Img Src : iStockphoto
గౌట్ అనేది ఒక రకమైన అర్థరైటిస్. ఇది రక్తంలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల వల్ల ఏర్పడుతుంది. దీని వలన శరీరంలో మరీ ముఖ్యంగా కాళ్లు, చేతుల కీళ్లలో మోనోసోడియం యూరేట్ స్ఫటికాలు ఏర్పడతాయి.
Img Src : iStockphoto
ఇది ప్రధానంగా పురుషులను, 60 ఏళ్లు నిండిన మహిళలను ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట అకస్మాత్తుగా వాపుమంటలు ప్రారంభమై, 1-2 వారాల పాటు ఉంటాయి. మొదటి 24 గంటల్లో అత్యంత బాధాకరమైన లక్షణాలు కనిపిస్తాయి.
Img Src : iStockphoto
గౌట్ అరోగ్య పరిస్థితి ఏర్పడిన వెంటనే చికిత్స చేయించాలి, లేని పక్షంలో శరీరంలోని ఇతర కీళ్లకు గౌట్ వ్యాపించి ప్రభావితం చేస్తుంది. ఇది ఎక్కువగా కాళ్లు లేదా చేతి వేళ్లలోని కీళ్ల వద్ద ఏర్పడుతుంటాయి.
Img Src : iStockphoto
గౌట్ చికిత్సా కోసం నొప్పి నివారణ మందులను వైద్యులు సూచిస్తారు. వాటిలో వాపును తగ్గించే నాన్‌స్టెరాయిడ్ డ్రగ్స్ వంటి కొల్చిసిన్, స్టెరాయిడ్స్‌తో కూడి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే అల్లోపురినోల్ వంటి మందులు.
Img Src : iStockphoto
ఆర్థరైటిస్ ఫౌండేషన్ అధ్యయనాలు గౌట్ ఉన్న వ్యక్తులు బరువు నియంత్రణ చేసుకోవాలని పేర్కోంటున్నాయి. ఈ పరిస్థితి అభివృద్ధి చెందడానికి స్థూలకాయం కూడా కారకం. బరువు తగ్గడం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
Img Src : iStockphoto
బరువు తగ్గడంతో కీళ్లపై ఒత్తిడి తగ్గడంతో పాటు గుండె జబ్బులను దూరం చేస్తుంది. శరీరాన్ని ధృడంగా తయారు చేసి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. ధూమపానం, మద్యపానాన్ని తగ్గించండి
Img Src : iStockphoto
మొక్కలు, ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన మెడిటరేనియన్ ఆహారపు అలవాట్లను ప్రోత్సహించండి. చక్కని ఆహారం నిత్యం బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుం
Img Src : iStockphoto
గౌట్‌ను మందులతో చికిత్స చేయవచ్చు. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, పాల ఉత్పత్తులతో కూడిన సమతుల్య, తక్కువ ప్యూరిన్ ఆహారంతో గౌట్ లక్షణాలను సమర్థవంతంగా నివారించి మంటలను నిరోధిస్తాయి.
Img Src : iStockphoto
మెడిటరేనియన్ డైట్ ప్లాన్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. భోజన ప్రణాళికలో యూరిక్ యాసిడ్ స్థాయిల నియంత్రణ, బరువును నిర్వహణకు దోహదపడే ఆహారాలు ఎంచుకోవాలి.
Img Src : iStockphoto
గౌట్ అనేది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ పరిస్థితి, ప్యూరిన్లను నివారించడం, మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెట్టడం వంటి ఆహార ఎంపికల ద్వారా దీనిని నివారించవచ్చు. కాగా, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యం.
Img Src : iStockphoto