Home హెల్త్ A-Z డయాబెటిస్ గుడ్ న్యూస్: మధుమేహ చికిత్స కోసం త్వరలో ఇన్సులిన్ చాకెట్లు - <span class='sndtitle'>Chocolates could replace injections for Diabetics </span>

గుడ్ న్యూస్: మధుమేహ చికిత్స కోసం త్వరలో ఇన్సులిన్ చాకెట్లు - Chocolates could replace injections for Diabetics

0
గుడ్ న్యూస్: మధుమేహ చికిత్స కోసం త్వరలో ఇన్సులిన్ చాకెట్లు - <span class='sndtitle'></img>Chocolates could replace injections for Diabetics </span>
<a href="https://www.freepik.com/">Src</a>

మధుమేహం అనేది దీర్ఘకాలికంగా ప్రభావం చూపే వ్యాధి. ఈ తీపి వ్యాధి దరి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందే తప్ప.. ఒక్కసారి వచ్చిందా.. జీవితాంతం మందులు వాడాల్సిందే. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా.. ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న వివరాల్లోకి వెళ్తే.. ది లాన్సెట్‌ నిర్వహించిన కొత్త అధ్యయనాలతో పాటు ప్రచురించబడిన భయంకరమైన అంచనాలు హడలెత్తిస్తున్నాయి. ఈ అంచానాల ప్రకారం, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో జీవించే వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ‘‘ప్రపంచ సంక్షోభం’’గా మారుతుంది. ఈ “ప్రపంచ సంక్షోభాన్ని” పరిష్కరించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోతే ప్రస్తుతం ( 2021 గణంకాల ప్రకారం ) 529 మిలియన్ల మధుమేహ వ్యాధి గ్రస్తులు రానున్న30 సంవత్సరాలలో 1.3 బిలియన్లకు పైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడతారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

డయాబెటీస్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, “గుండె, రక్త నాళాలు, కళ్ళు, మూత్రపిండాలు మరియు నరాలకు తీవ్రమైన నష్టం” కలిగించే అధిక రక్తంలో చక్కెర స్థాయిలతో కూడిన దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి 2045 నాటికి, మధుమేహంతో జీవిస్తున్న పెద్దలలో మూడొంతుల మంది తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలోని ప్రజలే ఉంటారని అంచానా వేశారు, ఇక్కడ వ్యాధి సంరక్షణకు తక్కువ ప్రాప్యత ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ దేశాలలో డయాబెటిస్ మరణాల రేటు కూడా అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే రెట్టింపు అని పరిశోధకులు తెలిపారు. ది లాన్సెట్ కొత్త అధ్యయనాలలో సహ రచయితగా ఉన్న దక్షిణాఫ్రికాలోని విట్‌వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్‌ అలీషా వేడ్ ప్రకారం, ఆరోగ్య సంరక్షణ, ఆహార అభద్రత మరియు ఔషధానికి పరిమితమైన ప్రాప్యత మధుమేహం ఉన్న తక్కువ, మధ్య ఆదాయ దేశాలవారికి ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవని పేర్కోన్నారు.

అయితే ఈ భయానక అంచానాల నేపథ్యంలో పరిశోధకులు మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం మరో కొత్త రకం ఉత్పాదనను తీసుకువచ్చారు. ఇది మధుమేహం తీవ్రంగా ఉన్న రోగులు ప్రతిరోజు తీసుకునే నోప్పితో కూడిన ఇన్సులిన్ ఇంజెక్షన్ ను.. హాయిగా అస్వాదించే చాక్లెట్ గా మార్చేసిందంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. ఇంజెక్షన్లు, మాత్రలతో పనిలేకుండా శాస్త్రవేత్తలు మరో విధంగా అదే మందును తీసుకువచ్చారు. నొప్పులకు స్వస్తి పలుకుతూ ఏకంగా చప్పరించి తినగల చాక్లెట్ మాదిరిగా ఓరల్ ఇన్సులిన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఔనా ఇది నిజమేనా అన్నట్లుగా చూస్తున్న అనేక మంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు పరిశోధకులు శుభవార్తను చెప్పారు. ఈ ఓరల్ ఇన్సులిన్ కొత్త రూపం, త్వరలో మానవులలో పరీక్షలు చేయబడతాయి, దీంతో సిరంజిలతో ఇంజెక్షన్లు లేదా ఇన్సులిన్ పంపులకు త్వరలోనే చాక్లెట్ ప్రత్యామ్నాయంగా మారనుంది.

Chocolate based diabetes treatment
Src

ఈ ఓరల్ ఇన్సులిన్ ను శాస్త్రవేత్తలు క్యాప్సూల్ లేదా చక్కెర రహిత చాక్లెట్ ద్వారా నోటి ద్వారా అందించడానికి ఒక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా ఇప్పటికే ఈ ఓరల్ ఇన్సులిన్‌ను జంతువులపై విజయవంతంగా పరీక్షించి మేలైన ఫలితాలను రాబట్టారు. త్వరలోనే దీనిని మనుషులపై కూడా పరీక్షించనున్నారు. వీరిపై కూడా సానుకూలమైన ఫలితాలే వస్తాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ఓరల్ ఇన్సులిన్ ను వచ్చే సంవత్సరం అంటే 2025లో హ్యూమన్ ట్రయల్స్ పరీక్షకు సిద్దం కానుందని సమాచారం.

ప్రపంచ జనాభాలో దాదాపుగా 530 మిలియన్ల మందికి షుగర్ వ్యాధి ఉండగా, అందులో ఒక్క యూరోప్ లోనే దాదాపు 61 మిలియన్ల మందికి మధుమేహంతో బాధ పడుతున్నారు. వీరిలో 5 నుండి 10 శాతం మందికి టైప్ 1 మధుమేహం ఉంది, అంటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాలి. చాలా సాధారణమైన టైప్ 2 డయాబెటిస్ ఉన్న కొందరు వ్యక్తులు కూడా ఇన్సులిన్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, ఇన్సులిన్ తీసుకోవడానికి మూడు సాధారణ మార్గాలు సిరంజి, ఇన్సులిన్ పెన్ లేదా ఇన్సులిన్ పంప్. కాగా తాజాగా అందుబాటులోకి రానున్న మార్గం ఓరల్ ఇన్సులిన్. అయితే ఇది క్యాప్సూల్ రూపంలో లేక చక్కర రహిత చాక్లెట్ రూపంలో అందుబాటులోకి రానుంది.

యూనివర్శిటీ ఆఫ్ ట్రోమ్సో (UiT) నుండి శాస్త్రవేత్తలు – నార్వేలోని ఆర్కిటిక్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలసి ఇన్సులిన్ యొక్క కొత్త రూపాన్ని కనుగొన్నారు. ఈ వినూత్న విధానం ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో జీవిస్తున్న సుమారు 530 మిలియన్ల మందికి ప్రతిరోజు బాధాకరమైన ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. అయితే ఈ చాకెట్లు లేదా క్యాప్సూల్స్ లో ఏమి ఉంటుంది. అదెలా రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.? అన్న ప్రశ్న సాధారణంగా ఉదయిస్తుంది. ఈ కొత్త ఓరల్ ఇన్సూలిన్ పద్ధతికి కీలకం నానో- క్యారియర్ టెక్నాలజీ. ప్రతి క్యాప్సూల్స్ లో మానవ వెంటుక్రల పరిమాణంలో పదివేలవ (1/10,000వ) వంతు వెడల్పులో చిన్న నానో-క్యారియర్‌లు ఉంటాయి. అవి ఇన్సులిన్‌ను కప్పి ఉంచుతాయి. ఈ వాహకాలు సాధారణ మైక్రోస్కోప్‌తో చూడటానికి కూడా చాలా చిన్నవి. శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు, మన రక్తంలో ఉన్న చక్కరను ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు. కణాలలోకి వెళ్లే బదులు ఆ చక్కర రక్తంలోనే ఉండిపోతుంది. దీంతో క్రమేనా రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితినే మధుమేహ వ్యాధి అని అంటారు. దీనిని నియంత్రించేందుకు మాత్రలు, ఇన్సూలిన్ ఇంజెక్షన్లు, ఇన్సూలిన్ పంపులు వినియోగిస్తారు.

షుగర్ స్థాయిలను నానో క్యారియర్లు ఎలా నియంత్రిస్తాయి.? How Sugar levels are controlled by Nano Carriers

How Sugar levels are controlled by Nano Carriers
Src

యూఐటి ఆక్కిటిక్ యూనివర్శిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ సంయుక్తంగా రూపొందించిన ఓరల్ ఇన్సూలిన్ లో కీలక పాత్రను పోషించేవి నానో క్యారియర్లు. వాస్తవానికి చాలా కాలంగా ఈ విధానం పరిశీలనలో ఉంది. కాగా, ఇందులో ఒక ప్రధాన సమస్య ఉంది. అదేమిటంటే నానో-క్యారియర్లలో ఉన్న ఇన్సులిన్ కడుపులోని అమ్లాలతో కలవడంతో రసాయనక మార్పులు చేంది నానో క్యారియర్లు విచ్చిన్నం అవుతాయి. దీంతో ఇన్సూలిన్ ఉదరంలోనే విడుదల కావడంతో లక్ష్య సాధనలో విఫలం అయ్యాయి. దీంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయమై పరిశోధకులు పలు విధాలుగా అలోచనలు చేశారు. అందులో భాగంగానే రక్తంలో చక్కర స్థాయిలు ఎక్కువైనప్పుడు ఉతప్పన్నమయ్యే ఎంజైమ్స్ మాత్రమే విచ్చిన్నం చేసేలా రక్షణ పూతను తయారు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

తాజాగా యూఐటి అర్కిటిక్ యూనివర్శిటీ ఆఫ్ నార్వే, యూనివర్సిటీ ఆప్ సిడ్నీలు చేసిన పరిశోధనలో ఉదర ఆమ్లంతో నానో క్యారియర్లు విచ్ఛిన్నం కాకుండా రక్షణ పూతను సృష్టించారు. దీంతో ఇప్పుడు నానో క్యారియర్లు నేరుగా కాలేయం వద్దకు చేరుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్ లు చురుకుగా మారి రక్షణ పూతను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో వాటిలోని ఇన్సూలిన్ విడుదల చేస్తాయి. ఇది రక్తం నుంచి చక్కరను తొలగించడానికి పనిచేస్తుంది. తద్వారా శరీరంలో షుగర్ స్థాయిలు పెరిగిన ప్రతీసారి ఇన్సులిన్ ఉత్పత్తి కూడా అలోమేటిక్ గా అవుతుంది. ఈ మేరకు యూఐటి యూనివర్సిటీ ఆఫ్ నార్వే ప్రొఫెసర్ పీటర్ మెక్ కొర్ట్ నానో కారియర్లు ఎలా పనిచేస్తాయన్నది వివరించారు.

కాలేయానికి మందులను అందజేసే చాక్లెట్లే మంచివి: Delivering medicine to the liver

Delivering medicine to the liver
Src

నానో క్యారియర్‌లతో కాలేయానికి మందులను అందించడం సాధ్యమవుతుందని గతంలో కనుగొన్నామని అయితే ఉదర అమ్లంతో విచ్ఛిన్నం కాకుండా పూతను వూయించి ఎంజైమ్ చురుకుగా మారడంతో పూత విచ్చిన్నం అయ్యేలా తాజా పరిశోధన విజయవంతం అయ్యిందన్నారు సిడ్నీ విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్ డాక్టర్ నికోలస్ హంట్. వయస్సు పైబడిన వయోజనులలోని కణాలకు ఆ చికిత్సా విధానాలను అందించడానికి వివిధ పద్ధతులను పరిశీలించడానికి ఆస్ట్రేలియాలో గ్రాంట్ పొందామని అన్నారు. నానోమెడిసిన్‌ల వినియోగాన్ని కలిగి ఉన్న క్యారియర్లు నిజానికి చాలా చల్లని మరియు అద్భుతమైన పదార్థాలని ఆయన అన్నారు.

‘‘ నానో క్యారియర్లు మొదట ఉపయోగించినప్పుడు, అవి చాలా సమర్ధవంతంగా ఔషధాలను అందించగలవని పరిశీలించాము, అంతేకాదు అవి శరీరంలోని ఏ భాగానికి వెళ్తున్నాయో కూడా పరిశీలించాము. వాటిని ఖచ్చితంగా నియంత్రించవచ్చు. ఇవి లక్ష్యరహిత ప్రభావాలను కలిగి ఉండవని నిర్థారించుకున్న తరువాత ఉదర అమ్లంతో విచ్ఛిన్నం కాకుండా ప్రత్యేకమైన పాలిమర్‌ను అభివృద్ధి చేశామని దీంతో నానో క్యారియర్లు కాలేయానికి చేరుకుంటాయని అన్నారు. ఇక ఈ పాలిమర్ రక్తంలో చక్కెర స్థాయిలకు ప్రతిస్పందించేలా రూపొందించామని దీంతో షుగర్ లెవల్స్ పెరగగానే పాలిమర్స్ విచ్చిన్నమై ఇన్సులిన్ విడుదల చేస్తాయి” అని హంట్ చెప్పారు.

ఇంజెక్షన్ల కన్నా చాక్లెట్ మంచివా.? Insulin chocolates are better than Injections

Insulin chocolates are better than Injections
Src

ప్రస్తుతం ఉన్న ఇన్సులిన్ ఇంజెక్షన్ పద్దతి కంటే ఇన్సులిన్ చాక్లెట్ మంచిదా అన్న ప్రశ్న మధుమేహ రోగులలో ఉత్పన్నం అవుతుంది. ఇదే విషయమై నార్వేలోని ఆర్కిటిక్ విశ్వవిద్యాలయం UiT వద్ద పీటర్ మెక్‌కోర్ట్ వివరిస్తూ ‘‘ఇన్సులిన్ తీసుకునే వారికి శరీరంలోని అవసరమైన భాగాలకు వేగంగా ఇన్సులిన్ అందజేయాలి. అయితే ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడంతో ఇది మొత్తం శరీరంలో ఇన్సులిన్ చేరుతుంది. ఇన్సులిన్ ప్రయోజనం కూడా మొత్తం శరీరానికి చేరుతుంది. శరీరంలో పూర్తిగా వ్యాప్తి చెంది దుష్ప్రభావాలకు కూడా కారణం అవుతుంది. దాని బదులుగా నానో క్యారియర్ల ద్వారా ఇన్సులిన్ కాలేయానికి చేరడం ద్వారా అది ఎక్కడ అవసరమో అక్కడే వినియోగం అవుతుందని పీటర్ మెక్ కోర్టు వివరించారు. కాగా, ఇన్సులిన్ విడుదల చేసిన తరువాత అవశేషాలుగా ఉన్న నానో క్యారియర్లను మానవ శరీరంతో వేగంగా క్లియర్ చేస్తుందని కూడా ఆయన తెలిపారు.

చాక్లెట్లు విడుదల అయ్యేది అప్పుడేనా.? Plans for future clinical trials

Plans for future clinical trials
Src

టైప్ 1, టైప్ 2 రెండు విధాలా మధుమేహానికి నానో క్యారియర్ల ద్వారా విడుదలయ్యే ఇన్సూలిన్ ఎంతో మేలు చేస్తుందన్న శాస్త్రవేత్తల వ్యాఖ్యలు విన్న తరువాత చక్కర రహిత ఇన్సులిన్ చాకెట్లు లేదా ఇన్సులిన్ క్యాప్సూల్స్ విడుదల అయ్యేది ఎప్పుడా.? అని వేచి చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా మధుమేహ రోగులు, వారి సంబంధికులు ఈ చాక్లెట్లు ఎప్పుడు విడుదల అవుతాయా అన్న వివరాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చాకెట్లు మార్కెట్ లోకి వచ్చేందుకు మరో ఏడాది సమయం తప్పక పడుతుంది. ఈ ఔషధాన్ని నానో క్యారియర్ల ద్వారా ఇప్పటి వరకు జంతువులపై విజయవంతంగా ప్రయోగించి సానుకూల ఫలితాలు పొందామని హాంట్ తెలిపారు. ఇప్పటి వరకు ఎలుకలు మరియు బాబూన్‌లపై పరీక్షించామని, వాటి ఫలితాలను కూడా నేచర్ నానోటెక్నాలజీలో ప్రచురించామని తెలిపారు.

‘‘ఎలుకలపై పరిక్షలు జరిపిన తరువాత బాబూన్‌లపై పరీక్షించామని, అయితే అవి ట్యాబ్లెట్లను తీసుకోకపోవడంతో అదే మందును పరిశోధకులు షుగర్-ఫ్రీ జెల్లీలు మరియు షుగర్-ఫ్రీ చాక్లెట్‌లుగా మలిచారు. దీంతో బాబూన్‌లు ల్యాబ్లో సృష్టించిన చాక్లెట్‌ను ఇష్టపడ్డాయి. పరీక్ష ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. 20 డయాబెటిక్ బాబూన్ ల రక్తంలో షుగర్ లెవల్ తగ్గింది. ఈ చక్కెర రహిత చాక్లెట్ ను డయాబెటిక్ ఎలుకలపైనా పరీక్షించాం. వాటిలోనూ సానుకూల ప్రభావం కనిపించింది. ఇప్పటి వరకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు’’ అని హంట్ తెలిపారు. ‘‘ఈ 2025వ సంవత్సరం చివరి నాటికి ఈ నానో క్యారియర్ ఇన్సులిన్ చాకెట్లను ప్రపంచవ్యాప్త మధుమేహ వ్యాధిగ్రస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆశతో రాబోయే క్లినికల్ ట్రయల్ పై దృష్టి సారించామని’’ ఆయన తెలిపారు. తొలి హ్యూమన్ ట్రయల్స్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం అవుతుందని, ఇలా మూడు పర్యాయాలు ట్రయల్స్ విజయమంతమైన తరువాత 2028లో రెగ్యులేటర్ల నుండి వీలైనంత త్వరగా ఆమోదం పొందిన తరువాత ఈ క్యాప్సూల్స్ అందుబాటులోకి వస్తాయని హంట్ తెలిపారు.

Exit mobile version