Home న్యూట్రిషన్ ఈ వంటింటి గింజల్లో రక్తపోటు, చక్కర నియంత్రించే గుణం.!

ఈ వంటింటి గింజల్లో రక్తపోటు, చక్కర నియంత్రించే గుణం.!

0
ఈ వంటింటి గింజల్లో రక్తపోటు, చక్కర నియంత్రించే గుణం.!

ప్రతి ఇంటి వంటగదిలో అందులోనూ పోపుల డబ్బాలో తప్పనిసరిగా ఉండే వస్తువు ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మధుమేహంతో పాటు గుండె ధమనులలోని అడ్డంకులను కూడా తొలగించి రక్త సరఫరాను సక్రమంగా జరిగేలా.. గుండె సమస్యలు ఉత్పన్నం కాకుండా చేసే ఈ వస్తువు గురించి మీకు తెలుసా.? అయితే ఇప్పటికే దీని ప్రయోజనాలు తెలిసిన చాలా మంది దీనిని ఉదయాన్నే కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగేస్తుంటారు. అయితే ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.? లేక ఆహారంగా తీసుకోవాలా.? అన్న విషయాల్లోకి వెళ్లే ముందు ఇంతకీ ఆ వస్తువు ఏంటో చెప్పండీ అంటారా.?

వంటింట్లోని పోపుల డబ్బాలో ఉండే ఔషధ గుణాలు ఇమిడి వున్న ఆహార పదార్థం జీలకర్ర. ఔనండీ.. అంతగా బిల్డప్ ఇచ్చింది ఈ చిన్న పోపు గింజల కోసమా.? అనుకోకండి. ఇందులో ఉన్న అనేక ఔషధ గుణాలు ప్రతిరోజు పరిగడుపునే తీసుకుంటే ఆయుష్సును పెంచేందుకు కూడా కారణంగా మారతాయి. బహుశా ఈ విషయాన్ని గుర్తించి కాబోలు, పెద్దలకు పోపులో జీలకర్ర వేసే అలవాటు చేశారు. జీలకర్రను తిరగమోతకు మాత్రమే పరిమితం చేయడం వల్ల పరిమిత ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దీన్ని సరైన మోతాదులో.. సరిగ్గా వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో చూద్దాం.

  • రోజూ గోరువెచ్చని నీటిలో జీలకర్ర కలిపి పరగడుపున తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా చేస్తుంది.
  • రక్తహీనతను కలిగించదు
  • రక్తంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన పోషకం.
  • శరీరంలో ఐరన్ తగ్గడం వల్ల రక్తహీనత వస్తుంది, ఇది పిల్లలు, ఆడవారు మరియు వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది.
  • జీలకర్రను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఐరన్ లభిస్తుంది.

జీర్ణక్రియ కోసం

  • జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.
  • గ్యాస్, అసిడిటీని పూర్తిగా నియంత్రిస్తుంది.
  • అజీర్తి, కడుపులో వికారం, కడుపులో అల్సర్లు మాయమవుతాయి.
  • కడుపులో పురుగులు చనిపోతాయి.
  • కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది

చర్మ వ్యాధులకు

  • జీలకర్రలో విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుతుంది.
    జీలకర్ర నూనెను ముఖానికి రాసుకుంటే మొటిమలు, గజ్జి, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు త్వరగా తగ్గుతాయి.

జుట్టు రాలడాన్ని నివారించడంలో…

  • జీలకర్ర వాడటం వల్ల బట్టతల, జుట్టు రాలడం తగ్గుతుంది.
  • ఆలివ్ ఆయిల్ మరియు జీలకర్ర నూనెను బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరగడంతోపాటు జుట్టు రాలడం తగ్గుతుంది.

రెగ్యులర్ నెలవారీ

  • ఋతుస్రావం సక్రమంగా జరిగేలా చేస్తుంది మరియు రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది.
  • ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల బహిష్టు సమయంలో వచ్చే సమస్యలను శరీరం తట్టుకుంటుంది.

రోగనిరోధక శక్తి

  • జీలకర్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలోని మలినాలను, ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • దీని వల్ల దగ్గు, జలుబు వంటి వ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు

  • జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
  • మంచి నిద్ర కావాలనుకునేవారు జీలకర్ర నీళ్లు తాగడం మంచిది.
  • జీలకర్ర నీళ్లు తాగే వారికి రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • ఇది రక్త సరఫరాను మెరుగుపరచడమే కాకుండా రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు జీలకర్ర నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
  • ఈ ప్రయోజనాలను చిన్నచూపు చూడకుండా జీలకర్రను విరివిగా వాడటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
Exit mobile version