Home చర్మ సంరక్షణ పాదాలు ఆకర్షణీయంగా వుండాలా..?

పాదాలు ఆకర్షణీయంగా వుండాలా..?

0
పాదాలు ఆకర్షణీయంగా వుండాలా..?

పాదాలు ఆకర్షణీయంగా కనిపించాలంటే.. రసాయనాలతో కూడిన ప్రోడక్టులు వాడటం కంటే ఇంట్లోనే కొన్ని సహజ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు చెబుతున్నారు. తద్వారా పాదాలు అందంగా కనిపించడంతోపాటు ఎంతో సహజంగా వుంటాయి. అంతకంటే ముందు.. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడుగుతూ వుండాలని సూచిస్తున్నారు. ఇంకా మరిన్ని చిట్కాలు..

  • ఒక గాజు పాత్ర తీసుకుని అందులో ఒక చెంచా క్యుటికల్ క్రిము లేదా రెండు చెంచాలా ఆలివ్‌ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కుల గ్లిజరిన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటిలో హెర్బల్ షాంపు వేసి 15 నిమిషాలపాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. ఫలితంగా పాదాలు ఎంతో ఆకర్షణీయంగా మారుతాయి.
  • ముందుగా ఒక పెద్ద పాత్రలో శుభ్రంగా వుండే నీళ్ళు తీసుకుని అందులో కొద్దిసేపు పాదాలను వుంచాలి. అనంతరం ప్యూమిక్‌స్టోన్‌తో పాదాలమీద, మడమలమీద వున్న పగుళ్ళను మూడు-నాలుగు నిమిషాలపాటు రుద్దండి. దీనివల్ల పాదాలపై పేరుకున్న మట్టి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి.
  • రోజూరాత్రిపూట హేండ్‌క్రీమ్ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా నునుపుగా ఉంటాయి. కాలిమడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే నైట్ పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సుధరించి నిద్రించడం మంచిది.
  • కాలివేళ్ళగోళ్ళు వీలనయింతగా కత్తిరించడం మంచిది. పొడిచర్మంగలవారు వారానాకి ఒకసారి గోరువెచ్చటి నూనెలో పాదాల్ని కాసేపు వుంచాలి. ఇలా చేస్తే మీ పాదాలు మృదువుగా తయారవుతాయి.
Exit mobile version