Home వుమెన్ హెల్త్ పగిలిన పెదాలకు బెస్ట్ రెమెడీస్

పగిలిన పెదాలకు బెస్ట్ రెమెడీస్

0
పగిలిన పెదాలకు బెస్ట్ రెమెడీస్

వాతావరణంలో వచ్చే మార్పులు సౌందర్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా.. మృదువుగా వుండే పెదవులు పగులుతాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ రకమైన సమస్య రావడం సహజం. పెదాలు అలా పగిలిపోవడంతో అవి చర్మసౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చాలా బాధిస్తాయి కూడా. ఈ సమస్య చిన్నగా వున్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.

అలాకాకుండా నిర్లక్ష్యం చేస్తే.. చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. వీలైనంత త్వరగా ఈ పెదవుల పగుళ్ల సమస్యను చెక్ పెట్టాల్సి వుంటుంది. అందుకు రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రోడక్ట్స్ వినియోగించడం కంటే.. సహజ పదార్థాలతో తయారుచేసిన రెమెడీలే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

  • పెదాల సంరక్షణకు కొబ్బరి నూనె చక్కగా పని చేస్తుంది. పెదవులు ఎండిపోయి పొరలుగా ఏర్పడుతుంటే పెదవులకు తగినంత తేమను అందించడం ముఖ్యం. కొబ్బరి నూనెలో ఉండే ఎన్నో మినరల్స్ పెదవులకు కావలసినంత తేమను అందించి పెదవులు మృదువుగా ఉండేందుకు తోడ్పడుతాయి. కాబట్టి.. పెదాలను పగిలినప్పుడు నిత్యం కొబ్బరినూనె రాస్తూ వుంటే.. ఆ సమస్యను అధిగమించవచ్చు.
  • ఒక పాత్ర తీసుకుని అందులో ఒక్కొక్క టీస్పూన్ చొప్పున కొబ్బరి నూనెను, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై కాటన్ బాల్ తో అద్దండి. కోమలంగా వేళ్ళతో పెదవులపై సర్కులర్ మోషన్ లో ఒక నిమిషంపాటు మసాజ్ చేయండి. కొద్దిసేపు తర్వాత మెత్తటి వస్త్రంతో పెదవులను తుడుచుకోవాలి. అప్పుడు పెదాలు ఎంతో మృదువుగా తయారవుతాయి.
  • ఒక గిన్నె తీసుకుని అందులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకుని.. అందులో ముప్పావువంతు టేబుల్ స్పూన్ హనీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మూత ఉన్న జార్ లో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకుని.. పెదాలకు రాసుకుంటూ వుండాలి. అలా చేస్తే మంచి ఫలితం వుంటుంది.
Exit mobile version