Home న్యూట్రిషన్ అధిక రక్తపోటును నియంత్రించే 12 ఆహార పదార్థాలు

అధిక రక్తపోటును నియంత్రించే 12 ఆహార పదార్థాలు

0
అధిక రక్తపోటును నియంత్రించే 12 ఆహార పదార్థాలు

అధిక రక్తపోటు, లేదా హైపర్ టెన్షన్, లేదా హై బిపి ఈ సమస్య రమారమి అందరికీ తెలిసిందే. ప్రతీ పదిమందిలో ఇద్దరు లేదా ముగ్గురు అనుభవిస్తున్నదే. అహారపు అలవాట్లు, వ్యాయామ లేమి, క్రమబద్దం కానీ దినచర్య, వంశపారంపర్యంగా కొందరికి సంక్రమించే ఈ వ్యాధి సాధారణంగా కనిపించినా.. ఇది సందర్భానుచితంగా వ్యాధిగ్రస్తులు వ్యవహరించని పక్షంలో ప్రాణంతకంగానూ మారుతుంది. అధిక రక్తపోటు ఆటుపోట్లకు గురైతే క్రమంగా హృదయ సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చు. అయితే దీని పట్ల సరైన అవగాహనతో వ్యవహరిస్తే నియంత్రించడం కూడా సాధ్యమే ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మందికి పైగా ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని సమాచారం. రక్తపోటు సాధారణంగా ఎగువ స్థాయి దీనిని సిస్టోలిక్ రక్తపోటు (SBP) విలువ 130 mm Hg, దిగువ స్థాయి దీనిని డయాస్టొలిక్ రక్తపోటు (DBP) 80 mm Hg, గా నమోదు అవుతుంది. అయితే ఈ ఎగువ, దిగువ స్థాయిలను దాటి సంఖ్యలు నమోదయితే అధిక రక్తపోటు ఉందని స్పష్టమైనట్లే. ఇక అధిక రక్తపోటును నమోదైన పక్షంలో వైద్యులు ఇచ్చే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లతో సహా మందులను హైపర్ టెన్షన్ నియంత్రణకు పేషంట్లు వాడతారు. అయితే కేవలం మందులు మాత్రమే కాకుండా మన జీవనశైలిలో పలు మార్పులను అలవర్చుకోవడం వల్ల హైబిపిని నియంత్రించవచ్చు. అంతేకాదు ఆహార మార్పులతో సహా, రక్తపోటు స్థాయిలను నిర్ణీత శ్రేణులకు తగ్గించవచ్చు.

అధిక రక్తపోటు క్రమంగా హృదయ సంబంధ వ్యాధులకు దారితీయకుండా ప్రమాదాన్ని నివారించవచ్చు. రక్తపోటు-తగ్గించే మందులతో సహా అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులందరికీ చక్కని పోషక ఆహారాన్ని అందించడం ద్వారా గుండె-ఆరోగ్యకరంగా బలోపేతంగా చేయవచ్చు. అయితే రక్తపోటును నియంత్రించడం.. గుండెను బలోపేతంగా చేసి.. ధృడంగా మార్చడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉండాలి అన్న వివరాల్లోకి వెళ్తే.. హైపర్ టెన్షన్ వ్యాధిగ్రస్తులకు అందించే ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం వంటి నిర్దిష్ట పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలోని పోటీషియం, మెగ్నీషియం రక్తపోటు స్థాయిలను తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది. మరి ఈ పోషకాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ఏమిటో ఓ సారి చూద్దామా.

1. సిట్రస్ పండ్లు

Citrus fruits

విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లలో రక్తపోటు-తగ్గించే గుణాలు ఇమిడి ఉన్నాయి. ద్రాక్షపండు, నారింజ బత్తాయి, నిమ్మకాయలలో ఈ గుణాలు అధికంగా ఉన్నాయి. సిట్రస్ పండ్లు శక్తివంతమైన అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాద కారకాలను కూడా తగ్గించడంలో దోహదపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే విటమిన్లు, ఖనిజాలను ఇవి కలిగివున్నాయి. 101 మంది జపనీస్ మహిళలు పాల్గొన్న 5-నెలల అధ్యయనం ప్రకారం, రోజువారీ నిమ్మరసం తీసుకోవడంతో పాటు 40 నిమిషాల నుంచి గంట నడకతో అధిక రక్తపోటు గణనీయంగా తగ్గించవచ్చునని తేలింది. ఈ ప్రభావం నిమ్మకాయలలోని సిట్రిక్ యాసిడ్ సహా ఫ్లేవనాయిడ్ కంటెంట్‌కు కారణమని పరిశోధకులు తెలిపారు. నారింజ, ద్రాక్షపండు రసం తాగడం కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ద్రాక్షపండు, ద్రాక్షపండు రసంతో బిపీ స్థాయి నియంత్రించబడటంతో పాటు.. తగ్గిస్తుంది. కాగా, రోజువారీగా ఈ పండ్లను, పండ్ల రసాన్ని మీ ఆహారంలో తీసుకోవాలంటే మందులతో తీసుకునే విషయమై మీ వైద్యుడిని సంప్రదించండీ.

2. సాల్మన్, కొవ్వు చేప

Salmon fish

హైపర్ టెన్షన్ తగ్గించడంతో పాటు గుండె దమణులను సక్రమంగా పనిచేసేలా దోహదపడేది ఒమెగా-3. ఈ పదార్థం ఎక్కువగా సాల్మన్ చేపలతో పాటు ఇతర కొవ్వు చేపలలో నిక్షిఫ్తమై ఉంటుంది. ఇవి ప్రధానంగా గుండె ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ కొవ్వు పదార్థాలలో ఉండే ఆక్సిలిపిన్స్ అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రించడంతో పాటు గుండె దమనులలో వాపులను కూడా తగ్గిస్తాయి. ఈ చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 రిచ్ ఫ్యాటీ ఫిష్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలోనూ తేలింది. 2,036 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, రక్తంలో ఒమేగా-3 కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో ఈ కొవ్వులు తక్కువగా ఉన్నవారి కంటే రక్తపోటు ఎగువ, దిగువ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అధిక ఒమేగా -3 తీసుకోవడం కూడా రక్తపోటును నియంత్రించే అవకాశాలు ఉన్నాయని తేలింది.

3. బచ్చల కూర చెట్టు

Swiss chard

బచ్చల కూర చెట్టు దీనినే అంగ్లములో స్విస్ చార్డ్ అని అంటారు. స్విస్ బ్యాంకుల గురించి తెలిసినంతగా స్విస్ చార్డ్ చెట్టు గురించి చాలా మందికి తెలియదు. అయితే మనిషి గుండెను బలోపేతం చేయగల ఈ చెట్టు ఆకుల్లోని నిల్వ ఉన్న పోషకాల్లో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ఎంతమందికి తెలుసు. ఇవి గుండెను పథిలపర్చడంతో పాటు అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. పొటాషియం, మెగ్నీషియంతో సహా రక్తపోటును నియంత్రించే పోషకాలతో నిండిన ఈ బచ్చల కూర చెట్టు ఆకులు, కాండం రెండింటినీ తినవచ్చు. ఒక కప్పు (145 గ్రాములు) వండిన ఈ కూరలో మీ రోజువారీ పొటాషియం, మెగ్నీషియం అవసరాలలో వరుసగా 17% మరియు 30% అందిస్తుంది.

అధిక రక్తపోటు ఉన్నవారిలో,ప్రతి 0.6 గ్రాముల ఆహార పొటాషియం పెరుగుదలతో రక్తపోటులోని ఎగువ స్థాయి (SBP) లో 1.0 mm Hg తగ్గింపుతో పాటు రక్తపోటు దిగువస్థాయి (DBP)లో 0.52 mm Hg తగ్గింపును చేకూరుతుంది. ఒక కప్పు (145 గ్రాములు) స్విస్ చార్డ్ 792 mg ఈ ముఖ్యమైన పోషకాన్ని ప్యాక్ చేస్తుంది. అంటే అధిక రక్తపోటుకు పూర్తిగా నియంత్రించినట్టే. రక్తపోటు నియంత్రణకు మెగ్నీషియం కూడా అవసరం. ఇది అనేక మెకానిజమ్‌ల ద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది,సహజ కాల్షియం ఛానల్ బ్లాకర్‌గా పనిచేయడం ద్వారా,ఇది గుండె ధమనుల కణాలలోకి కాల్షియం కదలికను అడ్డుకుంటుంది,రక్త నాళాలు విశ్రాంతి తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

4. గుమ్మడికాయ గింజలు

Pumpkin seeds

రక్తపోటు అందులోనూ అదిక రక్తపోటు గురించి మాట్లాడితే.. తాడిచెట్టంత మనుషులను కూడా అల్లాడించేస్తుంది. ముక్కు పైనుండే కోపం మనిషికి ఉన్న విలువను కూడా విలవిలలాడేట్టు చేస్తుంది. అయితే మనిషితో పోల్చితే గుమ్మడికాయ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి,కానీ మనిషిని ఊపిని సలపనీయకుండా చేసిన అధిక రక్తపోటును మాత్రం చక్కగా నియంత్రిస్తాయి. అందుకు కారణం వీటిలో పుష్కలంగా ఉండే పోషక విలువలే. రక్త నాళాల సడలింపు, రక్తపోటు తగ్గింపుకు అవసరమైన మెగ్నీషియం,పొటాషియం, అర్జినిన్,నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి అవసరమైన అమైనో యాసిడ్ సహా రక్తపోటు నియంత్రణకు ముఖ్యమైన పోషకాలన్నీ గుమ్మడికాయ గింజలలో కేంద్రీకృతమయ్యాయంటే అతిశయోక్తికాదు. గుమ్మడికాయ గింజల నూనె కూడా అధిక రక్తపోటుకు శక్తివంతమైన సహజ నివారణగా చూపబడింది. 23 మంది స్త్రీలలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం,రోజుకు 3 గ్రాముల గుమ్మడికాయ గింజల నూనెను 6 వారాల పాటు సప్లిమెంట్ చేయడం వలన ప్లేసిబో సమూహంతో పోలిస్తే ఎగువ రక్తపోటు స్థాయి (SBP) గణనీయంగా తగ్గుతుంది.

5. బీన్స్ సహా కాయగూరలు

Beans

బీన్స్, గోరుచిక్కుడు సహా ఇతర కాయగూరల్లో పుష్కలంగా ఉండే ఫైబర్,మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధిక రక్తపోటును నియంత్రించడంలో దోహదపడతాయి. బీన్స్, గోరు చిక్కుడు సహా ఇతర కాయగూరలు తినడం వల్ల అధిక రక్తపోటు స్థాయిలు తగ్గుతాయని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 554 మందితో జరిపిన 8 అధ్యయనాల సమీక్ష,ఇతర ఆహారాలు,బీన్స్, కాయగూరల కోసం మార్పిడి చేసినప్పుడు,రక్తపోటు ఉన్న వ్యక్తులలో రక్తపోటు ఎగువ స్థాయితో పాటు సగటు రక్తపోటు స్థాయిలను గణనీయంగా తగ్గించిందని వెల్లడైంది..

6. బెర్రీస్

Berries

బెర్రీలు అనగానే స్ట్రాబెరీ గుర్తుకువచ్చింది కదూ. అధిక రక్తపోటు వంటి గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించగల సామర్థ్యంతో సహా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్న పోషక నిల్వల నిధి బెర్రీస్. యాంటీఆక్సిడెంట్ల గుణాలను గొప్పగా ఇమిడివున్న ఈ బెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో ఘనాపాటీలు. వీటిలో ఆంథోసైనిన్లు ఉన్నాయి, ఇవి బెర్రీలకు శక్తివంతమైన రంగును ఇచ్చే వర్ణద్రవ్యం. ఆంథోసైనిన్‌లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయని, రక్త నాళాలను నియంత్రించే అణువుల ఉత్పత్తిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో ఇది అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ,ఈ పోటెన్షియల్ మెకానిజమ్ లను నిర్ధారించడానికి మరింత పరిశోధన. బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, చోక్‌బెర్రీస్, క్లౌడ్‌బెర్రీస్, స్ట్రాబెర్రీలలో రక్తపోటును-తగ్గించే ప్రభావాలతో సంబంధం ఉన్న కొన్ని బెర్రీలు.

7. పిస్తాపప్పులు

Pistachios

పిస్తాపప్పులు చాలా పోషక గుణములతో నిండిఉన్నవి, వీటి వినియోగం ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలతో ముడిపడి ఉంది. పొటాషియంతో సహా గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు అవసరమైన అనేక పోషకాలలో ఇవి అధికంగా ఉన్నాయి. 21 అధ్యయనాల సమీక్ష ప్రకారం, సమీక్షలో చేర్చబడిన అన్ని గింజలలో, పిస్తా తీసుకోవడం రక్తపోటు ఎగువ (SBP), దిగువ స్థాయి (DBP)లు రెండింటినీ తగ్గించడంలో బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

8. క్యారెట్లు

Carrots

కరకరలాడే క్యారెట్లు పోషకాలతో నిండిన చక్కటి శాఖాహారం. క్యారెట్‌లో క్లోరోజెనిక్, పి-కౌమారిక్, కెఫీక్ యాసిడ్స్ వంటి ఫినాలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి రక్త నాళాలను సడలించడంతో పాటు రక్త నాళాల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు తద్వారా ఇవి రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో దోహదపడతాయి. క్యారెట్లను ఉడికించి లేదా పచ్చిగా తినవచ్చు, అయినప్పటికీ వాటిని పచ్చిగా తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. 40-59 సంవత్సరాల వయస్సు గల 2,195 మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో పచ్చి క్యారెట్ తీసుకోవడం వల్ల తక్కువ రక్తపోటు స్థాయిలు నమోదైయినట్టు కనుగొన్నారు. 17 మంది వ్యక్తులలో మరొక చిన్న అధ్యయనం 3 నెలల పాటు 16 ounces (473 mL) తాజా క్యారెట్ రసం యొక్క రోజువారీ తీసుకోవడం రక్తపోటు ఎగువ స్థాయి (SBP)లో తగ్గింపులు నమోదు కాగా, దిగువ స్థాయిలో మాత్రం ప్రభావాన్న కనబర్చలేదు.

9. టమాటాలు, దాని ఉత్పత్తులు

Tomatoes products

టమాటాలు, దాని ఉత్పత్తులు పొటాషియం మరియు కెరోటినాయిడ్ పిగ్మెంట్ లైకోపీన్‌తో సహా అనేక పోషకాలలో పుష్కలంగా ఉన్నాయి. లైకోపీన్ గుండె ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావాలతో గణనీయంగా ప్రభావాన్న చూపుతుంది. ఇక టొమాటో ఉత్పత్తులలోనూ ఈ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల అధిక రక్తపోటుతో సంక్రమించే గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడుతుంది. 21 అధ్యయనాల సమీక్షలో టమాటా దాని ఉత్పత్తులను తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపడుతుందని, గుండె జబ్బులు, గుండె-వ్యాధి సంబంధిత మరణాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని నిర్ధారించింది.

10. బ్రోకలీ

Broccoli

బ్రోకలీ ఈ మధ్యకాలంలో మన దేశంలో అందుబాటులోకి వచ్చిన ఆకకూర. దీనిని కేవలం అవిరి పట్టించిన మాత్రంగానే అరగిస్తున్నారు. అందుకు కారణం ఎన్నో అరోగ్య ప్రయోజనకర ప్రభావాలను ఇది కలిగివుండటమే. శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థతో పాటు గుండె దమనుల్లోని కణాలను కూడా బలపేతంగా చేయగల గుణాలు బ్రోకలీలో పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఈ క్రూసిఫెరస్ వెజ్జీని మీ ఆహారంలో చేర్చుకోవడం కారణంగా రక్తపోటును గణనీయంగా తగ్గించుకోవచ్చు. బ్రోకలీలో ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇది రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా, శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 187,453 మంది వ్యక్తులపై ఒక అధ్యయనం నిర్వహించి వారి నుండి సేకరించిన డేటా ప్రకారం, వారానికి 4 లేదా అంతకంటే ఎక్కువ సేర్విన్గ్స్ బ్రోకలీని తినేవారితో పోల్చితే.. నెలకు ఒకసారి లేదా బ్రోకలీని తినని వారిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

11. చియా గింజలు, అవిసెలు

Chia flax seeds
Src

చియా గింజలు, అవిసెలతోనూ అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రించవచ్చు. ఈ గింజలలోని పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ తో సహా ఆరోగ్యకరమైన రక్తపోటు నియంత్రణకు అవసరమైన పోషకాలతో కూడిన చిన్న విత్తనాలు. అధిక రక్తపోటు ఉన్న 26 మంది వ్యక్తులను కలిగి ఉన్న ఒక చిన్న, 12-వారాల అధ్యయనంలో, రోజుకు 35 గ్రాముల చియాసిడ్ పిండితో సప్లిమెంట్ చేయడం వల్ల ప్లేసిబో గ్రూప్ తో పోలిస్తే, ఔషధ, ఔషధం లేని వ్యక్తులలో రక్తపోటు తగ్గుదలకి దారితీసింది. అదనంగా, 11 అధ్యయనాల సమీక్ష ఫలితాలు అవిసె గింజలను తినడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయని సూచించాయి, ప్రత్యేకించి 12 వారాలు, అంతకు ఎక్కువ కాలం పాటు మొత్తం విత్తన రూపంలో వినియోగించినప్పుడు ఈ ఫలితాలు వెలువడ్డాయి.

12. బచ్చలికూర

Bachali Aaku
Src

దుంపల మాదిరిగానే బచ్చలికూరలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం నిల్వలతో నిండినది.. కావున ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి ఒక అద్భుతమైన ఎంపిక. 27 మందిలో జరిపిన ఒక అధ్యయనంలో, తక్కువ నైట్రేట్ ఆస్పరాగస్ సూప్ (42 ట్రస్టెడ్ సోర్స్) తినే వారితో పోలిస్తే, 7 రోజుల పాటు ప్రతిరోజూ 16.9 ఔన్సుల (500 mL) నైట్రేట్ బచ్చలికూర సూప్‌ను 7 రోజులు తినే వారు రక్తపోటు ఎగువ, దిగువ స్థాయిలు రెండింటిలో తగ్గింపులను చవిచూశారు. బచ్చలికూర సూప్ హృదయ ధమనుల దృఢత్వాన్ని కూడా తగ్గించడంలో దోహదపడి.. గుండెను బలోపేతం చేస్తుంది. తద్వారా అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇక చివరగా రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు ఇతర జీవనశైలి మార్పులతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అవలంబించడం చాలా ముఖ్యం. ఆహారంలో పైన సూచించబడిన పదార్థాలను జోడిస్తే అధిక రక్తపోటును గణనీయంగా తగ్గించవచ్చు, మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పరిశోధన ప్రకారం, మీ బోజనం, స్నాక్స్ లో ఆకు కూరలు, బెర్రీలు, బీన్స్, కాయగూరలు, గింజలు, కొవ్వు చేపలు, సిట్రస్ పండ్లు, క్యారెట్‌లు వంటి కొన్ని ఆహారాలను జోడించడం వలన మీరు అధిక రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు.

Exit mobile version