Img Src : iStockphoto
వాపు అనేది ఒక సాధారణ ఆరోగ్య పరిస్థితి. దీనిని కొన్ని ఆహారాలు తీవ్రతరం చేస్తాయి. వాపును నియంత్రణకు తక్కువ ప్రాసెస్ ఫుడ్, ఆల్కహాల్, మాంసం తీసుకోవాలి. ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాలు సహాయపడతాయి.
Img Src : iStockphoto
సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక మంటను మెడిటరేనియన్, డి.ఎ.ఎస్.హెచ్ వంటి డైట్ ఫుడ్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకర కొవ్వులు, లీన్ ప్రోటీన్, మసాలా దినుసులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగిఉన్నాయి.
Img Src : iStockphoto
శోథ నిరోధక ఆహారంలో డైటరీ యాంటీ అక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపు తగ్గించడంపై దృష్టి పెడతాయి. వాటిలో తాజా పండ్లు, కూరగాయలు, మొక్కల ఆధారిత ఆహారాలున్నాయి. చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు మంటను ప్రేరేపిస్తాయి.
Img Src : iStockphoto
తాజా ఆహారం, సంపూర్ణ ధాన్యాహారాలలో వాపు ప్రేరితం తక్కువగా ఉంటుంది. డైటరీ యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ సెల్ డ్యామేజ్ సహా ఇన్ఫ్లమేషన్కు దారితీస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ శరీరంలోని వాపును తగ్గిస్తాయి.
Img Src : iStockphoto
తాజా పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు, ఆరోగ్యకర కొవ్వులపై దృష్టి సారించే మెడిటరేనియన్, డి.ఎ.ఎస్.హెచ్ వంటి ప్రముఖ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లు హృదయనాళ వ్యవస్థలో మంటను తగ్గించి, హృదయ సంబంధ వ్యాధుల నివారణలో సహాయపడతాయి.
Img Src : iStockphoto
యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఆస్తమా, పెద్దప్రేగు శోథ, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, లూపస్, థైరాయిడిటిస్ వంటి దీర్ఘకాలిక అరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఈ ఆహారం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.
Img Src : iStockphoto
యాంటీఇన్ఫ్లమేటరీ డైట్లో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణ: అయిలీ చేపలు, పండ్లలో చెర్రీలు, బెర్రీలు, తాజా కూరగాయలు, నట్స్, విత్తనాలు, ఆలివ్ నూనె, ఫైబర్, చిక్కుళ్ళు, సుగంధ ద్రవ్యాలు, ప్రోబయోటిక్స్, మూలికలు.
Img Src : iStockphoto
ఆరోగ్యానికి వైవిధ్యమైన ఆహారం అవసరం, తాజా, సాదా పదార్థాలు ఉత్తమమైనవి. తయారుచేసిపెట్టిన ఆహారాలలో చక్కెర, కొవ్వు ఉండవచ్చు. రంగురంగుల ఆహార పదార్థాలు యాంటీఆక్సిడెంట్లు, పోషకాలను అందిస్తుంది. వివిధ రకాల పండ్లు, కూరగాయల రంగులు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Img Src : iStockphoto
యాంటి-ఇఫ్లమేటరీ డైట్లలో భాగంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర లేదా ఉప్పగా ఉండే ఆహారాలు, అనారోగ్య నూనెలు, ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు, చిరుతిండి పదార్థాలు, ఫలహారాలు, ఇంట్లో తయారుచేసిన డెజర్ట్‌లు, ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయాలి.
Img Src : iStockphoto
గ్లూటెన్-రహిత ఆహారాలతో శోథ లక్షణాలు కలిగేవారు.. కొన్ని వారాలపాటు వాటిని దూరం పెట్టాలి. టొమాటోలు, వంకాయలు, మిరియాలు వంటి నైట్ షేడ్స్ వాపు లక్షణాలను ప్రేరేపిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలతో నిండి ఉన్న చిలకడదుంపలు, తృణధాన్యాలు వంటి కార్బ్-రిచ్ ఆహారాలు ఉత్తమం.
Img Src : iStockphoto
శాఖాహారులు తక్కువ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటారని 2017 ఓ అధ్యయనం కనుగొంది, శాఖాహారం తీసుకునే వారిలో శోథ లక్షణాలు తక్కువ. మాంసాహారం మంట ప్రమాదాన్ని, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Img Src : iStockphoto