Home ఫిట్నెస్ శరీర ఆకృతిపై ఆందోళన.. మీరు ఫిట్ గా ఉన్నారా.? ఇలా తెలుసుకోండి..

శరీర ఆకృతిపై ఆందోళన.. మీరు ఫిట్ గా ఉన్నారా.? ఇలా తెలుసుకోండి..

0
శరీర ఆకృతిపై ఆందోళన.. మీరు ఫిట్ గా ఉన్నారా.? ఇలా తెలుసుకోండి..

చాలా మంది తమలో వచ్చిన మార్పులను గుర్తించకుండా.. తాము ఎప్పటిలాగానే ఒకేలా ఉన్నామని అనుకుంటారు. ముఖ్యంగా శరీర బరువు పెరిగిందని, శరీర ఆకృతి మారిందని తెలుసుకోలేకపోతున్నారు. యవ్వనంలో ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువ. వారు నిత్యం వేసుకునే దుస్తులు చిన్నగా అవుతున్నా.. తాము ఎదుగుతున్నామని అనుకుంటారే తప్ప.. తమ శరీరంలో మార్పులు సంభవిస్తున్నాయని మాత్రం అంగీకరించరు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అశ్రద్ద కారణంగా జాగ్రత్త చర్యల తీసుకుంటే సమసిపోవాల్సిన సమస్యలు సందర్భాలను బట్టి సర్జరీల వరకు వెళ్లాల్సి వస్తుంది. మీకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాకుండా ఉండాలంటే.. మీలో ఈ లక్షణాలు ఉంటే, మీరు బరువు పెరిగినట్లు గుర్తించాలి.

సాధారణంగా, మానవ ఆకృతిలో మార్పులు జరుగుతుంటాయి. దానికి చాలా కారణాలున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, సమయాతీత అహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల మనకు తెలియకుండానే శరీర ఆకృతిలో మార్పులు వస్తాయి. అయితే వాటిని మనం సకాలంలో గుర్తించాల్సిన అవసరం మనపైనే ఉంది.

కరోనా మహమ్మారి ప్రజలను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా దెబ్బతీసిందన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలా కుటుంబాలు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేదు. దీని కారణంగా కొందరు మానసిక ఆందోళనకు గురయ్యారు. అయితే కరోనా మహమ్మారితో ఇంటికే పరిమితమైన కుటుంబసభ్యులు బయటకు వెళ్లేందుకు కూడా జంకారు. దీంతో ప్రభుత్వం సహా అనేక ప్రైవేటు, బహుళజాతి సంస్థలు, కార్పోరేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అమల్లోకి తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఈ పద్దతినే పలు సంస్థలు అవలంభిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతో అనేక మంది వ్యాయామానికి దూరం కావడం.. అధికంగా బరువు పెరగడం జరిపోయాయి.

5 Ways to Tell Overweight 2

తద్వారా చాలామందికి తమ శరీర ఆకృతి మారిందని, అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అర్థం కాలేదు. రోజూ అలాగే ఉన్నాం అనే భావనలోనే ఉన్నారు. వ్యాయామానికి దూరం అయినా.. అవి చేసేప్పుడు తీసుకున్న ఆహారమే తీసుకోవడంతో పాటు.. తమ అలవాట్లలో పెద్దగా మార్పులు కూడా తీసుకోలేదు. అయితే ఎదుటివారు గుర్తించి తమ శరీర ఆకృతి మారిందని చెబితే.. అబ్బే ఏం లేదో అని భావించేవారే తప్ప.. వారి మాటలను లక్షపెట్టలేదు. రోజు మాదిరిగానే అద్దంలో తమను తాము చూసుకోవడంతో.. తమలో వచ్చిన మార్పులను వారు గమనించే పరిస్థితి లేదు. అయితే మన శరీరంలో వచ్చే మార్పులను గుర్తించే మార్గాలు ఉన్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు.. మన శరీరాకృతిలో వచ్చిన మార్పులను మన శరీరమే మనకు సంకేతిస్తుంది. అవేంటో తెలుసుకుందామా..

చిన్న పకికే ఆయాసం

5 Ways to Tell Overweight 3

మన శరీరం బరువు అధికంగా మారిన నేపథ్యంలో మనకు కొన్ని ప్రత్యేక సంకేతాలను అందిస్తుంది దేహం. వాటిలో ప్రధానమైనది.. గమనించాల్సినది ఆయాసం. కాసింత దూరం పరిగెడితే వచ్చే ఆయసం మాట ఎలా ఉన్నా.. కాసింత చిన్న పని చేసినా.. ఆయాసం వచ్చేస్తోంది. సాధారణ సమయాల్లో కాకుండా ఏ చిన్న పని చేసినా.. గట్టిన ఊపిరి పీల్చుకుంటే శరీర ఆకృతి మారిందని సంకేతం లభించినట్టే. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలుసుకోండి. మెట్లపై నడుస్తున్నప్పుడు శ్వాస వేగం పెరిగితే మీరు శారీరకంగా ఫిట్ గా లేరని అర్థం చేసుకోవాలి. దీనిని నివారించేందుకు శరీరిక వ్యాయామం తప్పనిసరి. అధిక బరువు మీ ఊపిరితిత్తులతో సహా మీ అవయవాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. మీ బూట్లు కట్టుకోవడం లేదా గదిని శుభ్రం చేయడం వంటి సాధారణ పనులు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారితీస్తే, మీకు బరువు సమస్య ఉండవచ్చు. అదేవిధంగా, అధిక బరువు, ఊబకాయం ఉన్న వ్యక్తులకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గుండెవేగం

5 Ways to Tell Overweight 4

పని, విశ్రాంతి సమయంలో హృదయ స్పందన వినండి. మీ హృదయ స్పందన రేటు సాధారణంగా ఉంటే పర్వాలేదు, అది పెరిగినట్లు అనిపిస్తే, మీరు ఖచ్చితంగా శారీరకంగా సరిగాలేరని సంకేతం. గుండె చప్పుడు శబ్దం అర్థం కాకపోతే స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. హార్ట్ బీట్ లో మార్పులు సంభవిస్తే మీ శరీరం ఫిట్ గా లేదని సంకేతం. అయితే ఈ మార్పులు స్వల్పంగా ఉంటే.. వ్యాయామం చేయడం, లేదా రోజు వాకింగ్ చేయడం ద్వారా సరిచేసుకోవచ్చు. అలా కాకుండా మార్పులు తీవ్రంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇక వ్యాయామం చేసేప్పుడు శరీరం ఫిట్ గా లేకుంటే నొప్పులు ఎక్కువగా వస్తంటాయి. క్రమం తప్పకుండా రోజు చేస్తంటే అవి తగ్గిపోతాయి. అయితే రోజూ నొప్పులు వస్తుంటే.. శరీర బరువు పెరిగిందని గుర్తింపు. నిత్యం వ్యాయామంతోనే దీనిని సరిచేయవచ్చు. క్రమం తప్పని వ్యాయామం, యోగా, వాకింగ్ లతో కొద్ది రోజుల్లోనే ఆ నొప్పులను దూరం చేసుకోవచ్చు.

నిద్రలేని రాత్రుళ్లు

బరువు పెరగడాన్ని గుర్తించడానికి ఇది సులభమైన మార్గం నిద్రలేని రాత్రులు గడపాల్సి రావడం. అందుకు ముఖ్యకారణం శారీరక శ్రమ లేకపోవడమే. ఇది చాలా ప్రమాదకరం కూడా.. ఎందుకంటే రాత్రిపూట నిద్రలేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. నిద్రలేమిని వదిలించుకోవడానికి ఒక మార్గం వ్యాయామం. శరీరం అలసిపోతే.. సులువుగా నిద్రపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు మీలో తరచుగా కనిపిస్తే మీ శరీర ఆకృతిలో మార్పు వచ్చిందని కచ్చితంగా గుర్తించవచ్చు.. అయితే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు శారీరక శ్రమ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు 30 నిమిషాల నుంచి గంటసేపు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు నడక చాలా ముఖ్యమైన వ్యాయామం. ప్రతిరోజూ మీ శరీరంలోని కేలరీలను బర్న్ చేయడం ద్వారా మీరు త్వరగా బరువు తగ్గుతారు. నడక వల్ల ఆరోగ్యంగా బరువు పెరగడమే కాకుండా మనసు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చునని అంటున్నారు. నడక వల్ల అధిక రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్ గా వాకింగ్ చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గ్రహించండి..

కీళ్ల నోప్పులు

5 Ways to Tell Overweight 5

ఊబకాయం అనేది ఆస్టియో ఆర్థరైటిస్‌కు ప్రమాద కారకం, ఇది అత్యంత సాధారణమైన ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జాయింట్ క్షీణత, నొప్పి, కీళ్ల కదలిక తగ్గడం, జీవన నాణ్యత తగ్గడానికి దారితీసే డిసేబుల్ డిజార్డర్. అదనపు బరువును మోయడం వల్ల మీ అన్ని కీళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది మరియు మీరు బరువు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. మీకు మోకాళ్లు లేదా తుంటి నొప్పి లేదా దీర్ఘకాలిక వెన్నునొప్పి ఉంటే, మీరు బరువు సమస్య యొక్క సంకేతాలను ఎదుర్కొంటారు.

గురక

5 Ways to Tell Overweight 6

మీ భాగస్వామి, తల్లిదండ్రులు అధిక గురక పెడుతున్నారా.. మీలోనూ ఈ సమస్య ఉందని ఎవరైనా గమనించారా.? అయితే, మీరు కూడా బరుపు పెరిగినట్టే. గురక అధికంగా వస్తుందంటే అది మీ శరీరం బరుపును పెరిగిందనడానికి సంకేతం. దీంతో మీరు బరువును తనిఖీ చేయడానికి ఇంతకన్నా మరో కారణం కూడా అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. తరచుగా గురక పెడుతుంటే ఇది మరో అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. అరుదుగా మంచి మధ్య రాత్రి నిద్రలోంచి మెలుకువస్తే.. అదే స్లీప్ అప్నియాకు కారణం కూడా కావచ్చు. ” స్లీప్ అప్నియా అనేది మీరు నిద్రపోతున్నప్పుడు మీ శ్వాస పదేపదే ఆగి మళ్లీ ప్రారంభమవుతుంది. ఇది మేల్కొనే సమయంలో ఆక్సిజన్ కోల్పోవడం, విపరీతమైన అలసటను కలిగిస్తుంది. ఈ పరిస్థితి ఉన్న చాలా మంది వాయుమార్గాల అవరోధం కారణంగా గురకకు గురవుతారు. “మీ శరీరం మెడ చుట్టూ కొవ్వును నిల్వ చేసినప్పుడు, అది శ్వాస మార్గాన్ని తగ్గించవచ్చు, దీని వలన నిస్సార శ్వాస లేదా శ్వాసలో విరామం ఉంటుంది” అని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version