Home ఫిట్నెస్ రోగ నిరోధ‌క శ‌క్తి పెంచడం కోసం తీసుకోవాల్సిన జ్యూస్‌లు ఇవే..

రోగ నిరోధ‌క శ‌క్తి పెంచడం కోసం తీసుకోవాల్సిన జ్యూస్‌లు ఇవే..

0
రోగ నిరోధ‌క శ‌క్తి పెంచడం కోసం తీసుకోవాల్సిన జ్యూస్‌లు ఇవే..

మనిషి తన దైనందిక వ్యవహారాల్లో నిత్యం యాక్టివ్ గా ఉండాలంటే.. ఆయనకు తన శరీరం కూడా సహకరించాలి. అంటే మానవుడి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కూడా అంతే ధృఢంగా ఉండాలి. ఈ ఇమ్యూనిటీ వ్యవస్థ నిత్యం చురుకగా ఉండాలి అంటే దానికి అరోగ్యకరమైన విటమిన్లు, మినరల్స్ అందాల్సిన అవసరం ఉంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ సహా వైరస్ లతో రోగనిరోధక వ్యవస్థ పోరాడుతుంది. అయితే శరీరానికి అవసరమయ్యే విటమిన్లను, మినరల్స్ రోగ నిరోధక వ్యవస్థకు ఎలా అందుతాయి అన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఇవి అందాలంటే అందుకు కావాల్సింది అరోగకరమైన ఆహారం. ఆహారం అంటే కేవలం ఘన పదార్థలే కాదు. ద్రవపదార్థాలు కూడా అందించాలి. మరీ ముఖ్యంగా పళ్లు, కూరగాయల రసాలను అందించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ చక్కబడుతోంది. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. ప్రతి జ్యూస్, స్మూతీ లేదా సీడ్ మిల్క్‌లో రోగనిరోధక శక్తిని పెంపొందించే పోషకాలు ఉంటాయి. వీటి ద్వారా శరీరం సహజ రక్షణ వ్యవస్థ మరింత ధృఢంగా తయారవుతుంది. అయితే ఈ జ్యూస్, స్మూతీ, సీడ్ మీల్స్ లో రోగ నిరోధక వ్యవస్థకు అధికంగా దోహదపడే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఆరెంజ్, ద్రాక్షా, బత్తాయి సహా ఇతర పుల్లని పండ్ల జ్యూస్

Orange Grapefruit Juice

రోగ నిరోధక వ్యవస్థకు అత్యధికంగా కావాల్సింది శక్తి. ఆ శక్తిని అందించడంలో విటమిన్ సితో కూడిన జ్యూస్ లు దోహదపడతాయి. విటమిన్ సి లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్, శరీరాన్ని దెబ్బతీసే పదార్థాల నుంచి కణాలను కాపాడుతోంది. విటమిన్ సి లోపించడం ద్వారా మీ శరీరానికి అయిన గాయం తగ్గడంలో జాప్యం తగ్గుతుంది, తద్వారా వెనువెంటనే స్పందించాల్సిన రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం మందగిస్తోంది. దీని వల్ల శరీరంపై దాడి చేసే అంటువ్యాధుల నుంచి కాపాడుకునే రక్షణ వ్యవస్థ అచేతనంగా మారుతుంది. అయితే కరోనా వైరస్ లాంటి మహమ్మారి నుంచి శరీరం పోరాడటంలో నోటి ద్వారా తీసుకునే విటమిన్ సి దోహదం చేస్తుందని వార్తలు వినిపించినా.. ఇప్పటివరకు అందుకు సంబంధించిన ఆదరాలు మాత్రం లేవు. ఇదిలావుంటే సాధారణ జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి వ్యాధుల బారిన పడినప్పుడు విటమిన్-సి ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. ఈ వ్యాధుల వల్ల కలిగే లక్షణాలు అంత తీవ్రంగా ఉండవు, అంతేకాదు ఆ వ్యాధుల బారి నుంచి త్వరగా కోలుకునేందుకు కూడా విటమిన్-సి సాయం చేస్తోంది. అందుకోసం పెద్దలు రోజుకు 2 వేల మిల్లీగ్రాముల మేర విటమిన్ సీ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

విటమిస్ సీలో ఉండే పోషకాలు (ఒక సర్వింగ్‌లో)

  • నారింజ నుండి పొటాషియం
  • నారింజ, ద్రాక్షపండు నుండి విటమిన్ ఎ
  • నారింజ నుండి విటమిన్ B-6
  • నారింజ నుండి విటమిన్ B-9 (ఫోలేట్).
  • అన్ని సిట్రస్ పండ్ల నుండి విటమిన్ సి
  • నారింజ నుండి జింక్

2. గ్రీన్ యాపిల్, కారెట్, ఆరెంజ్ జ్యూస్

Green apple carrot orange Juice

క్యారెట్స్, ఆపిల్స్, అరేంజ్ మూడు పండ్లను కలిపి చేసే జ్యూస్ మిశ్రమం శరీర రోగ నిరోధక వ్యవస్థ పరిరక్షణకు, అంటువ్యాధులను దరిచేరనీయకుండా పోరాడటంలోనూ విన్నింగ్ కాంబినేషన్ గా మారింది. యాపిల్స్, ఆరేంజ్ లలో ఉండే పుష్కలమైన విటమిన్-సి శరీరానికి అందుతుంది. ఇక శరీర అరోగ్యకర రోగనిరోధక వ్యవస్థకు అత్యంత కీలకమైన విటమిన్ ఏ కారెట్లలో సమృద్దిగా ఉంటుంది. క్యారెట్లలోని యాంటీ ఆక్సీడెంట్ బిటా కారోటీన్ పటిష్ట శరీర అరోగ్య వ్యవస్థకు దోహదపడుతుంది. క్యారెట్‌లో విటమిన్ బి-6 కూడా ఉంటుంది, ఇది రోగనిరోధక కణాల విస్తరణకు యాంటీబాడీ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆకుపచ్చ యాపిల్స్ లోని ఒగరు క్యారెట్లు, నారింజలోని తీయ్యదనాన్ని కూడా తగ్గించివేస్తుంది.

గ్రీన్ యాపిల్, కారెట్, ఆరెంజ్ మిశ్రమ జ్యూస్ నుంచి లభించే పోషకాలు

  • క్యారెట్ నుండి పొటాషియం
  • క్యారెట్ నుండి విటమిన్ ఎ
  • క్యారెట్ నుండి విటమిన్ B-6
  • నారింజ నుండి విటమిన్ B-9 (ఫోలేట్).
  • నారింజ మరియు ఆపిల్ నుండి విటమిన్ సి

3. బీట్‌రూట్, క్యారెట్, అల్లం, ఆపిల్ జ్యూస్

Beetroot carrot ginger apple juice

శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరిచే ఈ బీట్‌రూట్, క్యారెట్, అల్లం, ఆపిల్ జ్యూస్‌లో బీట్ రూట్, క్యారెట్, అల్లం మూడు కూరగాయల జాబితాలోకి వచ్చే పధార్థాలే. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను బలపర్చడంలో సహాయపడటంతో పాటు తాపజనక లక్షణాలను తగ్గిస్తాయి. తరచుగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధులను ఎదుర్కోనే వ్యవస్థకు ఈ జ్యూస్ బలాన్ని చేకూర్చుతుంది. జలుబు లేదా ఫ్లూ లక్షణాలలో ముక్కు కారటం, దగ్గు, ఒళ్లు నొప్పులు కలిగినా ఈ జ్యూస్ వాటిని తగ్గించడంలో దోహదం చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఈ రసాన్ని తాగితే చక్కని ప్రయోజనం లభిస్తుంది. ఈ జ్యూస్ లోని అల్లం శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది.

బీట్‌రూట్, క్యారెట్, అల్లం, ఆపిల్ జ్యూస్ లలో పోషకాలు

  • క్యారెట్లు, దుంపలు మరియు ఆపిల్ నుండి పొటాషియం
  • క్యారెట్లు మరియు దుంపల నుండి విటమిన్ ఎ
  • క్యారెట్ నుండి విటమిన్ B-6
  • దుంపల నుండి విటమిన్ B-9 (ఫోలేట్)
  • ఆపిల్ నుండి విటమిన్ సి

4. టొమాటో జ్యూస్

Tomato juice

రోగ నిరోదక శక్తిని శరీరంలో ఇనుమడింపచేసే జ్యూస్ లలో టొమాటో రసం కూడా ఒకటి. అయితే ఈ జ్యూస్ తాజా కాయతో చేసిందా లేదా అన్నది నిర్థారించుకోవాలి. ఇక తాజా టమాటాను తీసుకుని మీరే చేసుకుంటే అది మరింత ఉత్తమం. అయితే టమాటా తాజా కాయను తీసుకుని చేసుకోవాలి. ఇక ఈ జ్యూస్ లో ఎక్కువ జోడించిన పదార్థాలు కూడా కలపకూడదు. కేవలం కొన్ని పదార్ధాలను మాత్రమే తప్పనిసరి కాబట్టి కలుపుకోవాలి. టమాటా జ్యూస్ కోసం మీరు జ్యూసర్ లేదా మిక్సీని వినియోగించాల్సిన అవసరం లేదు. చేతితో ఒక వాటిని క్వాష్ చేసి.. తరువాత గింజలు, ముక్కలను జల్లెడ ద్వారా వడకట్టుకోవచ్చు. టొమాటోలో విటమిన్ బి-9 పుష్కలంగా ఉంటుంది, దీనిని సాధారణంగా ఫోలేట్ అని పిలుస్తారు. ఇది మీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. టొమాటోలు మెగ్నీషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీని కూడా అందిస్తాయి.

టొమాటో జ్యూస్ ద్వారా లభించే పోషకాలు (ఒక సర్వింగ్‌లో)

  • టమోటా జ్యూస్ నుండి మెగ్నీషియం
  • టమోటాల నుండి పొటాషియం
  • టమోటాల నుండి విటమిన్-ఎ
  • టమోటాల నుండి విటమిన్ బి-6
  • టమోటాల నుండి విటమిన్ బి-9 (ఫోలేట్).
  • టమోటాల నుండి విటమిన్ సి
  • టమోటాలు, సెలెరీ నుండి విటమిన్-కె

5. టమాటా, సెలరీ, కాలే మిశ్రమ జ్యూస్

Kale tomato celery juice

టమాటా గురించి తెలుసు. ఇక కాలే గురించి చెప్పాలంటే దీనిని ఆకు క్యాబేజి అని క్యాబేజీలో ఓ రకమని కూడా అంటారు. అనేక ఆకు కూరల్లో ప్రధానమైనది కాలే ఆకు. ఈ ఆకు రసంలో అనేక పోషకగుణాలు ఉన్నాయి. ఇక దీనికి తోడు సెలరీ ఇదో రకం తోటకూర అని అంటారు. ఈ మూడింటి మిశ్రమ జ్యూస్ కూడా రోగ నిరోధక శక్తి బలోపేతానికి దోహదం చేస్తుంది. తీయ్యని పండ్లతో కలపి కాలే రసాన్ని తీసుకునే బదులు.. ఇలా సెలరీ, టమోటాలతో తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ ఎ కూడా అందుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, ఈ రెసిపీకి కొంత మునకవేరు (హార్స్ రాడిష్)ని జోడించడం వలన యాంటీ ఇన్ ఫ్లామేటరీ ప్రయోజనాలను కూడా అందించవచ్చు. మీ ఇంద్రియాలను మేల్కొల్పే పానీయంగా కూడా పనిచేస్తుంది.

టమాటా, సెలరీ, కాలే మిశ్రమ జ్యూస్ ద్వారా లభించే పోషకాలు (ఒక సర్వింగ్‌లో)

  • టమోటా రసం నుండి మెగ్నీషియం
  • కాలే నుండి మాంగనీస్
  • టమోటా రసం నుండి పొటాషియం
  • కాలే మరియు టమోటా రసం నుండి విటమిన్ ఎ
  • టమోటా రసం నుండి విటమిన్ B-6
  • టమోటా రసం నుండి విటమిన్ B-9 (ఫోలేట్).
  • కాలే మరియు టమోటా రసం నుండి విటమిన్ సి
  • టమోటా రసం నుండి విటమిన్ K

6. స్ట్రాబెర్రీ, కివిల మిశ్రమ జ్యూస్

Strawberry kiwi juice

స్ట్రాబెర్రీ, కివీలు ఇవి అరోగ్యానికి మరో ప్రత్యామ్యాయం. ఈ మిశ్రమంతో కూడిన జ్యూస్ తో విటమిన్ సి సమృద్దిగా లభిస్తుంది. 1 కప్పు జ్యూస్ చేయడానికి 4 కప్పుల స్ట్రాబెర్రీలు అవసరం అవుతాయి. కాబట్టి ఈ పండ్లను జ్యూస్‌గా కాకుండా స్మూతీగా కలపి తీసుకోవడం ఉత్తమం. పాలతో కలిపి చేసుకునే ఈ స్మూతీలో స్కిమ్ మిల్క్ ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్ డి పుష్కలంగా ఉండే పాలను పండ్లు లేదా కూరగాయలతో కలిపి తీసుకుంటే లభించే రుచి, పోషకాలు అమోఘం. విటమిన్ డి లోపంతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ విటమిన్ ఎక్కువగా సూర్యకాంతి ద్వారా లభిస్తుండగా.. జంతు ఉత్పత్తులలో తక్కువ మోతాదులో లభిస్తుంది. సూర్యరశ్మి, ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా సాధించబడిన ఆరోగ్యకరమైన స్థాయిలు, న్యుమోనియా లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇక ఇటీవల కొన్ని పరిశోధనలు విటమిన్ డి లోపానికి ఇన్ఫెక్షన్ రేట్లు, తీవ్రత ఉన్న సంబంధాన్ని కూడా సూచిస్తున్నాయి. ఈ మిశ్రమంలో పాలలో కాసింత ప్రోబయోటిక్ గ్రీక్ పెరుగు కలుపుకుంటే అదనపు బూస్ట్ మీ సొంతం. ప్రోబయోటిక్స్ మీ శరీరంలోని కణాలు యాంటీ మైక్రోబియల్ అవరోధాలను తట్టుకునేలా చేస్తోంది. ఇక ఇవి సాధారణంగా సప్లిమెంట్స్ లేదా ఫర్మెంటెడ్ ఆహారాలలో కనిపిస్తాయి.

స్ట్రాబెర్రీ, కివిల జ్యూస్ ద్వారా లభించే పోషకాలు (ఒక సర్వింగ్‌లో)

  • స్కిమ్ మిల్స్ నుండి కాల్షియం
  • స్ట్రాబెర్రీలు, వోట్స్ నుండి మాంగనీస్
  • వోట్స్ నుండి భాస్వరం
  • స్ట్రాబెర్రీలు, అరటి, నారింజ నుండి పొటాషియం
  • వోట్స్ నుండి విటమిన్ B-1 (థయామిన్).
  • అరటిపండు నుండి విటమిన్ B-6
  • స్ట్రాబెర్రీ, నారింజ నుండి విటమిన్ B-9 (ఫోలేట్).
  • స్కిమ్ మిల్క్ నుండి విటమిన్ B-12
  • స్ట్రాబెర్రీలు, కివి, నారింజ నుండి విటమిన్ సి
  • స్కిమ్ మిల్క్ నుండి విటమిన్ డి
  • కివి నుండి విటమిన్ K
  • స్కిమ్ మిల్క్ నుండి జింక్

7. స్ట్రాబెరీ, మామిడీ స్మూతీ

Strawberry mango Juice

స్ట్రాబెర్రీ మామిడి స్మూతీ అనేది మీ ఆకలిని తీర్చుకునేందుకు వినియోగించుకునే ఆరోగ్యకరమైన మార్గం. ఉదయం కాసింత ఆలస్యంగా అటు అల్పాహారం ఇటు మధ్యాహ్న బోజనం కలిపి మధ్యాహ్నానికి ముందు తీసుకునే ఈ స్మూతీ ఎంతో ఘనీభవించిన పండ్లతో పాటు పోషకాలను సమృద్దిగా నిండిన పదార్థం. ఈ స్మూతీని అస్మాదిస్తున్నట్లు అయితే మీరు అన్ని తాజా పండ్లను మాత్రమే ఇందులో వినియోగించుకోవడం ముఖ్యం. మామిడి నుంచి విటమిన్ ఇని పొందడంతో పాటు బాదం పాల నుంచి అదనపు యాండీఆక్సిడెంట్ ప్రయోజనాలను కూడా కలగలపి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మరీ ముఖ్యంగా పట్టుతప్పుతున్న వయోజనులలో ఈ స్మూతీ బలవర్థకంలా పనిచేస్తూ.. అదనపు యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కల్పిస్తంది.

స్ట్రాబెరీ, మామిడీ స్మూతీ ద్వారా లభించే పోషకాలు (ఒక సర్వింగ్‌లో)

  • బాదం పాలు నుండి కాల్షియం
  • స్ట్రాబెర్రీల నుండి మాంగనీస్
  • స్ట్రాబెర్రీల నుండి పొటాషియం
  • మామిడి, క్యారెట్ నుండి విటమిన్ ఎ
  • మామిడి నుండి విటమిన్ B-6
  • స్ట్రాబెర్రీ, మామిడి నుండి విటమిన్ B-9 (ఫోలేట్).
  • స్ట్రాబెర్రీ, మామిడి, నారింజ నుండి విటమిన్ సి
  • బాదం పాలు నుండి విటమిన్ డి
  • మామిడి, బాదం పాలు నుండి విటమిన్ ఇ

8. పుచ్చకాయ పుదీనా జ్యూస్

Watermelon mint juice

రోగ నిరోధక శక్తిని బలపర్చే మరో జ్యూస్ పుచ్చకాయ పుదీనా. నీటిని ఎక్కువ శాతం కలిగివున్న ఓ పండు.. ఔషధగుణాలు అధికంగా ఉన్న ఆకుకూరతో పాటు చేసే ఈ జ్యూస్ విటమిన్ సీతో పాటు అర్జినైన్ కూడా సమృద్దిగా కలిగివుండటంతో రోగనిరోధక శక్తి మరింత పుష్కలంగా అందే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ మిశ్రమ జ్యూస్ కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. కండరాల నొప్పి అనేది ఫ్లూ యొక్క సాధారణ లక్షణం, ముఖ్యంగా వృద్ధులలో ఈ లక్షణం బయటపడుతుంది. ఈ పండు యొక్క భారీ నీటి శాతం కూడా జ్యూస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఇక పుచ్చకాయ రసాన్ని యాపిల్ లేదా ఆరెంజ్ వంటి ఇతర సాదా పండ్ల రసాలతో కలపి కూడా జ్యూస్ చేయవచ్చు, అవి విటమిన్ ఎ కలిగి ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

పుచ్చకాయ పుదీనా జ్యూస్ ద్వారా లభించే పోషకాలు (ఒక సర్వింగ్‌లో)

  • పుచ్చకాయ నుండి అర్జినైన్
  • పుచ్చకాయ నుండి సిట్రులిన్
  • పుచ్చకాయ నుండి మెగ్నీషియం
  • పుచ్చకాయ నుండి విటమిన్ ఎ
  • పుచ్చకాయ నుండి విటమిన్ సి

9. గుమ్మడికాయ గింజ జ్యూస్

Pumpkin seed juice

గుమ్మడికాయ జ్యూస్ ఇది కూడా రోగనిరోధక వ్యవస్థను ద్విగిణీకృతం చేస్తుంది. ఇది అత్యంత తాజా, సహజమైన పద్దతుల్లో ఒకటి. ఇది ఫ్రూట్ స్మూతీస్‌కి కూడా గొప్ప బేస్‌గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ నుంచి లభించే అదనపు ఆరోగ్య ప్రయోజనాలను విస్మరించడం చాలా కష్టం. ఎందుకంటే ఈ పాల నుంచి మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఇది మీకు ఎముకల దృఢత్వానికి, రుతువిరతి లక్షణాలు లేదా కొలెస్ట్రాల్ స్థాయిలు దిగజారడం వంటి వాటిలోనూ సహాయపడుతుంది. మూత్ర విసర్జనలో అవరోధాలను తొలగిస్తుంది. దీంతో పాటు జుట్టు, చర్మం సౌందర్యాన్ని పటిష్టపరుస్తుంది. ఇక మానసిన ఒత్తిళ్లను కూడా దూరం చేయడంతో పాటు వీర్యగ్రంధీ క్యాన్సర్ ను నిరోధిస్తుంది.

గుమ్మడికాయ గింజలు జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ జలుబును నియంత్రించడంలో క్రీయాశీలక పాత్రను పోషిస్తుంది. వాపు, రోగనిరోధక వ్యవస్థ రెండింటిపై గుమ్మడికాయ గింజలు సానుకూల ప్రభావం చూపుతున్నాయి. కరోనాతో సంబంధం ఉన్న శ్వాసకోశ సమస్యలకు ఆస్ట్రేలియన్ పరిశోధకులు ఇంట్రావీనస్ జింక్‌ను కూడా ఔషధంగా పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ సంక్రమణను నివారించడంలో జింక్ ప్రభావాన్ని (ఇతర చికిత్సలతో కలిపి) పరిశోధనలు సాగుతున్నాయి. అమెరికాలోని ఈ మేరకు క్లినికల్ ట్రయల్ కూడా సాగింది.

గుమ్మడికాయ గింజల జ్యూస్ ద్వారా లభించే పోషకాలు

  • గుమ్మడికాయ గింజల నుండి మెగ్నీషియం
  • గుమ్మడికాయ గింజల నుండి మాంగనీస్
  • తేదీల నుండి పొటాషియం
  • గుమ్మడికాయ గింజల నుండి జింక్

10. ఆపిల్, పాలకూర, కాలే జ్యూస్

Green apple lettuce kale juice

కూరగాయల ఆధారిత ఆకుపచ్చ రసం బలమైన రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహించే పోషకాల పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. ఇది పిల్లలతో సహా ఎవరైనా ఆకుకూరల జ్యూస్ ను త్రాగడానికి ఇష్టపడతారు. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంపోందించే పోషకాలతో పాటు ఆకు కూరలు, స్పినాచ్ సహా బచ్చలికూరలో లభించే అదనపు విటమిన్లు A, C, K కూడా కలిగివుంటాయి.

గ్రీన్ అపిల్, పాలకూర, కాలే జ్యూస్ నుంచి లభించే పోషకాలు

  • కాలే నుండి ఐరన్
  • కాలే నుండి మాంగనీస్
  • కాలే నుండి పొటాషియం
  • కాలే, సెలెరీ నుండి విటమిన్ ఎ
  • ఆకుకూరల నుండి విటమిన్ బి-9 (ఫోలేట్).
  • కాలే, నిమ్మకాయ నుండి విటమిన్ సి
  • దోసకాయ, సెలెరీ నుండి విటమిన్ కె

ఇలా సహజసిద్దమైన కూరగాయలు, పంఢ్లు, ఆకుకూరలతో జ్యూస్‌లు, స్మూతీస్, న్యూట్రీషియన్ డ్రింక్స్ తయారు చేసుకుని వాటిని సేవిస్తూ.. ఆరోగ్యంగా ఉండటం రుచికరమైన మార్గాలలో ఒకటి. మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి ఇతర మార్గాలు మంచి పరిశుభ్రతను పాటించడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, బాగా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించడం తరచుగా వ్యాయామం కూడా చేస్తుండాలి.

Exit mobile version