మీ కాలేయం, కండరాలలో అదనపు గ్లూకోజ్‌ని నిల్వ చేస్తుంది లేదా కొవ్వుగా మారుస్తుంది కాబట్టి తర్వాత అవసరమైనప్పుడు అది శక్తి కోసం ఉపయోగించబడుతుంది.

మీ కణాలు గ్లూకోజ్ పొందకపోతే, మీ శరీరం దాని సాధారణ విధులను నిర్వహించదు. స్వల్పకాలికంగా, ఇన్సులిన్‌ను పెంచే మందులు తీసుకోని వ్యక్తులు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి తగినంత గ్లూకోజ్‌ని కలిగి ఉంటారు అవసరమైతే కాలేయం గ్లూకోజ్‌ని తయారు చేయగలదు. ఇన్సులిన్ మందులను తీసుకునేవారి రక్తంలో గ్లూకోజ్‌లో స్వల్పకాలిక తగ్గింపు సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో, మరింత తీవ్రమైన లక్షణాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి తక్కువ బ్లడ్ షుగర్ స్థాయి పరిస్థితులకు తక్షణ చికిత్స అందించడం చాలా ముఖ్యం.

Hypoglycemia Symptoms

హైపోగ్లైసీమియా లక్షణాలు ఏమిటి?

రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గిపోవచ్చు. దీంతో ఈ పరిస్థితికి గురయ్యే పేషంట్లలోనూ అత్యంత తక్కువ సమయంలోనే లక్షణాలు సంభవించవచ్చు. అయితే ఆయా లక్షణాలు ఏమిటీ అన్న వివరాల్లోకి వెళ్తే..:

  • పాలిపోయిన చర్మం
  • వివరించలేని అలసట
  • ఆకలి వేయడం
  • వణుకు పుట్టడం
  • చెమటలు పట్టడం
  • తల తిరగడం
  • గుండె వేగం పెరగడం
  • మానసిక స్థితిలో మార్పు
  • చిరాకు/ఆందోళన
  • తలనొప్పి
  • నిద్ర కష్టంగా మారడం
  • చర్మం జలదరింపు
  • మసక మసకగా కనిపించడం
  • స్పష్టంగా ఆలోచించలేకపోవడం లేదా ఏకాగ్రత నిలుపపోవడం
  • స్పృహ కోల్పోవడం, మూర్ఛ, లేదా కోమా

అయితే మధుమేహం, షుగర్ వ్యాధితో బాధపడేవారికి తమ చక్కర స్థాయి అధికంగా ఉందన్న భ్రమలోనే ఉంటారు తప్ప.. తమ చక్కర స్థాయిలు ఒక్కోసారి ఇలా అనూహ్యంగా కిందకు జారతాయని వారికి అవగాహన ఉండదు. దీంతోనే వారు హైపోగ్లైసెమిక్ పరస్థితికి గురవుతుంటారు. ఇక బ్లడ్ షుగర్ లెవల్స్ వారు గమనించకుండానే హఠాత్తుగా పడిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితులకు ఎవరైనా గురైనప్పుడు తక్షణం వైద్య చికిత్స అందించాలి. అలా చేయని పక్షంలో రోగి సృహ కోల్పోవచ్చు, మూర్ఛలోకి జారుకోవచ్చు, తీవ్రత ఎక్కవగా ఉంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

బ్లడ్ షుగర్ స్థాయిలు తక్కువగా ఉంటే ఏమి చేయాలి.?

Low Blood Sugar

మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు తమ బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని తేలికపాటి నుండి మితమైన హైపోగ్లైసీమియా లక్షణాలను ఎదుర్కొన్నట్లయితే వెంటనే సులభంగా జీర్ణమయ్యే 15 గ్రాముల కార్బోహైడ్రేట్లను తీసుకోవడం సురక్షితం. అయితే సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఏంటనేగా మీ సందేహం.

  • 1/2 కప్పు పండ్ల రసం లేదా సాధారణ సోడా
  • 1 టేబుల్ స్పూన్ తేనె
  • 4 లేదా 5 సాల్టిన్ బిస్కెట్లు
  • సగం లేదా ఒక స్వీటు లేదా 3 నుంచి 4 గ్లూకోజ్ మాత్రలు
  • 1 టేబుల్ స్పూన్ చక్కెర

చాలా తక్కువ రక్త చక్కెర స్థాయిలు నమోదైతే మాత్రం అది వైద్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుంది. ఎవరైనా ఇలాంటి తీవ్ర హైపోగ్లెసెమియా పరిస్థితులను ఎదుర్కోంటే.. వారు అపస్మారక స్థితి వంటి తీవ్రమైన లక్షణాలను ఎదుర్కొంటుంటే, గ్లూకాగాన్ అనే ఔషధాన్ని అందించడం చాలా ముఖ్యం. దాంతో పాటు వెంటనే అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అసుపత్రికి తరలించాలి. ఇక ఎవరైనా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పరిస్థితులకు లోనైన పక్షంలో వారు వారి వైద్యుడిని కలసి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గే ప్రమాదం గురించి వివరించి, గ్లూకాగాన్ కోసం ప్రిస్క్రిప్షన్ పొందడం చాలా ముఖ్యం. ఇలా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు మీకు తారసపడినట్లేయితే వారికి నోటి ద్వారా ఏమీ ఇవ్వరాదు, ఇది వారిని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మధుమేహం వ్యాధిగ్రస్తులే కాదు మిగిలినవారందరూ తెలుసుకుని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హైపోగ్లైసెమియాకు కారణమేమిటి?

బ్లడ్ షుగర్ స్థాయిలు తక్కువగా నమోదు కావడానికి కారణాల అనేకం కావచ్చు. అయితే ఈ పరిస్థితులకు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏదో ఒక సమయంలో గురవుతుంటారు. అందుకు వారు తీసుకునే ఔషధాల ప్రభావంతో పాటు వారు పాటించే కఠిన క్రమశిక్షణ కూడా కారణం కావచ్చు. చాలామందిలో ఈ పరిస్థితికి ఉత్పన్నం కావడానికి సాధారణ షుగర్ చికిత్స దుష్ప్రభావమే కారణం కూడా కావచ్చు.

మధుమేహంతో సాధ్యమయ్యే కారణాలు

శరీరంలోని ఇన్సులిన్‌ను ఉపయోగించగల సామర్థ్యాన్ని మధుమేహం ప్రభావితం చేస్తుంది. కణాలను తమ పనిచేసేలా అన్‌లాక్ చేసే తాళం చెవిగా ఇన్సులిన్ వ్యవహరిస్తూ, అందుకు తగ్గ శక్తి కోసం గ్లూకోజ్‌ని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారి శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను ఉపయోగించుకునేందుకు వివిధ చికిత్సలు సహాయపడతాయి. వీటిలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే ఇన్సులిన్ ఇంజెక్షన్లు, మాత్రలు కూడా ఉన్నాయి. ఈ రకమైన మందులను ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవచ్చు. అలా అని కడుపార భోజనం తినాలని ప్లాన్ చేసినా, షుగర్ ఉందని కొంత ఆహారాన్నే పరిమితంగా తీసుకున్న నేపథ్యంలో బ్లడ్ గ్లూకోజ్ తక్కువగా నమోదు కావచ్చు.

భోజనం మానేయడం, ఆకలిని పట్టించుకోకుండా మితాహారం తీసుకోవడం లేదా సాధారణం కంటే ఆలస్యంగా తినడం కారణంగా రెగ్యూలర్ టైమ్ లో కాకుండా సమయాతీతంగా మందులను తీసుకోవడం వంటి వాటితోనూ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవచ్చు.

తగినంత ఆహారం తీసుకోకుండా ఎక్కువగా శారీరిక శ్రమ ఒనర్చిన పక్షంలోనూ రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడానికి కారణమవుతుంది.

మధుమేహం మందులను వాడుతున్న క్రమంలో మద్యం సేవించడం కూడా తక్కువ రక్త చక్కెరకు దారితీస్తుంది, ప్రత్యేకించి మద్యం ఆహార స్థానాన్ని భర్తీ చేస్తే ఈ పరిస్థితికి కారణం అవుతుంది. మద్యాన్ని శరీరం బయటకు పంపే ప్రయత్నిస్తున్నప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం శరీరానికి ఒత్తిడికి గురిచేస్తుంది. దీంతో హైపోగ్లెసెమియా ఏర్పడవచ్చు.

Hypoglycemia causes

మధుమేహం రహితంగా హైపోగ్లెసెమియాకు కారణాలు

డయాబెటిస్ లేకపోయినా, మీరు తక్కువ రక్త చక్కెరను అనుభవించవచ్చు. అయినప్పటికీ, మధుమేహం లేని వ్యక్తులలో హైపోగ్లైసీమియా చాలా తక్కువగా ఉంటుంది. అందుకు గల కారణాలను ఓసారి పరిశీలిద్దాం:

  • క్వినైన్ వంటి కొన్ని మందులు
  • హెపటైటిస్, కిడ్నీ డిజార్డర్స్ వంటి కొన్ని వైద్య పరిస్థితులు
  • కణతి కారణంగా అదనపు ఇన్సులిన్ ఉత్పత్తి అయితే
  • అడ్రినల్ గ్రంథి లోపం వంటి ఎండోక్రైన్ రుగ్మతలు

హైపోగ్లెసెమియా ఎలా నిర్ధారణ అవుతుంది?

బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉందని మీరు అనుమానంగా ఉంటే, వెంటనే మీ రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం ముఖ్యం. రక్తంలో గ్లూకోజ్ మీటర్ లేకుంటే మీరు ఇన్సులిన్‌ను పెంచే మధుమేహ మందులను తీసుకుంటే, మీ వైద్యునితో గ్లూకోజ్ మీటర్ తీసుకోవడం గురించి మాట్లాడండి.

తరచుగా తక్కువ రక్త చక్కెర స్థాయిలు నమోదువుతున్నాయని, అందులోనూ వారానికి రెండు, మూడు పర్యాయాలు లక్షణాలను ఎదుర్కోంటే అందుకు గల కారణాలు ఏమై ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం సముచితం. వైద్య చరిత్ర ఆధారంగా, ఆహారపు అలవాట్ల విషయాన్ని అర్థం చేసుకున్న వైద్యుడు.. ఎలాంటి లక్షణాలను ఎదుర్కోంటున్నారన్న విషయాలను తెలుసుకున్న తరువాత అందుకు అనుగూణంగా చికిత్సతో పాటు మాత్రలను కూడా మర్చే అవకాశం ఉంటుంది.

డయాబెటిక్ పేషంట్ కాకపోయినా, హైపోగ్లైసీమియా ఉందని అనుమానించినట్లయితే, లక్షణాల గురించి మీ వైద్యునితో మాట్లాడండి. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడంపై నిర్ధారించడానికి మీ వైద్యుడు మూడు ప్రమాణాలను ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు “విప్పల్స్ ట్రయాడ్”గా సూచిస్తారు:

షుగర్ లెవల్స్ తగ్గడానికి సంకేతాలు, లక్షణాలను పరిశీలించేందుకు వైద్యుడు మిమ్మల్ని ఉపవాసం చేయమని కూడా సూచించవచ్చు లేదా ఎక్కువ సమయం ఏమీ తినకుండా, తాగకుండా ఉండమని కూడా సూచించవచ్చు.

బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని సంకేతాలు, లక్షణాలు సంభవించినప్పుడు దానిని నిర్థారించుకునేందుకు వైద్యులు రక్త పరీక్షకు అదేశించివచ్చు. తద్వారా షుగర్ లెవల్స్ ను తెలుసుకోవచ్చు.

రక్తంలో తక్కువ చక్కెర స్థాయిల సంకేతాలు, లక్షణాలు నమోదైన నేపథ్యంలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పెంచడం ద్వారా లో- బ్లడ్ షుగర్ లెవల్స్ అదృశ్యమవుతున్నాయా.? లేక అలాగే కొనసాగుతున్నాయా అన్న విషయాన్ని కూడా మీ వైద్యుడు పరిశీలిస్తారు.

మీ వైద్యుడు మిమ్మల్ని ఇంట్లోనే రక్తంలోని చక్కర స్థాయిలను తెలుసుకునేందుకు గ్లూకో మీటర్ ను కొనుగోలు చేయమని కూడా సూచించవచ్చు. వివిధ సమయాల్లో మరీ ముఖ్యంగా తిన్న తరువాత. అంతకుముందు రక్తంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని నమోదు చేయమని కోరవచ్చు. దీంతో పాటు లేవగానే మీ చక్కర స్థయాిలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా గమనిస్తూ నమోదు చేయమని అదేశించవచ్చు.

Low Blood Sugar Treatment

ఇంట్లో బ్లడ్ షుగర్ ను ఎలా పరీక్షించాలి.?

బ్లడ్ షుగర్ పరీక్షను నిర్వహించడానికి.. వేలిని లాన్సెట్‌తో మెల్లిగా గుచ్చాలి. దాంతో వేలి నుంచి రక్తం బయటకు వస్తుంది. దానిని గ్లూకోజ్ మీటర్‌లోకి చొప్పించిన స్ట్రిప్‌పై ఉంచాలి.

ఇంట్లో బ్లడ్ షుగర్‌ పరీక్ష చేసుకునే ముందు, మీ ఆరోగ్యకరమైన బ్లడ్ షుగర్ స్థాయిల గురించి వైద్యుడిని అడిగి తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆయనకే మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి మీ శరీరానికి అవసరమైన చక్కర స్థాయిలు ఏంటో చెప్పగలరు. ఇక ఆయన పరిగణలోకి తీసుకునే అరోగ్య అంశాలు ఏటంటే..

  • మధుమేహం రకం
  • ఎంతకాలం షుగర్ ఉంది
  • వయస్సు
  • ఏవైనా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయా

మీ వద్ద బ్లడ్ గ్లూకోజ్ పరీక్షించుకునే పరికరం లేని పక్షంలో తక్కువ బ్లడ్ షుగర్ సంకేతాలు లేదా లక్షణాలను ఎదుర్కొంటుంటే, అవి తక్కువ స్థాయిలు ఉన్నాయని నిర్ధారించడానికి సరిపోతాయి.

హైపోగ్లైసీమియా ఎలా చికిత్స చేస్తారు.?

మీ రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు, కార్బోహైడ్రేట్లను తినడం కీలకం. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, అధిక కార్బోహైడ్రేట్ స్నాక్స్ చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

Hypoglycemia remedies

మీ చిరుతిండిలో కనీసం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉండాలి. నిత్యం అందుబాటులో ఉండేలా కొన్ని మంచి స్నాక్స్:

  • హార్డ్ క్యాండీలు
  • నాన్-డైట్ సోడా లేదా పళ్ల రసం
  • తేనె లేదా టేబుల్ చక్కెర
  • జెల్లీ బీన్స్ లేదా గమ్‌డ్రాప్స్
  • తాజా లేదా ఎండిన పండ్లు

బ్లడ్ షుగర్ స్థాయిలు తక్కువగా ఉంటే వేగంగా పెంచడానికి మీరు గ్లూకోజ్ మాత్రలను కూడా తీసుకోవచ్చు. ఇవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకునే ముందు ప్రతి టాబ్లెట్‌లో ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో పరిశీలించి తీసుకోవడం సముచితం. 15 నుండి 20 గ్రాముల కార్బోహైడ్రేట్లను పొందాలని లక్ష్యంగా పెట్టుకోండి.

తిన్న తర్వాత లేదా గ్లూకోజ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 15 నిమిషాలు వేచి ఉండండి, మీ రక్తంలో చక్కెరను మళ్లీ పరీక్షించండి. మీ రక్తంలో చక్కెర పెరగకపోతే, మరొక 15 గ్రాముల కార్బోహైడ్రేట్లను తినండి లేదా గ్లూకోజ్ మాత్రల మరొక మోతాదు తీసుకోండి. మీ రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభించే వరకు దీన్ని పునరావృతం చేయండి.

అయితే ఒకేసారి ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ తీసుకోరాదు. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను విపరీతంగా పేంచేందుకు కూడా దారితీయవచ్చు.

మీ బ్లడ్ షుగర్ ప్రతిస్పందించనట్లయితే, వెంటనే మీ వైద్యుడిని లేదా అత్యవసర సేవలను సంప్రదించండి.

తక్కువ రక్త చక్కెర లక్షణాలు సాధారణంగా చికిత్స చేయకుండా వదిలేస్తే మరింత తీవ్రమవుతాయి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే లేదా మీకు మధుమేహం లేకపోయినా, మీకు లక్షణాలు ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించడం సముచితం.

హైపోగ్లైసీమియాను నిరోధింవచ్చా?

మధుమేహం ఉందని.. దీంతో ఎప్పుడో ఒకప్పుడు మనకు తెలియకుండానే హైపోగ్లైసీమియా పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని తెలుసు. అయితే ఈ హైపోగ్లెసెమియా పరిస్థితులను నివారించడానికి చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఆ చర్యలు ఏమైవుంటాయంటే:

  • చక్కని అరోగ్యవంతమైన మధుమేహ నిర్వహణ ప్రణాళికను పాటించడం
  • కొత్త ఔషధాలను తీసుకోవాల్సి వస్తే వైద్యుడిని సంప్రదించండి లేదా సాధారణ జీవనశైలిని మార్చుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించి.. డాక్టర్ సూచనలు పాటించండి
  • బ్లడ్ షుగర్ స్థాయిని ట్రాక్ చేయడానికి CGM అని పిలువబడే “నిరంతర గ్లూకోజ్ మానిటర్”ని ఉపయోగించండి.
  • ఎక్కువ కాలం ఇంటి నుండి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు మీతో గ్లూకోజ్ మాత్రలు లేదా మిఠాయిని తీసుకెళ్లండి.
  • రోజుకు మూడు సార్లు కడుపునిండా తినే బదులు మితంగా ఐదారు సార్లు తినండి. ఈ ఆహార ప్రణాళికను అనుసరించే ముందు మీ వైద్యుడితో చర్చించండి.

హైపోగ్లైసీమియా అనేది చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు పోరాడవలసిన వాస్తవం. వాస్తవాల గురించి మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న పరిష్కారాలను తనిఖీ చేయండి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా జాగ్రత్త చర్యలు ఫాలో అవుతూ.. మార్పులను మీ డాక్టర్‌తో చర్చించండి.

Exit mobile version